Friday, August 17, 2012

రూరల్ మేనేజ్‌మెంట్ కోర్సులు...


దేశానికి పట్టు కొమ్మలు గ్రామాలు. అలాంటి గ్రామ ప్రాంతాల అభివృద్ధిలో కో-ఆపరేటివ్ సొసైటీలు, అభివృద్ధి ఏజెన్సీలది కీలక పాత్ర.. వీటిల్లో ప్రొఫెషనలిజం పెంచడం ద్వారా.. గ్రామాలు మరింత ముందడుగు వేసే అవకాశం ఉంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన కోర్సులను అందించే సంస్థ.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్, ఆనంద్ (ఐఆర్‌ఎంఏ). 2012-13 విద్యా సంవత్సరానికి ఐఆర్‌ఎంఏ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్(ఐఆర్‌ఎంఏ)ను 1979లో గుజరాత్‌లోని ఆనంద్‌లో స్థాపించారు. పాడి పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన డాక్టర్ కురియన్ మార్గదర్శకం మేరకు ఈ ఇన్‌స్టిట్యూట్ పని చేస్తుంది. ఈ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ సర్వీస్ మేనేజర్స్, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ అధికారులు, ఎన్‌జీఓలు, కార్పొరేట్ సంస్థలో రూరల్ డెవలప్‌మెంట్ విభాగాల్లో పని చేసే అధికారులకు మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా శిక్షణ ఇస్తుంది.

ఆఫర్ చేస్తున్న కోర్సులు: పోస్టుగ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్ (పీఆర్‌ఎమ్): గ్రామీణ అభివృద్ధి సంస్థల్లో, రూరల్ కో ఆపరేటివ్ సంస్థల్లో.. ప్రొఫెషనలిజంను పెంచడానికి అవసరమైన అంశాల దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను రూపొందించారు. గ్రామీణప్రాంతాల్లో చేపట్టవలసిన చర్యలు, కార్యక్రమాలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనేందుకు.. సంబంధిత ఆర్గనైజేషన్స్‌లో మేనేజర్‌గా విధులు నిర్వహించడానికి కావాలసిన నైపుణ్యాలను ఈ కోర్సులో బోధిస్తారు. ఈ కోర్సు క్లాస్ రూం టీచింగ్, ఫీల్డ్ వర్క్ (ఫీల్డ్ వర్క్), డెవలప్‌మెంట్ ఇంటర్న్‌షిప్, మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ అని నాలుగు విభాగాలుగా ఉంటుంది.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం)ఏదైనా గ్రాడ్యుయేషన్ (10+2+3 విధానంలో).

కాల వ్యవధి: రెండేళ్లు
ప్రవేశ విధానం: ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా. ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్‌ను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫెలో ప్రోగ్రాం ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌పీఆర్‌ఎమ్):
ఇది కోర్సు బేస్డ్ డాక్టోరల్ రెసిడెన్సీ ప్రోగ్రామ్. ఈ కోర్సులో భాగంగా పలు రకాల స్పెషలైజేషన్స్‌ను ఎంచుకోవాలి. అవి.. మేనేజ్‌మెంట్, అగ్రి బిజినెస్/రూరల్ మార్కెటింగ్, నేచురల్ రీసోర్స్ మేనేజ్‌మెంట్, డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్, మైక్రో ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, గవర్ననెస్ అండ్ లైవ్లీహుడ్స్, రూరల్ ఇన్ఫాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ పాలసీ అండ్ నాన్ ప్రాఫిట్ మేనేజ్‌మెంట్.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతోఏదైనా సబ్జెక్ట్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్. డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలి. లేదా ఐఆర్‌ఎంఏ నుంచి పీజీడిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ లేదా 60 శాతం మార్కులతో ప్రొఫెషనల్ డిగ్రీ (ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చరల్, సెన్సైస్)తోపాటు మూడేళ్ల అనుభవం (ఐదేళ్ల డిగ్రీకి-సంవత్సరం).

ఫెలోషిప్:
ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఫెలోషిప్ కూడా అందజేస్తారు. ప్రారంభంలో నెలకు రూ.14,000 ఫెలోషిప్ చెల్లిస్తారు. తర్వాత ఉండే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణులైన వారికి నెలకు రూ.16,000 ఫెలోషిప్ ఉంటుంది. ఇవికాకుండా కంటిన్‌జెన్సీ నిధుల కింద సంవత్సరానికి రూ. 20,000 చొప్పున నాలుగేళ్లు ఇస్తారు.

ప్రవేశ విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దీంతోపాటు ఒక వ్యాసాన్ని కూడా ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మేనేజ్ మెంట్, సోషల్ వర్క్, ఎకనామిక్స్, సోషియాలజీ, సైకాలజీ, కామర్స్‌లో యూజీసీ-జేఆర్‌ఎఫ్/సీఎఎస్‌ఐఆర్ నెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు రాత పరీక్షకు హాజరు కావల్సిన అవసరం లేదు. వీరికి ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు. ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్‌ను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

స్కాలర్‌షిప్-ప్లేస్‌మెంట్స్: ఐఆర్‌ఎంఏ విద్యార్థులకు రతన్‌టాటా స్కాలర్‌షిప్‌తోపాటు అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ స్కాలర్‌షిప్స్ అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా 15 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్ షిప్ మంజూరు చేస్తుంది. ఈ ఇన్‌స్టిట్యూట్ దారిద్య్రరేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న పేద విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో కొంత మినహాయింపు ఇస్తుంది. ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఆనంద్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటువంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ అందిస్తుంది. ప్లేస్‌మెంట్ విషయంలో కూడా ఐఆర్‌ఎంఏకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడి అభ్యర్థులు వివిధ యూనివర్సిటీలు, కాలేజీలు, ఎన్‌ఎంసీలతోపాటు ప్రఖ్యాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లలో వివిధ హోదాల్లో స్థిర పడ్డారు.

కెరీర్:
రూరల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేసిన వారికి కేంద్ర, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థల్లో విస్త్రత ఉద్యోగావకాశాలు ఉంటాయి. రూరల్ డెవలప్‌మెంట్, కమ్యూనిటీ మొబలైజేషన్, మేనేజింగ్ కలెక్టివ్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ప్లానింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ప్రొడెక్షన్ మేనేజ్ మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హ్యూమన్ రీసోర్స్ డెవలప్‌మెంట్, నేచురల్ రీసోర్స్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి. గ్రామీణాప్రాంతాల అభివృద్ధికోసం పనిచేసే వివిధ ప్రైవేట్ సంస్థల్లో, ఎన్‌జీవోలలో ఉపాధి అవకాశాలు లభించవచ్చు. పీహెచ్‌డీ పూర్తి చేసిన వారు వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో రూరల్ డెవలప్‌మెంట్, మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఫ్యాకల్టీగా అవకాశాలను పొందవచ్చు. ఈ కోర్సు ఉత్తీర్ణులకు సంవత్సరానికి రూ.8 లక్షల వరకు వేతనం లభించవచ్చు.

దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్డ్‌కాపీని ప్రింట్ అవు ట్ తీసి కింది చిరునామాకు పంపాలి. లేదా వెబ్‌సైట్ నుంచి కూడా దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిషన్స్ ఆఫీసు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ అండ్- ఆనంద్(ఐఆర్‌ఎంఏ)
ఆనంద్-388 001, గుజరాత్.

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: సెప్టెంబర్ 30, 2012
పరీక్ష తేదీ: నవంబర్ 11
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.
వివరాలకు: www.irma.ac.in


బీఎస్సీ(మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, బోటనీ) చేశాను. మైక్రోబయాలజీ, కెమిస్ట్రీలలో ఏ కోర్సుకు అవకాశాలుంటాయి? - లావణ్య కుమార్, తిరుపతి.
మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ రెండింటిలోను మంచి అవకాశాలుంటాయి. అయితే మైక్రోబయాలజీ అనేది స్పెషలైజ్డ్ కోర్సు కావడంతో ఈ కోర్సు చేసిన వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువేనని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్న రంగాల్లో మైక్రోబయాలజీ ఒకటి. మైక్రోబయాలజిస్ట్‌లు వ్యాధులు, వాటి కారణాలు, నివారణకు ఉపయోగించే ఔషధాలు వంటి అంశాలపై తమ పరిశోధనలు సాగిస్తుంటారు. మైక్రోబయాలజీలో పీజీ చేసిన తర్వాత మీకిష్టమైన అంశంలో షార్ట్‌టర్మ్ కోర్సు లేదా అందుకు సంబంధించిన శిక్షణను తీసుకోవచ్చు. పరిశోధన రంగంలోకి కూడా ప్రవేశించవచ్చు. ఈ కోర్సు చేసిన వారికి వివిధ డయాగ్నోస్టిక్ సెంటర్లు, రీసెర్చ్ లేబొరేటరీల్లో అవకాశాలుంటాయి. కెమిస్ట్రీ విషయానికొస్తే..ఇందులో అవకాశాలు కొంత పరిమితం. ఈ అంశంలో మాస్టర్/ పీహెచ్‌డీ చేసిన వారికి ఫార్మసీ కంపెనీలు, లేబొరేటరీల్లో విరివిగా అవకాశాలుంటాయి. అంతేకాకుండా విద్యా సంస్థల్లో లెక్చరర్‌గా పని చేసే అవకాశం కూడా ఉంటుంది. మన రాష్ట్రంలోని అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు మాస్టర్/ పీహెచ్‌డీ స్థాయిల్లో కెమిస్ట్రీని అందిస్తున్నాయి. ఆయా వర్సిటీ లు నిర్వహించే పరీక్షల ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది.



ఎంబీఏ(టెలికాం) కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లను తెలపండి? -సలీమ్, కర్నూల్.
ఇటీవల కాలంలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ) కోర్సులో నూతనంగా ప్రవేశపెట్టిన స్పెషలైజేషన్స్‌లో టెలికాం మేనేజ్‌మెంట్ ఒకటి. దేశంలో ప్రస్తుతం టెలికాం రంగం శరవేగంగా విస్తరిస్తుండడంతో ఈ కోర్సు చేసిన వారికి అవకాశాల పరంగా మంచి డిమాండ్ ఉంటోంది.

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
భారతి స్కూల్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్- ఐఐటీ, ఢిల్లీ.
కోర్సు: ఎంబీఏ(టెలికాం సిస్టమ్స్ మేనేజ్‌మెంట్)
అర్హత: బీఈ/బీటెక్/బీఆర్క్/బీఫార్మసీ/అగ్రికల్చరల్ ఇంజనీరింగ్/ 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ(ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథ్స్/కామర్స్/ఎకనామిక్స్ సంబంధిత బ్రాంచ్‌లలో)
ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
వెబ్‌సైట్: http://bsttm.iitd.ac.in

సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలికాం మేనేజ్‌మెంట్-పుణే
కోర్సు: ఎంబీఏ-టెలికాం(సిస్టమ్స్ అండ్ ఫైనాన్స్/మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ స్పెషలైజేషన్లుగా)
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్
ప్రవేశం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
వెబ్‌సైట్: www.sitm.ac.in


అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలికాం టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్-నోయిడా
కోర్సు: ఎంబీఏ(టెలీకమ్యూనికేషన్స్)
అర్హత: బీటెక్/బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్/ఐటీ)
ఎంపిక: క్యాట్/మ్యాట్/జీమ్యాట్ స్కోర్‌తోపాటు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా
వెబ్‌సైట్: www.amity.edu
బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సు వివరాలను తెలపండి?
-ప్రవీణ్, కమర్‌పల్లి.
బీఎస్సీ (అగ్రికల్చర్)కోర్సులో... ఆగ్రానమీ, హార్టికల్చర్, ప్లాంట్ పాథాలజీ, ఎంటమాలజీ, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్, జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్, సారుుల్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, యూనిమల్ హజ్బెండరీలు ప్రధాన సబ్జెక్టులు. వీటి తోపాటు హ్యుమానిటీస్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ వంటి ప్రాథ మిక సబ్జెక్టుల బోధన కూడా తప్పనిసరి. కోర్సులో చేరిన విద్యా ర్థి... విత్తనోత్పత్తి, కొత్త పద్ధతుల ఆవిష్కరణ, చీడపీడల గుర్తింపు, నివారణ మార్గాలు కనుగొనడం, అగ్రికల్చరల్ మార్కె టింగ్, విత్తనాభివృద్ధి వంటి అంశాల్లో పూర్తిస్థారుు నైపుణ్యం సాధించేలా బోధన జరుగుతుంది. నాలుగేళ్లపాటు 8 సెమిస్టర్ల విధానంలో సాగే ఈ కోర్సులో.. మొదటి సెమిస్టర్ మినహా రుుస్తే.. మిగతాదంతా ప్రాక్టికల్ ఓరియెంటెడ్.
అందువల్ల విద్యార్థులు ఆ కోణంలో క్షేత్రస్థారుు పరిశీలనలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.ఏజీ బీఎస్సీ ఉత్తీర్ణులకు ఇటు ప్రభుత్వ.. అటు ప్రైవేట్ రంగాల్లో పలు అవకాశాలు లభిస్తారుు. ఇటీవల ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షల్లో ఈ విద్యార్థులదే హవా. ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాలు పెరుగుతున్నారుు. ర్యాలీస్, మోన్‌శాంటో, ఐటీసీ, ఆంధ్రా బ్యాంక్, ఓబీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి సంస్థలు కూడా ఏజీ బీఎస్సీ విద్యార్థులను రిక్రూట్ చేసుకుంట్తున్నారుు. కేవలం బ్యాచ్‌లర్ డిగ్రీకే పరిమితంగా కాకుండా... పీజీ కూడా చదివితే అవకాశాలు మరింత విసృ్తతమవుతారుు. క్రాప్ ప్రొడ క్షన్, ఎంటమాలజీ, ప్లాంట్ పాథాలజీ, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ తదితర విభాగాల్లో పీజీ చేసిన వారికి మంచి డిమాండ్ ఉంది. స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయూలనుకుంటే... ఎంబీఏ (అగ్రికల్చరల్ మేనేజ్‌మెంట్) చదవాలి. దానివల్ల సొంతంగా యూనిట్‌లు ప్రారంభించే నైపుణ్యం వస్తుంది.

Friday, August 3, 2012

ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే?

యూఎస్‌లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ చేయాలనుకుంటున్నాను? వివరాలు తెలపండి?
- లక్ష్య, హైదరాబాద్.
యూఎస్‌లో ఎంఎస్ చేయాలంటే ముందుగా అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి. సంబంధిత ప్రిపరేషన్‌ను దాదాపుగా ఏడాదిన్నర ముందుగానే ప్రారంభించాలి. ఈక్రమంలో అక్కడి యూనివర్సిటీలు, వాటి అడ్మిషన్ ప్రక్రియను తెలుసుకోవాలి. సాధారణంగా ఏ దేశంలోనైనా అడ్మిషన్ విధానం ఏ రెండు ఇన్‌స్టిట్యూట్‌ల మధ్య ఒకే మాదిరిగా ఉండదు. ఇన్‌స్టిట్యూట్‌ల స్థాయి, ప-ర్వ చరిత్ర ఆధారంగా నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి యూఎస్‌లో ఏరోనాటికల్ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు, అడ్మిషన్ కోసం అవి పాటించే ప్రమాణాలను తెలుసుకోవాలి. ఈ క్రమంలో దాదాపు 10 నుంచి 12 టాప్ యూనివర్సిటీలను షార్ట్‌లిస్ట్ చేసుకోవాలి. విద్యార్థులు తాము ఎంచుకున్న కళాశాలలతో ఏడాది ముందుగా సంప్రదింపులు మొదలు పెట్టాలి. కోర్సు అప్లికేషన్, ఇతర సమాచారం కోసం ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు ఈ సమయంలోనే వినతి పత్రాలు సమర్పించాలి.

ఆ సమాచారం పొందాక.. రికమెండేషన్ లెటర్లు సిద్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యమైన దశ. ఇందుకోసం విద్యార్థులు తమకు బాగా తెలిసిన ప్రొఫెసర్లు లేదా ప్రొఫెషనల్స్‌ను సంప్రదించడం మంచిది. దీంతోపాటు తాము చదువుతున్న విద్యా సంస్థల నుంచి సంబంధిత డాక్యుమెంట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సాధారణంగా ప్రతి ఇన్‌స్టిట్యూట్ ప్రవేశ సమయానికి 4,5 నెలల ముందే తుది జాబితా రూపొందిస్తుంది. ఈ క్రమంలో విద్యార్థులకు సమాచారం కూడా పంపుతుంది. ప్రవేశం కల్పించిన ఇన్‌స్టిట్యూట్‌లు అందించే ఐ-20 ఫామ్‌తో వీసా కోసం దరఖాస్తు చేయాలి. ఇందుకోసం సంబంధిత కాన్సులేట్ లేదా ఎంబసీ అధికారుల్ని సంప్రదించాలి. దరఖాస్తు సమయంలోనే.. అందుబాటులో ఉన్న తేదీల్లో తమకు అనుకూలమైన తేదీలను వీసా ఇంటర్వ్యూ కోసం ఎంచుకోవడం మంచిది.

యూఎస్‌లో దాదాపు అన్ని యూనివర్సిటీలు టోఫెల్/ జీఆర్‌ఈ స్కోర్ ఆధారంగా ఎంఎస్‌లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు చివరి సంవత్సరంలోనే ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. అలా కాకుండా మూడో సంవత్సరంలోనే వీటిని ప-ర్తి చేసుకోవడం మంచిది. ఒకవేళ మొదట్లో నిరాశపరిచే ఫలితాలు వచ్చినా సరిదిద్దుకునే వీలుంటుంది. అంతేకాకుండా.. చివరి సంవత్సరంలో ఉండే ప్రాజెక్ట్ వర్క్ ఒత్తిడివల్ల ఈ పరీక్షలకు ప్రిపేరయ్యే సమయం లభించకపోవచ్చు.

ఉపయోగపడే వెబ్‌సైట్లు:
www.msinus.com
http://studyusa.com
www.vfsusa.co.in
www.studyusa.in
www.usnews.com

ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నాను. దీనికి సంబంధించిన వివరాలను తెలపండి?
- వర్థన్, కరీంనగర్.
ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించడానికి రెండు మార్గాలు.. ఒకటి ఆర్మ్‌డ్‌ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ చేయడం, ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ ఆధారంగా ఆర్మీలో డాక్టర్ చేరడం. ఆర్మీలో డాక్టర్‌గా సేవలు అందించడానికి వేదికగా నిలుస్తోంది ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్(ఏఎఫ్‌ఎంసీ)-పుణే. ఈ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంబీబీఎస్ చేయడం ద్వారా ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఎంబీబీఎస్‌లో ప్రవేశం కోసం ఏఎఫ్‌ఎంసీ జాతీయ స్థాయిలో ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఏఎఫ్‌ఎంసీలో ప్రవేశానికి ప్రతి ఏటా ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.

ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఏటా 130 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. ఎంట్రెన్స్ టెస్ట్ 200 ప్రశ్నలకు, 200 మార్కులకు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. ఇందుకోసం 2 గంటల సమయం కేటాయిస్తారు. బయాలజీ (బోటనీ, జువాలజీలను కలిపి), ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 50 ప్రశ్నల చొప్పున వస్తాయి. ఇంటెలిజెన్స్, లాజికల్ రీజనింగ్‌లపై 25 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్‌లపై 25 ప్రశ్నలుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో ఉత్తీర్ణులకు తర్వాతి దశల్లో ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఉంటుంది.

వీటి ఆధారంగా సీటు ఖరారు చేస్తారు. సంబంధిత నోటిఫికేషన్ జనవరి/ఫిబ్రవరిలలో వెలువడుతుంది. పరీక్ష మే నెలలో ఉంటుంది.
అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్(ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో) ఉత్తీర్ణత. భారతీయులై ఉండాలి. అవివాహితులు మాత్రమే అర్హులు. మెడికల్‌గా ఫిట్‌గా ఉండాలి.
కనీస వయసు: 17 సంవత్సరాలు, గరిష్ట వయసు: 22 సంవత్సరాలు మించకూడదు.
ఏఎఫ్‌ఎంసీ కాకుండా.. ఆర్మీ నేరుగా విడుదల చేసే ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ కాప్స్‌ను రిక్రూట్ చేసుకుంటుంది. ఈ విధంగా కూడా ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. సంబంధిత నోటిఫికేషన్ల కోసం ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ లేదా ఆర్మీ వెబ్‌సైట్ చూడొచ్చు.
వివరాలకు: htpp://afmc.nic.in,
htpp://indianarmy.nic.in

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంబైన్డ్ మెట్రిక్ లెవల్ పరీక్షకు సంబంధించిన వివరాలు తెలపండి?
- కృష్ణ, విజయవాడ.
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ).. దేశ వ్యాప్తంగా నిర్వహించే కంబైన్డ్ మెట్రిక్ లెవల్ ఎగ్జామినేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో స్టెనోగ్రాఫర్లు గ్రేడ్-‘సి’, గ్రేడ్-‘డి’, లోయర్ డివిజన్ క్లర్క్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తుంది. ఇటీవలి కాలంలో ఈ ఎగ్జామ్‌ను ‘హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్’గా పేరు మార్చారు. ఈ పరీక్ష ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సీవీసీ, విదేశీ మంత్రిత్వ శాఖ, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం, కస్టమ్స్‌తోపాటు పలు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/ఆఫీసులలో గ్రేడ్-‘సి’, గ్రేడ్-‘డి’, లోయర్ డివిజన్ క్లర్క్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ ఉంటుంది.

అర్హతలు: ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం.
వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్లు. రిజర్‌‌వడ్ అభ్యర్థులకు నిబంధనలమేరకు వయోసడలింపు ఉంటుంది. రెండు దశల్లో.. ఎంపిక ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో జనరల్ ఇంటలిజెన్స్, ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి రెండో దశలో పోస్టును బట్టి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా మెరిట్‌లిస్ట్ రూపొందిస్తారు. దాని ఆధారంగా నియామకం ఖరారు చేస్తారు.
వివరాలకు:htpp://ssc.nic.in