Sunday, November 25, 2012

లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సులు, కెరీర్ అవకాశాలపై ఫోకస్...


లైబ్రరీస్... రిజర్వాయర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్’.. గ్రంథాలయాల ప్రాశస్త్యాన్ని తెలిపేందుకు ఈ ఒక్క వాక్యం చాలు. సప్త సముద్రాలకు మించి ఉండే సమాచారాన్ని నిక్షిప్తం చేసే ప్రదేశాలు గ్రంథాలయాలు. ఆ గ్రంథాలయాలను సమర్థంగా నిర్వహించడం; సమాచారాన్ని పొందిగ్గా అమర్చడం; అడిగిన వెంటనే సదరు సమాచారాన్ని అందించడం అనుకున్నంత సులభమేమీ కాదు. అందుకే ఈ లక్షణాలు, నైపుణ్యాలు అందించేందుకు రూపొందిన కోర్సు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఆధునిక యుగంలో ఒక్కో అంశంపై పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు, రిఫరెన్స్‌లు పెరుగుతుండటంతో లైబ్రరీలను సమర్థంగా నిర్వహించే సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ కోసం అన్వేషణ రోజురోజుకీ పెరుగుతోంది. వినూత్న ఆలోచన, సహనం ఉన్న వారికి చక్కగా సరిపడే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సులు, కెరీర్ అవకాశాలపై ఫోకస్...

‘అరల్లో పుస్తకాలను అమర్చడం.. అడగగానే అందించడం’.. లైబ్రరీలు, అందులో పనిచేసే సిబ్బంది విషయంలో సాధారణంగా నెలకొనే అభిప్రాయమిదే. కానీ ‘ఆ.. అడగగానే అవసరమైన పుస్తకాన్ని అందించడమే’ ఓ ఆర్ట్. సాధారణ వ్యక్తికి సాధ్యంకాని సైన్స్. అందుకే లైబ్రరీ నిర్వహణ కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేసిన కోర్సు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్.

ఉదాహరణకు: హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో లక్షల్లో పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఒక వ్యక్తి తనకు కావలసిన పుస్తకం కోసం గంటలకొద్దీ అన్వేషణ సాగిస్తున్నాడు. దీన్ని గమనించిన లైబ్రేరియన్.. ఆ వ్యక్తి వద్దకు వచ్చి ఏం కావాలో కనుక్కున్నాడు. క్షణాల్లో ఆ పుస్తకం ఆ వ్యక్తి చేతిలోకొచ్చింది. సాధారణ వ్యక్తికి సాధ్యం కానిది లైబ్రేరియన్‌కు క్షణాల్లో సాధ్యమవడానికి కారణం.. అతడు లైబ్రరీ సైన్స్ కోర్సులో ఉత్తీర్ణత సాధించడమే.

ప్రఖ్యాత కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సైతం లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో అసోసియేట్‌షిప్‌ను అందిస్తోందంటే ఈ కోర్సు ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా నేషనల్ నాలెడ్జ్ కమిషన్ సైతం ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో నేషనల్ మిషన్ ఫర్ లైబ్రరరీస్‌ను రూపొందించాలని సిఫార్సు చేసిందంటే లైబ్రరీలు, ఈ కోర్సు ప్రాముఖ్యత తెలుసుకోవచ్చు.

కోర్సు స్వరూపం:
సాధారణంగా లైబ్రరీ సైన్స్ కోర్సులో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజ్‌మెంట్, క్లాసిఫికేషన్, క్యాటలాగింగ్ సిస్టమ్స్, బిబ్లియోగ్రఫీ, డాక్యుమెంటేషన్, మెయింటెనెన్స్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ మాన్యుస్క్రిప్ట్, లైబ్రరీ మేనేజ్‌మెంట్, రీసెర్చ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, ఆర్కైవ్స్ మేనేజ్‌మెంట్, ఇండెక్సింగ్, లైబ్రరీ ప్లానింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఉంటుంది.

కన్వెన్షన్ టు కంప్యూటరైజేషన్: కాలంతోపాటు లైబ్రరీ సైన్స్ కోర్సు స్వరూపం కూడా మారుతోంది. ఆధునిక కంప్యూటర్ యుగం నేపథ్యంలో.. గతంలో సంప్రదాయంగా పుస్తకాలు, జర్నల్స్ వంటి వాటి నిర్వహణకే పరిమితమైన శిక్షణ ఇప్పుడు సీడీలు, డీవీడీలు, మైక్రోఫిల్మ్స్ సేకరణ, శాస్త్రీయపద్ధతుల్లో సంరక్షణ వరకు పొడిగింది.

స్పెషలైజేషన్స్‌తో స్పెషల్‌గా..:
ఇప్పుడు ప్రతికోర్సు, ప్రతి విభాగంలో స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అనే మాట తరచుగా వినిపిస్తోంది. ఆ మాట లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌కూ విస్తరించింది. ఈ క్రమంలో మెడికల్ లైబ్రేరియన్, లా ఫర్మ్ లైబ్రేరియన్, మ్యూజియం లైబ్రరీస్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తి చేస్తే మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లు, లీగల్ పబ్లిషింగ్ హౌసెస్; మ్యూజియంలు ఆఫర్లు ఇవ్వడంలో ముందుం టాయి. మెడికల్ లైబ్రేరియన్ స్పెషలైజేషన్ చేస్తే క్లినికల్ రీసెర్చ్ సంస్థలు, ఫార్మా సంస్థల్లోనూ అవకాశాలుంటాయి.

అవకాశాలు అపారం:
చాలామంది ఇప్పటికీ ఈ కోర్సుకున్న ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదు. కానీ కోర్సు పూర్తి చేస్తే అవకాశాలు ఆహ్వానం పలుకుతాయనడంలో ఎలాంటి సంకోచం అవసరం లేదు. కారణం.. పెరుగుతున్న డాక్యుమెంటేషన్ సెంటర్లు, మ్యూజియంలు, కాలేజీలు, యూనివర్సిటీలు, ముద్రణ సంస్థలు, రీసెర్చ్ సంస్థల్లో లైబ్రేరియన్ల కొరత వేధిస్తుండటమే! ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు రంగంలో అవకాశాలు కోకొల్లలుగా పేర్కొనొచ్చు. అంతేకాకుండా 2008లో నిర్వహించిన ఎంప్లాయ్‌మెంట్ సర్వేలో ‘బెస్ట్ కెరీర్స్ ఆఫ్ 2008’ జాబితాలో ఈ కోర్సు స్థానం పొందిందంటే దీనికి గల అవకాశాలు అర్థం చేసుకోవచ్చు.

అవకాశాల వేదికలు:
ఈ కోర్సు పూర్తి చేస్తే లైబ్రరీలే కాకుండా అనేక ఇతర విభాగాలు అవకాశాల వేదికలుగా నిలుస్తున్నాయి. అవి.. పబ్లిక్/ ప్రభుత్వ లైబ్రరీలు; విద్యా సంస్థలు; విదేశీ రాయబార కార్యాలయాలు; జాతీయ స్థాయి మ్యూజియంలు, పురాతత్వ శాఖలు. అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్; డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ); ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్); ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) వంటి సంస్థల్లోనూ అవకాశాలు లభిస్తాయి.

కార్పొరేట్ సెక్టార్‌లోనూ!
లైబ్రరీ సైన్స్ కోర్సు ఉత్తీర్ణులకు కార్పొరేట్ సంస్థలు సైతం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయనడం అతిశయోక్తికాదు. సాఫ్ట్‌వేర్ సంస్థల్లో వీరి అవసరం పెరుగుతోంది. విస్తృతమైన సమాచారాన్ని పొందిగ్గా అమర్చడానికి సంబంధిత విభాగంలో సుశిక్షుతులైన సిబ్బంది అవసరం ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ క్రమంలో ఆయా సంస్థల నిరంతర కార్యకలాపాలైన డేటాబేస్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజ్‌మెంట్, వెబ్ కంటెంట్ మేనేజ్‌మెంట్ అండ్ డిజైన్, ఇంటర్నెట్ కోఆర్డినేషన్ వంటి విభాగాల్లో లైబ్రరీ సైన్స్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు
న్నాయి.

కెరీర్ గ్రాఫ్:
ఈ విభాగంలో కెరీర్ గ్రాఫ్.. పూర్తి చేసిన కోర్సుపై ఆధారపడి ఉంటుంది. డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేస్తే లైబ్రరీ క్లర్క్ లేదా లైబ్రరీ అటెండెంట్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. ఇలా పలు స్థాయిల్లో కెరీర్ గ్రాఫ్ ఉంటుంది. అవి.. లైబ్రరీ అటెండెంట్/అసిస్టెంట్ లైబ్రేరియన్; డిప్యూటీ లైబ్రేరియన్; లైబ్రేరియన్/చీఫ్ లైబ్రేరియన్; రీసెర్చర్/అప్లికేషన్ స్పెషలిస్ట్; కన్సల్టెంట్/రిఫరెన్స్ లైబ్రేరియన్; టెక్నికల్ అసిస్టెంట్/ రికార్డ్స్ మేనేజర్; ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్ట్ వంటివి.

వేతనాల వెల్లువ:
కోర్సు పూర్తి చేసిన వారికి వేతనాలు కూడా వెల్లువలా లభిస్తాయని చెప్పొచ్చు. విద్యా సంస్థల్లో లైబ్రేరియన్లుగా చేరిన వారికి యూజీసీ స్కేల్ అందిస్తారు. డీఆర్‌డీఓ, ఇస్రో వంటి పరిశోధన సంస్థల్లో చేరిన వారికి సైంటిఫిక్ సిబ్బందికి సమాన స్థాయిలో వేతనాలు లభిస్తాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన విభాగాల్లో చేరితే ప్రారంభంలోనే అయిదంకెల జీతం గ్యారెంటీ. ఇతర విభాగాల్లో చేరిన వారికి ప్రారంభంలో కనీసం నెలకు రూ. 15 వేల జీతం ఖాయం.

విధులివే:
లైబ్రేరియన్ విధులు..
- వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా సమాచారం అందించడం
- సబ్జెక్ట్ ఆధారంగా ప్రచురణల కొనుగోలు, లైబ్రరీలో అమరిక
- లైబ్రరీ నిర్వహణ, సిబ్బందిపై పర్యవేక్షణ
- పుస్తకాలు, రాతప్రతులు, ప్రత్యేక ప్రచురణల సేకరణ, సంరక్షణ

వ్యక్తిగత లక్షణాలు:
లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సులో అడుగుపెట్టే వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు అవసరం. అవి పుస్తకాలపై ప్రేమ; నూతన ప్రచురణలపై నిరంతర అన్వేషణ; చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్; సహనం; వ్యక్తుల అవసరాలను గుర్తించి సహకరించడం వంటివి.

మన రాష్ట్రంలో:
ఇక.. ఈ కోర్సును మన రాష్ట్రంలో దాదాపు అన్ని యూనివర్సిటీలు బ్యాచిలర్ (బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్) స్థాయిలోనే అందిస్తున్నాయి. ఆయా యూనివర్సిటీలు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు, లేదా ప్రత్యేక ప్రవేశ ప్రక్రియ ద్వారా సీట్లు భర్తీ చేస్తారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలు దూర విద్యా విధానంలోనూ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సును అందిస్తున్నాయి. జాతీయ స్థాయి ఓపెన్ యూనివర్సిటీ.. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) సర్టిఫికెట్ నుంచి ఎం.ఫిల్ స్థాయి వరకు ఈ కోర్సును దూర విద్యా విధానంలో అందిస్తోంది.

మాస్టర్ డిగ్రీకి సమానంగా అసోసియేట్‌షిప్:
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ (NISCAIR -న్యూఢిల్లీ; ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్-బెంగళూరులు.. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీకి సమాన హోదాలో డాక్యుమెంటేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో రెండేళ్ల వ్యవధిగల అసోసియేట్‌షిప్ ప్రోగ్రాంను అందిస్తున్నాయి.

సర్టిఫికెట్ టు రీసెర్చ్

లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సు ప్రాముఖ్యత తెలుసుకోగానే తలెత్తే ప్రశ్న.. కోర్సులేంటి? అనేదే. ప్రస్తుతం మన దేశంలో 80కి పైగా యూనివర్సిటీలు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. న్యూఢిల్లీ కేంద్రంగా కోర్సులను నిర్వహించే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ (NISCAIR), ఇండియన్ నేషనల్ సైంటిఫిక్ డాక్యుమెంటేషన్ సెంటర్ (INSD-OC)లు ఈ కోర్సు విషయంలో దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిలుస్తున్నాయి. ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు అందించే కోర్సులు సర్టిఫికెట్ నుంచి పీహెచ్‌డీ వరకు ఉంటున్నాయి. ఆ వివరాలు..

= సర్టిఫికెట్ కోర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్; అర్హత: ఇంటర్మీడియెట్.
= డిప్లొమా ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్; అర్హత: ఇంటర్మీడియెట్.
= బ్యాచిలర్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్(బీఎల్‌ఐఎస్‌సీ); అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ; వ్యవధి: ఏడాది.

= మాస్టర్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్; అర్హత: బీఎల్‌ఐఎస్‌సీ ఉత్తీర్ణత; వ్యవధి: ఏడాది.
= ఎం.ఫిల్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్; అర్హత: ఎంఎల్‌ఐఎస్‌సీ ఉత్తీర్ణత.
= పీహెచ్‌డీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్; అర్హత: ఎంఎల్‌ఐఎస్‌సీ ఉత్తీర్ణత.
= సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల కాల వ్యవధి ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల విధానాల మేరకు ఉంటుంది. సాధారణంగా సర్టిఫికెట్ కోర్సు ఆరు నెలలు, డిప్లొమా కోర్సు ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో సాగుతుంది.

ఎంబీఏ (మీడియా మేనేజ్‌మెంట్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?


ఎంబీఏ (మీడియా మేనేజ్‌మెంట్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?
-పూజిత, జడ్చర్ల.
మీడియూ రంగంలో రిపోర్టింగ్, ఎడిటింగ్ వంటి ఫ్రంట్-ఎండ్ ఆపరేషన్స్‌తోపాటు సర్క్యులేషన్, షెడ్యూలింగ్, యూడ్ సేల్స్, బ్రాండ్ మేనేజ్‌మెంట్, మీడియా ప్లానింగ్ వంటి వాటికి సంబంధించిన ప్రొఫెషనల్స్ కోసం అన్వేషణ సాగుతోంది. అలాంటి ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దే కోర్సే ‘మీడియూ మేనేజ్‌మెంట్’. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి సాధారణంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, ఇంటర్నెట్, వెబ్‌సైట్‌లను నిర్వహిస్తున్న సంస్థలు, మీడియా హౌస్‌లు, పబ్లికేషన్స్ సంస్థలు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలలో ఉపాధి అవకాశాలుంటాయి. సినీ తారలు, సెలెబ్రెటీస్, రచయితలు, సంగీత దర్శకులకు, క్రీడాకారులు, ప్రముఖ వ్యక్తులకు మీడియా మేనేజర్‌గా కూడా వ్యవహరించవచ్చు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం కాబట్టి వేతనాలు కూడా అదే మాదిరిగానే ఉంటున్నాయి. సాధారణంగా వీరి ప్రారంభ వేతనం నెలకు రూ. 15,000-30,000 మధ్య ఉంటుంది.

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
= శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం - తిరుపతి
వెబ్‌సైట్: www.spmvv.ac.in/
= ఏషియన్ అకాడెమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్- నోయిడా
వెబ్‌సైట్: www.aaft.com
= ఇన్‌స్టిట్యూట్ ఫర్ మీడియా మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్టడీస్ - న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.imcsindia.com
= మణిపాల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ - బెంగళూరు
వెబ్‌సైట్: www.manipal.edu
= ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టడీస్ - న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.isomes.com
= అమిటీ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్ - నోయిడా
వెబ్‌సైట్: www.amity.edu
= ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ- న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.ignou.ac.in/


కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ వివరాలను తెలపండి?
-చరణ్, గద్వాల.
కంైబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా.. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు/మంత్రిత్వ శాఖ ల్లోని అసిస్టెంట్లు/అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ); సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ప్రివెంటివ్ ఆఫీసర్; ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌స్పెక్టర్లు; సీబీఐలో సబ్-ఇన్‌స్పెక్టర్లు; సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్‌లలో ఇన్‌స్పెక్టర్/ట్యాక్స్ అసిస్టెంట్స్; డెరైక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో.. అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లు; కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) ఆఫీస్‌లో.. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్/జూనియర్ అకౌంటెంట్/అకౌంటెంట్/అడిటర్స్; స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటింగ్ మంత్రిత్వ శాఖలో.. స్టాటిస్టికల్ ఇన్వెస్ట్‌గేటర్ గ్రేడ్-2, తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ పరీక్షకు హాజరు కావడానికి కావల్సిన అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్. అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి మాత్రం కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. వయసు: 27 ఏళ్లు. ఇన్‌స్పెక్టర్/సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్.. టయర్-1, టయర్-2 అనే రెండు దశలుగా ఉంటుంది.
టయర్-1: ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటుంది. ఈ పేపర్‌కు 200 మార్కులు కేటాయించారు. సమయం రెండు గంటలు. నాలుగు విభాగాలుగా ఉంటుంది. అవి.. జనరల్ ఇంటలిజెన్స్ (50 మార్కులు); జనరల్ అవేర్‌నెస్ (50 మార్కులు); న్యూమరికల్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు); ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ (50 మార్కులు); ఈ దశలో క్వాలిఫై అయిన వారిని మాత్రమే తర్వాతి దశ.. టయర్-2 కు అనుమతిస్తారు.

టయర్-2: ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటుంది. ఈ పేపర్‌కు 400 మార్కులు కేటాయించారు. రెండు విభాగాలుగా ఉంటుంది. అవి.. ఆర్థమెటిక్ ఎబిలిటీస్ (200 మార్కులు-సమయం రెండు గంటలు); ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ (200 మార్కులు-సమయం రెండు గంటలు); కంపైలర్/స్టాటిస్టికల్ ఇన్వెస్ట్‌గేటర్ గ్రేడ్-2 పోస్టుకు ‘స్టాటిస్టిక్స్ లేదా సంబంధిత సబ్జెక్ట్’ పేపర్ అదనంగా ఉంటుంది (200 మార్కులు-సమయం రెండు గంటలు); ఈ రెండు దశల్లో క్వాలిఫై అయిన వారికి చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్.. నిర్దేశించిన అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ నిర్వహించి నియామకం ఖరారు చేస్తారు.
వెబ్‌సైట్: http://ssc.nic.in

గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు వివరాలను తెలపండి?
-గణేష్, కర్నూలు.
గ్రాఫిక్ డిజైనింగ్ అనేది విజువల్ కమ్యూనికేషన్‌లోని ఒక ప్రక్రియ. అందుబాటులోని సమాచారాన్ని పదాలు, చిత్రాలు (images) ఉపయోగించి ప్రభావవంతంగా ప్రజెంట్ చేయడమే గ్రాఫిక్ డిజైన్. ఈ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునేవారికి.. డ్రాయి ంగ్, లే అవుట్, టైపోగ్రఫీ, లెట్టరింగ్, డయాగ్రమింగ్ వంటి అంశాలపై అవగాహన ఉండాలి.

వివిధ పత్రికలు, కార్పొరేట్ రిపోర్ట్స్, జర్నల్స్, మార్కెటింగ్ బ్రోచర్స్ లే అవుట్ డిజైన్ చేయడం, వ్యాపార-వాణిజ్య ఉత్పత్తులకు సంబంధించిన లోగోలను రూపొందించడం వంటి విధులను గ్రాఫిక్ డిజైనర్లు నిర్వహిస్తుంటారు. వీరికి మీడియా హౌస్‌లు, పబ్లికేషన్ సంస్థలు, యాడ్ ఏజెన్సీలు, కార్పొరేట్ హౌసెస్‌లు కెరీర్ అవె న్యూస్‌గా నిలుస్తున్నాయి.

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
= నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-అహ్మదాబాద్
వెబ్‌సైట్: www.nid.edu
= ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్-ఐఐటీ బాంబే
వెబ్‌సైట్: www.idc.iitb.ac.in
= ఐఐటీ-కాన్పూర్
వెబ్‌సైట్: www.iitk.ac.in
= ఐఐటీ-గువహటి
వెబ్‌సైట్: www.iitg.ac.in
= సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-పుణే
వెబ్‌సైట్: sid.edu.in
ఇవే కాకుండా తపస్ మల్టీమీడియా, ఎరెనా, జీ ఇన్‌స్టిట్యూట్ వంటి ఎన్నో ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు గ్రాఫిక్ డిజైన్ సంబంధిత కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

ఉపకార వేతనాలు


దేశ, విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనేది ప్రతి విద్యార్థి కల. కానీ చాలా మంది విద్యార్థులకు ఆర్థిక లేమి. ఈ విషయాన్ని గుర్తించిన ఎన్నో వర్సిటీలు/సంస్థలు మేమున్నామంటూ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తున్నాయి. వాటి వివరాలు..

యూజీసీ పీజీ స్కాలర్‌షిప్ ఫర్ ఎస్సీ/ఎస్టీ
ప్రొఫెషనల్ పీజీ కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు యూజీసీ అందించే స్కాలర్‌షిప్‌లకు నోటిఫికేషన్ వెలువడింది. వీటిని 2012-13 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఫార్మసీ మొదలైన కోర్సులను రెగ్యులర్ విధానంలో చదువుతున్నవారికి అందిస్తారు.

మొత్తం స్కాలర్‌షిప్స్: 1000
అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ప్రస్తుత విద్యా సంవత్సరానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీలు/ కళాశాలల్లో పీజీ ప్రొఫెషనల్ కోర్సులు చదువుతుండాలి. దూరవిద్య ద్వారా విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ను ఇవ్వరు.

వయో పరిమితి: పురుషులకు జూలై 1, 2012 నాటికి 45 ఏళ్లు మించరాదు. మహిళలకు గరిష్ట వయో పరిమితి 50 ఏళ్లు.

స్కాలర్‌షిప్ వ్యవధి: కోర్సును బట్టి రెండు/మూడేళ్లు
స్కాలర్‌షిప్ మొత్తం: ఎంఈ/ఎంటెక్ కోర్సులు చదువుతున్న వారికి నెలకు రూ. 5000, ఇతర పీజీ కోర్సులు చదువుతున్న వారికి నెలకు రూ.3000 స్కాలర్‌షిప్‌తోపాటు కాంటిన్‌జెన్సీ గ్రాంట్ కింద ఎంఈ/ఎంటెక్ విద్యార్థులకు ఏడాదికి రూ.15000, ఇతరులకు ఏడాదికి రూ.10,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: విద్యార్థుల ప్రతిభ ఆధారంగా నిపుణుల కమిటీ ఎంపిక చేస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 6, 2012
వెబ్‌సైట్: www.ugc.ac.in/pgsprof/


మన్మోహన్‌సింగ్ స్కాలర్‌షిప్స్-2013

ఇంగ్లండ్‌లోని సెయింట్ జాన్స్ కాలేజ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్స్, సోషల్ సెన్సైస్‌లో డాక్టోరల్ కోర్సులు చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు అందించే మన్మోహన్‌సింగ్ స్కాలర్‌షిప్స్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. సెయింట్ జాన్స్ కాలేజ్ పూర్వ విద్యార్థి, భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్ధం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది.

అర్హతలు:
- భారతీయ పౌరులై ఉండి పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండాలి.
- డిసెంబర్ 31, 2012 నాటికి 35 ఏళ్లు మించరాదు.
- ఇంగ్లిష్‌లో రాయగలిగి, మాట్లాడగలిగి ఉండాలి.
- ఇప్పటివరకు యూకే ప్రభుత్వం అందించే ఎలాంటి స్కాలర్‌షిప్/ఆర్థిక సహాయాన్ని పొంది ఉండకూడదు.
- గుర్తింపు పొందిన భారతీయ యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత సబ్జెక్టులలో యూజీ, పీజీలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- లీడర్‌షిప్ క్వాలిటీస్ (ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేదా సంబంధిత సబ్జెక్టులలో విద్యార్థి తాను చేసిన కృషి.. దానికి సంబంధించి ఏదైనా పబ్లికేషన్స్‌లో ప్రచురితమైతే వాటి వివరాలు) తెలిపేలా ఆధార పత్రం.
- సెప్టెంబర్/అక్టోబర్ 2013 నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ-యూకేలో ప్రారంభమయ్యే డాక్టోరల్ కోర్సులు చదవడానికి ఆసక్తి కలిగి ఉండాలి.

స్కాలర్‌షిప్ ద్వారా అందేవి: అకడెమిక్ ఫీజులు, రానూపోను విమాన ఖర్చులు, యూకేలో నివసించడానికి నెలవారీ ఖర్చులు, యూకే వీసా.

ఎంపిక విధానం: విద్యార్థుల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా బ్రిటిష్ కౌన్సిల్ షార్ట్‌లిస్ట్ చేస్తుంది. వీరికి న్యూఢిల్లీలో నిపుణుల కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించి స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తుంది.
దరఖాస్తు విధానం: దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ:డిసెంబర్ 31, 2012
వెబ్‌సైట్: www.britishcouncil.org


ఖొరానా ప్రోగ్రామ్ ఫర్ స్కాలర్స్

అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్సిటీతోపాటు దానితో భాగస్వామ్యమున్న ఇతర అమెరికన్ వర్సిటీల్లో బయోటెక్నాలజీ.. సంబంధిత అంశాల్లో రీసెర్చ్ చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు అందించే ఖొరానా స్కాలర్‌షిప్‌కు నోటిఫికేషన్ వెలువడింది. ఈ స్కాలర్‌షిప్‌ను 2013 సంవత్సరానికి గానూ విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్సిటీ (యూఎస్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ, ఇండియా), ఇండియా-యూఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం కలిసి అందిస్తున్నాయి.

కోర్సును అందిస్తోన్న అమెరికన్ యూనివర్సిటీలు:
- యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్
- యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్
- యూనివర్సిటీ ఆఫ్ లోవా
- యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్
- మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ
- యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా
- ఇండియానా యూనివర్సిటీ
- జార్జిటౌన్ యూనివర్సిటీ-బ్లూమింగ్‌టన్
- మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)

అర్హత:
- ఇండియాలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాలల్లో బయోటెక్నాలజీ.. దాని సంబంధిత (అగ్రికల్చర్, హెల్త్, బయోమెడికల్ సెన్సైస్) అంశాల్లో బీటెక్/ఎంటెక్/ఎమ్మెస్సీ చదువుతుండాలి.
- యూఎస్‌లోని సంబంధిత యూనివర్సిటీల్లో బయోటెక్నాలజీ సంబంధిత అంశాల్లో రీసెర్చ్ చేసేందుకు ఆసక్తి ఉండాలి.

స్కాలర్‌షిప్ వ్యవధి: 10 వారాలు (మే-జూలై 2013)
స్కాలర్‌షిప్ ద్వారా: ఎయిర్‌ఫేర్, స్టైఫండ్, ఉచిత వసతి.
దరఖాస్తు విధానం: దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని పూర్తిచేసి scholar@indousstf.org కు మెయిల్ చేయాలి.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: నవంబర్ 30, 2012
వెబ్‌సైట్: http://indousstf.org


యూజీసీ-ఫీనిష్ గవర్నమెంట్ స్కాలర్‌షిప్స్
2013-14 విద్యా సంవత్సరానికి ఫిన్‌లాండ్‌లో రీసెర్చ్ కోర్సులు, డాక్టోరల్ స్టడీస్ చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఫిన్‌లాండ్ ప్రభుత్వం స్కాలర్‌షిప్పులను అందిస్తోంది.
మొత్తం స్కాలర్‌షిప్స్: 10

అర్హతలు:
- భారతీయ పౌరులై ఉండాలి.
- మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునేముందు ఫిన్‌లాండ్ అకడెమిక్ సూపర్‌వైజర్ నుంచి ఆహ్వానం అందుకుని ఉండాలి.
- ఇంగ్లిష్/స్వీడిష్/ఫీనిష్ లాంగ్వేజీల్లో దేనిలోనైనా రైటింగ్, స్పీకింగ్ సామర్థ్యం అవసరం.

స్కాలర్‌షిప్ మొత్తం: నెలకు 1200 యూరోల చొప్పున ఏడాదిపాటు చెల్లిస్తారు. స్కాలర్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు రానుపోను ఎయిర్‌ఫేర్ ఛార్జీలను యూజీసీ చెల్లిస్తుంది.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తుతోపాటు స్టడీ రీసెర్చ్ ప్లాన్, సీవీ, రెండు రికమండేషన్ లెటర్స్, విద్యార్హతలను తెలిపే సర్టిఫికెట్ల కాపీలను ఈ దిగువ చిరునామాకు పంపాలి.

పూర్తి చేసిన దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
సెక్షన్ ఆఫీసర్ (ఐసీ), రూమ్ నెంబర్-508 ఏ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, బహదూర్‌షా జాఫర్ మార్గ్, న్యూఢిల్లీ-110002
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: నవంబర్ 30, 2012
వెబ్‌సైట్స్: www.ugc.ac.in, www.studyinfinland.fi


రామలింగస్వామి రీ ఎంట్రీ ఫెలోషిప్

విదేశాల్లో పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో రీసెర్చ్ చేస్తున్న భారతీయులకు అందించే రామలింగస్వామి రీ ఎంట్రీ ఫెలోషిప్‌నకు నోటిఫికేషన్ వెలువడింది. దీన్ని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) అందిస్తోంది. విదేశాల్లో బయోటెక్నాలజీ సంబంధిత అంశాల్లో (అగ్రికల్చర్, హెల్త్ సెన్సైస్, బయో ఇంజనీరింగ్, ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్, బయో ఇన్ఫర్మేటిక్స్ మొదలైనవి) రీసెర్చ్ చేస్తున్నవారికి ఈ ఫెలోషిప్‌లు అందిస్తారు.

అర్హత: పీహెచ్‌డీ/ఎండీ/ఎంటెక్/ఎంవీఎస్సీలలో మంచి అకడెమిక్ రికార్డుతో ఉత్తీర్ణత సాధించడంతోపాటు విదేశాల్లో ఆర్ అండ్ డీ సంస్థల్లో మూడేళ్ల పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ అనుభవం తప్పనిసరి. విదేశాల నుంచి స్వదేశానికి తిరిగొచ్చి మన దేశంలో ఇక్కడే పని చేస్తున్న భారతీయులకు ఈ ఫెలోషిప్ అందించరు.
వయో పరిమితి: నిర్దేశిత కటాఫ్ తేదీ నాటికి 55ఏళ్లు మించరాదు.

ఫెలోషిప్ వ్యవధి: ఐదేళ్లు
ఫెలోషిప్: ఫెలోషిప్‌నకు ఎంపికైనవారిని ఫ్యాకల్టీగా, వివిధ ఆర్ అండ్ డీ ఇన్‌స్టిట్యూషన్స్‌ల్లో సైంటిస్ట్-డీ విభాగంలో శాస్త్రవేత్తగా నియమిస్తారు. రెమ్యునరేషన్‌గా నెలకు రూ.75,000 అందించడంతోపాటు ఇంటి అద్దె అలవెన్స్ కింద నెలకు రూ.7500 చెల్లిస్తారు. అంతేకాకుండా కాంటిన్‌జెన్సీ గ్రాంట్ కింద మొదటి ఏడాది రూ.10 లక్షలు, రెండో ఏడాది రూ.7.5 లక్షలు, మూడో ఏడాది రూ.5 లక్షలు అందిస్తారు. వీటిని ఎక్విప్‌మెంట్ కొనుగోలుకు, సెమినార్‌లకు హాజరు కావడానికి, రీసెర్చ్‌కు అవసరమైన మానవ వనరులను ఏర్పాటు చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు. వీటితోపాటు వైద్య సౌకర్యం, రవాణా భత్యం, లీవ్ ట్రావెల్ అలవెన్స్ మొదలైన సదుపాయాలు అందిస్తారు.

దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో ఉన్న దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని పూర్తిచేసి ఈ దిగువ చిరునామాకు పంపాలి.
డాక్టర్ మీనాక్షి మున్షీ, డెరైక్టర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ,
బ్లాక్-2, 7వ ఫ్లోర్, సీజీఎం కాంప్లెక్స్, లోఢీ రోడ్, న్యూఢిల్లీ-110003
ఈ-మెయిల్: rlsfellowship.dbt@nic.in
పూర్తిచేసిన దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: డిసెంబర్ 31, 2012
వెబ్‌సైట్: www.dbtindia.nic.in

ఎన్‌బీహెచ్‌ఎం స్కాలర్‌షిప్స్

2013-14 విద్యా సంవత్సరానికి మ్యాథమెటిక్స్‌లో పీహెచ్‌డీ చదవాలనుకునే విద్యార్థులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ హయ్యర్ మ్యాథమెటిక్స్ (ఎన్‌బీహెచ్‌ఎం) స్కాలర్‌షిప్పులను అందిస్తోంది.

అర్హత:
- మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా బీఏ/బీఎస్సీ/బీటెక్/బీఈ/ఎంఏ/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణత లేదా సంబంధిత కోర్సులు ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులూ అర్హులే.

- 10+2 నుంచి డిగ్రీ/పీజీ వరకు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ద్వితీయ శ్రేణితో బీఎస్సీ(ఆనర్స్)ఉత్తీర్ణులు అర్హులే.
- పీహెచ్‌డీ (మ్యాథ్స్) కోసం ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌లో దరఖాస్తు చేసుకుని ఉండాలి.

స్కాలర్‌షిప్: మొదటి రెండేళ్లు నెలకు రూ.16,000, ఆ తర్వాత సంవత్సరాల్లో నెలకు రూ.18000లతోపాటు ఏడాదికి రూ.20,000 కాంటిన్‌జెన్సీ గ్రాంట్ కూడా లభిస్తుంది. వీటితోపాటు ఇంటి అద్దె అలవెన్స్ కూడా అందిస్తారు.

స్కాలర్‌షిప్ వ్యవధి: నాలుగేళ్లు. విద్యార్థి ప్రతిభను బట్టి మరో ఏడాది పొడిగిస్తారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సెన్సైస్-చెన్నై, హరీశ్ చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-అలహాబాద్, ఐఐఎస్‌ఈఆర్ (పుణె) వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో పీహెచ్‌డీ మ్యాథ్స్ చదవడానికి ఈ పరీక్ష తప్పనిసరి.

ఎంపిక విధానం: రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా మౌఖిక పరీక్షకు ఎంపిక చేస్తారు. ఇందులో విజయం సాధించినవారిని స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: రెండున్నర గంటల వ్యవధిలో జరిగే పరీక్షలో మ్యాథ్స్‌పై పీజీ స్థాయిలో ప్రశ్నలుంటాయి. పాత ప్రశ్నపత్రాల కోసం www.nbhm.dae.gov.in చూడొచ్చు.

మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనా ఆధారంగా పూర్తిచేసిన దరఖాస్తును ఈ కింద చిరునామాకు పంపాలి.
ప్రొఫెసర్ ఈ.కేశవన్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సెన్సైస్, సీఐటీ క్యాంపస్, తారామణి, చెన్నై-600113. ఈ-మెయిల్: kesh@imsc.res.in

ముఖ్య తేదీలు:
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: నవంబర్ 30, 2012
రాత పరీక్ష: జనవరి 19, 2013
వెబ్‌సైట్: www.nbhm.dae.gov.in

Sunday, September 23, 2012

S.I. ప్రిపరేషన్ ప్లాన్




ఎస్.ఐ.ఆఫ్ పోలీస్ పరీక్ష రాసే అభ్యర్థులు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ పేపర్లతో పాటు తెలుగు, ఇంగ్లిష్ పేపర్లలో కనీస అర్హత మార్కులు సాధించాలి. పరీక్షలో అర్హత సాధించడానికే కాకుండా, ఎస్సైగా ఎన్నికైన అభ్యర్థులకు ఉత్తర ప్రత్యుత్తరాల నిర్వహణకు తెలుగు భాషా ప్రావీణ్యం అనివార్యం. అందువల్ల తెలుగు సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలి.

సిలబస్ విశ్లేషణ
తెలుగు పేపర్ 100 మార్కులకు ఉంటుంది. కింది భాషా నైపుణ్యానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
1. లేఖారచన (లెటర్ రైటింగ్)
2. పేరాగ్రాఫ్ రైటింగ్
3. అనువాదం(ట్రాన్‌‌సలేషన్)
4. కాంప్రహెన్షన్ రైటింగ్
5. వ్యాసరచన (ఎస్సే రైటింగ్)
6. నివేదికా రచన (రిపోర్‌‌ట రైటింగ్)
7. {పెసీ రైటింగ్ (సంక్షిప్తీకరణ)
మొదలైన అంశాలపై ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షలో తెలుగు సాహిత్య, వ్యాకర ణాంశాలు ఉండవు.
అభ్యర్థులు గమనించాల్సిన ప్రధానాంశాలు :
సమాధానాలు ప్రామాణికమైన వాడుక భాషలో రాయాలి.
అభ్యర్థులకు డిగ్రీ స్థాయి వరకు చదివిన తెలుగుభాషా ప్రావీణ్యం సరి పోతుంది.
తెలుగుపేపరు కేవలం అర్హత పరీక్షకేనని నిర్లక్ష్యం చేస్తే, మిగిలిన పేపర్లలో మంచి మార్కులొచ్చినా, ఉద్యోగం పొందలేరు.

వ్యాసరచన (ఎస్సే రైటింగ్) :
వ్యాసం అంటే విస్తరించి, వివరించి రాసే దని అర్థం. వ్యాసరచన సులువుగా అని పిస్తుంది. కానీ కష్టసాధ్యమైంది. వ్యాసరచన ద్వారా అభ్యర్థి ఆలోచనా శక్తి, ప్రతిభను అంచనా వేయటానికి వీలవుతుంది.

వ్యాసరచనకు ఇచ్చిన అంశాన్ని క్రమ పద్ధతిలో విశ్లేషించాలి. ఉపోద్ఘాతం, నిర్వచనం పేరాల వారీ విషయ వివరణ, లాభ నష్టాలు, పరిష్కారానికి సూచనలు, ఆకర్షణీయ శైలి, సమీక్షాత్మకమైన ముగింపు వ్యాసానికి ప్రధానంగా ఉండాలి.
ప్రముఖ ఆంగ్ల విమర్శకుల మాటలు అక్షరసత్యాలు.
'Brevity and clarity are very Important in Essay Writing But brevity should not be achieved at the cost of clarity'. సంక్షిప్తత, స్పష్టత వ్యాసరచనలో ప్రధాన అంశాలు. సంక్షిప్తత కోసం స్పష్టత పరిత్యజించడం తగదు.

సంక్షిప్తత, స్పష్టతలు సాధించగలిగే వ్యాసరచన కళాత్మకమైందే. అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఇచ్చిన ప్రశ్నను విశ్లేషించి రాయాలి. వ్యాసరచనకు 15 మార్కు లుంటాయి. ఇందులో రెండు ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం రాయాలి.
వ్యాసరచనకు ఇవ్వదగిన అంశాలు:
1. స్త్రీలు - భారత రాజ్యాంగం
2. జలయజ్ఞం
3. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర
4. భారతదేశం- మతకలహాలు
5. విద్యాసంస్థల్లో ర్యాగింగ్
6. పర్యావరణ పరిరక్షణ
7. సమాజంలో విస్తరిస్తున్న అవినీతి మొదలైనవి ప్రధానమైనవి.

లేఖారచన (లెటర్ రైటింగ్)
విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు తెలుగులో లేఖారచన పరీక్షల్లో ముఖ్యాంశంగా ఉంటుంది. వివిధ పోటీ పరీక్షల్లో కూడా పరీక్ష స్థాయిని బట్టి విధిగా లేఖా రచన ఉంటుంది. లేఖారచన నియమాలు ఇతర పరీక్షల్లో మాదిరి ఈ పరీక్షలో కూడా అభ్యర్థులు పాటించాలి.

లేఖా నియమాలు ...తేదీ, స్థలం, సంబోధన, ముగింపు వంటివి జాగ్రత్తగా పాటించాలి. తేదీ తర్వాత ఫుల్‌స్టాప్ (చుక్క) స్థలం తర్వాత కామావంటి సాంకేతికాంశాలు పాటించడం ముఖ్యం, అధికార్లకు, స్నేహితులకు, బంధు వులకు రాసేటప్పుడు సంబోధించాల్సిన పద్ధతులు, ముగించాల్సిన పద్ధతులుతెలుసు కోవడం కీలకం. లేఖలో విషయానికే ప్రాధాన్యమివ్వాలి. ఉపోద్ఘాతాలు, అనవసర విషయాలు ప్రస్తావించకుండా చూసుకోవాలి. లేఖారచనకు 15 మార్కులుంటాయి.

రాదగిన ప్రశ్నలు:
1. మంబై పేలుళ్ల నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదాన్ని నియంత్రించాలని కోరుతూ పత్రికా సంపాదకుడికి లేఖ.
2. రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిని తక్షణం కాపాడాల్సిన ఆవశ్యకతను తెలుపుతూ మిత్రుడికి లేఖ.
3. మారుతున్న వ్యవస్థలో పోలీస్ సంస్కరణల గురించి పత్రికా సంపాదకుడికి లేఖ.
4. మీ ప్రాంతంలో దోమల బెడద నివా రణ గురించి మున్సిపల్ కమిషనర్‌కు లేఖ.
5. మీ పట్టణంలో శాంతిభద్రలపై జిల్లా పోలీస్ అధికారికి లేఖ.

పేరాగ్రాఫ్ రైటింగ్
సామెతలు, సూక్తులు వంటి వాటిని లేదా సంస్కృతికి సంబం ధించి ఇచ్చిన రెండు అంశాల్లో ఒకదాన్ని గురించి వివరంగా ఔచిత్యమైన ఉల్లేఖనాలతో (కొటేషన్లు) ఆకర్షణీయమైన శైలిలో రాయాలి. ఈ ప్రశ్న సంతృప్తికరంగా రాయాలంటే సమగ్ర విషయ పరిజ్ఞానం అవసరం. సంక్షిప్తం, స్పష్టంగా రాయడం ముఖ్యం. ఈ ప్రశ్నకు సమాధానం రాయడం కష్టమైనప్పటికీ అభ్యాసంతో సులువుగానే రాయొచ్చు. ఈ అంశానికి 15 మార్కులు ఉంటాయి.

రాదగిన ప్రశ్నలు:
1. అందమే ఆనందం
2. శాంతం సముద్రం కంటే గొప్పది
3. నిదానమే ప్రధానం
4. ఆరోగ్యమే మహాభాగ్యం
5. మానవసేవే మాధవసేవ

అనువాదం (ట్రాన్‌‌సలేషన్):
అనువాదంలో అభ్యర్థికి మూలభాష, లక్ష్య భాషల్లో సామర్థ్యం ఉండాలి. తెలుగు పేపర్‌లో ఇచ్చిన అంశాన్ని ఇంగ్లిష్‌లోకి మార్చమంటారు. ఇంగ్లిష్ పేరాని తెలుగులోని అనువదించమంటారు. అభ్యర్థికి అనువాదం కొంచెం కష్టమే. తెలుగు పదాలకు సమానార్థకాలైన ఆంగ్ల పదాలు తెలిసి ఉండాలి.

వాటిని సరైన వాక్యక్రమంలో అమర్చగలగాలి. ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం, వ్యాకరణంపై అవగాహన ఉండాలి. తెలుగులో ఉన్న జాతీయాలకు ఇంగ్లిష్‌లో సమానార్థకాలైన ప్రోవెర్‌‌బ, ఇడియమ్స్ తెలుసుకోవాలి. కొన్ని తెలుగు పేరాలను తీసుకొని ఆంగ్లంలోకి అనువదించే అభ్యాసం చేయాలి.

అనువాదానికి సూచనలు: తెలుగులో ఉన్న కర్త్రర్థక (Active Voice) వాక్యాలను సందర్భాన్ని అనుసరించి ఇంగ్లిష్‌లో కర్మార్థక (Passive Voice) గా రాయాలి.
తెలుగులో ఉన్న చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లిష్‌లో సంయుక్త లేదా సంశ్లిష్ట వాక్యాలుగా సందర్భానుసారం మార్చి రాయాలి.

అందని ద్రాక్ష పుల్లన’ వంటి సామెతలను సమానార్థక ఆంగ్ల సామెత Gra-pes are sour గా రాయాలి. అనువాదానికి 15 మార్కులుంటాయి.

నివేదిక రచన (రిపోర్‌‌ట రైటింగ్)
సమాజంలో సమస్యాత్మక సంఘటనల వివరణే నివేదిక రచన. స్పష్టంగా, సూటిగా విషయాన్ని వివరించండం ప్రధానం. అభ్యర్థుల రచనా శక్తిని నిశితంగా పరీక్షించే అంశం నివేదిక రచన. ఇచ్చిన ప్రశ్న అనుసరించి సమస్య పూర్వాపరాలు గణాంకాలతోసహా వివరిం చడం అవసరం. నివేదిక రచనలో ఆకర్షణీయ శీర్షిక, సంఘటనను అనుసరించి రాయడం బాగుంటుంది. ఈ ప్రశ్నకు 15 మార్కులుంటాయి.

అడగదగిన అంశాలు:
1. కరువుతో దెబ్బతిన్న రైతుల సంక్షేమం
2. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు
3. యువతీ యువకుల ఆత్మహత్యలు
4. గృహహింస
5. వరకట్న చావులు
6. దేశ రక్షణ- భద్రత
7. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు

మొదలైన అంశాలు ప్రధానమైనవి. వీటిని వ్యాసంలా కాకుండా గణాంకాలు, వాస్తవ సంఘటనలు, ఉదాహరణలతో వివరిస్తే ఎక్కువ మార్కులు పొందొచ్చు.

సంక్షిప్తీకరణ- (ప్రెసీ రైటింగ్)
పరీక్షలో ఇచ్చిన పేరాగ్రాఫ్‌ని ముఖ్యమైన అంశాలు, సొంత మాటలతో సంక్షిప్తీకరించి రాయమంటారు. రాత నైపుణ్యాలకు సంబంధించిన అంశాల్లో ఇదొకటి. అభ్యర్థులు స్పష్టంగా, సంక్షిప్తంగా ఇచ్చిన అంశాన్ని జాగ్రత్తగా రెండు మూడు సార్లు చదివి మూడో వంతుకు కుదించి రాయాలి.

పేరాలో మాటలు యధాతథంగా రాయకూడదు.
ముఖ్యమైన అంశాలను సొంతమాటలతో కుదించి రాయాలి.
కుదించడంకోసం స్పష్టత లేకుండా అస్పష్టంగా రాయకూడదు.
సంక్షిప్తతతో పాటు స్పష్టత పాటించాలి.
ఇచ్చిన పేరాకు మంచి టైటిల్ రాయడం అవసరం.
ఈ ప్రశ్నకు 15 మార్కులుంటాయి. అభ్యాసంతో ఈ విభాగంలో మంచి మార్కులు సాధించొచ్చు.

కాంప్రహెన్షన్ పాసేజీ:
కాంప్రహెన్స్‌డ్ అంటే అర్థం చేసుకోవడం లేదా అవగాహనా సామర్థ్యం అని అర్థం. ఇది అభ్యర్థి అవగాహనా సామర్థ్యానికి పెట్టే పరీక్ష. పరీక్షలో ఇచ్చిన పెద్ద పేరాగ్రాఫ్ చదివి, దాని కింద ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఈ అంశం ప్రతిపోటీ పరీక్షలో పరీక్ష స్థాయిని బట్టి విధిగా ఉంటుంది.

కొంచెం జాగ్రత్తగా ఒకటి రెండుసార్లు పేరాని చదివితే ప్రశ్నలకు సులువుగా సమాధానాలు రాయొచ్చు. ఈ ప్రశ్నలో రెండు పేరాలిచ్చి ఒక్కోదాని కింద 5 ప్రశ్నలిస్తారు. దీనికి చాయిస్ లేదు. 10 ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి. మొత్తం పది మార్కులకు ఈ విభాగంలో ప్రశ్నలడుగుతారు.

Friday, August 17, 2012

రూరల్ మేనేజ్‌మెంట్ కోర్సులు...


దేశానికి పట్టు కొమ్మలు గ్రామాలు. అలాంటి గ్రామ ప్రాంతాల అభివృద్ధిలో కో-ఆపరేటివ్ సొసైటీలు, అభివృద్ధి ఏజెన్సీలది కీలక పాత్ర.. వీటిల్లో ప్రొఫెషనలిజం పెంచడం ద్వారా.. గ్రామాలు మరింత ముందడుగు వేసే అవకాశం ఉంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన కోర్సులను అందించే సంస్థ.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్, ఆనంద్ (ఐఆర్‌ఎంఏ). 2012-13 విద్యా సంవత్సరానికి ఐఆర్‌ఎంఏ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్(ఐఆర్‌ఎంఏ)ను 1979లో గుజరాత్‌లోని ఆనంద్‌లో స్థాపించారు. పాడి పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన డాక్టర్ కురియన్ మార్గదర్శకం మేరకు ఈ ఇన్‌స్టిట్యూట్ పని చేస్తుంది. ఈ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ సర్వీస్ మేనేజర్స్, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ అధికారులు, ఎన్‌జీఓలు, కార్పొరేట్ సంస్థలో రూరల్ డెవలప్‌మెంట్ విభాగాల్లో పని చేసే అధికారులకు మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా శిక్షణ ఇస్తుంది.

ఆఫర్ చేస్తున్న కోర్సులు: పోస్టుగ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్ (పీఆర్‌ఎమ్): గ్రామీణ అభివృద్ధి సంస్థల్లో, రూరల్ కో ఆపరేటివ్ సంస్థల్లో.. ప్రొఫెషనలిజంను పెంచడానికి అవసరమైన అంశాల దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను రూపొందించారు. గ్రామీణప్రాంతాల్లో చేపట్టవలసిన చర్యలు, కార్యక్రమాలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనేందుకు.. సంబంధిత ఆర్గనైజేషన్స్‌లో మేనేజర్‌గా విధులు నిర్వహించడానికి కావాలసిన నైపుణ్యాలను ఈ కోర్సులో బోధిస్తారు. ఈ కోర్సు క్లాస్ రూం టీచింగ్, ఫీల్డ్ వర్క్ (ఫీల్డ్ వర్క్), డెవలప్‌మెంట్ ఇంటర్న్‌షిప్, మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ అని నాలుగు విభాగాలుగా ఉంటుంది.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం)ఏదైనా గ్రాడ్యుయేషన్ (10+2+3 విధానంలో).

కాల వ్యవధి: రెండేళ్లు
ప్రవేశ విధానం: ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా. ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్‌ను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫెలో ప్రోగ్రాం ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌పీఆర్‌ఎమ్):
ఇది కోర్సు బేస్డ్ డాక్టోరల్ రెసిడెన్సీ ప్రోగ్రామ్. ఈ కోర్సులో భాగంగా పలు రకాల స్పెషలైజేషన్స్‌ను ఎంచుకోవాలి. అవి.. మేనేజ్‌మెంట్, అగ్రి బిజినెస్/రూరల్ మార్కెటింగ్, నేచురల్ రీసోర్స్ మేనేజ్‌మెంట్, డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్, మైక్రో ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, గవర్ననెస్ అండ్ లైవ్లీహుడ్స్, రూరల్ ఇన్ఫాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ పాలసీ అండ్ నాన్ ప్రాఫిట్ మేనేజ్‌మెంట్.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతోఏదైనా సబ్జెక్ట్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్. డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలి. లేదా ఐఆర్‌ఎంఏ నుంచి పీజీడిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ లేదా 60 శాతం మార్కులతో ప్రొఫెషనల్ డిగ్రీ (ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చరల్, సెన్సైస్)తోపాటు మూడేళ్ల అనుభవం (ఐదేళ్ల డిగ్రీకి-సంవత్సరం).

ఫెలోషిప్:
ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఫెలోషిప్ కూడా అందజేస్తారు. ప్రారంభంలో నెలకు రూ.14,000 ఫెలోషిప్ చెల్లిస్తారు. తర్వాత ఉండే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణులైన వారికి నెలకు రూ.16,000 ఫెలోషిప్ ఉంటుంది. ఇవికాకుండా కంటిన్‌జెన్సీ నిధుల కింద సంవత్సరానికి రూ. 20,000 చొప్పున నాలుగేళ్లు ఇస్తారు.

ప్రవేశ విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దీంతోపాటు ఒక వ్యాసాన్ని కూడా ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మేనేజ్ మెంట్, సోషల్ వర్క్, ఎకనామిక్స్, సోషియాలజీ, సైకాలజీ, కామర్స్‌లో యూజీసీ-జేఆర్‌ఎఫ్/సీఎఎస్‌ఐఆర్ నెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు రాత పరీక్షకు హాజరు కావల్సిన అవసరం లేదు. వీరికి ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు. ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్‌ను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

స్కాలర్‌షిప్-ప్లేస్‌మెంట్స్: ఐఆర్‌ఎంఏ విద్యార్థులకు రతన్‌టాటా స్కాలర్‌షిప్‌తోపాటు అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ స్కాలర్‌షిప్స్ అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా 15 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్ షిప్ మంజూరు చేస్తుంది. ఈ ఇన్‌స్టిట్యూట్ దారిద్య్రరేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న పేద విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో కొంత మినహాయింపు ఇస్తుంది. ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఆనంద్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటువంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ అందిస్తుంది. ప్లేస్‌మెంట్ విషయంలో కూడా ఐఆర్‌ఎంఏకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడి అభ్యర్థులు వివిధ యూనివర్సిటీలు, కాలేజీలు, ఎన్‌ఎంసీలతోపాటు ప్రఖ్యాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లలో వివిధ హోదాల్లో స్థిర పడ్డారు.

కెరీర్:
రూరల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేసిన వారికి కేంద్ర, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థల్లో విస్త్రత ఉద్యోగావకాశాలు ఉంటాయి. రూరల్ డెవలప్‌మెంట్, కమ్యూనిటీ మొబలైజేషన్, మేనేజింగ్ కలెక్టివ్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ప్లానింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ప్రొడెక్షన్ మేనేజ్ మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హ్యూమన్ రీసోర్స్ డెవలప్‌మెంట్, నేచురల్ రీసోర్స్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి. గ్రామీణాప్రాంతాల అభివృద్ధికోసం పనిచేసే వివిధ ప్రైవేట్ సంస్థల్లో, ఎన్‌జీవోలలో ఉపాధి అవకాశాలు లభించవచ్చు. పీహెచ్‌డీ పూర్తి చేసిన వారు వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో రూరల్ డెవలప్‌మెంట్, మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఫ్యాకల్టీగా అవకాశాలను పొందవచ్చు. ఈ కోర్సు ఉత్తీర్ణులకు సంవత్సరానికి రూ.8 లక్షల వరకు వేతనం లభించవచ్చు.

దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్డ్‌కాపీని ప్రింట్ అవు ట్ తీసి కింది చిరునామాకు పంపాలి. లేదా వెబ్‌సైట్ నుంచి కూడా దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిషన్స్ ఆఫీసు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ అండ్- ఆనంద్(ఐఆర్‌ఎంఏ)
ఆనంద్-388 001, గుజరాత్.

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: సెప్టెంబర్ 30, 2012
పరీక్ష తేదీ: నవంబర్ 11
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.
వివరాలకు: www.irma.ac.in


బీఎస్సీ(మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, బోటనీ) చేశాను. మైక్రోబయాలజీ, కెమిస్ట్రీలలో ఏ కోర్సుకు అవకాశాలుంటాయి? - లావణ్య కుమార్, తిరుపతి.
మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ రెండింటిలోను మంచి అవకాశాలుంటాయి. అయితే మైక్రోబయాలజీ అనేది స్పెషలైజ్డ్ కోర్సు కావడంతో ఈ కోర్సు చేసిన వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువేనని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్న రంగాల్లో మైక్రోబయాలజీ ఒకటి. మైక్రోబయాలజిస్ట్‌లు వ్యాధులు, వాటి కారణాలు, నివారణకు ఉపయోగించే ఔషధాలు వంటి అంశాలపై తమ పరిశోధనలు సాగిస్తుంటారు. మైక్రోబయాలజీలో పీజీ చేసిన తర్వాత మీకిష్టమైన అంశంలో షార్ట్‌టర్మ్ కోర్సు లేదా అందుకు సంబంధించిన శిక్షణను తీసుకోవచ్చు. పరిశోధన రంగంలోకి కూడా ప్రవేశించవచ్చు. ఈ కోర్సు చేసిన వారికి వివిధ డయాగ్నోస్టిక్ సెంటర్లు, రీసెర్చ్ లేబొరేటరీల్లో అవకాశాలుంటాయి. కెమిస్ట్రీ విషయానికొస్తే..ఇందులో అవకాశాలు కొంత పరిమితం. ఈ అంశంలో మాస్టర్/ పీహెచ్‌డీ చేసిన వారికి ఫార్మసీ కంపెనీలు, లేబొరేటరీల్లో విరివిగా అవకాశాలుంటాయి. అంతేకాకుండా విద్యా సంస్థల్లో లెక్చరర్‌గా పని చేసే అవకాశం కూడా ఉంటుంది. మన రాష్ట్రంలోని అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు మాస్టర్/ పీహెచ్‌డీ స్థాయిల్లో కెమిస్ట్రీని అందిస్తున్నాయి. ఆయా వర్సిటీ లు నిర్వహించే పరీక్షల ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది.



ఎంబీఏ(టెలికాం) కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లను తెలపండి? -సలీమ్, కర్నూల్.
ఇటీవల కాలంలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ) కోర్సులో నూతనంగా ప్రవేశపెట్టిన స్పెషలైజేషన్స్‌లో టెలికాం మేనేజ్‌మెంట్ ఒకటి. దేశంలో ప్రస్తుతం టెలికాం రంగం శరవేగంగా విస్తరిస్తుండడంతో ఈ కోర్సు చేసిన వారికి అవకాశాల పరంగా మంచి డిమాండ్ ఉంటోంది.

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
భారతి స్కూల్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్- ఐఐటీ, ఢిల్లీ.
కోర్సు: ఎంబీఏ(టెలికాం సిస్టమ్స్ మేనేజ్‌మెంట్)
అర్హత: బీఈ/బీటెక్/బీఆర్క్/బీఫార్మసీ/అగ్రికల్చరల్ ఇంజనీరింగ్/ 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ(ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథ్స్/కామర్స్/ఎకనామిక్స్ సంబంధిత బ్రాంచ్‌లలో)
ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
వెబ్‌సైట్: http://bsttm.iitd.ac.in

సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలికాం మేనేజ్‌మెంట్-పుణే
కోర్సు: ఎంబీఏ-టెలికాం(సిస్టమ్స్ అండ్ ఫైనాన్స్/మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ స్పెషలైజేషన్లుగా)
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్
ప్రవేశం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
వెబ్‌సైట్: www.sitm.ac.in


అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలికాం టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్-నోయిడా
కోర్సు: ఎంబీఏ(టెలీకమ్యూనికేషన్స్)
అర్హత: బీటెక్/బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్/ఐటీ)
ఎంపిక: క్యాట్/మ్యాట్/జీమ్యాట్ స్కోర్‌తోపాటు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా
వెబ్‌సైట్: www.amity.edu
బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సు వివరాలను తెలపండి?
-ప్రవీణ్, కమర్‌పల్లి.
బీఎస్సీ (అగ్రికల్చర్)కోర్సులో... ఆగ్రానమీ, హార్టికల్చర్, ప్లాంట్ పాథాలజీ, ఎంటమాలజీ, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్, జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్, సారుుల్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, యూనిమల్ హజ్బెండరీలు ప్రధాన సబ్జెక్టులు. వీటి తోపాటు హ్యుమానిటీస్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ వంటి ప్రాథ మిక సబ్జెక్టుల బోధన కూడా తప్పనిసరి. కోర్సులో చేరిన విద్యా ర్థి... విత్తనోత్పత్తి, కొత్త పద్ధతుల ఆవిష్కరణ, చీడపీడల గుర్తింపు, నివారణ మార్గాలు కనుగొనడం, అగ్రికల్చరల్ మార్కె టింగ్, విత్తనాభివృద్ధి వంటి అంశాల్లో పూర్తిస్థారుు నైపుణ్యం సాధించేలా బోధన జరుగుతుంది. నాలుగేళ్లపాటు 8 సెమిస్టర్ల విధానంలో సాగే ఈ కోర్సులో.. మొదటి సెమిస్టర్ మినహా రుుస్తే.. మిగతాదంతా ప్రాక్టికల్ ఓరియెంటెడ్.
అందువల్ల విద్యార్థులు ఆ కోణంలో క్షేత్రస్థారుు పరిశీలనలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.ఏజీ బీఎస్సీ ఉత్తీర్ణులకు ఇటు ప్రభుత్వ.. అటు ప్రైవేట్ రంగాల్లో పలు అవకాశాలు లభిస్తారుు. ఇటీవల ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షల్లో ఈ విద్యార్థులదే హవా. ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాలు పెరుగుతున్నారుు. ర్యాలీస్, మోన్‌శాంటో, ఐటీసీ, ఆంధ్రా బ్యాంక్, ఓబీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి సంస్థలు కూడా ఏజీ బీఎస్సీ విద్యార్థులను రిక్రూట్ చేసుకుంట్తున్నారుు. కేవలం బ్యాచ్‌లర్ డిగ్రీకే పరిమితంగా కాకుండా... పీజీ కూడా చదివితే అవకాశాలు మరింత విసృ్తతమవుతారుు. క్రాప్ ప్రొడ క్షన్, ఎంటమాలజీ, ప్లాంట్ పాథాలజీ, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ తదితర విభాగాల్లో పీజీ చేసిన వారికి మంచి డిమాండ్ ఉంది. స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయూలనుకుంటే... ఎంబీఏ (అగ్రికల్చరల్ మేనేజ్‌మెంట్) చదవాలి. దానివల్ల సొంతంగా యూనిట్‌లు ప్రారంభించే నైపుణ్యం వస్తుంది.

Friday, August 3, 2012

ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే?

యూఎస్‌లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ చేయాలనుకుంటున్నాను? వివరాలు తెలపండి?
- లక్ష్య, హైదరాబాద్.
యూఎస్‌లో ఎంఎస్ చేయాలంటే ముందుగా అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి. సంబంధిత ప్రిపరేషన్‌ను దాదాపుగా ఏడాదిన్నర ముందుగానే ప్రారంభించాలి. ఈక్రమంలో అక్కడి యూనివర్సిటీలు, వాటి అడ్మిషన్ ప్రక్రియను తెలుసుకోవాలి. సాధారణంగా ఏ దేశంలోనైనా అడ్మిషన్ విధానం ఏ రెండు ఇన్‌స్టిట్యూట్‌ల మధ్య ఒకే మాదిరిగా ఉండదు. ఇన్‌స్టిట్యూట్‌ల స్థాయి, ప-ర్వ చరిత్ర ఆధారంగా నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి యూఎస్‌లో ఏరోనాటికల్ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు, అడ్మిషన్ కోసం అవి పాటించే ప్రమాణాలను తెలుసుకోవాలి. ఈ క్రమంలో దాదాపు 10 నుంచి 12 టాప్ యూనివర్సిటీలను షార్ట్‌లిస్ట్ చేసుకోవాలి. విద్యార్థులు తాము ఎంచుకున్న కళాశాలలతో ఏడాది ముందుగా సంప్రదింపులు మొదలు పెట్టాలి. కోర్సు అప్లికేషన్, ఇతర సమాచారం కోసం ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు ఈ సమయంలోనే వినతి పత్రాలు సమర్పించాలి.

ఆ సమాచారం పొందాక.. రికమెండేషన్ లెటర్లు సిద్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యమైన దశ. ఇందుకోసం విద్యార్థులు తమకు బాగా తెలిసిన ప్రొఫెసర్లు లేదా ప్రొఫెషనల్స్‌ను సంప్రదించడం మంచిది. దీంతోపాటు తాము చదువుతున్న విద్యా సంస్థల నుంచి సంబంధిత డాక్యుమెంట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సాధారణంగా ప్రతి ఇన్‌స్టిట్యూట్ ప్రవేశ సమయానికి 4,5 నెలల ముందే తుది జాబితా రూపొందిస్తుంది. ఈ క్రమంలో విద్యార్థులకు సమాచారం కూడా పంపుతుంది. ప్రవేశం కల్పించిన ఇన్‌స్టిట్యూట్‌లు అందించే ఐ-20 ఫామ్‌తో వీసా కోసం దరఖాస్తు చేయాలి. ఇందుకోసం సంబంధిత కాన్సులేట్ లేదా ఎంబసీ అధికారుల్ని సంప్రదించాలి. దరఖాస్తు సమయంలోనే.. అందుబాటులో ఉన్న తేదీల్లో తమకు అనుకూలమైన తేదీలను వీసా ఇంటర్వ్యూ కోసం ఎంచుకోవడం మంచిది.

యూఎస్‌లో దాదాపు అన్ని యూనివర్సిటీలు టోఫెల్/ జీఆర్‌ఈ స్కోర్ ఆధారంగా ఎంఎస్‌లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు చివరి సంవత్సరంలోనే ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. అలా కాకుండా మూడో సంవత్సరంలోనే వీటిని ప-ర్తి చేసుకోవడం మంచిది. ఒకవేళ మొదట్లో నిరాశపరిచే ఫలితాలు వచ్చినా సరిదిద్దుకునే వీలుంటుంది. అంతేకాకుండా.. చివరి సంవత్సరంలో ఉండే ప్రాజెక్ట్ వర్క్ ఒత్తిడివల్ల ఈ పరీక్షలకు ప్రిపేరయ్యే సమయం లభించకపోవచ్చు.

ఉపయోగపడే వెబ్‌సైట్లు:
www.msinus.com
http://studyusa.com
www.vfsusa.co.in
www.studyusa.in
www.usnews.com

ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నాను. దీనికి సంబంధించిన వివరాలను తెలపండి?
- వర్థన్, కరీంనగర్.
ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించడానికి రెండు మార్గాలు.. ఒకటి ఆర్మ్‌డ్‌ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ చేయడం, ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ ఆధారంగా ఆర్మీలో డాక్టర్ చేరడం. ఆర్మీలో డాక్టర్‌గా సేవలు అందించడానికి వేదికగా నిలుస్తోంది ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్(ఏఎఫ్‌ఎంసీ)-పుణే. ఈ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంబీబీఎస్ చేయడం ద్వారా ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఎంబీబీఎస్‌లో ప్రవేశం కోసం ఏఎఫ్‌ఎంసీ జాతీయ స్థాయిలో ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఏఎఫ్‌ఎంసీలో ప్రవేశానికి ప్రతి ఏటా ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.

ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఏటా 130 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. ఎంట్రెన్స్ టెస్ట్ 200 ప్రశ్నలకు, 200 మార్కులకు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. ఇందుకోసం 2 గంటల సమయం కేటాయిస్తారు. బయాలజీ (బోటనీ, జువాలజీలను కలిపి), ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 50 ప్రశ్నల చొప్పున వస్తాయి. ఇంటెలిజెన్స్, లాజికల్ రీజనింగ్‌లపై 25 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్‌లపై 25 ప్రశ్నలుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో ఉత్తీర్ణులకు తర్వాతి దశల్లో ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఉంటుంది.

వీటి ఆధారంగా సీటు ఖరారు చేస్తారు. సంబంధిత నోటిఫికేషన్ జనవరి/ఫిబ్రవరిలలో వెలువడుతుంది. పరీక్ష మే నెలలో ఉంటుంది.
అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్(ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో) ఉత్తీర్ణత. భారతీయులై ఉండాలి. అవివాహితులు మాత్రమే అర్హులు. మెడికల్‌గా ఫిట్‌గా ఉండాలి.
కనీస వయసు: 17 సంవత్సరాలు, గరిష్ట వయసు: 22 సంవత్సరాలు మించకూడదు.
ఏఎఫ్‌ఎంసీ కాకుండా.. ఆర్మీ నేరుగా విడుదల చేసే ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ కాప్స్‌ను రిక్రూట్ చేసుకుంటుంది. ఈ విధంగా కూడా ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. సంబంధిత నోటిఫికేషన్ల కోసం ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ లేదా ఆర్మీ వెబ్‌సైట్ చూడొచ్చు.
వివరాలకు: htpp://afmc.nic.in,
htpp://indianarmy.nic.in

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంబైన్డ్ మెట్రిక్ లెవల్ పరీక్షకు సంబంధించిన వివరాలు తెలపండి?
- కృష్ణ, విజయవాడ.
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ).. దేశ వ్యాప్తంగా నిర్వహించే కంబైన్డ్ మెట్రిక్ లెవల్ ఎగ్జామినేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో స్టెనోగ్రాఫర్లు గ్రేడ్-‘సి’, గ్రేడ్-‘డి’, లోయర్ డివిజన్ క్లర్క్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తుంది. ఇటీవలి కాలంలో ఈ ఎగ్జామ్‌ను ‘హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్’గా పేరు మార్చారు. ఈ పరీక్ష ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సీవీసీ, విదేశీ మంత్రిత్వ శాఖ, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం, కస్టమ్స్‌తోపాటు పలు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/ఆఫీసులలో గ్రేడ్-‘సి’, గ్రేడ్-‘డి’, లోయర్ డివిజన్ క్లర్క్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ ఉంటుంది.

అర్హతలు: ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం.
వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్లు. రిజర్‌‌వడ్ అభ్యర్థులకు నిబంధనలమేరకు వయోసడలింపు ఉంటుంది. రెండు దశల్లో.. ఎంపిక ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో జనరల్ ఇంటలిజెన్స్, ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి రెండో దశలో పోస్టును బట్టి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా మెరిట్‌లిస్ట్ రూపొందిస్తారు. దాని ఆధారంగా నియామకం ఖరారు చేస్తారు.
వివరాలకు:htpp://ssc.nic.in

Wednesday, July 18, 2012

సీట్ల కేటాయింపులో ర్యాంకులు, రిజర్వేషన్లు ఎలా పరిగణిస్తారు?


ఎంసెట్-మెడికల్ కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధమైంది. వేలాదిమంది అభ్యర్థులు ఆ దిశగా
అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కౌన్సెలింగ్‌కు ఎలాంటి సర్టిఫికెట్లు తీసుకెళ్లాలి?
సీట్ల కేటాయింపులో ర్యాంకులు, రిజర్వేషన్లు ఎలా పరిగణిస్తారు?
గత ఏడాది ఏ రీజియన్ లో ఏ ర్యాంకు వరకు సీటు లభిస్తుంది? ఇలా ఎన్నో సందేహాలు..
ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకు, కౌన్సెలింగ్ తీరుతెన్నులపై విశ్లేషణకు
ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ ఐ.వి.రావుతో
ప్రత్యేక ఇంటర్వ్యూ..

1. ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ విధానంలో ఏమైనా మార్పులున్నాయా?
జవాబు: కౌన్సెలింగ్ విధానంలో కొత్త మార్పులేమీ లేవు. గతంలో మాదిరిగానే రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సెంటర్ల నుంచి ఆన్‌లైన్ విధానంలోనే కౌన్సెలింగ్ ఉంటుంది. అవి.. హైదరాబాద్‌లో జేఎన్‌టీయూ కౌన్సెలింగ్ సెంటర్; విజయవాడలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ క్యాంపస్; విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్యకేంద్రం బిల్డింగ్ ఎదురుగా; తిరుపతిలో ఎస్‌వీ యూనివర్సిటీ ఓల్డ్ ఎంబీఏ బిల్డింగ్ ఎదురుగా. విద్యార్థులు ఈ నాలుగు కేంద్రాల్లో ఎక్కడైనా కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు.

2. సీట్లు, కళాశాలల సంఖ్య పెరుగుదలకు సంబంధించి ఈ ఏడాది కొత్త మార్పులు?
జవాబు: ప్రభుత్వ పరిధిలోని మొత్తం 14 కళాశాలల్లో మూడు కళాశాలలు.. ఆంధ్ర మెడికల్ కాలేజ్ (విశాఖపట్నం), కర్నూలు మెడికల్ కళాశాల, స్టేట్‌వైడ్ కళాశాల సిద్ధార్థ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 50 చొప్పున మొత్తం 150 సీట్లు పెరిగాయి. అదేవిధంగా ప్రైవేటు విభాగంలో మెడిసిటీ ఇనిస్టిట్యూట్ ఆ్‌ఫ్ మెడికల్ సెన్సైస్ (ఘన్‌పూర్)లో 50 సీట్లు, మహారాజా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(విజయనగరం)లో 50 సీట్లు పెరిగాయి. బీడీఎస్‌కు సంబంధించి సీట్లు, కళాశాలల విషయంలో ఎలాంటి మార్పులు లేవు.

3. కొత్త కళాశాలల వివరాలు?
జవాబు: ఈ ఏడాది రాష్ట్రానికి కొత్తగా మూడు ప్రైవేటు కళాశాలల ఏర్పాటుకు అనుమతి లభించింది. అవి ఓయూ రీజియన్‌లో అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ రీసెర్చ్, హైదరాబాద్ (100 సీట్లు); మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, హైదరాబాద్ (150 సీట్లు); ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఎన్‌ఆర్‌ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (విశాఖపట్నం-150 సీట్లు). ఇలా.. ఇప్పటికే ఉన్న కళాశాలల్లో సీట్ల పెంపు, కొత్త కళాశాలల్లో సీట్లు ద్వారా గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అదనంగా 650 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కడపలోని ఫాతిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌కు, ఈ ఏడాది ఎంసీఐ అనుమతి నిరాకరించడంతో వంద సీట్లు తగ్గాయి.

4. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థి ఎలాంటి సర్టిఫికెట్స్ సిద్ధం చేసుకుని హాజరు కావాలి?
జవాబు: నోటిఫికేషన్ ప్రకారం తమ ర్యాంకుకు సంబంధించిన తేదీల్లో తమకు అనుకూలమైన ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సెంటర్‌లో ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు రూ.300, ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 500 కౌన్సెలింగ్ ఫీజు చెల్లించి కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఇంటర్మీడియెట్ మార్కుల లిస్ట్, ఎస్‌ఎస్‌సీ లేదా సమాన అర్హత పరీక్ష సర్టిఫికెట్, ఇంటర్మీడియెట్ పాస్, మార్కుల సర్టిఫికెట్, టీసీ, స్టడీ సర్టిఫికెట్ (ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియెట్) తీసుకురావాలి.

ఆరు నుంచి ఇంటర్మీడియెట్ వరకు వరుసగా ఏడేళ్లు ఒకే ప్రాంతంలో చదవని విద్యార్థులు రెసిడెన్స్ సర్టిఫికెట్ తేవాలి. ఇతర రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులు తహసీల్దార్/ఎంఆర్‌ఓ జారీ చేసిన పదేళ్ల రెసిడెన్స్ సర్టిఫికెట్; ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హత ఉన్న విద్యార్థులు ఇన్‌కం సర్టిఫికెట్; రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులు ఎంఆర్‌ఓ/తహసీల్దార్ జారీ చేసిన కుల ధ్రువీకరణ సర్టిఫికెట్; ఆర్మీ/ఎన్‌సీసీ/స్పోర్ట్స్ అండ్ గేమ్స్/ ఆంగ్లోఇండియన్ కోటాకు చెందిన అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి.

5. లోకల్, నాన్ లోకల్ విధానం అమలు తీరు ఎలా ఉంటుంది?
జవాబు: లోకల్ ఏరియా నిర్ణయించడానికి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్(క్వాలిఫైయింగ్ ఎగ్జాం) వరకు విద్యార్థి చదివిన ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. ఇంటర్మీడియెట్‌తో సహా అంతకు ముందు వరుసగా ఏడేళ్లు (ఆరు నుంచి ఇంటర్మీడియెట్) వరకు ఏ యూనివర్సిటీ పరిధిలో చదివితే ఆ యూనివర్సిటీ పరిధిలోని మెడికల్ కళాశాలలకు లోకల్ అభ్యర్థిగా గుర్తింపు లభిస్తుంది. అలా కాకుండా ఇంటర్మీడియెట్‌లోపు వేర్వేరు యూనివర్సిటీ పరిధిల్లో సమానంగా చదివుంటే... ఇంటర్మీడియెట్ పూర్తి చేసే నాటికి ఏ వర్సిటీ పరిధిలో చదివితే ఆ వర్సిటీ లోకల్ అభ్యర్థిగా పరిగణిస్తారు.

6. ఒక విద్యార్థి ఇంటర్మీడియెట్‌లోపు మూడు రీజియన్లు (ఏయూ, ఎస్వీయూ, ఓయూ)లోనూ చదివుంటే కౌన్సెలింగ్‌లో అతడిని ఏ రీజియన్‌కు లోకల్ అభ్యర్థిగా పరిగణిస్తారు? (ఉదా: రమేశ్ అనే విద్యార్థి 4 నుంచి 7 వరకు ఏయూ పరిధిలో, 8 నుంచి 10 వరకు ఎస్వీయూ పరిధిలో, ఇంటర్మీడియెట్ ఓయూ పరిధిలో చదివితే అతడు కౌన్సెలింగ్‌లో ఏ ఏరియాకు లోకల్ అభ్యర్థి అవుతాడు).?

జవాబు: ఈ సందర్భంలో ఆ విద్యార్థి ఎస్‌వీ యూనివర్సిటీ పరిధిలోకి వస్తాడు. అలాగే ఆరు నుంచి ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం వరకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో, ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో చదివితే అలాంటి విద్యార్థులు ఉస్మానియా రీజియన్‌కు లోకల్ అభ్యర్థులవుతారు.

7. కౌన్సెలింగ్‌లో ముందుగా అన్ రిజర్వ్‌డ్ (15 శాతం) సీట్లను భర్తీ చేస్తారా? లేదా లోకల్ కేటగిరీ భర్తీ అయ్యాక అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ భర్తీ చేస్తారా?
జవాబు: మొదట అన్‌రిజర్వ్‌డ్ 15 శాతం సీట్లు, తరువాత 85 శాతం లోకల్ సీట్లు భర్తీ చేస్తారు. మొదటగా భర్తీ చేసే 15 శాతం అన్ రిజర్వ్‌డ్ కోటా సీట్ల కోసం.. విద్యార్థులు తమ రీజియన్‌తో సంబంధం లేకుండా రాష్ట్రం మొత్తంలోని కళాశాలల్లో సీట్ల కోసం పోటీ పడొచ్చు.

8. ఫీజు రీయింబర్‌‌సమెంట్ పొందే విద్యార్థులు తీసుకురావాల్సిన పత్రాలు? లేదా వారు కౌన్సెలింగ్ సమయంలో ఫీజు చెల్లించి తర్వాత రీయింబర్‌‌సమెంట్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలా?

జవాబు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా వర్గాల ఫీజు రీయింబర్స్‌మెంట్ సదుపాయం ఉంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ప్రభుత్వ కళాశాలలతో పాటు ప్రైవేటు ఏ-కేటగిరీ, బీ-కేటగిరీ సీట్లకు; బీసీ అభ్యర్థులకు, కుటుంబ వార్షికాదాయం రూ. లక్ష లోపు ఉన్న ఈబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ కళాశాలల సీట్లు, ప్రైవేటు ఏ-కేటగిరీ సీట్లకు రీయింబర్స్‌మెంట్‌కు లభిస్తుంది. వీరు కౌన్సెలింగ్ సమయంలో కేవలం యూనివర్సిటీ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ట్యూషన్ ఫీజు చెల్లించక్కర్లేదు. ఈ సదుపాయం పొందాలంటే మాత్రం తప్పనిసరిగా ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాల్సిందే.

9. సీట్ల భర్తీ క్ర మంలో పరిగణించే అంశాలు వరుస క్రమంలో? వివరించగలరు. అంటే ‘ర్యాంకు, రీజియన్, రిజర్వేషన్, లోకల్- నాన్ లోకల్, ఓపెన్’ వీటిలో వేటిని వర ుస క్రమంలో పరిగణిస్తూ సీటు కేటాయింపు చేస్తారు.

జవాబు:రిజర్వేషన్, లోకల్ ఏరియా కేటగిరీలతో నిమిత్తం లేకుండా ముందుగా ర్యాంకు ఆధారంగా సీటు లభిస్తుందో? లేదో? చూస్తాం? తర్వాత యూనివర్సిటీ ఏరియా, రిజర్వేషన్, లోకల్, నాన్ లోకల్ వీటిని వరుసగా పరిగణనలోకి తీసుకుంటాం. మెరిట్ అభ్యర్థి నాన్‌లోకల్ ఏరియాలో ఎక్కడైనా సీటు పొందొచ్చు.

10. రెండో దశ కౌన్సెలింగ్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు సీటు బదిలీ కోసం దీనికి హాజరయ్యే అవకాశం కల్పిస్తారా?
జవాబు: రెండో దశ కౌన్సెలింగ్ ఆగస్టులో జరుగుతుంది. మొదటి దశలో సీట్లు పొందిన అభ్యర్థులకు స్లైడింగ్ అవకాశం ఉంటుంది.

11. మౌలిక సదుపాయాల కొరత కారణంగా చూపుతూ ఎంసీఐ కొన్ని కళాశాలల్లో సీట్ల పెంపుదలకు నిరాకరించింది. వాటిలో ప్రభుత్వ కళాశాలలు కూడా ఉన్నాయి. దీనిపై మీ స్పందన?
జవాబు: సీట్లు పెంచడం, తగ్గించడం అంతా ఎంసీఐ స్వీయ నిర్ణయాధికారం. ఎంసీఐ బృందం తాము నిర్వహించే తనిఖీల్లో తేలిన అంశాల ఆధారంగా సీట్లను పెంచడం, తగ్గించడం వంటి నిర్ణయాలు తీసుకుంటుంది. సీట్లు పెంపుదల దిశగా మా వంతుగా కృషి చేస్తున్నాం.
ప్రతి కళాశాలపై యూనివర్సిటీ నిరంతర నిఘా, పర్యవేక్షణ ఉంటుంది. లోపాలు బయటపడితే దానికి సంబంధించిన క్రమశిక్షణ చర్యల తీసుకోవాలని ప్రభుత్వానికి, ఎంసీఐకి సిఫార్సు చేస్తాం.

12. ఈ ఏడాది కొత్తగా.. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీని కూడా ఆన్‌లైన్‌లోనే చేపట్టాలనే ఆలోచన ఈ కౌన్సెలింగ్‌లోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉందా?
జవాబు: ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.

13. ఎంబీబీఎస్, బీడీఎస్ కాకుండా ఇతర మెడికల్ కోర్సుల(హోమియోపతి, నేచురోపతి, ఆయుర్వేద , యునానీ) కౌన్సెలింగ్ ఎప్పుడు ఉంటుంది?
జవాబు: హోమియో, నేచురోపతి, ఆయుర్వేద డిగ్రీ కోర్సులకు ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఆగస్టులోనే కౌన్సెలింగ్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం.

14. చివరగా.. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు; సీటు పొంది కోర్సులో చేరాక మెరుగ్గా రాణించేందుకు మీరిచ్చే సలహాలు?

జవాబు: కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు నిర్దేశిత ధ్రువపత్రాలన్నీ తప్పనిసరిగా తీసుకురావాలి. ఒక్కటి లేకున్నా కౌన్సెలింగ్‌లో అనర్హతకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక.. సీటు పొందిన విద్యార్థులు.. ఎంబీబీఎస్ కోర్సు చాలా కఠినమైన కోర్సని గుర్తించాలి. ఎంసెట్ కోసం పడిన శ్రమకు ప్రతిఫలం లభించిందని సరిపెట్టుకోకుండా.. భవిష్యత్తులో మంచి వైద్యుడిగా గుర్తింపు పొందడం లక్ష్యంగా చేసుకోవాలి.

దీనికోసం కళాశాలలో చేరిన మొదటి రోజు నుంచే నిరంతర పరిశ్రమ చేసి సబ్జెక్టులను బాగా అధ్యయనం చేసి, క్లినికల్ స్కిల్స్ పూర్తిగా నేర్చుకోవాలి. ఇంటర్న్‌షిప్‌లో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం బాగా కృషి చేయాలి. రోగులతో సహృదయంతో వ్యవహరించి... నైపుణ్యత ఉన్న డాక్టర్‌గా తయారు కావాలని ఆకాంక్షిస్తున్నాను.

15. కోర్సు పూర్తయ్యాక రూరల్ సర్వీస్ తప్పనిసరా?
జవాబు: జీవో 166 ప్రకారం.. కోర్సు పూర్తయ్యాక ఏడాదిపాటు రూరల్ సర్వీస్ తప్పనిసరి. ఈ జీవో గత రెండేళ్ల నుంచి అమల్లో ఉంది.


మేనేజ్‌మెంట్ కోటా మార్గదర్శకాలు:

ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాలలు 40 శాతం సీట్లను మేనేజ్‌మెంట్ (ప్రైవేట్-సి) కోటా కింద భర్తీ చేసుకోవచ్చు.

ఏప్రిల్ 30, 2007న ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం 136 ప్రకారం ప్రతి కళాశాల మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి పత్రికా ప్రకటన జారీ చేయాలి.

నిర్దేశిత విద్యార్హతలు ఉండి, ఆసక్తి ఉన్న వారికి తప్పనిసరిగా దరఖాస్తులు అందజేయాలి. దరఖాస్తులు సమర్పించిన ప్రతి ఒక్కరికీ రశీదు ఇవ్వాలి. ప్రవేశ ప్రక్రియ అంతా పారదర్శకంగా నిర్వహించాలి.

వార్షిక ట్యూషన్ ఫీజు రూ. 5.5 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ కళాశాలల మేనేజ్‌మెంట్‌లు అంతకుమించి ఒక్కపైసా కూడా అదనంగా వసూలు చేయకూడదు. ఇలా చేస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లే.

అంతేకాకుండా ట్యూషన్ ఫీజు మొత్తాన్ని ఒకేసారి వసూలు చేయకూడదు. ప్రతి ఏటా ఆ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజును మాత్రమే వసూలు చేయాలి.

జీఓ 136ను ఉల్లంఘించినట్లు ఎవరైనా ఆధారాలతో నిరూపిస్తే సంబంధిత కళాశాలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.

కెరీర్‌కు వ్యవ‘సాయమే’


ఎంసెట్ ర్యాంకు ద్వారా ప్రవేశం కల్పించే బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (సీఏ అండ్ బీఎం), బీటెక్ ఫుడ్‌టెక్నాలజీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్‌ఎస్‌సీ, బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటి వివరాలు...

కెరీర్ గెడైన్‌‌స

యూనివర్సిటీలు-కోర్సులు
ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ- హైదరాబాద్

కోర్సు: బీఎస్సీ (అగ్రికల్చర్)
వ్యవధి: నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 620
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
అగ్రికల్చర్ కాలేజ్, బాపట్ల, గుంటూరు జిల్లా
అగ్రికల్చర్ కాలేజ్, నైరా, శ్రీకాకుళం జిల్లా
అగ్రికల్చర్ కాలేజ్, రాజమండ్రి, తూర్పు గోదావరి
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్
అగ్రికల్చర్ కాలేజ్, అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా
అగ్రికల్చర్ కాలేజ్, జగిత్యాల, కరీంనగర్ జిల్లా
ఎస్వీ అగ్రికల్చర్ కాలేజ్, తిరుపతి, చిత్తూరు జిల్లా
అగ్రికల్చర్ కాలేజ్, మహానంది, కర్నూలు జిల్లా

కోర్సు: బీఎస్సీ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (సీఏ అండ్ బీఎం)
వ్యవధి: నాలుగేళ్లు;
మొత్తం సీట్లు: 40
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్

కోర్సు: బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ)
వ్యవధి: నాలుగేళ్లు:
మొత్తం సీట్లు: 45
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బాపట్ల, గుంటూరు జిల్లా
కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పులివెందుల, వైఎస్‌ఆర్ జిల్లా

డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ -
వెంకటరామన్నగూడెం
కోర్సు: బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్
వ్యవధి: నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 230 సీట్లు.
వీటిలో 20 సీట్లు పేమెంట్ సీట్లు.
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా
కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్
కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్,మోజెర్ల,మహబూబ్‌నగర్ జిల్లా
కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, అనంతరాజుపేట, వైఎస్‌ఆర్ జిల్లా

శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ-తిరుపతి
కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ (బీవీఎస్సీ అండ్ ఏహెచ్)
వ్యవధి: ఐదేళ్లు
మొత్తం సీట్లు: 240
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, హైదరాబాద్
కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి, చిత్తూరు జిల్లా
ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, గన్నవరం, కృష్ణా జిల్లా
కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, ప్రొద్దుటూరు, వైఎస్‌ఆర్ జిల్లా
కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, కోరుట్ల, కరీంనగర్ జిల్లా

కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ (బీఎఫ్‌ఎస్‌సీ)
వ్యవధి: నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 30
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా

అర్హత:
ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత. బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సుకు ఇంటర్‌లో ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల్లో ప్రతి సబ్జెక్టులోనూ 50 శాతం (ఎస్సీ, ఎస్టీలు 40 శాతం) మార్కులు సాధించి ఉండాలి.
ఎంసెట్-2012లో ర్యాంకు తప్పనిసరి.
వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి కనీసం 17 ఏళ్లు ఉండి 22 ఏళ్లు మించరాదు. గరిష్ట వయోపరిమితి ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు, శారీరక వికలాంగులకు 27 ఏళ్లు.

దరఖాస్తు విధానం:
www.angrau.net నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: జూలై 24, 2012
వెబ్‌సైట్: www.angrau.net

Saturday, June 30, 2012

కెరీర్‌గా... ఫొటోగ్రఫీ


మాటలకందని భావాలను వ్యక్తపరచడానికి.. జీవితంలోని మధురస్మృతులను బంధించి సొంతం చేసుకోవడానికి చక్కటి మాధ్యమం.. ఫొటోగ్రఫీ. అభిరుచి, సృజనాత్మకత ఉన్న వారికి సరిపడే రంగం ఫొటోగ్రఫీ.

కోర్సు:
ఫొటోగ్రఫీకి సంబంధించి ఆరు నెలల షార్ట్‌టర్మ్ కోర్సులతోపాటు డిప్లొమా, సర్టిఫికెట్, బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సంస్థలు పదో తరగతి అర్హతతో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. అధిక శాతం ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రం 10+2/ఇంటర్మీడియెట్ అర్హతతో బ్యాచిలర్, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

స్పెషలైజేషను:్ల
ఇతర కోర్సులకు భిన్నంగా ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉండడం ఫొటోగ్రఫీలో ప్రధాన ప్రత్యేకత. ఫొటో జర్నలిజం, కమర్షియల్ ఫొటోగ్రఫీ, అడ్వర్టైజింగ్, ఫ్యాషన్ ఫొటోగ్రఫీ, వెడ్డింగ్ ఫొటోగ్రఫీ, ఇండస్ట్రియల్ ఫొటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ, ఏరియల్ ఫొటోగ్రఫీ, సైంటిఫిక్ ఫొటోగ్రఫీ.. ఇలా పలురకాల స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఫ్యాషన్ ఫొటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పట్ల చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.

స్కిల్స్:
ఫొటోగ్రఫీలో రాణించాలనుకునే వారికి సృజనాత్మకత ముఖ్యం. దృశ్యాన్ని అందంగా చిత్రీకరించడంలో కీలకమైన బ్యాక్‌గ్రౌండ్ కలర్స్, లైటింగ్ వంటి అంశాల్లో చక్కని అవగాహన ఉండాలి. సాంకేతికంగా ఈ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.

ఉన్నత విద్య:
డిప్లొమా ఇన్ ఫొటోగ్రఫీని చేసినవారు బీఎఫ్‌ఏ చేయొచ్చు. బీఎఫ్‌ఏ పూర్తిచేస్తే ఎంఎఫ్‌ఏ ఫొటోగ్రఫీ చేయొచ్చు. మన రాష్ట్రంలో జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఎంఎఫ్‌ఏ కోర్సును ఆఫర్ చేస్తోంది. ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఇంకా మనదేశంలో అనేక యూనివర్సిటీలు ఎంఎఫ్‌ఏ ఫొటోగ్రఫీ కోర్సును అందిస్తున్నాయి.

అవకాశాలు:
ఫొటోగ్రఫీ కోర్సు చేసిన వారికి అవకాశాలకు కొదవేలేదు. ఫొటో జర్నలిస్ట్‌లకు వివిధ పత్రికలు, టీవీ ఛానెళ్లల్లో అవకాశాలుంటాయి. ఎంచుకున్న స్పెషలైజేషన్స్‌ను బట్టి వివిధ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, ఇండస్ట్రియల్ హౌస్‌లు, సైంటిఫిక్ జర్నల్స్, ఫ్యాషన్ హౌస్‌లు, ప్రభుత్వ సంస్థలు తదితర విభాగాల్లో అవకాశాలుంటాయి.

నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ వంటి అంతర్జాతీయ మీడియా హౌసుల్లో కూడా పని చేసే సౌలభ్యం ఉంటుంది. సొంతంగా స్టూడియోలను ఏర్పాటు చేసుకోవడంతోపాటు ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా కూడా పని చేయొచ్చు.

వేతనాలు:
ఏదైనా సంస్థల్లో ప్రారంభంలో కనీసం రూ. 8000 వేతనంగా పొందొచ్చు. పనితీరు, అనుభవాన్ని బట్టి నెలకు రూ. 20,000 సంపాదించడం సులువే. సొంతంగా ఫొటో స్టూడియోలు నిర్వహించొచ్చు. వివిధ కార్యక్రమాలకు ఫొటోలు తీయడం ద్వారా కూడా మంచి ఆదాయం పొందొచ్చు.

ఫొటోగ్రఫీని వివిధ స్థాయిల్లో ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
మన రాష్ట్రంలో..
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ-హైదరాబాద్
కోర్సు: బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ)
అర్హత: ఇంటర్మీడియెట్
వెబ్‌సైట్: www.jnafau.ac.in

శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ - హైదరాబాద్.
కోర్సు: బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ)
అర్హత: ఇంటర్మీడియెట్

ఇతర సంస్థలు:
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-అహ్మదాబాద్
కోర్సు: రెండేళ్ల వ్యవధితో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫొటోగ్రఫీ డిజైన్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
అర్హత: సంబంధిత అంశంలో గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.nid.edu

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫొటోగ్రఫీ -ముంబై
కోర్సు: ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో ఆరు నెలల పార్ట్‌టైం డిప్లొమా కోర్సును అందిస్తోంది.
వెబ్‌సైట్:
http://photoinstutenip.com

ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం-చెన్నై
కోర్సు: ఫొటో జర్నలిజం ఒక అంశంగా పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజంను ఆఫర్ చేస్తోంది.

అర్హత:
ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్:
www.asianmedia.org http://www.asianmedia.org

ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-పుణే
వెబ్‌సైట్: www.ftiindia.com

సెయింట్ జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్-ముంబై
వెబ్‌సైట్: www.xaviercomm.org

Wednesday, June 27, 2012

ఇంటర్‌తోనే పీజీకి మార్గం ఇంటిగ్రేటెడ్ కోర్సులు

డిగ్రీ.. అది పూర్తయ్యాక పీజీ. సాధారణంగా ఈ రెండు చదవాలంటే వేర్వేరు చోట్లే సాధ్యం! పైగా డిగ్రీ పూర్తయ్యాక పీజీలో చేరాలంటే.. ఏదైనా యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు రాసి తీరాలి. ఇప్పుడు కాలం మారింది. డిగ్రీ, పీజీ ఒకేచోట చదివే అవకాశాన్ని కల్పించడానికి వివిధ ఐఐటీలు, కేంద్రీయ, రాష్ట్రస్థాయి యూనివర్సిటీలు ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ పీజీలను అందిస్తోన్న వర్సిటీలు.. కోర్సులపై విశ్లేషణ...

ఎవరు అర్హులు:
ఇంటర్మీడియెట్ చదివిన వారెవరైనా ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సులు అభ్యసించొచ్చు. ఈ కోర్సుల వ్యవధి ఐదేళ్లు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసిన వారు ఇంజనీరింగ్, సైన్స్ డిగ్రీ, పీజీ చదవచ్చు. లేదంటే.. ఇంటర్ అర్హతతో లా, మేనేజ్‌మెంట్, కామర్స్ వంటి కోర్సుల్లోనూ చేరొచ్చు. ఐదేళ్ల ఈ కోర్సుల్లో చేరి, మూడేళ్లకే మానేస్తే వారికి డిగ్రీ వస్తుంది. నాలుగేళ్లు చదివితే డిగ్రీ(ఆనర్స్) ఇస్తారు. పూర్తిగా ఐదేళ్లు చదివితే ఐదేళ్ల పీజీ చేతికి వస్తుంది. 

గుర్తింపు ముఖ్యమే:

ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ కోర్సులు అభ్యసించిన విద్యార్థులు ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయగా, ఆ కోర్సులకు గుర్తింపు లేదని ఏపీపీఎస్సీ మెలిక పెట్టగా.. యూనివర్సిటీ అధికారులు రాసిన లేఖలకు సమాధానంగా యూజీసీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ), ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు గుర్తింపు ఉందని పేర్కొన్నాయి. ఈ మేరకు యూనివర్సిటీకి లేఖలు అందాయి. దీంతో వివాదం సుఖాంతమైంది. కాబట్టి సంబంధిత వర్సిటీలు అందించే కోర్సులకు గుర్తింపు ఉందో లేదో తెలుసుకుని చేరడం మంచిది.

అదేవిధంగా కోర్సులను కూడా పూర్తిగా ఐదేళ్లు నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఇది ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీని ప్రకారం మూడేళ్లు పూర్తయ్యాక డిగ్రీ పట్టా ఇవ్వకపోవచ్చు! మూడేళ్ల పట్టా ముందుగానే ఇచ్చేస్తే ఈ కోర్సుల ఉద్దేశం దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేయడమే దీనికి కారణం. కాబట్టి విద్యార్థులు కోర్సుల్లో చేరే ముందే అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. 

మన రాష్ర్టంలో..

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ-గుంటూరు

ఎంఎస్సీ నానోటెక్నాలజీ
అర్హత: ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణత.
ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్)
అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
{పవేశం: యూనివర్సిటీ ప్రవేశపరీక్ష ద్వారా
వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in

ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం

ఎంఎస్ అప్లైడ్ కెమిస్ట్రీ: సీట్లు: 30
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ లేదా బైపీసీ ఉత్తీర్ణత.
ఎంఎస్ జియాలజీ: సీట్లు: 30
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ లేదా బైపీసీ ఉత్తీర్ణత.
ఎంఎస్ ఎకనామిక్స్:
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
{పవేశం: యూనివర్సిటీ రాత పరీక్ష ఆధారంగా
వెబ్‌సైట్: www.andhrauniversity.info

ఆదికవి నన్నయ యూనివర్సిటీ-రాజమండ్రి

ఎంఎస్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్: సీట్లు: 30
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్‌లతో ప్రథమ శ్రేణిలో ఇంటర్ ఉత్తీర్ణత.
ఎంఎస్ పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్: సీట్లు: 30
అర్హత: ఇంటర్ ఎంపీసీ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత.
ఎంఎస్ బయోటెక్నాలజీ: సీట్లు: 20
అర్హత: బయాలజీ, ఫిజిక్స్‌తో ఇంటర్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత.
ఎంఎస్ మైక్రో బయాలజీ: సీట్లు: 15
అర్హత: బయాలజీ, ఫిజిక్స్‌తో ఇంటర్ ప్రథమ శ్రేణి.
ఎంఎస్ ఎకనామిక్స్: సీట్లు: 30
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
{పవేశం: యూనివర్సిటీ రాతపరీక్ష ఆధారంగా.
వెబ్‌సైట్: www.nannayauniversity.info/

కాకతీయ యూనివర్సిటీ-వరంగల్

ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు:
కెమిస్ట్రీ; బయోటెక్నాలజీ; ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ
ఎంపిక: కేయూసెట్‌లో ర్యాంక్ ఆధారంగా
వెబ్‌సైట్: www.kuwarangal.com

నేషనల్ లా యూనివర్సిటీ-విశాఖపట్నం

ఇంటిగ్రేటెడ్ బీఏ, ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్)
అర్హత: 45 శాతం మార్కులతో 10+2 ఉత్తీర్ణత
{పవేశం: క్లాట్‌లో ర్యాంకు ఆధారంగా.
వెబ్‌సైట్: www.apulvisakha.org/

జేఎన్‌టీయూ-కాకినాడ

ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్స్:
కోర్సులు: బీటెక్(ఈసీఈ, సీఎస్‌ఈ, సివిల్, ఈఈఈ)
వెబ్‌సైట్: http://jntuk.edu.in/ 

ఇంటిగ్రేటెడ్ పీజీతో ప్రయోజనాలు

- ఫాస్ట్‌ట్రాక్ విధానంలో కోర్సులు పూర్తి చేయాలనుకుంటే ఇంటిగ్రేటెడ్ పీజీలు ఎంతో ప్రయోజనకరం. 
సంప్రదాయ కోర్సులకు భిన్నంగా విద్యార్థులు జ్ఞా నాన్ని సముపార్జించేందుకు వీలుగా... అతి ముఖ్యమైన, అవసరమైన అంశాల బోధన, అప్లికబిలిటీ ఉండే విధంగా కోర్సుల రూపకల్పన ఉంటుంది. 

- పాఠ్యాంశాలపై లోతైన విశ్లేషణ, ప్రాక్టికల్‌కు ప్రాధాన్యమివ్వడం ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రత్యేకత. 

- డిగ్రీ, పీజీలను సమ్మిళితం చేస్తున్న ఈ పీజీల పట్ల విద్యార్థుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. ప్రవేశానికి ఇంటర్మీడియెట్ అర్హత కావడంతో.. ఏ కెరీర్‌లో స్థిరపడవచ్చో ముందుగానే అవగాహనకు వచ్చే వీలుంటుంది. 

- {పస్తుతం ఆర్ట్స్, సైన్స్, లా, హ్యుమానిటీస్, ఇంజినీరింగ్ ఇలా.. అన్ని విభాగాల్లోనూ ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మార్చి- మే లోపు వీటిల్లో ప్రవేశానికి నోటిఫికేషన్లు విడుదలవుతాయి.

- మొదటి మూడేళ్లు పూర్తయ్యాక బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్ కూడా విద్యార్థుల చేతికందుతుండటం ఈ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల ప్రత్యేకత. 

కేంద్రీయ విద్యా సంస్థల్లో..

ఎన్‌ఐటీల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులు:
ఎన్‌ఐటీ-రూర్కెలా (ఒడిశా) అందిస్తోన్న కోర్సులు:
ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-ఫిజిక్స్;కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్

ఐదేళ్ల బీటెక్-ఎంటెక్ డ్యుయెల్ డిగ్రీ ప్రోగ్రామ్స్
బీటెక్ సిరామిక్ ఇంజనీరింగ్ అండ్ ఎంటెక్ ఇండస్ట్రియల్ సిరామిక్స్ 
బీటెక్-ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్
బీటెక్ సివిల్ అండ్ ఎంటెక్ ట్రాన్స్‌పోర్టేషన్
బీటెక్ సివిల్ అండ్ ఎంటెక్ వాటర్‌రిసోర్స్
బీటెక్-ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
బీటెక్-ఎంటెక్ మైనింగ్ ఇంజనీరింగ్
బీటెక్-ఎంటెక్ మెటలర్జికల్ - మెటీరియల్స్ సైన్స్
బీటెక్ సీఎస్‌ఈ అండ్ ఎంటెక్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ.
{పవేశం: ఏఐఈఈఈ ర్యాంక్ ఆధారంగా.
వెబ్‌సైట్: www.nitrkl.ac.in/

ఏబీవీ-ఐఐఐటీఎం-గ్వాలియర్

బీటెక్+ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్; బీటెక్+ఎంబీఏ
{పవేశం: ఏఐఈఈఈ ర్యాంక్ ఆధారంగా.
వెబ్‌సైట్: www.iiitm.ac.in/

ఐఐఎంలలో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు:
సంస్థ: ఐఐఎం-ఇండోర్
ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్
అర్హత: 60 శాతం మార్కులతో పదోతరగతితోపాటు 10+2లో ఉత్తీర్ణత.
ఎంపిక: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా.
వెబ్‌సైట్: www.iimidr.ac.in/ 

ఐఐఎస్‌ఈఆర్-భోపాల్, కోల్‌కతా, మొహాలి, పుణె, తిరువనంతపురం క్యాంపస్‌లు

కోర్సులు: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్
విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.
వెబ్‌సైట్: www.iiser-admissions.in


పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ

ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు:
అప్లైడ్ జియాలజీ; కెమిస్ట్రీ; ఫిజిక్స్; మ్యాథమెటిక్స్; కంప్యూటర్ సైన్స్; స్టాటిస్టిక్స్; ఎకనామిక్స్
అర్హత: 50 శాతం మార్కులతో 10+2లో ఎంపీసీ ఉత్తీర్ణత. ఎకనామిక్స్‌కు 10+2లో (మ్యాథ్స్ ఆప్షనల్‌గా).
ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సులు:
హిస్టరీ; పొలిటికల్ సైన్స్; సోషియాలజీ
అర్హత: 50 శాతం మార్కులతో 10+2 ఉత్తీర్ణత.
ఎంపిక: యూనివర్సిటీ ప్రవేశపరీక్ష ఆధారంగా.
వెబ్‌సైట్: www.pondiuni.edu.in/

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇన్ సెన్సైస్:
మ్యాథమెటికల్ సెన్సైస్; సిస్టమ్స్ బయాలజీ; ఫిజిక్స్; కెమికల్ సెన్సైస్
అర్హత: 60 శాతం మార్కులతో సైన్స్ గ్రూప్‌తో ఇంటర్.
ఎంఏ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇన్ సోషల్ సెన్సైస్:
ఎకనామిక్స్; హిస్టరీ; పొలిటికల్ సైన్స్; సోషియాలజీ; ఆంత్రోపాలజీ
అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
ఎంఏ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇన్ హ్యుమానిటీస్:
హిందీ; తెలుగు; ఉర్దూ; లాంగ్వేజ్ సెన్సైస్
అర్హత: 60శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
{పవేశం: యూనివర్సిటీ ప్రవేశపరీక్ష ఆధారంగా 
వెబ్‌సైట్: www.uohyd.ac.in/

ఐఐటీల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు:

అప్లైడ్ జియాలజీ
సంస్థ: ఐఐటీ-కాన్పూర్
అప్లైడ్ మ్యాథమెటిక్స్ 
సంస్థ: ఐఐటీ-మద్రాస్
అప్లైడ్ ఫిజిక్స్
సంస్థ: ఐటీ-బీహెచ్‌యూ, వారణాసి
కెమిస్ట్రీ
సంస్థ: ఐఐటీ-బాంబే, ఐఐటీ-కాన్పూర్, మద్రాస్, ఐఎస్‌ఎం-ధన్‌బాద్
ఎకనామిక్స్
సంస్థ: ఐఐటీ-కాన్పూర్
ఎక్స్‌ప్లోరేషన్ జియోఫిజిక్స్
సంస్థ: ఐఐటీ-కాన్పూర్
మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్
సంస్థ: ఐఐటీ-కాన్పూర్, ఐఎస్‌ఎం-ధన్‌బాద్
ఫిజిక్స్
సంస్థ: ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-మద్రాస్

ఐదేళ్ల బీఎస్-ఎంఎస్ డ్యుయెల్ డిగ్రీ ప్రోగ్రామ్స్:

బయోలాజికల్ సెన్సైస్, ఫిజిక్స్
సంస్థ: ఐఐటీ-ఖరగ్‌పూర్
వెబ్‌సైట్: www.iitkgp.ac.in/

ఐదేళ్ల ఎంఎస్సీ టెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సులు:

అప్లైడ్ జియాలజీ, అప్లైడ్ జియోఫిజిక్స్
సంస్థ: ఐఎస్‌ఎం-ధన్‌బాద్
వెబ్‌సైట్: www.ismdhanbad.ac.in/