Saturday, June 30, 2012

కెరీర్‌గా... ఫొటోగ్రఫీ


మాటలకందని భావాలను వ్యక్తపరచడానికి.. జీవితంలోని మధురస్మృతులను బంధించి సొంతం చేసుకోవడానికి చక్కటి మాధ్యమం.. ఫొటోగ్రఫీ. అభిరుచి, సృజనాత్మకత ఉన్న వారికి సరిపడే రంగం ఫొటోగ్రఫీ.

కోర్సు:
ఫొటోగ్రఫీకి సంబంధించి ఆరు నెలల షార్ట్‌టర్మ్ కోర్సులతోపాటు డిప్లొమా, సర్టిఫికెట్, బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సంస్థలు పదో తరగతి అర్హతతో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. అధిక శాతం ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రం 10+2/ఇంటర్మీడియెట్ అర్హతతో బ్యాచిలర్, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

స్పెషలైజేషను:్ల
ఇతర కోర్సులకు భిన్నంగా ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉండడం ఫొటోగ్రఫీలో ప్రధాన ప్రత్యేకత. ఫొటో జర్నలిజం, కమర్షియల్ ఫొటోగ్రఫీ, అడ్వర్టైజింగ్, ఫ్యాషన్ ఫొటోగ్రఫీ, వెడ్డింగ్ ఫొటోగ్రఫీ, ఇండస్ట్రియల్ ఫొటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ, ఏరియల్ ఫొటోగ్రఫీ, సైంటిఫిక్ ఫొటోగ్రఫీ.. ఇలా పలురకాల స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఫ్యాషన్ ఫొటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పట్ల చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.

స్కిల్స్:
ఫొటోగ్రఫీలో రాణించాలనుకునే వారికి సృజనాత్మకత ముఖ్యం. దృశ్యాన్ని అందంగా చిత్రీకరించడంలో కీలకమైన బ్యాక్‌గ్రౌండ్ కలర్స్, లైటింగ్ వంటి అంశాల్లో చక్కని అవగాహన ఉండాలి. సాంకేతికంగా ఈ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.

ఉన్నత విద్య:
డిప్లొమా ఇన్ ఫొటోగ్రఫీని చేసినవారు బీఎఫ్‌ఏ చేయొచ్చు. బీఎఫ్‌ఏ పూర్తిచేస్తే ఎంఎఫ్‌ఏ ఫొటోగ్రఫీ చేయొచ్చు. మన రాష్ట్రంలో జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఎంఎఫ్‌ఏ కోర్సును ఆఫర్ చేస్తోంది. ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఇంకా మనదేశంలో అనేక యూనివర్సిటీలు ఎంఎఫ్‌ఏ ఫొటోగ్రఫీ కోర్సును అందిస్తున్నాయి.

అవకాశాలు:
ఫొటోగ్రఫీ కోర్సు చేసిన వారికి అవకాశాలకు కొదవేలేదు. ఫొటో జర్నలిస్ట్‌లకు వివిధ పత్రికలు, టీవీ ఛానెళ్లల్లో అవకాశాలుంటాయి. ఎంచుకున్న స్పెషలైజేషన్స్‌ను బట్టి వివిధ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, ఇండస్ట్రియల్ హౌస్‌లు, సైంటిఫిక్ జర్నల్స్, ఫ్యాషన్ హౌస్‌లు, ప్రభుత్వ సంస్థలు తదితర విభాగాల్లో అవకాశాలుంటాయి.

నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ వంటి అంతర్జాతీయ మీడియా హౌసుల్లో కూడా పని చేసే సౌలభ్యం ఉంటుంది. సొంతంగా స్టూడియోలను ఏర్పాటు చేసుకోవడంతోపాటు ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా కూడా పని చేయొచ్చు.

వేతనాలు:
ఏదైనా సంస్థల్లో ప్రారంభంలో కనీసం రూ. 8000 వేతనంగా పొందొచ్చు. పనితీరు, అనుభవాన్ని బట్టి నెలకు రూ. 20,000 సంపాదించడం సులువే. సొంతంగా ఫొటో స్టూడియోలు నిర్వహించొచ్చు. వివిధ కార్యక్రమాలకు ఫొటోలు తీయడం ద్వారా కూడా మంచి ఆదాయం పొందొచ్చు.

ఫొటోగ్రఫీని వివిధ స్థాయిల్లో ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
మన రాష్ట్రంలో..
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ-హైదరాబాద్
కోర్సు: బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ)
అర్హత: ఇంటర్మీడియెట్
వెబ్‌సైట్: www.jnafau.ac.in

శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ - హైదరాబాద్.
కోర్సు: బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ)
అర్హత: ఇంటర్మీడియెట్

ఇతర సంస్థలు:
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-అహ్మదాబాద్
కోర్సు: రెండేళ్ల వ్యవధితో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫొటోగ్రఫీ డిజైన్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
అర్హత: సంబంధిత అంశంలో గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.nid.edu

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫొటోగ్రఫీ -ముంబై
కోర్సు: ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో ఆరు నెలల పార్ట్‌టైం డిప్లొమా కోర్సును అందిస్తోంది.
వెబ్‌సైట్:
http://photoinstutenip.com

ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం-చెన్నై
కోర్సు: ఫొటో జర్నలిజం ఒక అంశంగా పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజంను ఆఫర్ చేస్తోంది.

అర్హత:
ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్:
www.asianmedia.org http://www.asianmedia.org

ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-పుణే
వెబ్‌సైట్: www.ftiindia.com

సెయింట్ జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్-ముంబై
వెబ్‌సైట్: www.xaviercomm.org

Wednesday, June 27, 2012

ఇంటర్‌తోనే పీజీకి మార్గం ఇంటిగ్రేటెడ్ కోర్సులు

డిగ్రీ.. అది పూర్తయ్యాక పీజీ. సాధారణంగా ఈ రెండు చదవాలంటే వేర్వేరు చోట్లే సాధ్యం! పైగా డిగ్రీ పూర్తయ్యాక పీజీలో చేరాలంటే.. ఏదైనా యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు రాసి తీరాలి. ఇప్పుడు కాలం మారింది. డిగ్రీ, పీజీ ఒకేచోట చదివే అవకాశాన్ని కల్పించడానికి వివిధ ఐఐటీలు, కేంద్రీయ, రాష్ట్రస్థాయి యూనివర్సిటీలు ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ పీజీలను అందిస్తోన్న వర్సిటీలు.. కోర్సులపై విశ్లేషణ...

ఎవరు అర్హులు:
ఇంటర్మీడియెట్ చదివిన వారెవరైనా ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సులు అభ్యసించొచ్చు. ఈ కోర్సుల వ్యవధి ఐదేళ్లు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసిన వారు ఇంజనీరింగ్, సైన్స్ డిగ్రీ, పీజీ చదవచ్చు. లేదంటే.. ఇంటర్ అర్హతతో లా, మేనేజ్‌మెంట్, కామర్స్ వంటి కోర్సుల్లోనూ చేరొచ్చు. ఐదేళ్ల ఈ కోర్సుల్లో చేరి, మూడేళ్లకే మానేస్తే వారికి డిగ్రీ వస్తుంది. నాలుగేళ్లు చదివితే డిగ్రీ(ఆనర్స్) ఇస్తారు. పూర్తిగా ఐదేళ్లు చదివితే ఐదేళ్ల పీజీ చేతికి వస్తుంది. 

గుర్తింపు ముఖ్యమే:

ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ కోర్సులు అభ్యసించిన విద్యార్థులు ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయగా, ఆ కోర్సులకు గుర్తింపు లేదని ఏపీపీఎస్సీ మెలిక పెట్టగా.. యూనివర్సిటీ అధికారులు రాసిన లేఖలకు సమాధానంగా యూజీసీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ), ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు గుర్తింపు ఉందని పేర్కొన్నాయి. ఈ మేరకు యూనివర్సిటీకి లేఖలు అందాయి. దీంతో వివాదం సుఖాంతమైంది. కాబట్టి సంబంధిత వర్సిటీలు అందించే కోర్సులకు గుర్తింపు ఉందో లేదో తెలుసుకుని చేరడం మంచిది.

అదేవిధంగా కోర్సులను కూడా పూర్తిగా ఐదేళ్లు నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఇది ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీని ప్రకారం మూడేళ్లు పూర్తయ్యాక డిగ్రీ పట్టా ఇవ్వకపోవచ్చు! మూడేళ్ల పట్టా ముందుగానే ఇచ్చేస్తే ఈ కోర్సుల ఉద్దేశం దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేయడమే దీనికి కారణం. కాబట్టి విద్యార్థులు కోర్సుల్లో చేరే ముందే అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. 

మన రాష్ర్టంలో..

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ-గుంటూరు

ఎంఎస్సీ నానోటెక్నాలజీ
అర్హత: ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణత.
ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్)
అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
{పవేశం: యూనివర్సిటీ ప్రవేశపరీక్ష ద్వారా
వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in

ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం

ఎంఎస్ అప్లైడ్ కెమిస్ట్రీ: సీట్లు: 30
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ లేదా బైపీసీ ఉత్తీర్ణత.
ఎంఎస్ జియాలజీ: సీట్లు: 30
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ లేదా బైపీసీ ఉత్తీర్ణత.
ఎంఎస్ ఎకనామిక్స్:
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
{పవేశం: యూనివర్సిటీ రాత పరీక్ష ఆధారంగా
వెబ్‌సైట్: www.andhrauniversity.info

ఆదికవి నన్నయ యూనివర్సిటీ-రాజమండ్రి

ఎంఎస్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్: సీట్లు: 30
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్‌లతో ప్రథమ శ్రేణిలో ఇంటర్ ఉత్తీర్ణత.
ఎంఎస్ పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్: సీట్లు: 30
అర్హత: ఇంటర్ ఎంపీసీ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత.
ఎంఎస్ బయోటెక్నాలజీ: సీట్లు: 20
అర్హత: బయాలజీ, ఫిజిక్స్‌తో ఇంటర్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత.
ఎంఎస్ మైక్రో బయాలజీ: సీట్లు: 15
అర్హత: బయాలజీ, ఫిజిక్స్‌తో ఇంటర్ ప్రథమ శ్రేణి.
ఎంఎస్ ఎకనామిక్స్: సీట్లు: 30
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
{పవేశం: యూనివర్సిటీ రాతపరీక్ష ఆధారంగా.
వెబ్‌సైట్: www.nannayauniversity.info/

కాకతీయ యూనివర్సిటీ-వరంగల్

ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు:
కెమిస్ట్రీ; బయోటెక్నాలజీ; ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ
ఎంపిక: కేయూసెట్‌లో ర్యాంక్ ఆధారంగా
వెబ్‌సైట్: www.kuwarangal.com

నేషనల్ లా యూనివర్సిటీ-విశాఖపట్నం

ఇంటిగ్రేటెడ్ బీఏ, ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్)
అర్హత: 45 శాతం మార్కులతో 10+2 ఉత్తీర్ణత
{పవేశం: క్లాట్‌లో ర్యాంకు ఆధారంగా.
వెబ్‌సైట్: www.apulvisakha.org/

జేఎన్‌టీయూ-కాకినాడ

ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్స్:
కోర్సులు: బీటెక్(ఈసీఈ, సీఎస్‌ఈ, సివిల్, ఈఈఈ)
వెబ్‌సైట్: http://jntuk.edu.in/ 

ఇంటిగ్రేటెడ్ పీజీతో ప్రయోజనాలు

- ఫాస్ట్‌ట్రాక్ విధానంలో కోర్సులు పూర్తి చేయాలనుకుంటే ఇంటిగ్రేటెడ్ పీజీలు ఎంతో ప్రయోజనకరం. 
సంప్రదాయ కోర్సులకు భిన్నంగా విద్యార్థులు జ్ఞా నాన్ని సముపార్జించేందుకు వీలుగా... అతి ముఖ్యమైన, అవసరమైన అంశాల బోధన, అప్లికబిలిటీ ఉండే విధంగా కోర్సుల రూపకల్పన ఉంటుంది. 

- పాఠ్యాంశాలపై లోతైన విశ్లేషణ, ప్రాక్టికల్‌కు ప్రాధాన్యమివ్వడం ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రత్యేకత. 

- డిగ్రీ, పీజీలను సమ్మిళితం చేస్తున్న ఈ పీజీల పట్ల విద్యార్థుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. ప్రవేశానికి ఇంటర్మీడియెట్ అర్హత కావడంతో.. ఏ కెరీర్‌లో స్థిరపడవచ్చో ముందుగానే అవగాహనకు వచ్చే వీలుంటుంది. 

- {పస్తుతం ఆర్ట్స్, సైన్స్, లా, హ్యుమానిటీస్, ఇంజినీరింగ్ ఇలా.. అన్ని విభాగాల్లోనూ ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మార్చి- మే లోపు వీటిల్లో ప్రవేశానికి నోటిఫికేషన్లు విడుదలవుతాయి.

- మొదటి మూడేళ్లు పూర్తయ్యాక బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్ కూడా విద్యార్థుల చేతికందుతుండటం ఈ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల ప్రత్యేకత. 

కేంద్రీయ విద్యా సంస్థల్లో..

ఎన్‌ఐటీల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులు:
ఎన్‌ఐటీ-రూర్కెలా (ఒడిశా) అందిస్తోన్న కోర్సులు:
ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-ఫిజిక్స్;కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్

ఐదేళ్ల బీటెక్-ఎంటెక్ డ్యుయెల్ డిగ్రీ ప్రోగ్రామ్స్
బీటెక్ సిరామిక్ ఇంజనీరింగ్ అండ్ ఎంటెక్ ఇండస్ట్రియల్ సిరామిక్స్ 
బీటెక్-ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్
బీటెక్ సివిల్ అండ్ ఎంటెక్ ట్రాన్స్‌పోర్టేషన్
బీటెక్ సివిల్ అండ్ ఎంటెక్ వాటర్‌రిసోర్స్
బీటెక్-ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
బీటెక్-ఎంటెక్ మైనింగ్ ఇంజనీరింగ్
బీటెక్-ఎంటెక్ మెటలర్జికల్ - మెటీరియల్స్ సైన్స్
బీటెక్ సీఎస్‌ఈ అండ్ ఎంటెక్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ.
{పవేశం: ఏఐఈఈఈ ర్యాంక్ ఆధారంగా.
వెబ్‌సైట్: www.nitrkl.ac.in/

ఏబీవీ-ఐఐఐటీఎం-గ్వాలియర్

బీటెక్+ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్; బీటెక్+ఎంబీఏ
{పవేశం: ఏఐఈఈఈ ర్యాంక్ ఆధారంగా.
వెబ్‌సైట్: www.iiitm.ac.in/

ఐఐఎంలలో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు:
సంస్థ: ఐఐఎం-ఇండోర్
ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్
అర్హత: 60 శాతం మార్కులతో పదోతరగతితోపాటు 10+2లో ఉత్తీర్ణత.
ఎంపిక: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా.
వెబ్‌సైట్: www.iimidr.ac.in/ 

ఐఐఎస్‌ఈఆర్-భోపాల్, కోల్‌కతా, మొహాలి, పుణె, తిరువనంతపురం క్యాంపస్‌లు

కోర్సులు: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్
విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.
వెబ్‌సైట్: www.iiser-admissions.in


పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ

ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు:
అప్లైడ్ జియాలజీ; కెమిస్ట్రీ; ఫిజిక్స్; మ్యాథమెటిక్స్; కంప్యూటర్ సైన్స్; స్టాటిస్టిక్స్; ఎకనామిక్స్
అర్హత: 50 శాతం మార్కులతో 10+2లో ఎంపీసీ ఉత్తీర్ణత. ఎకనామిక్స్‌కు 10+2లో (మ్యాథ్స్ ఆప్షనల్‌గా).
ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సులు:
హిస్టరీ; పొలిటికల్ సైన్స్; సోషియాలజీ
అర్హత: 50 శాతం మార్కులతో 10+2 ఉత్తీర్ణత.
ఎంపిక: యూనివర్సిటీ ప్రవేశపరీక్ష ఆధారంగా.
వెబ్‌సైట్: www.pondiuni.edu.in/

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇన్ సెన్సైస్:
మ్యాథమెటికల్ సెన్సైస్; సిస్టమ్స్ బయాలజీ; ఫిజిక్స్; కెమికల్ సెన్సైస్
అర్హత: 60 శాతం మార్కులతో సైన్స్ గ్రూప్‌తో ఇంటర్.
ఎంఏ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇన్ సోషల్ సెన్సైస్:
ఎకనామిక్స్; హిస్టరీ; పొలిటికల్ సైన్స్; సోషియాలజీ; ఆంత్రోపాలజీ
అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
ఎంఏ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇన్ హ్యుమానిటీస్:
హిందీ; తెలుగు; ఉర్దూ; లాంగ్వేజ్ సెన్సైస్
అర్హత: 60శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
{పవేశం: యూనివర్సిటీ ప్రవేశపరీక్ష ఆధారంగా 
వెబ్‌సైట్: www.uohyd.ac.in/

ఐఐటీల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు:

అప్లైడ్ జియాలజీ
సంస్థ: ఐఐటీ-కాన్పూర్
అప్లైడ్ మ్యాథమెటిక్స్ 
సంస్థ: ఐఐటీ-మద్రాస్
అప్లైడ్ ఫిజిక్స్
సంస్థ: ఐటీ-బీహెచ్‌యూ, వారణాసి
కెమిస్ట్రీ
సంస్థ: ఐఐటీ-బాంబే, ఐఐటీ-కాన్పూర్, మద్రాస్, ఐఎస్‌ఎం-ధన్‌బాద్
ఎకనామిక్స్
సంస్థ: ఐఐటీ-కాన్పూర్
ఎక్స్‌ప్లోరేషన్ జియోఫిజిక్స్
సంస్థ: ఐఐటీ-కాన్పూర్
మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్
సంస్థ: ఐఐటీ-కాన్పూర్, ఐఎస్‌ఎం-ధన్‌బాద్
ఫిజిక్స్
సంస్థ: ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-మద్రాస్

ఐదేళ్ల బీఎస్-ఎంఎస్ డ్యుయెల్ డిగ్రీ ప్రోగ్రామ్స్:

బయోలాజికల్ సెన్సైస్, ఫిజిక్స్
సంస్థ: ఐఐటీ-ఖరగ్‌పూర్
వెబ్‌సైట్: www.iitkgp.ac.in/

ఐదేళ్ల ఎంఎస్సీ టెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సులు:

అప్లైడ్ జియాలజీ, అప్లైడ్ జియోఫిజిక్స్
సంస్థ: ఐఎస్‌ఎం-ధన్‌బాద్
వెబ్‌సైట్: www.ismdhanbad.ac.in/

అవగాహన కల్పించే గత ర్యాంకుల విశ్లేషణ..

మరి కొద్ది రోజుల్లో ఎంసెట్ ర్యాంకులు విడుదల కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్మీడియెట్‌లో మార్కుల వెయిటేజీ లెక్కింపులో బిజీగా ఉన్నారు. ఇక.. ఎంసెట్ ర్యాంకులు వెల్లడైతే.. తమకు ఏ ర్యాంకు వచ్చింది? ఏ కాలేజీలో సీటు వస్తుంది? ఏ బ్రాంచ్ మంచిది? అనే విషయాలపై ఆలోచనలు సాగించడం సహజం. అందుకే.. ఈ విషయాల్లో విద్యార్థులను ముందుగానే సన్నద్ధం చేసేలా.. రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో గత ఏడాది చివరి ర్యాంకులపై విశ్లేషణ.. 

రాష్ట్రంలో ఏడు వందలకుపైగా ఇంజనీరింగ్ కళాశాలలు.. మూడు లక్షలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ఇంజనీరింగ్ అంటే క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. ఆ కోర్సులో ప్రవేశిస్తే.. నాలుగేళ్ల తర్వాత సర్టిఫికెట్ చేతిలో పడితే జీవితం సాఫీగా సాగుతుందని, భవిష్యత్తు బాగుంటుందనేదే ఆలోచన. మన రాష్ట్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌కు ఏటేటా పెరుగుతున్న ఆదరణే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇక.. ఎంసెట్ ర్యాంకులు విడుదలవుతున్నాయంటే విద్యార్థుల్లో ఒకవిధమైన ఆందోళన. ఏ ర్యాంకుకు ఏ కాలేజ్‌లో, ఏ బ్రాంచ్ లో సీటొస్తుందని లెక్కలేస్తుంటారు. 

గత ర్యాంకుల విశ్లేషణతో మార్గం:
గత ఏడాది ఆయా కాలేజీల్లో, ఆయా బ్రాంచ్‌ల్లో చివరి సీటు ఏ ర్యాంకుతో ముగిసిందనే సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా విద్యార్థులు ప్రాథమికంగా తమకు లభించే బ్రాంచ్, కాలేజ్ విషయంలో ఒక అవగాహన పొందే అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల వెబ్‌కౌన్సెలింగ్ సమయంలో ఆప్షన్స్ నింపే క్రమంలో... అందుబాటులో ఉన్న అవకాశాలను చేజార్చుకోకుండా జాగ్రత్తపడొచ్చు. తమకు వచ్చిన ర్యాంకు పరిధిలోనే మెరుగైన కళాశాలను ఎంచుకునేందుకు వీలవుతుంది.

కాలేజ్ తర్వాత.. బ్రాంచ్:
కాలేజీ విషయంలో స్పష్టత ఏర్పడ్డాక తక్షణం తలెత్తే ప్రశ్న ఏ బ్రాంచ్ మంచిది? సదరు కళాశాలలో తక్కువ ర్యాంకుతో సీట్లు భర్తీ అయిన బ్రాంచ్‌ను తెలుసుకోవడం ద్వారా ఆ నిర్దిష్ట కాలేజీలో ఏ బ్రాంచ్ మంచిదో తెలుసుకునే ఆస్కారం లభిస్తుంది. 

వన్నె తరగని బ్రాంచ్.. ఈసీఈ:

ఎన్ని వందల కళాశాలలున్నా.. ఎన్ని లక్షల సీట్లు ఉన్నా వన్నె తరగని బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్. క్యాంపస్ కళాశాలలు, ఏ గ్రేడ్ ప్రైవేట్ కళాశాలలు మొదలు.. సాధారణ కళాశాలల వరకు ముందుగా సీట్లు భర్తీ అయ్యే బ్రాంచ్ ఈసీఈ కావడమే ఇందుకు నిదర్శనం. భవిష్యత్తులో ఉన్నత విద్య, ఉపాధి పరంగా విస్తృత అవకాశాలు ఉండటం; ఆర్థిక సంక్షోభాలకు; మార్కెట్ ఒడిదుడుకులకు ఎక్కువగా గురికాని ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ విభాగాల్లో అవకాశాలు లభించడమే ఇందుకు కారణం. 

సాఫ్ట్‌వేర్‌కు రూట్.. సీఎస్‌ఈ:

సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు మార్గం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సాఫ్ట్‌వేర్ రంగంలో అవసరమైన అప్లికేషన్స్, ప్రోగ్రాం డెవలప్‌మెంట్ వంటి అంశాల్లో ఈ కోర్సు ద్వారా శిక్షణ పొందొచ్చు.

నిర్మాణ రంగంలో భవిష్యత్తుకు సివిల్:
నిర్మాణ రంగంలో భవిష్యత్తును కోరుకునే విద్యార్థులకు సరైన వేదిక సివిల్ ఇంజనీరింగ్. అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేటు రంగం మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో సివిల్ ఇంజనీరింగ్‌కు చక్కటి భవిష్యత్తు ఉందనేది నిస్సందేహం. ఈ విభాగంలో అధిక శాతం విధులు క్షేత్రస్థాయిలో ఉంటాయి. కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ ఎంచుకునే విద్యార్థులకు ఆ మేరకు శారీరక సన్నద్ధత అవసరం. 

ఈసీఈ తర్వాత స్థానం ఈఈఈ:
ఈసీఈ తర్వాత అత్యధిక శాతం విద్యార్థులు ఆసక్తి చూపుతున్న బ్రాంచ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ). ఎలక్ట్రికల్ రంగంతోపాటు ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ భవిష్యత్తులో అవకాశాలు లభించడమూ మరో కారణం. ఇటీవల కాలంలో ప్రైవేటు సంస్థలతోపాటు పబ్లిక్ సెక్టార్ సంస్థలు కూడా బీటెక్(ఈఈఈ) విద్యార్థులను భారీస్థాయిలో ట్రైనీలుగా నియమించుకుంటున్నాయి. అందుకే ఈఈఈని కూడా బెటర్ ఆప్షన్‌గా పేర్కొనొచ్చు.

మెకానికల్.. మెరుగవుతున్న జాబ్స్:

గత దశాబ్దం వరకు మెకానికల్ ఇంజనీరింగ్‌కు అవకాశాలు పరిమితం అని చెప్పొచ్చు. కానీ ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ఆటోమొబైల్ రంగం విస్తరించడం, పలు విదేశీ సంస్థల ప్రవేశంతో మెకానికల్ పట్టభద్రులకు కూడా మెండైన అవకాశాలు లభిస్తున్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీతో బీహెచ్‌ఈఎల్, హెచ్‌ఏఎల్, డీఆర్‌డీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ట్రైనీగా అడుగుపెట్టి కెరీర్ ప్రారంభించవచ్చు. 

విదేశీ భాష... అవకాశాల బాట...


విదేశీ భాష నేర్చుకోవడం ఒకప్పుడు హాబీ. ఇప్పుడు అదే అవకాశాలకు బాట వేస్తోంది. ఫారిన్ లాంగ్వేజ్‌లో ప్రావీణ్యం సంపాదిస్తే... ట్రాన్స్‌లేషన్, ఇంటర్‌ప్రిటేషన్, టీచింగ్, రీసెర్చ్‌ల్లో దేశ, విదేశాల్లో కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు.

ప్రభుత్వ రంగంలోని జాబ్స్‌తో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్, రాయబార కార్యాలయాలు, మల్టీనేషనల్ కంపెనీలు, కాల్ సెంటర్స్, టూరిజం సంస్థల్లో అవకాశాలు మెండు. స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, అరబిక్, పర్షియన్, పోర్చుగీస్, చైనీస్, జపనీస్, రష్యన్... ఇలా ఏ ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకున్నా.. ఉపాధికి ఢోకా లేదు.

ఫారిన్ లాంగ్వేజెస్ ఎందుకంటే...
గ్లోబలైజేషన్‌తో.. మల్టీనేషనల్ కంపెనీలు భారత్‌కు రావడం.. స్వదేశీ కంపెనీలు జాయింట్ వెంచర్స్ పేరిట విదేశాలకు వ్యాపారాన్ని విస్తరిస్తుండటం.. ఫలితంగా విదేశీ నిపుణులతో సంప్రదింపులు, డాక్యుమెంటేషన్ నిత్యకృత్యమయ్యాయి. దాంతో ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకున్నవారికి డిమాండ్ ఏర్పడింది. మన దేశం.. విదేశాలతో కుదుర్చుకున్న అవగాహనల ఫలితంగా.. వచ్చే సమాచారాన్ని క్రోడీకరించడం, నాన్ ఇంగ్లిష్ స్పీకింగ్ దేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరగడం వంటి కారణాలతో ఫారిన్ లాంగ్వేజెస్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.

ప్రతి దేశానికీ ఏదో ఒక విషయంలో అవసరం/కొరత ఉంటుంది. ఆ కొరత తీరాలంటే.. ఇతర దేశాల సహకారం అనివార్యం. చైనాలో ఇంగ్లిష్ శిక్షకుల కొరత చాలా ఎక్కువ. జపాన్‌కు ఇంజనీర్లు, మలేషియాకు ఉపాధ్యాయులు, అమెరికాకు నర్సులు బాగా అవసరం.

ఇక్కడ నిపుణులు అక్కడ పనిచేయాలంటే ఆ దేశాల భాషలు నేర్చుకోలి. విదేశీ సంస్థల కార్యాలయాలు భారత్‌లోనూ.. భారత్‌కు చెందిన సంస్థల కార్యాలయాలు విదేశాల్లో ఏర్పాటవుతున్నాయి. వీరి మధ్య భాషా సంధనకర్తలు అవసరం. అందుకే పరదేశీ భాషలు... అవకాశాలకు బాటలేస్తున్నాయి.

బహుళజాతి కంపెనీ ఉద్యోగులు కొన్నిసార్లు క్లైంట్‌తో కలిసి పనిచేయడం, వాళ్లతో మమేకం కావడం తప్పనిసరి. ఇద్దరికీ ఇంగ్లిష్ రానప్పు డు క్లైంట్ భాష వచ్చిన వారికే ఆన్‌సైట్ ఆఫర్.
విదేశాల నుంచి భారత్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతోంది.

వారి భాష మనకు తెలిస్తే టూరిస్ట్ గైడ్‌గా వ్యవహరించొచ్చు. పెద్ద హోటళ్లలోనూ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. మారుతున్న వాణిజ్య కార్యకలాపాల దృష్ట్యా ఒక భాషలోని సమాచారం మరో భాషలోకి తర్జుమా చేయాల్సిన అవసరం ఎక్కువైంది.

పుస్తకాలు బాగా అనువాదమవుతున్నాయి. కాబట్టి విదేశీ భాషపై పట్టు ఉంటే ట్రాన్స్‌లేటర్ కావొచ్చు. అవుట్ సోర్సింగ్, మెడికల్ ట్రా న్స్‌క్రిప్షన్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో విదేశీ భాషలు వచ్చినవారి సేవలు తప్పనిసరి.

ప్రవేశం.. కోర్సులు:
దేశంలో ఫారిన్ లాంగ్వేజెస్‌కు సంబంధించి వివిధ స్థాయిల్లో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం. కొన్ని వర్సిటీలు.. డిప్లొమా/సర్టిఫికెట్‌తో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఈఫ్లూ), జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ-ఢిల్లీ.. పీహెచ్‌డీ స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, కన్సల్టెన్సీలు కూడా సంబంధిత భాషల్లో కోర్సులను నిర్వహిస్తున్నాయి.

ఆఫర్ చేస్తోన్న యూనివర్సిటీలు/సంస్థలు:

ఉస్మానియా యూనివర్సిటీ
ఎంఏ: అరబిక్, ఫ్రెంచ్, పర్షియన్ కోర్సులు రెగ్యులర్ విధానంలో అందిస్తోంది. డిగ్రీలో కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత భాష డిగ్రీ స్థాయిలో చదివినవాళ్లు అర్హులు.

జూనియర్ డిప్లొమా: ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, మోడర్న్ అరబిక్, పర్షియన్ కోర్సులు రెగ్యులర్ విధానంలో నిర్వహిస్తోంది. కోర్సు వ్యవధి ఏడాది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు అర్హులు. పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది.
సీనియర్ డిప్లొమా: ఫ్రెంచ్, జర్మన్, రష్యన్. సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో జూనియర్ డిప్లొమా ఉత్తీర్ణులు, డిగ్రీలో సంబంధిత భాష చదివిన వాళ్లు ఈ కోర్సుకు అర్హులు. ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
అడ్వాన్స్‌డ్ డిప్లొమా: ఫ్రెంచ్, జర్మన్, రష్యన్. సంబంధిత భాషలో సీనియర్ డిప్లొమాలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

ఎంఫిల్: అరబిక్, ఫ్రెంచ్, పర్షియన్ కోర్సులు నిర్వహిస్తోంది. పీజీలో సంబంధిత భాషలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది.
పీహెచ్‌డీ: అరబిక్, ఫ్రెంచ్, పర్షియన్.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత, లేదా ఆ సబ్జెక్టులో ఎంఫిల్ ఉత్తీర్ణత.
వెబ్‌సైట్: www.osmania.ac.in

రామకృష్ణ మఠం, హైదరాబాద్
ఆఫర్ చేస్తోన్న కోర్సులు: జర్మన్, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్ భాషలు ఆరు స్థాయిల్లో నేర్పుతుంది. జపనీస్ ఐదు స్థాయిలు. ఒక్కోస్థాయి వ్యవధి మూడు నెలలు. ఏడాదికి మూడుసార్లు జనవరి, జూన్, సెప్టెంబర్ సెషన్లలో క్లాసులు ప్రారంభమవుతాయి. మూడు సమయాల్లో తరగతులు నిర్వహిస్తారు. ఫీజులు నామమాత్రంగా ఉంటాయి. సమర్థ బోధనా సి బ్బంది, క్రమశిక్షణ.. రామకృష్ణ మఠం ప్రత్యేకత.
వెబ్‌సైట్: www.rkmath.org

ఇఫ్లూ
రీసెర్చ్ ప్రోగ్రామ్స్: అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్.
అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు: అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్; ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సులు: అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్
రెండేళ్ల ఎంఏ కోర్సులు: అరబిక్ అండ్ ఫ్రెంచ్
పీజీ డిప్లొమా కోర్సులు: టీచింగ్ ఆఫ్ అరబిక్
డిప్లొమా కోర్సులు: అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్
సర్టిఫికెట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ: అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్
వెబ్‌సైట్: www.efluniversity.ac.in

యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
పీహెచ్‌డీ: జర్మన్, హిస్పానిక్, పర్షియన్
ఎంఫిల్: అరబిక్, బల్గేరియన్ లాంగ్వేజ్, ఫ్రెంచ్, జర్మన్, హిస్పానిక్ ఇటాలియన్, లింగ్విస్టిక్స్, పర్షియన్, రష్యన్.
ఎంఏ: అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, హిస్పానిక్, ఇటాలియన్, లింగ్విస్టిక్స్, పర్షియన్
బీఏ (ఆనర్స్): ఫ్రెంచ్, జర్మన్, పర్షియన్, స్పానిష్, జోంగా, అరబిక్
డిప్లొమా/అడ్వాన్స్‌డ్ డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సులు: అప్లైడ్ లింగ్విస్టిక్స్, బల్గేరియన్/క్రొయేషియన్/చెక్/ఫ్రెంచ్/జర్మన్/హంగేరియన్/ఇటాలియన్/పర్షియన్/పోలిష్/సెర్బియన్/స్లోవేక్ లాంగ్వేజెస్.వెబ్‌సైట్: www.du.ac.in

బెనారస్ హిందూ యూనివర్సిటీ
ఎంఏ: అరబిక్, చైనీస్, జర్మన్, పర్షియన్, రష్యన్, నేపాలీ, పాళీ, లింగ్విస్టిక్స్.
పీజీ డిప్లొమా: జపనీస్ స్డడీస్; వ్యవధి: ఏడాది
బీఏ (ఆనర్స్): అరబిక్, పర్షియన్, పాళీ, నేపాలీ, చైనీస్, జర్మన్, ఫ్రెంచ్, రష్యన్, లింగ్విస్టిక్స్.
యూజీ డిప్లొమా: అరబిక్, చైనీస్, ఫ్రెంచ్ స్టడీస్, జర్మన్ స్టడీస్, నేపాలీ, పర్షియన్, రష్యన్, సింహళీస్. వెబ్‌సైట్: www.bhu.ac.in

యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్
ఎంఫిల్: ఫ్రెంచ్; ఎంఏ: ఫ్రెంచ్
డిప్లొమా/సర్టిఫికెట్: ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్పానిష్; వెబ్‌సైట్: ఠీఠీఠీ.ఠౌఝ.్చఛి.జీ

జామియా మిలియా ఇస్లామియా
పీహెచ్‌డీ: అరబిక్, పర్షియన్
ఎంఏ/ బీఏ: అరబిక్, పర్షియన్
అడ్వాన్స్‌డ్ డిప్లొమా: మోడర్న్ అరబిక్ లాంగ్వేజ్ అండ్ ట్రాన్స్‌లేషన్, మోడర్న్ పర్షియన్, టర్క్‌మెనియన్, టర్కిష్, ఫ్రెంచ్, రష్యన్, ఇటాలియన్.
డిప్లొమా కోర్సులు: మోడర్న్ అరబిక్, మోడర్న్ పర్షియన్, టర్క్‌మెనియన్, టర్కిష్, కజక్, ఉజ్బె క్, క్రెగ్, స్పానిష్, పోర్చుగీస్, ఫ్రెంచ్, రష్యన్, ఇటాలియన్.
వెబ్‌సైట్: http://jmi.nic.in

యూనివర్సిటీ ఆఫ్ ముంబై
పీహెచ్‌డీ: అరబిక్, ఫ్రెంచ్, పర్షియన్
ఎంఏ: అరబిక్, ఫ్రెంచ్, పర్షియన్
బీఏ: అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, పాళీ, పర్షియన్, పోర్చుగీస్, రష్యన్.
అడ్వాన్స్‌డ్ డిప్లొమా: అరబిక్, జర్మన్, రష్యన్
డిప్లొమా: అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, పాళీ, పర్షియన్, రష్యన్
సర్టిఫికెట్: అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పర్షియన్, పోలిష్, రష్యన్
వెబ్‌సైట్: www.mu.ac.in

ఇగ్నో
పీహెచ్‌డీ: అరబిక్, ఫ్రెంచ్
సర్టిఫికెట్: జర్మన్, జపనీస్, ఫ్రెంచ్, అరబిక్
డిప్లొమా: టీచింగ్ జర్మన్ లాంగ్వేజ్
వెబ్‌సైట్: http://ignou.ac.in

డిమాండ్ ఉన్న భాషలు: ఫ్రెంచ్, జర్మనీ, రష్యన్, చైనీస్ భాషలకు మంచి డిమాండ్ ఉంది. ఇటీవలి కాలంలో జపనీస్, స్పానిష్, కొరియన్ భాషలకు కూడా ఆదరణ లభిస్తోంది.

అవకాశాలిలా...
ఫారిన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు అవకాశాలు విస్తృతం. వీరికి సెక్రటేరియల్ పొజిషిన్ నుంచి ఎగ్జిక్యూటివ్ వరకు వివిధ స్థాయిల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. ట్రాన్స్‌లేటర్స్, ఇంటిప్రిటేటర్స్, డీకోడర్స్, టెక్నికల్ రైటర్స్, కంటెంట్ రైటర్స్, టూర్ ఆపరేటర్స్, ఫ్యాకల్టీ వంటి వివిధ స్థాయిల్లో స్థిరపడొచ్చు. వివిధ ఐటీ కంపెనీలు, మీడియా, పార్లమెంట్, బోధన, పరిశ్రమలు, కార్పొరేట్ హౌసెస్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, పబ్లిషింగ్ హౌస్‌లు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ రాయబార కార్యాలయాల్లో అవకాశాలు ఉంటాయి.

ట్రాన్స్‌లేటర్స్: విదేశీ భాష నిపుణుల్లో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ట్రాన్స్‌లేషన్ (అనువాదం). భాషపై పట్టు, అర్థాన్ని మార్చకుండా అనువదించే నేర్పు ఉంటే ఎదగడానికి అవకాశాలెన్నో. మన కంపెనీలు ఫారెన్ కంపెనీలతో జాయింట్ వెంచర్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి.

విదేశాలతో అవగాహన కారణంగా వచ్చే పత్రాలను.. అనువదించడం, సమాచారాన్ని క్రోడీకరించడం కోసం కూడా ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ట్రాన్స్‌లేటర్లు అవసరం. టెక్నికల్, సైంటిఫిక్, బిజినెస్, సాహిత్యం, రంగాల్లో కూడా వీరు తప్పనిసరి కావడంతో సంబంధిత సంస్థలు ఆకర్షణీయ ప్యాకేజీలను అందిస్తున్నాయి. భారత్‌లో ఐటీ రంగ వృద్ధి వల్ల వివిధ దేశాల నుంచి అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆ ప్రాజెక్టు నివేదికల తర్జుమాకు పెద్దఎత్తున ట్రాన్స్‌లేటర్ల అవసరం ఉంది.

ఇంటర్‌ప్రిటేటర్: వ్యక్తి మాటలను అనువాదం చేసి మరో వ్యక్తికి అప్పటికప్పుడు వినిపించే ప్రక్రియే ఇంటర్‌ప్రిటేషన్. ఈ తరహా బాధ్యతలను నిర్వహించే వారే ఇంటర్‌ప్రిటేటర్లు. ఈ వృత్తిలో రాణించడానికి వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కీలకం. సెమినార్లు, కాన్ఫరెన్స్‌లు, సభల్లో వీరి అవసరం ఎక్కువ. ఇద్దరు వ్యక్తుల సంభాషణను ఇంటర్‌ప్రిటేషన్ చేయడానికి ఉండే వారిని లెసియన్ ఇంటర్‌ప్రిటేటర్ అంటారు. వీరికి లోక్‌సభ, విదేశీ మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ హౌసెస్‌లో అవకాశాలు ఉంటాయి.

టీచింగ్: ప్రస్తుతం దేశంలోని పలు కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు విదేశీ భాష కోర్సులను నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఆ దిశగా కూడా అవకాశాలు అనేకం.

ఫ్రీలాన్సింగ్: లాంగ్వేజ్‌ల్లో పట్టు సాధించినా.. పూర్తిస్థాయి ఉద్యోగంపై ఆసక్తిలేని వారికి.. అప్పటికే మరో ఉద్యోగంలో ఉన్న వారికి ఫ్రీలాన్సింగ్ ఎంతో ప్రయోజనకరం. ముఖ్యంగా పుస్తక ప్రచురణ విభాగంలో వీరికి అవకాశాలు పుష్కలం. అదేవిధంగా కొందరు పీహెచ్‌డీ స్కాలర్స్ తాము రూపొందించే పరిశోధన పత్రాలను ఇంగ్లిష్‌లో అనువదించడానికి ఫ్రీలాన్సర్ల వైపే మొగ్గు చూపుతున్నారు.

అవకాశాలు కల్పిస్తున్న మరికొన్ని రంగాలు: విదేశీ భాష నిపుణుల అవసరం హాస్పిటల్స్, క్లినిక్స్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో ఉంటోంది. కారణం.. ఈ రంగాల్లో ఉన్న సంస్థలు పలు విదేశీ సంస్థలతో సంయుక్తంగా వ్యాపారం నిర్వహిస్తుండటమే.

ఫలితంగా అక్కడి నుంచి వచ్చే డాక్యుమెంట్ల అనువాదం కోసం కార్పొరేట్ ఆసుపత్రులు, హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఫార్మాస్యూటికల్ కంపెనీలు ట్రాన్స్‌లేటర్స్‌ను నియమించుకుంటున్నాయి. ఈ వృత్తిలో రాణించాలంటే.. సంబంధిత టెర్మినాలజీపై పట్టు ఉండాలి. విదేశీ పర్యాటకులను ఆకర్షించేవిధంగా వివిధ ఎయిర్‌లైన్ సంస్థలు, టూరిజం ఆర్గనైజేషన్స్, హాస్పిటాలిటీ సంస్థల్లో అవకాశాలున్నాయి.

వేతనాలు.. టాప్ రిక్రూటర్స్: అనువాదకులు, ఇంటర్‌ప్రిటేటర్లకు ఆదాయం కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. భాష ఆధారంగా ట్రాన్స్‌లేటర్లకు ఒక్కో పేజీకి దాదాపు రూ.200 నుంచి రూ.500 వరకు లభిస్తుంది. అధ్యాపకులకు ప్రారంభంలో 25వేలకుపైగా వేతనం లభిస్తుంది. ఇంటర్‌ప్రిటేటర్లకు గంట చొప్పున చెల్లిస్తారు. వీరికి గంటకు రూ.400-500 వరకు చెల్లిస్తున్నారు.

రాయబార కార్యాలయాలు, కార్పొరేట్ హౌసెస్, ఫార్మాస్యూటికల్, మెడికల్, తదితర రంగాల్లో స్థిర పడిన వారికి రూ. 15 వేల నుంచి ప్రారంభంలో వేతనం ఉంటుంది. అనుభవం ఆధారంగా పెరిగే అవకాశం ఉంటుంది. వీరికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ రాయబార కార్యాల యాలు, హెచ్‌పీ, ఒరాకిల్, స్యామ్‌సంగ్, హ్యుందాయ్, ఎల్‌జీ, థామ్సన్, జీఈ, ఎవన్‌టీస్, మౌలీనెక్స్, టూరిజం సంస్థలు, హోటల్ పరిశ్రమ, ఎయిర్‌లైన్ ఆఫీస్‌లు, ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ తదితరాల్లో కూడా అవకాశాలు ఉంటాయి.

ప్రపంచస్థాయి సంస్థలు: వరల్డ్ బ్యాంక్, యూఎన్‌ఓ, యునెస్కో, డబ్ల్యూహెచ్‌ఓ, యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో ఫారెన్ లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్స్ అవసరం.

Friday, June 15, 2012

‘లా’తో భవిత ఇలా..


నేటి యువత మనస్ఫూర్తిగా మొగ్గుచూపే మరో కోర్సు... లా! ఆర్థిక సరళీకరణల నేపథ్యంలో.. ప్రభుత్వ రెగ్యులేటరీ పాత్ర, మారుతున్న ఆర్థిక, సాంఘిక పరిస్థితులు ‘లా’ గ్రాడ్యుయేట్స్‌కు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయ్!!
నియంత్రణలు తొలగి, విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావడంతో బిజినెస్ ‘లా’కు డిమాండ్ పెరిగింది. దాంతోపాటు ‘లా’తో సంబంధమున్న బ్యాంకింగ్, ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్స్, టాక్సేషన్, టెలికాం, ఇన్సూరెన్స్, పవర్, సివిల్ ఏవియేషన్, పోర్ట్స్, షిప్పింగ్, మీడియా, మేథో సంపత్తి హక్కులు, విదేశీ ప్రత్యక్ష
పెట్టుబడులు(ఎఫ్‌డీఐ), రియల్ ఎస్టేట్, స్పెషల్ ఎకనమిక్ జోన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డాటా ప్రొటక్షన్ చట్టాలు వంటి విభాగాల్లో పెనుమార్పులు సంభ వించాయి. ఇది న్యాయ విద్యను అభ్యసించిన అభ్యర్థులకు వరంగా మారింది.
దాంతో ‘లా’ మళ్లీ క్రేజీ కోర్సుగా మారిపోయింది!!

న్యాయవిద్యకు ప్రపంచవ్యాప్తంగా ఉజ్వల భవిష్యత్తు ఇప్పుడు. గ్లోబలైజేషన్ యువ లా గ్రాడ్యుయేట్స్‌కు ఎన్నడూ లేనన్ని అవకాశాలను ముందుకు తెచ్చింది. భారత్‌తో పాటు అంతర్జాతీయ వ్యాపార సంస్థలు న్యాయ విద్య ను అభ్యసించిన అభ్యర్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఫండ్ రైజింగ్, షేర్లు, జాయింట్ వెంచర్లు, మెర్జర్‌లు, టెక్నాలజీ కొలాబరేషన్ తదితర అంశాల్లో న్యాయ విద్య అభ్యసించినవారి సలహాలు కీలకంగా మారడంతో.. లా గ్రాడ్యుయేట్లకు భవిష్యత్తులో కూడా విసృ్తత అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

ఎన్ని అవకాశాలో:
న్యాయశాస్త్రంలో విద్యనభ్యసిస్తే భవిష్యత్తుకు తిరుగుండదు. సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అనేక ప్రముఖ కంపెనీల్లో లా విభాగాల్లో కెరీర్ సొంతం చేసుకోవచ్చు. అనేక న్యాయ స్థానాల్లో మంచి అవకాశాలు వస్తాయి. మరోవైపు లీగల్ అడ్వయిజర్లగా పనిచేయొచ్చు. సుప్రీంకోర్టు జడ్జిలకు సహాయకారులుగా లా కాలేజీల్లో చదివే విద్యార్థులకు మంచి అవకాశాలున్నాయి. వీరికి జ్యుడీషియల్ క్లర్కుల హోదా లభిస్తుంది.

లాయుర్‌కు ఉండాల్సిన లక్షణాలు:
విషయు పరిజ్ఞానం
జ్ఞాపక శక్తి రచనా నైపుణ్యం
సృజనాత్మకత్ఞ పట్టుదల, నిరంతర శ్రవ్ఞు భావవ్యక్తీకరణ నైపుణ్యాల్ఞు లాజికల్ థింకింగ్ టీం ప్లేయుర్
లాలో ఉన్నత విద్య: ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాక.. ఎల్‌ఎల్‌ఎం చేస్తే న్యాయ రంగంలో విజయువంతమైన కెరీర్ నిర్మించుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది.

కొత్త కోర్సులు: ముఖ్యంగా దేశంలోని పలు న్యాయ విశ్వ విద్యాలయాలు అవసరాలకు అనుగుణంగా సివిల్ లా, క్రిమినల్ లా, కార్పొరేట్ లా, టాక్సేషన్ లాస్ (ఇన్‌కంటాక్స్, ఎక్సైజ్ లా), లేబర్ లా, ఇంటర్నేషనల్ లా, ఫ్యామిలీ లా, కాన్స్‌టిట్యూషనల్ లా, అడ్మినిస్ట్రేషనల్ లా, ట్రేడ్‌మార్క్ అండ్ కాపీరైట్ అండ్ ఐపీ రైట్స్, పేటెంట్ లాస్ వంటివి అందిస్తున్నాయి.

లా స్కూల్స్..

1986లో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ) ఏర్పాటవడంతో దేశంలో న్యాయ విద్యకు కొత్త ఊపు లభించింది. ఆ తర్వాత నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్; నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ, భోపాల్ ; వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిడికల్ సెన్సైస్, కోల్‌కతా; నేషనల్ లా యూనివర్సిటీ, జోధ్‌పూర్; హిదయ్‌తుల్లా నేషనల్ లా యూనివర్సిటీ, రాయ్‌పూర్; గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ, గాంధీనగర్; డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ, లక్నో; రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా, పాటియాల; చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ, పాట్నా; నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ లీగల్ స్టడీస్, కోచిలలో ప్రముఖ లా స్కూల్స్ ఏర్పాటయ్యాయి. ఈ స్కూల్స్ అన్నీ కలిసి ఏటా కామన్ అడ్మిషన్ టెస్ట్(క్లాట్) ద్వారా ఐదేళ్ల అండర్ గ్రాడ్యుయేట్, రెండే ళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు
క ల్పిస్తున్నాయి.

నల్సార్ లా యూనివర్సిటీ:
నల్సార్ ఆఫర్ చేస్తున్న 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బి.ఎ.ఎల్.ఎల్.బి.(ఆనర్స్) కోర్సులో చేరడానికి ఇంటర్‌లో 50 శాతం మార్కులు రావాలి. క్లాట్ ర్యాంకు ఆధారంగా అడ్మిషన్ లభిస్తుంది. దీంతోపాటు పలు పీజీ డిప్లొమా కోర్సులనూ నల్సార్ అందిస్తోంది.
వెబ్‌సైట్: www.nalsar.ac.in

నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియావర్సిటీ:
బెంగుళూరులో ఏర్పాటైన తొలి లా యూనివర్సిటీ ఇది. ఇక్కడ 5 ఏళ్ల బి.ఎ.ఎల్.ఎల్.బి.(ఆనర్స్) ఉంది. ఈ కోర్సులో చేరాలంటే ఇంటర్‌లో కనీసం 50శాతంతోపాటు క్లాట్ రాయాలి. ఈ వర్సిటీ దూర విద్యావిధానంలోనూ పలు లా కోర్సులు ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.nls.ac.in

నేషనల్ లా యూనివర్సిటీ,ఢిల్లీ: ఇది 5ఏళ్ల కాలవ్యవధిగల బి.ఎ. ఎల్‌ఎల్.బి(ఆనర్స్) కోర్సు అందిస్తోంది. ఇందులో చేరేందుకు 50 శాతం మార్కులతో ఇంటర్ విద్యార్హత. దీనికి జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష పాసవ్వాలి. దీంతోపాటు ఈ వర్సిటీ పీజీ డిప్లమో కింద జడ్జింగ్ అండ్ కోర్టు మేనేజ్‌మెంట్, ఐపీఆర్ అండ్ పేటెంట్ లా కోర్సు నిర్వహిస్తోంది.
వెబ్‌సైట్: www.nludelhi.ac.in

నేషనల్ లా యూనివర్సిటీ, ఒరిస్సా: ఈ విశ్వవిద్యాలయం 5ఏళ్ల కాలవ్యవధిగల బి.ఎ.ఎల్‌ఎల్.బి. (ఆనర్స్) కోర్సు ఆఫర్ చేస్తోంది. విద్యార్హత: 50 శాతం మార్కులతో ఇంటర్. జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష పాసవ్వాలి. వెబ్‌సైట్: www.nluo.ac.in

ఉస్మానియా లా కాలేజ్: ఇది బి.ఎ. ఎల్.ఎల్.బి అయిదేళ్ల కోర్సును, మూడేళ్ల ఎల్.ఎల్.బి. పీజీ కోర్సుల కింద ఎల్.ఎల్.ఎం.(ఏడీఆర్), ఎల్.ఎల్.ఎం.(ఐపీఆర్), ఎల్.ఎల్.ఎం(ఐటీ ఈఏఎల్)కోర్సులతోపాటు, మేథోసంపత్తి హక్కులు, సైబర్ చట్టాలు, టాక్సేషన్ అండ్ బీమా ఈ మూడు పీజీ డిప్లమో కోర్సులు ఏడాది కాల వ్యవధితో నిర్వహిస్తోంది.
వెబ్‌సైట్: www.osmania.ac.in/law college

ఇగ్నో స్కూల్ లా: ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) దూర విద్యా విధానం కింద డిప్లమో ఇన్ పారాలీగల్ ప్రాక్టీస్ కోర్సు అందిస్తుంది. కాలవ్యవధి ఏడాది. ఇంటర్ అర్హత. దీంతోపాటు పలు పీజీ డిప్లొమా కో ర్సులనూ ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.ignou.ac.in/schools/sol/

నిర్మా యూనివర్సిటీ: గుజరాత్‌లోని ఈ విశ్వ విద్యాలయం 5ఏళ్ల కాలవ్యవధిగల బి.ఎ.ఎల్‌ఎల్.బి.(ఆనర్స్) కోర్సు ఆఫర్ చేస్తోంది. 50 శాతం మార్కులతో ఇంటర్ విద్యార్హత సరిపోతుంది. దీనికి జాతీయస్థాయి పరీక్ష పాసవ్వాలి. వెబ్‌సైట్: www. nirmauni.ac.in

కర్ణాటక లా యూనివర్సిటీ: కర్ణాటకలోని హుబ్లీలో ఉన్న కర్ణాటక స్టేట్ లా యూని వర్సిటీ బి.ఎ. ఎల్‌ఎల్.బి.(ఆనర్స్), బి.బి.ఎ. ఎల్.ఎల్.బి.(ఆనర్స్), ఎల్‌ఎల్‌ఎం కోర్సులు నిర్వహిస్తోంది. ఇంటర్‌లో 45శాతం మార్కులు అవసరం. దాంతోపాటు త్వరలో పీజీ డిప్లమో ఇన్ ఇంటలెక్చ్యువల్ ప్రాపర్టీ రైట్స్, హ్యూమన్‌రైట్స్ అండ్ సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లా ప్రవేశపెట్టబోతోంది.
వెబ్‌సైట్: www.kslu.org

రాష్ట్రంలోని లా కాలేజీలు: రాష్ట్రంలోని వివిధ లా కళాశాలల్లో ఐదేళ్ల, మూడేళ్ల లా కోర్సుల కోసం రాష్ట్రస్థారుు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలోని ఏ కాలేజీలో చదవాలన్నా.. లా సెట్ పరీక్షకు హాజరవడం తప్పనిసరి. అరుుదేళ్ల ఎల్‌ఎల్‌బీ, బీఎల్ కోర్సులకు ఇంటర్‌లో 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి. మన రాష్ట్రంలోని 49 కాలేజీల్లో దాదాపు 3000 లా సీట్లు అందుబాటులో ఉన్నాయి.

అమెరికాలో:
అంతేకాకుండా.. అమెరికాలో సైతం న్యాయ కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉంది. దేశంలో న్యాయ శాస్త్ర బోధనలో ఉన్న అత్యుత్తుమ వర్సిటీలో ప్రపంచంలో ఎక్కడా లేవని చెప్పవచ్చు. అంతేకాదు ఈ దేశంలో అత్యధికంగా జేడీ(జ్యురిస్ డాక్టర్) మూడేళ్ల కోర్సు, ఎల్‌ఎల్‌ఎం (మాస్టర్ ఆఫ్ లాస్) ఏడాది కోర్సు ప్రాక్టీస్‌లో ఉన్న లాయర్లకు, ఎస్‌జేడీ (డాక్టర్ ఆఫ్ జ్యురిడిసి యల్ సైన్స్), ఎల్‌ఎల్‌ఎం, జేఎస్‌డీ (డాక్టర్ ఆఫ్ ది సైన్స్‌ఆఫ్‌లా), మాస్టర్ ఆఫ్ లాస్ కోర్సులు అందిస్తున్నాయి. ఎస్‌ఎస్‌ఎల్, జేఎస్‌డి వంటి అత్యుత్తుమ కోర్సులను అందిస్తున్నాయి.
.......................................................
టాప్ ఇండియున్ లా స్కూల్స్
నల్సార్ యుూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్
వెబ్‌సైట్: www.nalsarlawuniv.ac.in
నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ, భోపాల్
వెబ్‌సైట్: www.nliu.comq నేషనల్ లా యూనివర్సిటీ-జోధ్‌పూర్
వెబ్‌సైట్: www. nlujodhpur.ac.in
ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ బెంగళూరు
వెబ్‌సైట్: www.nls.ac.in
ఎన్‌యూజేఎస్ కోల్‌కతా
వెబ్‌సైట్: www.nujs.edu
ఫాకల్టీ ఆఫ్ లా, ఢిల్లీ యుూనివర్సిటీ, ఢిల్లీ
వెబ్‌సైట్: www.du.ac.in
ఐఎల్‌ఎస్ లా కాలేజ్- పుణె వెబ్‌సైట్: www.ilslaw.edu
ఇండియున్ లా ఇన్‌స్టిట్యూట్-ఢిల్లీ వెబ్‌సైట్: www.ilidelhi.org
సింబయోసిస్ సొసైటీస్ లా కాలేజ్-పుణె
వెబ్‌సైట్: www.symlaw.ac.inq
ది గరవ్నమెంట్ లా కాలేజ్ ముంబై వెబ్‌సైట్: www.glc.edu
అమిటి లా స్కూల్-ఢిల్లీ
వెబ్‌సైట్: www.amity.edu/alsq డిపార్ట్‌మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్, వుద్రాసు యూనివర్సిటీ, చెన్నై
వెబ్‌సైట్: www.unom.ac.in/legal.html
డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్సిటీ-చెన్నై
వెబ్‌సైట్: www.tndalu.org
ఫ్యాకల్టీ ఆఫ్ లా, అలహాబాద్ యూనివర్సిటీ-అలహాబాద్
వెబ్‌సైట్: www.allduniv.ac.in
..........................................................................

ఎల్‌ఎల్‌ఎం కోర్సును అందిస్తున్న సంస్థలు :
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ: ఈ యూనివర్సిటీ.. హ్యూమన్ రైట్స్, ఎన్విరాన్‌మెంటల్ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, కార్పొరేట్ లా అండ్ గవర్నెన్స్, ఇన్సూరెన్స్ లాస్, కాన్‌స్టిట్యూషనల్ లా అండ్ క్రిమినల్ లా స్పెషలైజేషన్లుగా ఎల్‌ఎల్‌ఎం కోర్సును అందిస్తుంది. కనీసం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ/బీఎల్ పూర్తి చేసిన వారు అర్హు లు. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి.
వెబ్‌సైట్: www.nalsa-rla-w-un-iv.ac.in

కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ లీగల్ స్టడీస్:
ఈ లా స్కూల్ కూడా ఎల్‌ఎల్‌ఎం కోర్సును అందిస్తుంది. స్పెషలైజేషన్స్- అడ్మినిస్ట్రేటివ్ లా, కమర్షియల్ లా, కాన్‌స్టిట్యూషనల్ లా, కన్స్యుమర్ లా, క్రిమినల్ లా, ఎన్విరాన్‌మెంటల్ లా, హ్యూమన్ రైట్స్ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, లేబర్ లా, మారి టైమ్‌లా. లా లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
వెబ్‌సైట్: http://-sls.cusat.ac.in

నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ:
బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బిజినెస్ లా అండ్ హ్యూమన్ రైట్స్ లాలో ఎల్‌ఎల్‌ఎం కోర్సు ఆఫర్ చేస్తుంది. కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ చేసి ఉండాలి. ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి.
వెబ్‌సైట్: www.nls.ac.in

మహాత్మాగాంధీ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ ఇండియన్ లీగల్ థాట్:
మహాత్మాగాంధీ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ ఇండియన్ లీగల్ థాట్-ఎల్‌ఎల్‌ఎం(హ్యూమన్ రైట్స్ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, సైబర్ లా)కోర్సును ఆఫర్ చేస్తుంది. కనీసం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్ బీ పూర్తి చేసిన వారు అర్హులు. ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.mgun-i-ve-r-sity.edu–––––


కార్పొరేట్ లా కోర్సును ఆఫర్ చేస్త్తున్న యూనివర్సిటీలు:
ఏఎస్‌సీఎల్ లా స్కూల్, పుణే డిప్లొమా ఇన్ కార్పొరేట్ లా కోర్సును దూరవిద్యా విధానంలో అందిస్త్తుంది. లా, కామర్స్, మేనేజ్‌మెంట్ విద్యార్థులతోపాటు ఎంటర్‌ప్రెన్యూర్స్, మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌కు కూడా ఈ కోర్సు ఉపయుక్తంగా ఉంటుంది.
వెబ్‌సైట్: www.als.org.in

సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, పుణే:
డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ లా అండ్ కార్పొరేట్ లా
కోర్సును పార్ట్‌టైం విధానంలో అందిస్త్తుంది. 50 శాతం మార్కులతో మూడేళ్ల/ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ లేదా తత్సమాన డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
వెబ్‌సైట్: www.symlaw.ac.in

నల్సార్ యూనివర్సిటీ, హైదరాబాద్:
కార్పొరేట్ లా స్పెషలైజేషన్‌గా ఎల్‌ఎల్‌ఎం డిగ్రీని ఆఫర్ చేస్తోంది. న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది.
వెబ్‌సైట్: www.nalsar.ac.in

కార్పొరేట్ లా స్పెషలైజేషన్‌గా ఎల్‌ఎల్‌ఎం డిగ్రీని ఆఫర్ చేస్తోంది. న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది.
వెబ్‌సైట్: www.nalsar.ac.in

లా ఎంట్రెన్స్ టెస్టులు

కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్): క్లాట్.. జాతీయ స్థాయిలో 14 ప్రముఖ లా స్కూల్స్ అడ్మిషన్ కోసం ఏటా నిర్వహించే ప్రవేశపరీక్ష. క్లాట్‌లో ప్రతిభ ఆధారంగా బీఏ, ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.

అర్హత:10+2లో కనీసం 50 శాతం మార్కులు.
పరీక్ష ప్యాట్రన్: ఆబ్జెక్టివ్ తరహాలో 200 ప్రశ్నలకు ఉంటుంది. పరీక్ష అవధి 2 గంటలు. ఇంగ్లిష్ కాంప్రహెన్షన్‌కు 40 ప్రశ్నలు; జనరల్ నాలెడ్జ్/కరెంట్ అఫైర్స్ 50 ప్రశ్నలు; ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు; లీగల్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు; లాజికల్ రీజనింగ్ 40 ప్రశ్నలు. వెబ్‌సైట్: www.clat.ac.in

ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్:
(ఏఐఎల్‌ఈటీ): నేషనల్ లా యూనివర్సిటీ, ఢిల్లీ.. ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్‌ను ప్రతిఏటా నిర్వహిస్తుంది. ఏఐఎల్‌ఈటీ పరీక్ష ద్వారా తన ఐదేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ లా కోర్సులో ప్రవేశం కల్పిస్తుంది.
అర్హత: 10+2లో కనీసం 50 శాతం మార్కులు. అర్హత పరీక్ష ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష ప్యాట్రన్: ఏఐఎల్‌ఈటీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. 90 నిమిషాల్లో 150 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఇంగ్లిష్ 35 ప్రశ్నలు; జన రల్ నాలెడ్జ్/కరెంట్ అఫైర్స్ 35 ప్రశ్నలు; మ్యాథమెటిక్స్ 10 ప్రశ్నలు; లీగల్ అప్టిట్యూడ్ 35 ప్రశ్నలు; లాజికల్ రీజనింగ్ 35ప్రశ్నలు.వెబ్‌సైట్: http://nludelhi.ac.in/

ఎల్‌శాట్-ఇండియా:
విదేశాల్లో విద్యాభ్యాసానికి ఆయా కోర్సులను బట్టి తప్పనిసరిగా జీఆర్‌ఈ/టోఫెల్/జీమ్యాట్ స్కోర్ ఉండాల్సిందే. అదే కోవలో ‘లా’ చదవాలంటే.. ‘ద లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్(ఎల్‌శాట్)’కు హాజరు కావాలి. ఈ పరీక్షను ద లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ (ఎల్‌ఎస్‌ఏసీ) 1947 నుంచి నిర్వహిస్తోంది. ఈ టెస్ట్ స్కోర్ ఆధారంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలలోని దాదాపు టాప్- 200 ఇన్‌స్టిట్యూట్‌లలో న్యాయ విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది. ఎల్‌శాట్ స్కోర్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.

మన దేశంలో లా కోర్సుకున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎల్‌ఎస్‌ఏసీ, పియర్సన్ వీయూఈ సంస్థలు ఎల్‌శాట్- ఇండియా పరీక్షకు శ్రీకారం చుట్టాయి. ఈ టెస్ట్ స్కోర్ ఆధారంగా ఐఐటీ-ఖరగ్‌పూర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా అండ్ రీసెర్చ్, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ తదితర 20కి పైగా ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్‌లలో లా విద్యను అభ్యసించవచ్చు.

పరీక్ష విధానం: ఎల్‌శాట్-ఇండియా టెస్ట్‌ను దేశంలోని 17 పట్టణాల్లో నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రం ఉంది. లా కెరీర్‌లో రాణించడానికి దోహదం చేసే లాజికల్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, థింకింగ్ స్కిల్స్ వంటి అంశాల్లో అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఎల్‌శాట్- ఇండియా టెస్ట్‌ను రూపొందించారు. మూడేళ్ల, ఐదేళ్ల కోర్సులకు వేర్వేరుగా పేపర్-పెన్సిల్ పద్ధతిలో నాలుగు విభాగాల్లో ఈ టెస్ట్‌ను నిర్వహిస్తారు.

ఇందులో రెండు విభాగాల్లో లీగల్ రీజనింగ్ సంబంధిత ప్రశ్నలను ఇస్తారు. మిగిలిన విభాగాల్లో ఎనలిటికల్ రీజనింగ్, రీడింగ్ కాంప్రెహెన్షన్ అంశాలపై ప్రశ్నలుంటాయి. మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ప్రశ్నలను అడుగుతారు. ప్రతి విభాగానికి 35 నిమిషాలు చొప్పున మొత్తం 2 గంటల 35 నిమిషాల సమయం (మధ్యలో 15 నిమిషాలు విరామం) ఉంటుంది.

అర్హత: అర్హత విషయానికొస్తే.. ఎంపిక చేసుకున్న ఇన్‌స్టిట్యూట్, కోర్సు ఆధారంగా అర్హత మారుతుంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్‌కు ముందే సంబంధిత అర్హతను తెలుసుకోవడం మంచిది. రిజిస్ట్రేషన్ తర్వాత మీకున్న అర్హత సరిపడకపోతే.. రిజిస్ట్రేషన్ ఫీజును తిరిగి చెల్లించరు.

రిజిస్ట్రేషన్: ఎల్‌శాట్-ఇండియా టెస్ట్ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మూడేళ్ల, ఐదేళ్ల కోర్సుల కోసం వేర్వేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

టెస్ట్ కోసం నిర్దేశించిన ఫీజు రూ. 3500 ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్(డీడీ) ద్వారా చెల్లించాలి. ‘ఎన్‌సీఎస్ పియర్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట న్యూఢిల్లీ/నోయిడాలో చెల్లేలా డీడీని తీయాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఎల్‌శాట్-ఇండియా రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ నెంబర్‌ను ఎంపిక చేసుకున్న లా స్కూల్ ప్రవేశ దరఖాస్తులో తప్పనిసరిగా పేర్కొనాలి.
చిరునామా: పియర్సన్ వీయూఈ, కేరాఫ్ బ్లూషిఫ్ట్, ఆరో అంతస్తు, ఈస్ట్ వింగ్, శ్రేయస్ టవర్స్, 23-24, చామైర్స్ రోడ్, చెన్నై- 600018.
వెబ్‌సైట్: www.pearsonvueindia.com-/lsatindia/

సింబయాసిస్ ఎంట్రెన్స్ టెస్ట్:
సింబయాసిస్ యూనివర్సిటీలో భాగమైన సింబయాసిస్ లా స్కూల్... బీఏ ఎల్‌ఎల్‌బీ/బీబీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఏటా సెట్‌ను నిర్వహిస్తోంది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10+2 పాసై ఉండాలి. అర్హత పరీక్షను మొదటి అటెంప్ట్‌లో పాసైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వ యసు 20 ఏళ్లకు మించరాదు.
పరీక్ష ప్యాట్రన్: 150 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు 2 గంటల్లో సమాధానాలు గుర్తించాలి. ఇం దులో లాజికల్ రీజనింగ్, లీగల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తా యి. సెట్‌లో ప్రతిభ ఆధారంగా గ్రూప్‌డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
వెబ్‌సైట్: www.settest.org

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ:
ఐదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశం కోసం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రతిఏటా ఎంట్రెన్స్ టెస్ట్‌ను నిర్వహిస్తోంది. మూడు స్టడీ సెంటర్లలో మొత్తం 220 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

అర్హత:
కనీసం 50 శాతం మార్కులతో 10+2 పాసై ఉండాలి. వయసు 22ఏళ్లకు మించరాదు.
పరీక్ష ప్యాట్రన్: పరీక్ష 100 మార్కులకు 2గంటలపాటు జరుగుతుంది. 75 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు.. 10 షార్ట్ ఆన్సర్‌టైప్ ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంగ్లిష్, కరెంట్ అఫైర్స్/జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్‌పై ప్రశ్నలు ఉంటాయి.
వెబ్‌సైట్: www.amu.ac.in

Wednesday, June 13, 2012

సీఏ, సీఎస్, సీడబ్ల్యుఏ


చదువంటే ఇంజనీరింగ్, మెడిసిన్‌లే కాదు. వాటికేమాత్రం తీసిపోని కోర్సులెన్నో ఉన్నాయి. వాటిలో ప్రథమశ్రేణిలో నిల్చేవి సీఏ, సీఎస్, సీడబ్ల్యుఏ. వీటిని పూర్తిచేసినవాళ్లకు ఉపాధి గ్యారెంటీ. ఇంటర్‌లో ఏ గ్రూప్ చదివినప్పటికీ ఈ కోర్సుల్లో చేరొచ్చు. మిగతా కోర్సులతో పోల్చితే వీటిని పూర్తిచేయడానికి కొంత అదనంగా శ్రమించడం తప్పనిసరి. శ్రమకు తగ్గ వేతనం, గుర్తింపు రెండూ ఈ కోర్సులతో గ్యారంటీగా లభిస్తాయని చెప్పొచ్చు.


చార్టర్డ్ అకౌంటెన్సీ

కోర్సు ఇలా...

చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు మూడు దశలుగా ఉంటుంది. అవి.. కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సీపీటీ); ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కోర్స్ (ఐపీసీసీ), ఫైనల్ కోర్స్.

సీపీటీ: సీఏ కోర్సు క్రమంలో తొలి దశ కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్. ఇది అర్హత పరీక్ష లాంటిది. సీఏ భవిష్యత్తుగా ఎంచుకోవాలనుకునే ప్రతి విద్యార్థి దీనిలో ఉత్తీర్ణత సాధించాలి. దీనికోసం పదో తరగతి పూర్తి కాగానే ఆ సర్టిఫికెట్ ఆధారంగా ఐసీఏఐలో పేరు నమోదు చేసుకోవాలి. ఇలా పేరు నమోదు చేసుకున్న విద్యార్థుల ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తై తర్వాతే సీపీటీకి హాజరయ్యేందుకు అనుమతి లభిస్తుంది. ఇందుకోసం ఇంటర్మీడియెట్ పరీక్షలు రాశాక దరఖాస్తు చేసుకోవాలి. సీపీటీ ఏటా రెండుసార్లు (జూన్/డిసెంబర్) నిర్వహిస్తారు.. వీటికి హాజరు కావాలంటే... దరఖాస్తు సమయానికి పరీక్ష సమయానికి కచ్చితంగా అరవై రోజుల వ్యవధి ఉండాలి. అంటే.. జూన్‌లో సీపీటీకి హాజరవ్వాలంటే ఏప్రిల్ ఒకటో తేదీలోపు; డిసెంబర్‌లో సీపీటీకి హాజరవ్వాలంటే.. అక్టోబర్ ఒకటి లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఐపీసీసీ: కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సీపీటీ)లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. సీఏ కోర్సు క్రమంలో ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కోర్స్‌కు పేరు నమోదు చేసుకోవాలి. ఈ కోర్సు గ్రూప్-1, గ్రూప్-2 పేరిట రెండు గ్రూపులుగా ఉంటుంది. అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఏదైనా ఒక గ్రూప్ లేదా ఒకేసారి రెండు గ్రూప్‌లకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇలా పేరు నమోదు చేసుకున్న తర్వాత తొమ్మిది నెలలపాటు ఉండే స్టడీ కోర్సును పూర్తి చేయాలి. దీంతోపాటు 35 గంటల వ్యవధిలో సాగే ఓరియెంటేషన్ కోర్సు, వంద గంటలపాటు సాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సును పూర్తి చేయాలి. వీటిని పూర్తి చేసిన వారికి మాత్రమే ఐపీసీసీలోని గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతి లభిస్తుంది.

సీఏ ఫైనల్: ఐపీసీసీలోని రెండు గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సీఏ ఫైనల్ కోర్సులోకి అనుమతి లభిస్తుంది. దీనికంటే ముందుగా ఐపీసీసీలో ఉత్తీర్ణత సాధించిన వెంటనే ఆర్టికల్‌షిప్ (ఆర్టికల్డ్ అసిస్టెంట్‌గా) కోసం నమోదు చేసుకోవాలి. ఐసీఏఐ గుర్తింపు ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఈ ఆర్టికల్ షిప్ చేయాల్సి ఉంటుంది. వ్యవధి మూడేళ్లు. ఆర్టికల్ షిప్‌నకు దరఖాస్తు చేసుకున్న తర్వాత దాని ఆధారంగా సీఏ ఫైనల్ కోర్సు కోసం పేరు నమోదు చేసుకోవాలి. సీఏ ఫైనల్ కోర్సు చదువుతూ, ఆర్టికల్ షిప్ చివరి 12 నెలల సమయంలో.. 15 రోజుల జనరల్ మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సును పూర్తి చేయాలి. మూడేళ్ల ఆర్టికల్ షిప్ పూర్తి చేసిన తర్వాత లేదా ఆర్టికల్‌షిప్ చివరి ఆరు నెలల సమయంలో ఉన్నప్పుడు ఫైనల్ కోర్సు పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే పూర్తిస్థాయి చార్టర్డ్ అకౌంటెంట్‌గా గుర్తింపు లభించినట్లే.

ఉన్నత విద్య: కేవలం ఇంటర్మీడియెట్ అర్హతతో పూర్తి చేసే సీఏ కోర్సుకి.. ప్రభుత్వం ఇతర బ్యాచిలర్ డిగ్రీలకు తత్సమాన గుర్తింపు ఇచ్చింది. ఈ క్రమంలో సీఏ ఫైనల్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఎంకాం, ఎంబీఏ వంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో నిర్వహించే సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 మొదలు అన్ని ఉద్యోగ పరీక్షలకు హాజరుకావచ్చు.


కెరీర్ ఆప్షన్స్: ఐపీసీసీ పూర్తి చేస్తేనే పలు సంస్థలు అకౌంట్స్ ఆఫీసర్, ఇంటర్నల్ ఆడిటర్, తదితర హోదాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఫైనల్ పూర్తి చేసిన వారికి ప్రారంభ వేతనం నెలకు రూ.35 వేల నుంచి లక్ష వరకు ఉంటుంది. విదేశాల్లోనైతే ఇంకా భారీగా వేతనాలు లభిస్తాయి. అనుభవం, నైపుణ్యం ఆధారంగా ఫైనాన్స్ డెరైక్టర్, సీఈఓ స్థాయికి చేరుకోవచ్చు.

ఉద్యోగాలిక్కడ: బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్, స్టాక్ బ్రోకింగ్ సంస్థలు, ఆడిటింగ్ సంస్థలు, బహుళ జాతి సంస్థలు..

కావల్సిన నైపుణ్యాలు: విస్తృతంగా ఉండే సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించి ఆకళింపు చేసుకోవాలంటే.. సహనం ఎంతో అవసరం. అదేవిధంగా బుక్స్ ద్వారా నేర్చుకున్న పరిజ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా అన్వయించే నైపుణ్యం, తార్కిక ఆలోచన నైపుణ్యం కూడా ఈ కోర్సు ఔత్సాహికులకు అవసరమైనవే. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఐసీఏఐ మూడేళ్ల ఆర్టికల్‌షిప్ ట్రైనింగ్‌ను తప్పనిసరి చేసింది. వాక్చాతుర్యం, కమ్యూనికేషన్, సోషల్ నెట్‌వర్కింగ్ స్కిల్స్ ఉండాలి.

వెబ్‌సైట్: www.icsi.edu

కాస్ట్ అండ్ వర్‌‌క అకౌంటెన్సీ

కామర్‌‌స, అకౌంటింగ్ రంగాల్లో భవిష్యత్తును కోరుకునే విద్యార్థుల ముందున్న మరో చక్కటి అవకాశం కాస్ట్ అండ్ వర్‌‌క అకౌంటెన్సీ (సీడబ్ల్యుఏ). ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్‌‌క్స అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా (ఐసీడబ్ల్యుఏఐ) ఈ కోర్సును నిర్వహిస్తుంది. ఈ కోర్సు కూడా మూడు దశలుగా ఉంటుంది. అవి.. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్ కోర్సు.

ఫౌండేషన్ కోర్సు: ఈ కోర్సులో పేరు నమోదు చేసుకోవడానికి కనీస అర్హత ఇంటర్మీడియెట్. ఈ కోర్సు పరీక్షలు ఏటా రెండు సార్లు జూన్, డిసెంబర్‌ల్లో నిర్వహిస్తారు. జూన్‌లో పరీక్షలకు హాజరవ్వాలనుకుంటే అంతకుముందు సంవత్సరం డిసెంబర్ 5వ తేదీలోపు, డిసెంబర్‌లో జరిగే పరీక్షలకోసం అదే సంవత్సరం జూన్ 5 లోపు పేరు నమోదు చేసుకోవాలి. ఫౌండేషన్ కోర్సులో మొత్తం నాలుగు పేపర్లుంటాయి.

ఇంటర్మీడియెట్ కోర్సు:ఐసీడబ్ల్యుఏ ఫౌండేషన్ కోర్సు ఉత్తీర్ణులు లేదా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సుకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇంటర్మీడియెట్ కోర్సు రెండు స్టేజ్‌లుగా ఉంటుంది. ప్రతి స్టేజ్‌లోనూ మూడు పేపర్లుంటాయి.

ఫైనల్ కోర్సు: ఫైనల్ కోర్సులో రెండు స్టేజ్‌లు (స్టేజ్ -3, 4) ఉంటాయి.
సీడబ్ల్యుఏ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు ఆసక్తికి అనుగుణంగా మొదట ఫైనల్ కోర్సులోని రెండు స్టేజ్‌ల్లో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఒకేసారి రెండు స్టేజ్‌లకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలను కూడా ఏటా రెండుసార్లు (జూన్, డిసెంబర్‌లలో) నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన దరఖాస్తు తేదీల క్రమం ఫౌండేషన్ కోర్సు మాదిరిగానే ఉంటుంది.

ఉన్నత విద్య:సీడబ్ల్యుఏ ఫైనల్ పూర్తిచేసినవాళ్లు కామర్‌‌స, అకౌంటింగ్, మేనేజ్‌మెంట్ సంబంధిత కోర్సుల్లో పీజీ చేసుకోవచ్చు. గ్రూప్స్, సివిల్స్...లాంటి పోటీ పరీక్షలనూ రాసుకోవచ్చు.

సీడబ్ల్యు ఏ - ఇగ్నో సంయుక్త కోర్సులు:ఇంటర్ ఉత్తీర్ణతతో ఫౌండేషన్ కోర్సులో ప్రవేశించిన విద్యార్థుల సౌలభ్యం కోసం ఐసీడబ్ల్యుఏఐ సంస్థ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీతో ఒప్పందం ద్వారా బీకాం (ఫైనాన్షియల్ అండ్ కాస్ట్ అకౌంటింగ్), అదే విధంగా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఇంటర్మీడియెట్ కోర్సులో నమోదు చేసుకున్న విద్యార్థుల కోసం ఎంకాం (మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్) అనే రెండు స్థాయిల స్పెషలైజ్డ్ కోర్సులను అందిస్తోంది.

కెరీర్ ఆప్షన్‌‌స:సీడబ్ల్యుఏ పూర్తి చేసినవాళ్లు.. వస్తూత్పత్తి సంస్థలు, మైనింగ్ సంస్థలు, ఇతర పారిశ్రామిక సంస్థల్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, కాస్ట్ ఆడిటర్ వంటి హోదాలో ప్రవేశించొచ్చు. సీడబ్ల్యుఏ ఫైనల్ వరకు వేచిచూడకుండా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో కూడా పలు ఉద్యోగావకాశాలు చేజిక్కించుకోవచ్చు. ముఖ్యంగా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని మైనింగ్ సంస్థలు సీడబ్ల్యుఏ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులను ట్రైనీలుగా నియమించుకుంటున్నాయి. దీంతోపాటు ఐసీడబ్ల్యుఏఐకి దేశవ్యాప్తంగా ఉన్న చాప్టర్లలో పలు సంస్థలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు నిర్వహిస్తున్నాయి. సగటున నెలకు రూ. 25 వేల కనీస వేతనం ఖాయం చేసుకోవచ్చు.

ఇండియన్ కాస్ట్ అకౌంట్స్ సర్వీస్‌లో ఉద్యోగానికి ఐసీడబ్ల్యుఏఐలో ఫైనల్ పూర్తి చేసిన వారికి అవకాశం ఉంటుంది.
కావల్సిన నైపుణ్యాలు: కాస్ట్ అండ్ వర్‌‌క అకౌంటెన్సీ ప్రధాన లక్ష్యం వస్తువును ఉత్పత్తి చేసే క్రమంలో ఎదురయ్యే ఖర్చులను.. నిర్ణీత ఉత్పత్తి లక్ష్యానికి ఎలాంటి ఆటంకం లేకుండా తగ్గించడం. అంటే ఒకవైపు వస్తువుల ఉత్పత్తి సాఫీగా సాగాలి. మరోవైపు ఖర్చులు తగ్గాలి. ఇలాంటి బాధ్యతను నిర్వర్తించాలంటే లెక్కల చిక్కుముడులను ఇట్టే విప్పే నైపుణ్యం కావాలి. ఇందుకోసం లెక్కల నిర్వహణకు ఎక్కువ సమయం గడిపే విధంగా సహనం అలవర్చుకోవాలి.

వెబ్‌సైట్ : http://students.icwai.org