Thursday, April 26, 2012

యూజీసీ నెట్-2012.. ఒకే పరీక్ష.. బహుళ ప్రయోజనాలు


సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్ (లాంగ్వేజెస్), కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్ సబ్జెక్టుల్లో టీ చింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నా, పరిశోధనలు చేస్తూ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందాలనుకున్నా రాయాల్సిన పరీక్ష యూజీసీ-నెట్. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే లెక్చరర్‌షిప్‌కు, జేఆర్‌ఎఫ్‌కు అర్హత సాధిస్తారు. నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో యూజీసీ - నెట్ 2012పై ప్రత్యేక ఫోకస్..

ఏడాదిలో రెండుసార్లు (జూన్, డిసెంబర్) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణులైనవాళ్లు దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు/కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు అర్హులు అవుతారు.

అర్హత: హ్యుమానిటీస్ (లాంగ్వేజెస్‌తో కలిపి), సోషల్ సెన్సైస్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్ సబ్జెక్టుల్లో 55 శాతం (ఎస్సీ, ఎస్టీలు,శారీరక వికలాంగులు 50శాతం) మార్కులతో పీజీ ఉత్తీర్ణత. పీజీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులూ అర్హులే.

వయోపరిమితి:
జేఆర్‌ఎఫ్ కోసం: జూన్ 1, 2012 నాటికి 28 ఏళ్లు మించరాదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగులు, మహిళలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
లె క్చరర్‌షిప్ కోసం: ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం:
పరీక్ష రెండు సెషన్‌లుగా ఉంటుంది. మొదటి సెషన్ ఉదయం (మొదటి రెండు పేపర్లు), రెండో సెషన్ మధ్యాహ్నం (మూడో పేపర్) ఉంటుంది. పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. అవి..
పేపర్-1: అభ్యర్థి టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, టీచింగ్ ఎబిలిటీని అంచనా వేసేలా ప్రశ్నలు ఉంటాయి.

రీజనింగ్ ఎబిలిటీ, కాంప్రహెన్షన్, జనరల్ అవేర్‌నెస్‌లపై మొత్తం 60 మల్టిఫుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. వీటిల్లో ఏవైనా 50 ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానాలు ఇవ్వాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున 50 ప్రశ్నలకు 100 మార్కులుంటాయి. పరీక్ష ఉదయం 9.30 నుంచి 10.45 వరకు జరుగుతుంది.

పేపర్-2: ఈ పేపర్‌లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుపై 50 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 100 మార్కులుంటాయి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. పరీక్ష ఉదయం 10.45 నుంచి 12.00 వరకు ఉంటుంది.

పేపర్-3: అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టుపై 75 ఆబ్జెక్టివ్ ప్రశ్నలుంటాయి.అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 150 మార్కులుంటాయి. పరీక్ష మధ్యాహ్నం 1.30 నుంచి 4.00 గంటల వరకు జరుగుతుంది.

కటాఫ్ మార్కులు:
జనరల్ అభ్యర్థులు పేపర్-1, పేపర్-2లలో 40 శాతం మార్కులు, పేపర్-3లో 50 శాతం మార్కులు, ఓబీసీ (నాన్-క్రిమిలేయర్), ఎస్సీ/ఎస్టీ/శారీరక వికలాంగులు పేపర్-1, పేపర్-2లో 35 శాతం మార్కులు సాధించి ఉండాలి. పేపర్-3లో ఓబీసీ (నాన్-క్రిమిలేయర్) అభ్యర్థులు 45 శాతం, ఎస్సీ/ఎస్టీలు/శారీరక వికలాంగులు 40 శాతం మార్కులు పొంది ఉండాలి.

మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ-గుంటూరు, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి, ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్

దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2012
పరీక్ష తేదీ: జూన్ 24, 2012

వెబ్‌సైట్: http://ugcnetonline.in/

ఐఎఫ్‌ఎస్-2012కు సిద్ధమవ్వండిలా..


పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భూమి మీద జీవకోటి మనుగడ సాగించాలంటే అడవుల పాత్ర ఎంతో. అంతటి కీలకమైన అడవుల రక్షణ బాధ్యతలను నిర్వర్తించాలంటే నిష్ణాతులైన అధికారుల అవసరం చాలా ఉంది. అలాంటి నిబద్ధత గల అధికారులను దేశానికందించే ఉద్దేశంతో యూపీఎస్సీ ప్రతి ఏటా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాదికిగానూ నోటిఫికేషన్ విడుదలైన
నేపథ్యంలో పరీక్ష తీరుతెన్నులపై విశ్లేషణ...

మొత్తం పోస్టులు: 85
అర్హత: యానిమల్ హజ్బెండ్రీ అండ్ వెటర్నరీ సైన్స్/బోటనీ/కెమిస్ట్రీ/జియాలజీ/మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/స్టాటిస్టిక్స్ /జువాలజీ ఒక సబ్జెక్ట్‌గా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా అగ్రికల్చర్/ఫారెస్ట్రీ/ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ విద్యార్థులూ అర్హులే.

వయోపరిమితి: ఆగస్టు1, 2012 నాటికి 21-30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, శారీరక వికలాంగులకు పదేళ్లు సడలింపు.
అటెంప్ట్స్: జనరల్ కేటగిరీ అభ్యర్థులు మొత్తం నాలుగు సార్లు, ఓబీసీలు ఏడుసార్లు మాత్రమే రాసే అవకాశం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 14, 2012
పరీక్ష తేదీ: జూలై 14, 2012
మనరాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం

రాత పరీక్ష విధానం:
పరీక్షలో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. అవి..
1. జనరల్ ఇంగ్లిష్ - 300 మార్కులు
2. జనరల్ నాలెడ్‌‌జ - 300 మార్కులు
3. అభ్యర్థి ఎంచుకున్న రెండు ఆప్షనల్స్ సబ్జెక్టులలో ఒక్కో ఆప్షనల్ సబ్జెక్టుకు రెండు పేపర్లు ఉంటాయి.

ఒక్కో పేపర్‌కు 200 మార్కుల చొప్పున నాలుగు పేపర్లకు 800 మార్కులు. ప్రతి ప్రశ్నపత్రం పార్ట్-ఏ, పార్ట్-బీ అని రెండు విధాలుగా ఉంటుంది. ప్రతి పార్ట్‌లో నాలుగు ప్రశ్నల చొప్పున ఉంటాయి. వీటిలో ఏవైనా ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి పార్ట్‌లో తప్పనిసరిగా ఒక ప్రశ్నకైనా సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రాలన్నీ ఇంగ్లిష్ మాధ్యమంలోనే ఉంటాయి. వీటికి సమాధానాలు కూడా ఇంగ్లిష్ మాధ్యమంలోనే రాయాలి. అన్ని పేపర్లు కన్వెన్షనల్ (వ్యాసరూప) విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్ పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు.

ప్రశ్నపత్రం స్థాయి: జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్‌‌జ, ఇంజనీరింగ్ సబ్జెక్టులకు బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోనూ, మిగతా సబ్జెక్టులకు బ్యాచిలర్ డిగ్రీ స్థాయి కంటే పైన, మాస్టర్స్ డిగ్రీ స్థాయి కంటే తక్కువలోనూ సిలబస్ ఉంటుంది.

పర్సనాలిటీ టెస్ట్: రాత పరీక్షలో ఉత్తీర్ణులైనవారిని అందుబాటులో ఉన్న పోస్టులు, రిజర్వేషన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. దీనికి 300 మార్కులు ఉంటాయి.

అభ్యర్థి ఎంచుకోవాల్సిన ఆప్షనల్ సబ్జెక్టులు:
అగ్రికల్చర్; అగ్రికల్చరల్ ఇంజనీరింగ్; యానిమల్ హజ్బెండ్రీ అండ్ వెటర్నరీ సైన్స్; బోటనీ; కెమిస్ట్రీ; కెమికల్ ఇంజనీరింగ్; సివిల్ ఇంజనీరింగ్; ఫారెస్ట్రీ; జియాలజీ; మ్యాథమెటిక్స్; మెకానికల్ ఇంజనీరింగ్; ఫిజిక్స్; స్టాటిస్టిక్స్; జువాలజీ

అనుమతించని కాంబినేషన్లు:
కొన్ని సబ్జెక్టుల కాంబినేషన్‌ను అనుమతించరు. అవి..

అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్; అగ్రికల్చర్ అండ్ యానిమల్ హజ్బెండ్రీ అండ్ వెటర్నరీ సైన్స్; అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ; కెమిస్ట్రీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్; మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. అదే విధంగా అగ్రికల్చర్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టులలో ఒకదాన్ని మించి ఎంచుకోవడానికి కుదరదు.
వెబ్‌సైట్: www.upsconline.nic.in


జనరల్ నాలెడ్జ్: ఈ విభాగం నుంచి తక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. కరెంట్ అఫైర్స్ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి పరీక్ష తేదీకి సరిగ్గా ఏడాది ముందు వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న పలు ప్రధాన సంఘటనలు తెలుసుకోవాలి. భారత్‌కు వివిధ దేశాలతో ఈ ఏడాది కాలంలో జరిగిన ఒప్పందాలు; సదస్సులు, సమావేశాలు, అవార్డులు, సత్కారాలు, క్రీడలు-విజేతలు, పుస్తకాలు-రచయితలు మొదలైనవాటిని అధ్యయనం చేస్తే కరెంట్ అఫైర్‌‌స ప్రశ్నలకు సమాధానాలు రాయడం సులువే.

జాగ్రఫీ: ఎన్‌సీఈఆర్‌టీ 6 నుంచి 12 తరగతుల జాగ్రఫీ పుస్తకాలు చదివితే సరిపోతుంది. ఈ విభాగంలో మ్యాప్ పాయింట్ ప్రశ్నలడుగుతున్నారు. జాతీయ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, వివిధరకాల అటవీప్రాంతాలకు సంబంధించిన ప్రదేశాల మ్యాప్ పాయింట్ బాగా గుర్తుంచుకోవాలి.
హిస్టరీ: ఎన్‌సీఈఆర్‌టీ 6 నుంచి 12 తరగతుల హిస్టరీ పుస్తకాలు క్షుణ్నంగా చదవాలి. ఇందులో ప్రాచీన, మధ్యయుగ భారత దేశ చరిత్రకు ప్రాధాన్యం ఉంది. చదువుతున్నప్పుడే ముఖ్య పట్టణాలు, రాజులు-పాలనా కాలం-కీలక ఘట్టాలు, రాజ శాసనాలు-ఆ రాజు బిరుదులు-ఆస్థానంలో కవులు-రచనలు, ఆ సమయంలో సందర్శించిన ప్రముఖులు... ఇలా అన్ని అంశాలూ పాయింట్లుగా రాసుకుంటే ఎంతో ప్రయోజనం.

పాలిటీ: ఎన్‌సీఈఆర్‌టీ 8 నుంచి 12 తరగతుల పాఠ్య పుస్తకాలతోపాటు ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ పుస్తకం ఉపయోగపడతాయి.
ఇంగ్లిష్: రెన్ అండ్ మార్టిన్ హైస్కూల్ ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకం సరిపోతుంది.

ఆప్షనల్స్‌పై ఎక్కువ దృష్టి..
మీ దగ్గరున్న పాఠ్యపుస్తకం మొత్తం చదవడం కంటే సిలబస్ ప్రకారం చదవాలి. నోటిఫికేషన్‌లో చాప్టర్లవారీగా ఇచ్చిన సిలబస్ ప్రకారం.. ఏ చాప్టర్‌లో ఏఏ అంశాలు ఉన్నాయో వాటినే బాగా చదవాలి. చదివే సమయంలోనే ముఖ్యాంశాలను పాయింట్లుగా రాసుకోవాలి. ఆప్షనల్ సిలబస్ బ్యాచిలర్ డిగ్రీ స్థాయికి కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంబంధిత అంశాల మేరకు పీజీ లేదా రిఫరెన్స్ పుస్తకాలు కూడా చదవాలి.

జీకే, ఇంగ్లిష్‌లతో పాటు అభ్యర్థులు తమ ఆప్షనల్‌కు సంబంధించి పాత ప్రశ్నపత్రాలను బాగా అధ్యయనం చేయాలి. ప్రశ్నల శైలి, క్లిష్టత స్థాయి తెలుసుకోవాలి. ఇన్‌స్టంట్ మెటీరియల్ (గైడ్ల) కు బదులు అకడమిక్ పుస్తకాలు ఆప్షనల్ ప్రిపరేషన్‌కు బాగుంటాయి. అవసరం అనుకుంటే ఆ సబ్జెక్ట్‌లో రిఫరెన్స్ పుస్తకాలు తిరగేయాలి. ఆప్షనల్ సబ్జెక్టులు చదువుతున్నప్పుడే రాయడాన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. చదవడానికి కేటాయించే మొత్తం సమయంలో 60 శాతం ఆప్షనల్స్‌కు మిగిలిన 40 శాతం పేపర్-1, పేపర్-2లకు కేటాయించుకోవాలి. పరీక్షకు 5, 6 నెలల ముందు నుంచే పరీక్షకు సిద్ధం కావాలి.

స్కోరింగ్‌లో ఆప్షనల్ సబ్జెక్టులు కీలకపాత్ర పోషిస్తాయి. బ్యాచిలర్ డిగ్రీలో చదివిన సబ్జెక్టులనే పరీక్షలో ఎంచుకోవాలని చాలామంది అభ్యర్థులు అపోహపడుతుంటారు.అది సరికాదు. యూపీఎస్సీ పేర్కొన్న ఆప్షనల్స్‌లో ఏవైనా రెండు ఎంచుకుని పరీక్ష రాయొచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, కెమిస్ట్రీ ఆప్షనల్స్‌ను మంచి స్కోరింగ్ సబ్జెక్టులుగా పరిగణించొచ్చు.

ఇంటర్వ్యూ:
మౌఖిక పరీక్ష మొత్తం 300 మార్కులకు ఉంటుంది. ఇందులో విజయం సాధించాలంటే ఇంటర్వ్యూ నాటికి రెండు, మూడు నెలల ముందు జరిగిన ప్రధాన సంఘటనలపై దృష్టి సారించాలి. అదేవిధంగా మనరాష్ట్రంలో అడవులు, వాతావరణ మార్పులు, పర్యావరణ అంశాలు, అభ్యర్థి హాబీలు, బయోడైవర్సిటీ, ఇంతకు ముందు ఎక్కడైనా జాబ్ చేసి ఉంటే దానికి సంబంధించి వివరాలు అడిగే అవకాశం ఉంటుంది. అడవులకు సంబంధించిన విషయాల కోసం ఎవరైనా అటవీ అధికారిని కలిసి వివరాలు సేకరించడం లాభిస్తుంది.

Wednesday, April 25, 2012

న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?

1. ఫారెన్ లాంగ్వేజెస్ కోర్సులను ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలను తెలపండి? 

గ్లోబలైజేషన్‌తో.. మల్టీనేషనల్ కంపెనీలు భారత్‌కు రావడం.. స్వదేశీ కంపెనీలు జాయింట్ వెంచర్స్ పేరిట విదేశాలకు వ్యాపారాన్ని విస్తరిస్తుండటం.. ఫలితంగా విదేశీ నిపుణులతో సంప్రదింపులు, డాక్యుమెంటేషన్ తదితర వ్యవహారాలు నిత్యకృత్యమయ్యాయి. దీంతో సంబంధిత ఫారెన్ లాంగ్వేజ్ తెలిసి ఉండటం.. వ్యాపారపరంగా మంచి ఎత్తుగడ. 

ఈ కారణంగా ఫారెన్ లాంగ్వేజ్ డిగ్రీ నేర్చుకున్న వారికి డిమాండ్ ఏర్పడింది. మన దేశం.. వివిధ దేశాలతో కుదుర్చుకున్న అవగాహనల ఫలితంగా.. వచ్చే సమాచారాన్ని క్రోడీకరించడం, నాన్ ఇంగ్లిష్ స్పీకింగ్ దేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరగడం వంటి కారణాలతో ఫారెన్ లాంగ్వేజ్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, చైనీస్, జపనీస్, స్పానిష్, కొరియన్ భాషలకు మంచి ఆదరణ లభిస్తుంది.

ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు:
ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివ ర్సిటీ-హైదరాబాద్.
కోర్సులు: అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ రష్యన్, ఎంఏ(అరబిక్/ఫ్రెంచ్/స్పానిష్/జర్మన్/రష్యన్-ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు), ఎంఏ(అరబిక్/ఫ్రెంచ్/రష్యన్), పీజీ డిప్లొమా ఇన్ అరబిక్, ఎంఫిల్ (అరబిక్/ఫ్రెంచ్/జర్మన్/రష్యన్),పీహెచ్‌డీ(అరబిక్/ఫ్రెంచ్/జర్మన్/రష్యన్) వెబ్‌సైట్: ఠీఠీఠీ.్ఛజఠజీఠ్ఛిటటజ్టీడ.్చఛి.జీ
ఢిల్లీ యూనివర్సిటీ-న్యూఢిల్లీ.
ఎంఏ(ఫ్రెంచ్/అరబిక్), అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ హంగేరియన్/జపనీస్. వెబ్‌సైట్: www.du.ac.in
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ-ఢిల్లీ.
రష్యన్, అరబిక్, జపనీస్, పస్తూ, చైనీస్, ఫ్రెంచ్, కొరియన్, మంగోలియన్, ఇండోనేషియన్, జర్మన్, స్పానిష్, పోర్చుగీస్, ఇటాలియన్ భాషల్లో డిప్లొమా, ఎంఫిల్ స్థాయి వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వెబ్‌సైట్: www.jnu.ac.in

.....................

2. మ్యాట్ పరీక్ష వివరాలను తెలపండి? -రమేశ్, కూసుమంచి.

మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) పరీక్షను ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) నిర్వహిస్తుంది. ‘వ్యూట్’ ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా దాదాపు 500 బిజినెస్ స్కూళ్లలో ప్రవేశం పొందొచ్చు. వున రాష్ట్రంలో 70కి పైగా మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు వ్యూట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారుు.

వ్యూట్‌ను ఏఐఎంఏ ఏటా నాలుగుసార్లు ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్ నెలలో నిర్వహిస్తుంది. అర్హత: గ్రాడ్యుయేషన్. ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో జరిగే పరీక్షలో మొత్తం ఐదు సెక్షన్లు (లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, వ్యూథమెటికల్ స్కిల్స్, డేటా ఎనాలిసిస్ అండ్ సఫీషియున్సీ, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్, ఇండియున్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్) ఉంటాయి. 

ఒక్కో సెక్షన్‌కు 40 వూర్కుల చొప్పున మొత్తం 200 వూర్కులకు నిర్వహించే పరీక్షకు లభించే సవుయుం రెండున్నర గంటలు. వ్యూట్‌ను రెండు విధాలుగా (పేపర్ బేస్డ్, కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్) రాసుకునే అవకాశం ఉంటుంది.
వివరాలకు: www.aima-ind.org
...............

3. ఐఐఎస్‌ఈఆర్-పుణె నుంచి కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేయడానికి కావల్సిన అర్హత? -కరణ్, ఖమ్మం.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్)-పుణె.. కెమికల్ సెన్సైస్‌లో పీహెచ్‌డీ కోర్సును ఆఫర్ చేస్తుంది. ఇందులో ఫిజిక్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగాలు ఉన్నాయి. అర్హత: 55 శాతం మార్కులతో ఎంఎస్సీ(కెమిస్ట్రీ/ఫిజిక్స్/ బయోకెమిస్ట్రీ/మెటీరియల్ సైన్స్/బయోఇన్ఫర్మేటిక్స్/ఫార్మసీ) లేదా తత్సమానం. ప్రవేశం: సీఎస్‌ఐఆర్-నెట్, ఇన్‌స్పైర్-పీహెచ్‌డీ, గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా. వివరాలకు: www.iiserpune.ac.in
.................

4. పీజీ స్థాయిలో న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? 

తీసుకునే ఆహారానికి సరిపడే విధంగా పోషకాహార విలువల్లో తుల్యత పాటిస్తూ డైట్‌ను ప్రిస్క్రైబ్ చేసే వ్యక్తే ‘డైటీషియన్’. ఒక వ్యక్తి ఆరోగ్య వివరాలను మెడికల్ రికార్డ్స్ ద్వారా తెలుసుకుని, స్వభావసిద్ధ ఆహార అలవాట్లను గమనించి, శాస్త్రీయ పద్ధతిలో ఎటువంటి ఆహారం, ఎంత మోతాదులో, ఏయే సమయాల్లో తీసుకోవాలో డైటీషియన్ సూచిస్తాడు. ఈ కోర్సు చేసిన వారికి ఇటీవలి కాలంలో బాగా డిమాండ్ పెరిగింది. వీరికి కార్పొరేట్ ఆస్పత్రులు, జిమ్స్, హెల్త్ కేర్ సెంటర్లు, ఎయిర్‌లైన్ సంస్థలు, బ్యూటీ క్లినిక్స్, స్కూళ్లు-కళాశాలల హాస్టళ్లలో అవకాశాలు ఉంటాయి.

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ-హైదరాబాద్.
కోర్సు: ఎంఎస్సీ(హోం సైన్స్-న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్). వివరాలకు: www.angrau.net 
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
కోర్సు: ఎంఎస్సీ(న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్)
వెబ్‌సైట్: www.osmania.ac.in
} వేంకటేశ్వర యూనివ ర్సిటీ-తిరుపతి.
కోర్సు: ఎంఎస్సీ(న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్)
వెబ్‌సైట్: www.svuniversity.in 

గ్రూప్ - 4కు మార్గం ఇలా...

రాష్ర్ట ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గ్రూప్-4 నోటిఫికేషన్ వెలువరించింది. ఆగస్టు 11న జరగనున్న ఈ పరీక్షకు 80 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో పోస్టులు.. అర్హతలు, ప్రిపరేషన్ గెడైన్‌‌స..

1. జూనియర్ అకౌంటెంట్స్ ఇన్ ట్రెజర్స్ అండ్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్
పోస్టులు: 217
అర్హత: బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ నుంచి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఏపీ, హైదరాబాద్ నిర్వహించిన ఆఫీస్ ఆటోమేషన్/పీసీ మెయిన్‌టెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్/వెబ్ డిజైనింగ్‌లలో ఏదైనా ఒకటి ఉత్తీర్ణత లేదా యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీసీఏ/బీఎస్సీ (కంప్యూటర్స్)/బీకాం (కంప్యూటర్స్)/బీఏ (కంప్యూటర్స్)/బీటెక్/బీఈ (కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణత.

2. జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్
పోస్టులు: 114
3. జూనియర్ అసిస్టెంట్స్-సీసీఎల్‌ఏ
పోస్టులు: 892
4. జూనియర్ అసిస్టెంట్స్ ప్రిజన్స్ అండ్ క రెక్షనల్ డిపార్ట్‌మెంట్
పోస్టులు: 43
5. జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్
పోస్టులు: 03
6. జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ఫైర్ డిపార్ట్‌మెంట్
పోస్టులు: 06
అర్హత: 2, 3, 4, 5, 6 కోడ్ పోస్టులకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
7. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ సోషల్ వె ల్ఫేర్ డిపార్ట్‌మెంట్
పోస్టులు: 14
8. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ డీజీ అండ్ ఐజీ ఆఫ్ ప్రిజన్ అండ్ కరెక్షనల్ డి పార్ట్‌మెంట్
పోస్టులు: 20
అర్హత: 7, 8 కోడ్ పోస్టులకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు ప్రభుత్వ సాంకేతిక పరీక్ష (గ వర్నమెంట్ స్టాండర్డ్ కీ బోర్డ్‌పై) హయ్యర్ గ్రేడ్ ఇన్ తెలుగు టైప్ రైటింగ్ ఉత్తీర్ణత. హయ్యర్‌గ్రేడ్ ఉత్తీర్ణులు లభించకపోతే లోయర్‌గ్రేడ్ టైప్‌రైటింగ్ ఉత్తీర్ణులైనవారిని పరిగణనలోకి తీసుకుంటారు. తెలుగు టైప్‌రైటింగ్ ఉత్తీర్ణులు లేకపోతే ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఇస్తారు.
వయోపరిమితి: పై అన్ని పోస్టులకు జూలై 1, 2011 నాటికి 18-36 ఏళ్లు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, శారీరక వికలాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పే స్కేల్: * 8440 - * 24950
ఎంపిక: రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: మల్టిపుల్ చాయిస్ విధానంలో జరిగే పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. అవి పేపర్-1 జనరల్ స్టడీస్, పేపర్-2 సెక్రటేరియల్ ఎబిలిటీస్. ప్రశ్నపత్రం ఇంటర్మీడియెట్ పైస్థాయిలో ఉంటుంది.

పేపర్-1 జనరల్ స్టడీస్:
ఇందులో హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కరెంట్ అఫైర్స్‌లతోపాటు సీబీఎస్‌ఈ పబ్లికేషన్స్ నుంచి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కాన్సెప్ట్స్, భూకంపాలు, సునామీలు, తుఫానులు, వరదలు, కరువులు-వాటి కారణాలు, ప్రభావాలు, మానవ తప్పిద విపత్తులు-నివారణ వ్యూహాలు మొదలైనవాటిపై ప్రశ్నలుంటాయి. రెండున్నర గంటల వ్యవధిలో జరిగే పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.

పేపర్-2 సెక్రటేరియల్ ఎబిలిటీస్:
మెంటల్ ఎబిలిటీ (వెర్బల్-నాన్ వెర్బల్), లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్, రీ అరెంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, న్యూమరికల్ , అర్థమెటికల్ ఎబిలిటీస్‌పై 150 ప్రశ్నలుంటాయి. వీటికి ఒక్కోదానికి ఒక్కో మార్కు. రెండున్నర గంటల వ్యవధిలో సమాధానాలు ఇవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష కేంద్రాలు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది.

ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: మే 24, 2012
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జూన్ 22, 2012
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 24, 2012
రాత పరీక్ష తేదీ: ఆగస్టు 11, 2012

వెబ్‌సైట్: www.apspsc.gov.in

Friday, April 6, 2012

ఫ్యాషన్ డిజైన్/ టెక్నాలజీ/ మేనేజ్‌మెంట్/ రిటైల్ ఎడ్యుకేషన్‌లో ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సంస్థ పుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ). పాదరక్షల డిజైనింగ్, రిటైల్ మేనేజ్‌మెంట్‌లో అత్యుత్తమ నిపుణులను దేశానికందించే ఉద్దేశంతో కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎఫ్‌డీడీఐని ఏర్పాటు చేసింది. నోయిడా ప్రధాన క్యాంపస్‌గా.. ఫుర్‌సత్‌గంజ్, చెన్నై, కోల్‌కతా, రోహ్‌తక్, చింద్వారా, జోధ్‌పూర్‌లలో అనుబంధ క్యాంపస్‌లున్నాయి. ఈ సంస్థ వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఆయా కోర్సులు.. అర్హతలు.. ప్రవేశపరీక్ష విధానంపై ఫోకస్...


కోర్సులు:
బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు:
ఫుట్‌వేర్ టెక్నాలజీ
ఫ్యాషన్ మర్చెండైజింగ్ అండ్ రిటైల్ మేనేజ్‌మెంట్
లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్
ఫ్యాషన్ డిజైనింగ్
అర్హత: 10+2 ఉత్తీర్ణత.

మాస్టర్స్ డిగ్రీ కోర్సులు:
పుట్‌వేర్ టెక్నాలజీ 
క్రియేటివ్ డిజైన్ అండ్ క్యాడ్/క్యామ్
ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ మేనేజ్‌మెంట్
ఫ్యాషన్ మర్చెండైజింగ్ అండ్ రిటైల్ మేనేజ్‌మెంట్
లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్
విజువల్ మర్చెండైజింగ్ అండ్ కమ్యూనికేషన్ డిజైన్
ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ మేనేజ్‌మెంట్
అర్హత: దాదాపు అన్ని కోర్సులకు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. మరికొన్ని కోర్సులకు నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

పరీక్ష విధానం: 
యూజీ పరీక్ష ఇలా..
రెండున్నర గంటల వ్యవధిలో ఆన్‌లైన్‌లో జరిగే ప్రవేశపరీక్షలో మొత్తం 150 ప్రశ్నలుంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. 

విభాగం అంశం సమయం ప్రశ్నలు
సెక్షన్ ఏ మ్యాథమెటిక్స్ 45 ని. 45
సెక్షన్ బీ జనరల్ సైన్స్ 30 ని. 30
సెక్షన్ సీ ఇంగ్లిష్ 45 ని. 45
సెక్షన్ డీ జనరల్ అవేర్‌నెస్ 30 ని. 30

పీజీ పరీక్ష ఇలా..
రెండున్నర గంటల వ్యవధిలో ఆన్‌లైన్‌లో జరిగే ప్రవేశపరీక్షలో మొత్తం 150 ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు. నెగిటివ్ మార్కులు లేవు. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది.

విభాగం అంశం సమయం {పశ్నలు
సెక్షన్-ఏ క్వాంటిటేటివ్ 
ఆప్టిట్యూడ్ అండ్ 
రీజనింగ్ 45 ని. 45
సెక్షన్-బీ ఇంగ్లిష్ 45 ని. 45
సెక్షన్-సీ జనరల్ అవేర్‌నెస్ 30 ని. 30
సెక్షన్-డీ బిజినెస్ ఆప్టిట్యూడ్ 30 ని. 30

ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు: యూజీ కోర్సుల్లో ప్రవేశానికి ఏఐఈఈఈ/బిట్‌శాట్/ఐఐటీజేఈఈ/ఎంసెట్/వీఐటీ/ఎస్‌ఆర్‌ఎం మొదలైన ప్రవేశ పరీక్షలలో.. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి క్యాట్/మ్యాట్/ఎక్స్‌ఏటీ/ఏటీఎంఏ/ఎన్‌మ్యాట్/స్నాప్/జీమ్యాట్ వంటి పరీక్షల్లో మంచి పర్సంటైల్ సాధించినవారికి ఇన్‌స్టిట్యూట్ ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఉంది. 

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్: ఇక్కడ విద్యనభ్యసించిన విద్యార్థులకు నూటికి నూరుశాతం ప్లేస్‌మెంట్స్‌ను కల్పించడంలో ఎఫ్‌డీడీఐ ముందుంది. విద్యార్థులు కోర్సులు పూర్తికాగానే వివిధ కంపెనీలు వీరికి మంచి జీతాలను ఆఫర్ చేసి తమ కంపెనీలలోకి ఎగరేసుకుపోతున్నాయి.

మనరాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా 

ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మే 17, 2012
ప్రవేశ పరీక్ష: జూన్ 1, 2, 3, 2012
వెబ్‌సైట్: http://www.fddiindia.com/index.html
ఇంజనీరింగ్ అంటే కేవలం సాఫ్ట్‌వేర్ కంపెనీలు, లేదంటే నిర్మాణరంగ కంపెనీల్లో ఉద్యోగాలేనా.. అంతకుమించి సవాళ్లతో కూడుకుని, అత్యున్నత గౌరవం, హోదాతో కెరీర్లో వేగంగా ఎదగడానికి అవకాశం లేదా? అంటే సమాధానం... ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్(ఐఈఎస్). కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ విభాగాల్లో పనిచేయడానికి యూపీఎస్సీ ప్రత్యేకంగా ఐఈఎస్‌ను నిర్వహిస్తోంది. బీటెక్ అర్హతగా నిర్వహించే ఈ పరీక్షలో విజయం సాధిస్తే తక్కువ కాలంలోనే కెరీర్లో అత్యున్నత శిఖరాలకు ఎదిగే అవకాశం ఉంది. 

మొత్తం ఖాళీలు: 560
విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి బీటెక్/బీఈ ఉత్తీర్ణత. 

వయోపరిమితి: జనవరి 1, 2012 నాటికి 21 ఏళ్లు నిండి ఉండి 30 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఉద్యోగాలిక్కడ...
ఇండియన్ రైల్వే సర్వీస్ 
సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్
ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ 
ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీసెస్ 
సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ 
నేవల్ ఆర్మమెంట్ సర్వీస్
జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
ఇండియన్ సప్లై సర్వీస్
ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్ 
టెలీకమ్యూనికేషన్ సర్వీస్ మొదలైనవి.

పరీక్ష విధానం:
రాత పరీక్షకు మొత్తం 1000 మార్కులుంటాయి. ఇందులో రెండు విభాగాలుంటాయి. అవి.. సెక్షన్-1, సెక్షన్-2.

సెక్షన్-1: ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రధానంగా రెండు సెక్షన్లుంటాయి. మొదటి సెక్షన్‌లో జనరల్ ఎబిలిటీ టెస్ట్ (జనరల్ ఇంగ్లిష్, జనరల్ స్టడీస్) ఉంటుంది. ఈ పరీక్షకు కాలవ్యవధి రెండు గంటలు. మార్కులు 200. ఇదేవిభాగంలో అభ్యర్థి ఎంచుకున్న ఇంజనీరింగ్ సబ్జెక్టు (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్) ఏదొకటి నుంచి రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. ఒక్కో పేపర్‌కు 200మార్కులు. ఈ విభాగంలో జరిగే అన్ని పేపర్లకు..గుర్తించిన తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కులు ఉంటాయి. సెక్షన్-1లో కటాఫ్ మార్కులు సాధిస్తేనే.. సెక్షన్-2 ప్రశ్నపత్రం మూల్యాంకనం చేస్తారు. 

సెక్షన్-2: ఇది కన్వెన్షనల్ విభాగం. ఇందులో అభ్యర్థి ఎంచుకున్న ఇంజనీరింగ్ సబ్జెక్టు (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్)పై రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు. ఒక్కో పేపర్‌కు 3 గంటల వ్యవధిలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూ: రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. దీనికి 200 మార్కులుంటాయి.

పరీక్ష.. సిలబస్: అభ్యర్థులు పరీక్షకు బీటెక్ స్థాయిలో సిద్ధం కావాల్సి ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్‌లో ప్రధానంగా అభ్యర్థి ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అదేవిధంగా జనరల్ స్టడీస్‌లో కరెంట్ అఫైర్స్‌కుసంబంధించి, భారతదేశ చరిత్ర, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ప్రశ్నలడుగుతారు. సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులైతే వారికి ప్రధానంగా సాలిడ్ మెకానిక్స్, డిజైన్ ఆఫ్ స్టీల్‌స్ట్రక్చర్, కన్‌స్ట్రక్షన్ ప్రాక్టికల్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్, హైడ్రాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ వంటి సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. 

మెకానికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మో డైనమిక్స్, ఫ్లూయిడ్ మెషినరీ, స్ట్రీమ్ జనరేటర్స్, హీట్ ట్రాన్స్‌ఫర్ అండ్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండీషనింగ్..ఎలక్ట్రికల్ బ్రాంచ్ అభ్యర్థులకు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ మెటీరియల్స్, కంట్రోల్ సిస్టం, పవర్‌సిస్టం, కమ్యూనికేషన్ సిస్టం, మైక్రోప్రొసీజర్ వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి.

చక్కని ప్రిపరేషన్‌తో.. సులువుగా విజయం:
ఒక్కో సబ్జెక్టులో సుమారు 20 నుంచి 25 శాతం వరకు ప్రశ్నలపై పెద్దగా ప్రిపరేషన్ లేకుండానే సమాధానాలు రాయొచ్చు. 40 నుంచి 50 శాతం ప్రశ్నలకు కచ్చితంగా ప్రిపరేషన్ ఉండాలి. సంబంధిత బీటెక్/బీఈ పుస్తకాల్లో టాపిక్‌లు చదివి అర్థం చేసుకుంటే చాలు. విజయం సాధించాలంటే అత్యున్నతస్థాయి టాలెంట్ అవసరం లేదని ఈ రంగంలో విజయం సాధించిన సీనియర్లు చెబుతున్నారు. 

కేవలం ప్రణాళికబద్ధంగా ప్రిపరేషన్ చేయడం, ఒకటికి, రెండుసార్లు గత ఐదేళ్ల పాత ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేస్తే విజయం సాధించొచ్చు. ఆబ్జెక్టివ్ పేపర్లకు సంబంధించి అన్ని సబ్జెక్టులు చదవాల్సిందే. బీటెక్ పుస్తకాలను చదివి అర్థం చేసుకోవడం కష్టంగా అనిపిస్తే డిప్లొమా పుస్తకాలను చదివినా మంచి మార్కులు పొందే అవకాశాలుంటాయి. జనరల్ స్టడీస్ విభాగంలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలు, ఏదైనా ప్రామాణిక ఇయర్‌బుక్ చదవాలి.

రిఫరెన్స్‌బుక్స్:
నెట్‌వర్క్ ఎనాలసిస్-వాన్ వాల్కెన్‌బర్గ్
ఐఈఎస్ జనరల్‌స్టడీస్-జీకె
ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్-కేఆర్ బాట్కర్
డిజిటల్ లాజిక్ అండ్ కంప్యూటర్ డిజైన్-మోరిస్‌మనో
కమ్యునికేషన్ సిస్టం-ఊ.బ్రూకార్ల్‌సన్
ఆటోమెటిక్ కంట్రోల్ సిస్టం-బెంజ్‌మన్ సి.కౌ

ఐదంకెల వేతనాలు..అత్యుత్తమ కెరీర్:
ఆరంభంలోనే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా చేరితే 6వ పే కమిషన్ ప్రకారం * 36 వేల జీతం లభిస్తుంది. (బేసిక్ పే 15,600నుంచి 39,100వరకు, గ్రేడ్‌పే 5,400, డీఏ 9,180, హెచ్‌ఆర్‌ఏ 6,300, టీఏ 3,200 వరకు లభిస్తాయి.) ఆరంభంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మూడు, నాలుగేళ్ల అనుభవంతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పదోన్నతిని పొంది.. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ సెలక్షన్ గ్రేడ్, చీఫ్ ఇంజనీర్ లెవెల్-2కు, 25 ఏళ్ల సర్వీసు ఉంటే చీఫ్ ఇంజనీర్ లెవెల్-1, ఇంజనీర్ ఇన్ ఛీప్ వరకు చేరుకోవచ్చు.

దరఖాస్తు విధానం: www.upsconline.nic.in 
ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
మన రాష్ర్టంలో పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.

ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 9, 2012
పరీక్ష తేదీ: జూన్ 15, 2012
వెబ్‌సైట్: www.upsc.gov.in
1. న్యూక్లియర్ ఫిజిక్స్, ఎంటెక్(మైనింగ్) కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?- రవి, కరీంనగర్.

జ: న్యూక్లియర్ ఫిజిక్స్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం, ఎంఎస్సీ(న్యూక్లియర్ ఫిజిక్స్) కోర్సును ఆఫర్ చేస్తుంది. అర్హత: బీఎస్సీ(మ్యాథ్స్,ఫిజిక్స్). యూనివర్సిటీ నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వివరాలకు: www.andhrauniversity.info

యూనివర్సిటీ ఆఫ్ పుణే-పుణే, ఎంఎస్సీ(ఫిజిక్స్-న్యూక్లియర్ టెక్నిక్స్ ఆప్షనల్ సబ్జెక్టుగా) కోర్సును అందిస్తుంది. అర్హత: బీఎస్సీ(ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్). సంబంధిత బ్రాంచ్‌లో బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు కూడా అర్హులే. యూనివర్సిటీ నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. వివరాలకు: www.unipune.ac.in

ఎంటెక్(మైనింగ్) కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్:
ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్-ధన్‌బాద్
కోర్సు: ఎంటెక్(మైనింగ్ ఇంజనీరింగ్)
అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో బీఈ/బీటెక్.
ప్రవేశం: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా. గేట్‌లో క్వాలిఫై కాని అభ్యర్థులకు దేశవ్యాప్తంగా నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
వివరాలకు: www.ismdhanbad.ac.in

2. బీటెక్(ఐటీ) ఫైనలియర్ చదువుతున్నాను. సిస్కో (Cisco) సర్టిఫికేషన్స్‌లో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నాను. వివరాలు తెలపండి? -రాఘవేంద్ర, వరంగల్.

జ: నెట్‌వర్కింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రంగాల్లో సిస్కో సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఐటీ కంపెనీలు.. తమ నెట్‌వర్కింగ్ కోసం సిస్కో టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. అందువల్ల సిస్కో సర్టిఫికెట్ కలిగి ఉండడం కెరీర్ ఉన్నతితోపాటు జాబ్ మార్కెట్‌లో మీ అవకాశాలను మరింత విస్తృతం చేస్తుంది. ఇప్పటి వరకు చదివిన బీటెక్ కోర్సుతో నెట్‌వర్కింగ్‌కు సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. 

నెట్‌వర్క్, నిర్వహణ విషయంలో విస్తృత పరిజ్ఞానం సిస్కో సర్టిఫికెట్‌తో లభిస్తుంది. ఇందులో ప్రారంభంలో సర్టిఫైడ్ నెట్‌వర్క్ అసోసియేట్ (సీసీఎన్‌ఏ), సర్టిఫైడ్ నెట్‌వర్క్ ప్రొఫెషనల్ (సీసీఎన్‌పీ) కోర్సులు ఉంటాయి. తర్వాత సిస్కో సర్టిఫైడ్ ఇంటర్నెట్ వర్క్ ఇంజనీర్ (సీసీఐఈ), సిస్కో సర్టిఫైడ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ (సీసీఎస్‌పీ) వంటి అడ్వాన్స్‌డ్ కోర్సులు ఉంటాయి.

కోర్సు పూర్తైన తర్వాత జాబ్ నేచర్‌ను బట్టి వివిధ రకాల బాధ్యతలను నిర్వహించాలి. ఇన్‌స్టాలింగ్ అండ్ అనలైజింగ్ నెట్‌వర్క్స్, మానిటరింగ్ నెట్‌వర్క్, యాడింగ్ న్యూ సర్వర్స్, సిస్టమ్ అప్‌గ్రేడ్ అండ్ సెక్యూరిటీ టెస్టింగ్, రైటింగ్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్, నెట్‌వర్క్ ట్రైనర్స్ వంటి విధులను నిర్వర్తించాలి.
మన దేశంలో.. 
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ
(www.iisecurity.in) 
నిట్ (www.niit.com), జెట్‌కింగ్ వంటి ఇన్‌స్టిట్యూట్‌లు సిస్కో సర్టిఫికేషన్‌లో శిక్షణను అందిస్తున్నాయి.

3. బయోటెక్నాలజీ స్పెషలైజేషన్‌తో అందుబాటులో ఉన్న మేనేజ్‌మెంట్ కోర్సు వివరాలు?
-రాకేష్, రామకృష్ణాపురం.

జ: ఔషధాలకు సంబంధించి రీసెర్చ్, అనుబంధ కార్యక్రమాలు విస్తృతమవుతుండటంతో ఇటీవల కాలంలో బయోటెక్ పరిశ్రమల వ్యాపార కార్యకలాపాలు కూడా ఊపందుకున్నారుు. దీంతో సంబంధిత కంపెనీలు తమ మార్కెటింగ్ కార్యకలాపాల కోసం స్పెషలైజ్డ్ ఎగ్జిక్యూటి వ్‌లు, మార్కెటింగ్ మేనేజర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. దీన్ని గుర్తించిన కొన్ని విద్యా సంస్థలు ఈ విభాగంలో పలు మేనేజ్‌మెంట్ కోర్సులకు రూపకల్పన చేశారుు. అవి.. 
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్-హైదరాబాద్
కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్- బయోటెక్నాలజీ
అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్
ప్రవేశం: క్యాట్/ఎక్స్‌ఏటీ/మ్యాట్/ఏటీఎంఏ/ఐసెట్ స్కోర్‌తోపాటు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
వివరాలకు: www.ipeindia.org 
యూనివర్సిటీ ఆఫ్ పుణే
కోర్సు: ఎంబీఏ-బయోటెక్నాలజీ
అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి సైన్స్‌లో మాస్టర్/బ్యాచిలర్ డిగ్రీ
ప్రవేశం: ఏటీఎంఏ స్కోర్‌తోపాటు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
వివరాలకు: www.pumba.in 
అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ-న్యూఢిల్లీ.
కోర్సు: ఎంబీఏ-బయోటెక్నాలజీ
అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్.
ప్రవేశం: క్యాట్/మ్యాట్/జీమ్యాట్ లేదా ఇన్‌స్టిట్యూట్ సొంతంగా నిర్వహించే రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
వివరాలకు: www.amity.edu 

4. రాష్ట్రంలో ఎంఈడీ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి? -సురేష్, సూర్యాపేట.
జ: ఎంఈడీ కోర్సును రెగ్యులర్‌గా ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.osmania.ac.in
కాకతీయ యూనివర్సిటీ-వరంగల్
వెబ్‌సైట్: www.kuwarangal.com
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.svuniversity.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.info
దూర విద్యా విధానంలో ఎంఈడీ అందిస్తున్న వర్సిటీలు
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)-న్యూఢిల్లీ. వెబ్‌సైట్: ఠీఠీఠీ.జీజౌఠ.్చఛి.జీ
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.braou.ac.in