అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏసీఎఫ్) ఉద్యోగానికి ఎలా సిద్ధపడాలి? కెరీర్ ఏవిధంగా ఉంటుంది? ఏసీఎఫ్ ఉద్యోగానికి నిర్వహించే పరీక్షలో రెండు పేపర్లు, ఇంటర్వ్యూ ఉంటాయి. పేపర్ -1కు 150 మార్కులు(జనరల్ స్టడీస్), పేపర్ -2కు 300 మార్కులు, ఇంటర్వ్యూకు 50 మార్కులు ఉంటాయి. జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రం, సిలబస్, ప్రశ్నల స్వరూపం, ప్రశ్నల స్థాయి గ్రూప్-1నే పోలి ఉంటుంది. హిస్టరీ ప్రిపరేషన్ క్రమంలో చారిత్రక సంఘటనలు, చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీలు, సంవత్సరాలను సులువుగా గుర్తుంచుకునేందుకు వీలుగా పట్టికలు, చార్టులను రూపొందించుకోవాలి. పాలిటీ, ఎకానమీ కోసం ఆయా విభాగాల్లోని ప్రాథమిక అంశాలతోపాటు ఆయా రంగాల్లో సమకాలీన మార్పులు వాటి నేపథ్యాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. జాగ్రఫీ కోసం పదో తరగతి స్థాయి జాగ్రఫీలో పట్టు సాధించాలి. మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ కోసం ఆరు నుంచి పదో తరగతి వరకు మ్యాథ్స్ పుస్తకాల్లోని అర్థమెటిక్ అంశాలు బాగా సాధన చేయాలి. ఇలాచేస్తే పేపర్-1లో మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. చదవాల్సిన పుస్తకాలు: ఆరు నుంచి పదోతరగతి వరకు సైన్స్, సోషల్ పాఠ్యపుస్తకాలు (తప్పనిసరి) కరెంట్ అఫైర్స్ కోసం పరీక్ష తేదీకి ముందు తొమ్మిది నెలల్లో వివిధ రంగాల్లో ముఖ్యాంశాలు (రాష్ట్రీయం, జాతీయం, అంతర్జాతీయం) బాగా చదవాలి. ఇంటర్, డిగ్రీ తెలుగు అకాడెమీ- పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ పుస్తకాల్లో ముఖ్యాంశాలు (సమ్మరీ) చదువుకోవాలి. ఆప్షనల్ పేపర్ కోసం ఆ సబ్జెక్టుకు సంబంధించి డిగ్రీ మూడేళ్ల పుస్తకాలు బాగా అధ్యయనం చేయాలి. అవకాశం ఉంటే ఏదైనా ఒక పుస్తకాన్ని రిఫరెన్స్‌గా చదువుకోవాలి. ఆప్షనల్ ప్రిపరేషన్: సిలబస్‌లో పేర్కొన్న ప్రతి అంశాన్ని డిగ్రీ స్థాయిలో సన్నద్ధం కావాలి. ప్రతి చాప్టర్ ప్రిపరేషన్ పూర్తి కాగానే ముఖ్యమైన అంశాలతో టేబుల్స్ రూపొందించుకోవాలి. ఇలా చేయడం వల్ల సులువుగా గుర్తుంచుకోవడానికి వీలవుతుంది. రివిజన్ కూడా తేలికగా చేసుకోవచ్చు. ఆప్షనల్ ప్రశ్నల స్థాయి.. ఇలా: ఆప్షనల్ సబ్జెక్ట్‌లోని మొత్తం 150 ప్రశ్నల్లో 100 వరకు ప్రశ్నలు తేలికగా, మధ్యస్థంగా ఉంటాయి. డిగ్రీస్థాయిలో ఉన్న పరిజ్ఞానంతో వీటికి సమాధానాలు గుర్తించొచ్చు. మిగిలిన 50 ప్రశ్నలు కాస్త కష్టంగా ఉంటాయి. సిలబస్ మొత్తం బాగా చదివితే ఈ ప్రశ్నలకూ సమాధానాలు గుర్తించొచ్చు. జాబ్ ప్రొఫైల్: స్టేట్ ఫారెస్ట్ సర్వీస్‌లోని గ్రూప్-1 కేడరైన అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా ఎంపికైవారు జిల్లాల్లో సబ్ డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్స్ (సబ్ డీఎఫ్‌ఓ)గా డీఎఫ్‌ఓకు సహాయకులుగా ఉంటారు. వీరి ప్రధాన విధులు.. అటవీ భూముల సంరక్షణ; సామాజిక అడవుల పెంపకం; వన్య జంతువుల రక్షణ; పదోన్నతుల ద్వారా డీఎఫ్‌ఓ, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తదితర హోదాలకు చేరుకునే అవకాశం ఉంది. |
Friday, February 24, 2012
అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏసీఎఫ్) ఉద్యోగానికి ఎలా సిద్ధపడాలి..?
Wednesday, February 15, 2012
బి.ఇడి కరస్పాండెన్స్ ఎక్కడ చేయవచ్చు?
ప్ర ః
- ప్రసాద్, నల్లగొండ.
జ ః బిఇడి కరస్పాండెన్స్ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ) ద్వారా చేయొచ్చు. ఇందుకుగాను అభ్యర్థి కనీసం రెండు సంవత్సరాల బోధన అనుభవం కలిగి ఉండాలి. అడ్మిషన్ల కోసం ఆయా యూనివర్శిటీలు విడిగా ప్రవేశ పరీక్ష నిర్వహస్తాయి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీకి ట్యూషన్ ఫీజుగా రూ.18 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
ప్ర ః నాకు బిపిఓ ఉద్యోగం చేయాలని ఉండి. ఐఎల్ & ఎఫ్‌ఎస్ అనే సంస్థ STEEP ద్వారా ఉచిత బిపిఓ శిక్షణ, ఉద్యోగాలు, ఉచిత వసతి అని చదివాను. వాళ్లు మళ్లీ ఏమైనా డబ్బులు కట్టమంటారా? దయచేసి వివరాలు తెలుపగలరు?
- ప్రణవ్, జగిత్యాల.
జ ః కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో ప్రయివేటు సంస్థలను కూడా భాగస్వాములు చేసింది. అందులోభాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో ఐఎల్ & ఎఫ్‌ఎస్ వారి STEEP అనే సంస్థ తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న 18-30 ఏళ్ల యువకులకు స్కిల్స్ ఫర్ ఎంప్లాయిమెంట్ ఇన్ సర్వీస్ సెక్టార్ పేరుతో కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్‌స్కిల్స్, టైపింగ్, అనలిటికల్ స్కిల్స్, రిటైల్ మార్కెటింగ్ స్కిల్స్ మొదలైన వాటిలో నెల రోజులపాటు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తారు. వీరికి నెలకు రూ.2,000ల స్టయిఫండ్ కూడా చెల్లిస్తారు. ఈ సంస్థ కార్యాలయం STEEP అమీర్‌పేటలోని సారథి స్టూడియో వద్ద ఉంది. ఫోన్ నెం.040-40040919. ఇలాంటి సంస్థలు నగరంలో వివిధ ప్రాంతాల్లో శిక్షణ కల్పిస్తున్నాయి.
ప్ర ః నేను బి.ఎస్సీ (బయోటెక్) ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఆర్మీలో చేరాలని ఉంది. ఈ మధ్యనే అప్లయ్ చేశాను. ఈవెంట్లకి ప్రిపేర్ అవుతున్నాను. ఈవెంట్ల తర్వాత రిటెన్ టెస్టు గురించి భయంగా ఉంది. అందులో ఉండే ప్రశ్నలు, మోడల్ పేపర్లు మొదలైన వివరాలు తెలపగలరు?
- ఎం.శ్రీనివాస్, మంథని
జ ః ఆర్మీలో సోల్జర్ రిక్రూట్‌మెంట్‌కు పదో తరగతి ఉత్తీర్ణులై 16-20 ఏళ్ల మధ్య వయస్సు ఉంటే సరిపోతుంది. శారీరక పరీక్షల తర్వాత రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయబడుతుంది. రాత పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌పై ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. మొత్తం మార్కులు 100. ఎంపిక కావడానికి కనీస మార్కులు 32 మాత్రమే. పరీక్ష పేపరు పదో తరగతి స్థాయిలో ఉంటుంది. బుక్‌షాపులలో పాత ప్రశ్నపత్రాలు లభ్యమవుతాయి.
ప్ర ః నేను వినాయక మిషన్ యూనివర్శిటీ ద్వారా డిస్టెన్స్‌మోడ్‌లో ఎంఎల్‌ఐఎస్‌సి (m.l.i.sc.) పూర్తి చేశాను. నేను జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలల్లో లైబ్రేరియన్ జాబ్స్‌కి అప్లయ్ చేయవచ్చా?
- ఎ.రఘు, పెద్దపల్లి.
జ ః డిస్టెన్స్‌మోడ్‌లో (దూరవిద్య) ద్వారా ఆఫర్ చేసే కోర్సులు అన్నీకూడ (డిఇసి) డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వారిచే గుర్తించబడి ఉండాలి. వినాయక మిషన్ యూనివర్శిటీ వారు ఆఫర్ చేసే ఎంఎల్‌ఐఎస్‌సి కోర్సుకు డిఇసి వారి గుర్తింపు ఉంది. కాబట్టి మీరు లైబ్రేరియన్ ఉద్యోగానికి అర్హులు.
ప్ర ః నేను పాలిటెక్నిక్ (ఇఇఇ) రెండో సంవత్సరం చదువుతున్నాను. మూడో సంవత్సరం పూర్తయిన తర్వాత ఐఐటి/ఎఐఇఇఇలలో బి.టెక్ చేయాలని ఉంది. అలా చేయడం సాధ్యమేనా? వివరాలు తెలపండి?
- జి.మోహన్‌నాయక్, బేలెల్.
జ ః ఐఐటి/ఎఐఇఇఇలలో బి.టెక్ చేయాలంటే ఇంటర్మీడి యట్ (10+2) ఉత్తీర్ణులై ప్రవేశ పరీక్షకు కావాలి. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో 3 ఏళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారికి ‘ఈసెట్’ పరీక్ష ద్వారా నేరుగా బి.టెక్ రెండో సంవత్సరంలోకి ప్రవేశం పొందవచ్చు.
Monday, February 13, 2012
ఇగ్నో నుంచి ఎంబీఏ చేయాలంటే?
ఇగ్నో నుంచి ఎంబీఏ చేయాలంటే? -
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో), స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ దూరవిద్యా విధానంలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ) కోర్సును ఆఫర్ చేస్తుంది. అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు సూపర్‌వైజరీ/మేనేజీరియల్/సంబంధిత ప్రొఫెషనల్ హోదాలో మూడేళ్ల అనుభవం లేదా ఇంజనీరింగ్/టెక్నాలజీ/మెడిసిన్/ఆర్కిటెక్చర్/లా/ఫార్మసీ/అకౌంటెన్సీ/సీఎస్ లేదా ఏదైనా మాస్టర్ డిగ్రీ. యూనివర్సిటీ నిర్వహించే ఓపెన్‌మ్యాట్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
క్యాట్/మ్యాట్/రాష్ట్ర స్థాయిలో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఎంట్రెన్స్‌లలో క్వాలిఫై అయినవారికి ఓపెన్‌మ్యాట్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ పరీక్షను ఏటా రెండుసార్లు.. ఫిబ్రవరి, ఆగస్ట్‌లలో నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో నిర్వహించే పరీక్షకు అంతకుముందు సంవత్సరం నవంబర్ 30, ఆగస్ట్‌లో నిర్వహించే పరీక్షకు ఆ ఏడాది మే 31 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తులను యూనివర్సిటీ స్టడీసెంటర్లు లేదా వెబ్‌సైట్ నుంచి పొందొచ్చు. వివరాలకు: www.ignou.ac.in
.....................
పీజీ డిప్లొమా ఇన్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
-స్వరూప్, నాగర్‌కర్నూలు.
మన రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ టాక్సేషన్ కోర్సును అందిస్తోంది. అర్హత: బీకాం. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.osmania.ac.in
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ -సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఘజియాబాద్ ఏడాది వ్యవధి గల పీజీ డిప్లొమా ఇన్ టాక్సేషన్ కోర్సును దూరవిద్య విధానంలో అందిస్తోంది.
వివరాలకు: www.imtcdl.ac.in
అన్నామలై యూనివర్సిటీ-డెరైక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, తమిళనాడు పీజీ డిప్లొమా ఇన్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సును డిస్టెన్స్‌లో ఆఫర్ చేస్తోంది.
http://annamalaiuniversity.ac.in
......................
ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేయాలని ఉంది. వివరాలు తెలపండి?
- విజయ్, గోదావరిఖని.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఏటా నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ (సీజీఎల్‌ఈ) ద్వారా ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌స్పెక్టర్ హోదాలో ప్రవేశించవచ్చు. సెంట్రల్ ఎక్సైజ్/ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్‌లలో ఇన్‌స్పెక్టర్/ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులను కూడా ఈ పరీక్ష ద్వారానే భర్తీ చేస్తారు. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ.
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ (సీజీఎల్‌ఈ) టైర్-1, టైర్-2, ఇంటర్వ్యూ అనే మూడు దశలతో కూడిన ప్రక్రియ ఉంటుంది. టైర్-1, 2 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉండే రాత పరీక్షలు. ఇందులో క్వాలిఫై అయినవారు తర్వాతి దశలో పర్సనల్ ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరు కావాలి.
టైర్-1 రాత పరీక్షకు 200 మార్కులు కేటాయించారు. సమయం రెండు గంటలు. నాలుగు విభాగాలుగా ఉంటుంది. అవి..
జనరల్ ఇంటెలిజెన్స్ (50 మార్కులు);
జనరల్ అవేర్‌నెస్ (50 మార్కులు);
న్యూమరికల్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు);
ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్(50 మార్కులు);
ఈ దశలో క్వాలిఫై అయినవారిని మాత్రమే టైర్-2కు అనుమతిస్తారు.
టైర్-2 పరీక్షకు 400 మార్కులు కేటాయించారు. రెండు విభాగాలుగా ఉంటుంది. అవి..
అర్థమెటిక్ ఎబిలిటీస్(200 మార్కులు-సమయం రెండు గంటలు);
ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ (200 మార్కులు-
సమయం రెండుగంటలు);
చివరి దశ ఇంటర్వ్యూ.
సంబంధిత నోటిఫికేషన్ కోసం ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ లేదా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్
వెబ్‌సైట్: http://ssc.nic.in/ చూడొచ్చు

ఎన్‌జీఓ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్న వర్సిటీలు:
ఎన్‌జీఓ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్న వర్సిటీలను తెలపండి? -వేణు, నల్గొండ.
ఎన్‌జీఓకు సంబంధించిన అన్ని వ్యవహారాలను పర్యవేక్షించడం, ఆ సంస్థకు లక్ష్యాలను నిర్దేశించడం, సభ్యులు నిర్వహించాల్సిన విధులను వివరించడం ఎన్‌జీఓ మేనేజ్‌మెంట్ అభ్యర్థులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ కోర్సును పూర్తిచేసిన వారికి వివిధ ప్రభుత్వ- ప్రైవేట్ ప్రాజెక్ట్‌లు, స్వచ్ఛంద సంస్థల్లో అవకాశాలుంటాయి. ఈ కోర్సును రెగ్యులర్‌గా అందిస్తున్న వర్సిటీలు:
సెంటర్ ఫర్ సోషల్ ఇనీషియేటివ్ అండ్ మేనేజ్‌మెంట్ - హైదరాబాద్.
కోర్సు: సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఎన్‌జీఓ మేనేజ్‌మెంట్
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్
వివరాలకు: www.csim.in
అమిటీ యూనివర్సిటీ-నోయిడా.
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఎన్‌జీఓ మేనేజ్‌మెంట్
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్
వివరాలకు: www.amity.edu
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ- ఢిల్లీ.

వివరాలకు: www.jmi.ac.in
దూరవిద్యా విధానంలో అందిస్తోన్న సంస్థలు:
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.ignou.ac.in
అన్నామలై యూనివర్సిటీ
వెబ్‌సైట్: http://annamalaiuniversity.ac.in
మదురై కామరాజ్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.mkudde.org

కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించి డిప్లొమా కోర్సులు డిస్టెన్స్‌లో అందిస్తున్న వర్సిటీలు:
కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించిన డిప్లొమా కోర్సులను డిస్టెన్స్‌లో అందిస్తున్న వర్సిటీలేవి?
-రాంబాబు, మేడ్చల్.
కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించి డిప్లొమా కోర్సులు డిస్టెన్స్‌లో అందిస్తున్న వర్సిటీలు:
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ- న్యూఢిల్లీ.
కోర్సు: అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్. అర్హత: గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి డిప్లొమా (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/కంప్యూటర్/ఆర్కిటెక్చర్/కెమికల్ ఇంజనీరింగ్).
వివరాలకు: www.ignou.ac.in
అన్నామలై యూనివర్సిటీ-తమిళనాడు.
కోర్సు: డిప్లొమా ఇన్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్
వివరాలకు: జ్ట్టిఞ://్చ్చఝ్చ్చజీఠజీఠ్ఛిటటజ్టీడ.్చఛి.జీ
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్-పుణే, హైదరాబాద్, గోవా, ఢిల్లీ, బెంగళూరు, ముంబై క్యాంపస్‌లు. కోర్సులు:
పీజీ ప్రోగ్రామ్ ఇన్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్
పీజీ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్
గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్
కన్‌స్ట్రక్షన్ సేఫ్టీ మేనేజ్‌మెంట్
కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ మేనేజ్‌మెంట్
కన్‌స్ట్రక్షన్ బిజినెస్ మేనేజ్‌మెంట్
వివరాలకు: www.nicmar.ac.in

Friday, February 3, 2012
క్యాట్ స్కోర్‌తోపాటు.. కావలసినవెన్నో..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) క్యాంపస్‌లలో కాలు పెట్టాలంటే..?
కామన్ అడ్మిషన్ టెస్ట్‌కు హాజరు కావాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే.
ఎంత పర్సెంటైల్ వస్తే సీటు ఖరారవుతుంది?
ఇదే చాలామంది ‘క్యాట్’ విజేతలకు..
భవిష్యత్తులో ఐఐఎంలో అడుగుపెట్టాలనుకునే వారికి తలెత్తే సందేహం.
దీనికి సమాధానం?
ఆయా ఐఐఎంలు నిర్దేశించే కటాఫ్‌లను పరిశీలించడమే. ప్రస్తుతం ఆయా ఐఐఎంలు 2012-14కు క్యాట్ పర్సెంటైల్ ఆధారంగా ప్రవేశ ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో ఆయా ఐఐఎంలు.. కటాఫ్‌లపై విశ్లేషణ.
దేశవ్యాప్తంగా ఐఐఎం క్యాంపస్‌లు 13 ఉన్నాయి. ఒక్కో ఐఐఎంది ఒక్కో ప్రత్యేకత. దీన్ని బట్టే క్యాట్ కటాఫ్‌లో వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఐఐఎంల జాబితాలో అగ్రస్థానంలో నిలిచే అహ్మదాబాద్, కలకత్తా క్యాంపస్‌లలో 99, 99.5 పర్సెంటైల్ తప్పనిసరి కాగా.. కొత్తగా ఏర్పాటు చేసిన కాశీపూర్, ఉదయ్‌పూర్‌లలో 70 నుంచి 80 శాతం పర్సెంటైల్‌తో కూడా సీటు సొంతమయ్యే అవకాశాలున్నాయి.
సెక్షనల్, అగ్రిగేట్:
ఐఐఎంలలో అడ్మిషన్‌లకు క్యాట్ పర్సెంటైల్ కటాఫ్‌లను నిర్ణయించే క్రమంలో సెక్షనల్, అగ్రిగేట్ కటాఫ్‌లను నిర్దేశించడం కూడా జరుగుతోంది. అంటే క్యాట్‌లో రెండు సెక్షన్లు ఉంటాయి. అవి క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్; వెర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్.
వీటిలో ఒక్కో సెక్షన్‌కు తప్పనిసరిగా పొందాల్సిన కనీస పర్సెంటైల్; ఆ రెండిటిని కలిపితే ఉండాల్సిన సగటు కటాఫ్‌లను కూడా ఐఐఎంలు నిర్దేశిస్తున్నాయి. ఉదాహరణకు ఐఐఎం బెంగళూరును పరిగణిస్తే జనరల్ మెరిట్‌లో సెక్షన్1లో 80; సెక్షన్ 2 లో 90; అగ్రిగేట్ 90 పర్సెంటైల్స్‌ను కటాఫ్‌గా నిర్ణయించింది. ఇలా అడుగడుగునా కఠినమైన ప్రమాణాలతో కటాఫ్‌లను నిర్ణయించాయి.
పలు ప్రోగ్రాంలు.. పలు కటాఫ్‌లు:
దేశంలోని అన్ని ఐఐఎంలలో పీజీ స్థాయిలో పలు ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటికీ ప్రధానమైన అర్హత క్యాట్ స్కోర్. అయితే ప్రవేశాలు కల్పించే సమయంలో మాత్రం ఒక్కో ప్రోగ్రాంకు ఒక్కో విధమైన కటాఫ్ ప్రామాణికంగా ఉంటోంది.
ఉదాహరణకు ఐఐఎం అహ్మదాబాద్‌ను పరిశీలిస్తే.. ఈ క్యాంపస్‌లోని అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాంకు జనరల్ కేటగిరీలో క్యాట్ రెండు సెక్షన్లలోనూ 94 పర్సంటైల్ చొప్పున కటాఫ్‌గా నిర్ణయించింది. ఇతర ప్రోగ్రాంలకు 99 శాతం కటాఫ్‌గా నిర్ణయించింది.
క్యాట్‌తోపాటు మరెన్నో:
‘క్యాట్‌లో మంచి పర్సెంటైల్ సాధిస్తే ఐఐఎంలో సీటు సొంతం చేసుకోవచ్చు’.. అనేది చాలామంది ఔత్సాహికుల్లో నెలకొన్న అభిప్రాయం. కానీ ఐఐఎంలు క్యాట్ స్కోర్‌తోపాటు మరెన్నో అంశాలను ప్రాతిపదికగా తీసుకుని వాటికి నిర్దిష్ట వెయిటేజీ నిర్ణయించాయి. ఈ ప్రక్రియలో పదో తరగతి మొదలు బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు సాధించిన మార్కులకు; పని అనుభవానికి; గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ తదితర అంశాలకు వెయిటేజీ ప్రకటించి ఆ మేరకు తుది జాబితా రూపొందిస్తాయి.
ఐఐఎం అహ్మదాబాద్ క్యాట్ స్కోర్‌కు 70 శాతం; విద్యార్హతలు, పని అనుభవం (కనీసం రెండేళ్లకు పైగా)కు 30 శాతం వెయిటేజీ నిర్ణయించింది.
అకడెమిక్ ప్రొఫైల్ బాగుంటేనే:
‘క్యాట్‌లో అద్భుతమైన పర్సెంటైల్ వచ్చింది. సీటు గ్యారంటీ’ అని భావించడానికి వీలులేదు. పలు ఐఐఎంలు క్యాట్ స్కోర్‌తోపాటు విద్యార్థుల అకడెమిక్ ప్రొఫైల్‌కు పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలో నిర్దిష్ట నిబంధనలు విధిస్తున్నాయి. కొన్ని ఐఐఎంలు పదో తరగతి నుంచి బ్యాచిలర్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు ప్రథమశ్రేణి ఉత్తీర్ణత తప్పనిసరి అని పేర్కొన్నాయి.
ఐఐఎం షిల్లాంగ్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్‌లలో 80 శాతం పైగా మార్కులు తప్పనిసరి అని; ఐఐఎం రోహ్‌తక్, త్రిచి పదో తరగతిలో 70 శాతం; ఇంటర్మీడియెట్‌లో 65 శాతం; గ్రాడ్యుయేషన్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి అని పేర్కొనడాన్ని బట్టి ఐఐఎంలు విద్యార్థులు అకడెమిక్ ప్రొఫైల్‌కు ఎంత ప్రాధాన్యమిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఐఐఎం ఉదయ్‌పూర్ ఒక్కటే ఎలాంటి ఇతర వెయిటేజీలు, వడపోత ప్రక్రియలు లేకుండా నేరుగా క్యాట్ స్కోర్ ఆధారంగా మాత్రమే అడ్మిషన్ నిర్వహిస్తోంది.
పని అనుభవం కూడా ప్రధానమే:
క్యాట్‌లో మంచి పర్సెంటైల్, అకెడమిక్స్‌లో అద్భుతమైన ప్రతిభ ఉంటే ఐఐఎం సీటు గ్యారంటీ అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఈ రెండింటితోపాటు ఐఐఎంలు అభ్యర్థులకున్న పని అనుభవానికి కూడా ఎంతో ప్రాధాన్యమిస్తున్నాయి. ఐఐఎం-బెంగళూరులో పర్సనల్ ఇంటర్వ్యూ సమయంలో పని అనుభవానికి గరిష్టంగా పది పాయింట్ల స్కోరు ఇవ్వడానికి నిర్ణయించింది. అదే విధంగా ఐఐఎం అహ్మదాబాద్ రెండేళ్లకంటే ఎక్కువ పని అనుభవం ఉన్న వారికి మూడు పాయింట్ల స్కోరు ఇవ్వనుంది.
జీడీ/పీఐ కూడా కీలకమే:
క్యాట్ కటాఫ్‌లు, అకడెమిక్ రికార్డ్స్, వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లకు సంబంధించి గరిష్ట వెయిటేజీ పొందినప్పటికీ విద్యార్థులు ఎదుర్కోవాల్సిన మరో కీలకమైన దశ గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, రిటెన్ ఎబిలిటీ టెస్ట్. క్యాట్ స్కోర్, ఇతర వెయిటేజీల ఆధారంగా జాబితాలో నిలిచిన అభ్యర్థులు వీటిలో కూడా తప్పనిసరిగా ప్రతిభ చూపాల్సిందే. ఐఐఎం లక్నో, కోజికోడ్ క్యాంపస్‌లు జీడీ/పీఐకు 50 శాతం వెయిటేజీ నిర్ణయించడమే దీనికున్న ప్రాధాన్యానికి నిదర్శనం.
రిటెన్ ఎబిలిటీ టెస్ట్:
గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలకు అదనంగా కొన్ని ఐఐఎంలు నిర్వహిస్తున్న మరో ప్రక్రియ రిటెన్ ఎబిలిటీ టెస్ట్. క్యాట్ స్కోర్, ఇతర వెయిటేజీల ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు ఈ టెస్ట్‌ను నిర్వహిస్తాయి. ప్రస్తుతం ఐఐఎం బెంగళూరు, లక్నో, కోజికోడ్‌లు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ విధానంలో.. దాదాపు అరగంట వ్యవధిలో నిర్దేశిత అంశంపై వ్యాసం రాయాల్సి ఉంటుంది. గ్రామీణ వాతావరణం మొదలు.. గ్రహాంతర పరిస్థితుల వరకు ఏ రంగమైనా, ఎలాంటి అంశమైనా ఈ విధానంలో అడిగే అవకాశం ఉంది.
ఆరు ఐఐఎంలు... ఉమ్మడి ప్రక్రియ:
ఐఐఎం- కాశీపూర్, రాయ్‌పూర్, రాంచీ, రోహ్‌తక్, త్రిచీ, ఉదయ్‌పూర్.. ఇటీవల ఏర్పాటైన క్యాంపస్‌లు. క్యాట్ స్కోర్ తదుపరి ప్రవేశాలకు సంబంధించి ఈ ఆరు ఒకే గొడుగు కింద ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. ఐఐఎం-రాంచీ పర్యవేక్షణలో రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలు జరుగుతాయి. వీటిలో ప్రతిభ ఆధారంగా తుది జాబితాలో నిలిచిన వారికి ఈ ఆరు క్యాంపస్‌లలో ఎక్కడైనా సీటు లభించే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఈ ఆరు కొత్త క్యాంపస్‌ల కోసం నిర్దేశించిన ఈ విధానంలో రాణించిన అభ్యర్థులను.. ఐఐఎం- అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా, ఇండోర్, కోజికోడ్, లక్నోలు కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నాయి. అలాంటి క్యాంపస్‌ల సమాచారాన్ని అభ్యర్థులకు తెలియజేస్తారు. ఈ విషయంపై ఇంకా స్పష్టత లేదు కాబట్టి ఈ ఆరు కొత్త ఐఐఎం క్యాంపస్‌లతోపాటు పాత క్యాంపస్‌ల సెలక్షన్ ప్రాసెస్‌కు కూడా ప్రత్యేకంగా సంసిద్ధులు కావడం అవసరం.
ఎంపిక కాకున్నా.. మరెన్నో మన్నికైన బి-స్కూల్స్:
పలు రకాల క్లిష్టమైన వడపోత ప్రక్రియల కారణంగా ఐఐఎం క్యాంపస్‌లకు ఎంపిక కాకున్నా.. అలాంటి అభ్యర్థులు ఆందోళన చెందనవసరం లేదు. దాదాపు ఐఐఎంల స్థాయిలో ప్రమాణాలు పాటించే మరెన్నో మన్నికైన బిజినెస్ స్కూల్స్ క్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఘజియాబాద్); బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ- బిమ్‌టెక్ (గ్రేటర్ నోయిడా) వంటి పలు ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్స్ ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. ఐఐఎంలో అవకాశం చేజారిన అభ్యర్థులు ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ప్రతి విద్యార్థికి కెరీర్‌లో ప్రధాన లక్ష్యమైన క్యాంపస్ రిక్రూట్‌మెంట్లలో కూడా ఐఐఎంలతో సరితూగే బి-స్కూల్స్ ఎన్నో ఉన్నాయి.
షార్ట్‌లిస్టింగ్ ఇలా:
సాధారణంగా ఐఐఎంలలో షార్ట్ లిస్టింగ్ రెండు దశలుగా ఉంటుంది.
మొదటిది.. క్యాట్ స్కోర్‌కు నిర్దేశిత కటాఫ్‌లను నిర్ణయించడం.
రెండోది.. క్యాట్ స్కోర్ ఆధారంగా మొదటి జాబితాలో నిలిచిన అభ్యర్థుల అకడెమిక్ ప్రొఫైల్ వెయిటేజీ, వర్క్ ఎక్స్‌పీరియన్స్ వెయిటేజీలను పరిగణిస్తూ మరో జాబితా రూపొందించడం.
ఈ రెండిటి ఆధారంగా తుది జాబితా సిద్ధం చేసి జీడీపీఐలో మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తాయి.
జీమ్యాట్ స్కోర్ కూడా:
క్యాట్ స్కోర్ మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా బి-స్కూల్స్, మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణికమైన గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్) స్కోరు ఆధారంగా కూడా ఐఐఎం అహ్మదాబాద్, బెంగళూరులు పీజీ ప్రోగ్రాంలలో ప్రవేశం కల్పిస్తున్నాయి. జీమ్యాట్ స్కోరు, దానికి తత్సమానంగా నిర్దేశించిన క్యాట్ స్కోర్‌లను ప్రకటించాయి. ఈ విషయంలో ఈ రెండు క్యాంపస్‌లు కొన్ని నిబంధనలు వర్తించాయి.
అవి..
అహ్మదాబాద్: డిసెంబర్ 15, 2011 నాటికి రెండు సంవత్సరాలలోపు మాత్రమే జీమ్యాట్ స్కోరు పొంది ఉండాలి.
బెంగళూరు: గత మూడేళ్లలో (జనవరి 2009 నుంచి డిసెంబర్ 2011) కనీసం 18 నెలలు విదేశాల్లో నివసించి ఉండాలి.
పర్సనల్ అప్పీయరెన్స్: అంటే.. గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలకు కేటాయించిన వెయిటేజీ మొత్తం
క్యాట్+ప్రొఫైల్: అంటే.. క్యాట్ స్కోరు, విద్యార్హతలు, పని అనుభవాలకు కేటాయించిన వెయిటేజీ మొత్తం.
{పొఫైల్ వెయిటేజీ మొత్తాలు ఆయా క్యాంపస్‌ల మధ్య వేర్వేరుగా ఉంటాయి.
ఐఐఎంలలో క్యాట్ పర్సెంటైల్ కటాఫ్ అంచనా
(జనరల్ కేటగిరీ)
క్యాంపస్ కటాఫ్ పర్సెంటైల్
అహ్మదాబాద్ 99
బెంగళూరు 90
కలకత్తా 99.55
లక్నో 90
ఇండోర్ 90
కోజికోడ్ 85
షిల్లాంగ్ 94.5
రాయ్‌పూర్ 80
కాశీపూర్ 75
రాంచీ 90
రోహ్‌తక్ 70
{తిచీ 80
ఉదయ్‌పూర్ 80
.....................
క్యాట్, అకడెమిక్ ప్రొఫైల్, పర్సనల్
అప్పీయరెన్స్‌కు ఆయా ఐఐఎంలు కేటాయించిన వెయిటేజీ వివరాలు
క్యాంపస్ క్యాట్+ప్రొఫైల్ పర్సనల్ అప్పీయరెన్స్
అహ్మదాబాద్ 70 30
బెంగళూరు 60 40
కలకత్తా 37 63
ఇండోర్ 50 50
కాశీపూర్ 50 50
కోజికోడ్ 50 50
లక్నో 50 50
రాయ్‌పూర్ 70 30
ఉదయ్‌పూర్ 70 30
రోహ్‌తక్ 70 30
రాంచీ 70 30
త్రిచీ 70 30

రెజ్యుమె, జాబ్ ఇంటర్వ్యూ టిప్స్
ఉద్యోగాలకోసం దరఖాస్తు చేయడానికి ముందు పక్కా రెజ్యుమె తయారు చేసుకోవాలి. క్లుప్తంగా, తక్కువ పదాలతో ఎక్కువ వివరాలు అందించేలా ఉన్న రెజ్యుమెలు రిక్రూటర్‌ల మెప్పును పొందుతాయి. రెజ్యుమెల్లో తమ గుణగణాల గురించి పేరాల కొద్దీ రాయకుండా ఫ్యాక్ట్స్‌ను స్పష్టంగా తెలపాలి. ఇంటర్వ్యూలోనూ రెజ్యుమెలో పేర్కొన్న అంశాల ప్రస్తావన వస్తుంది. అందుకే రెజ్యుమె తయారీ నుంచే ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభమైనట్లే!! అంతటి ప్రాధాన్యమున్న రెజ్యుమె తయారీలో మెళకువలు.. సరైన సమాచారం: రెజ్యుమె తయారీలో ఇది చాలా ముఖ్యమైంది. కొందరు అభ్యర్థులు ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎక్స్‌పీరియన్స్ తదితర అంశాలు రాయడాన్ని తేలిగ్గా తీసుకుంటారు. తప్పు సమాచారాన్ని పొందుపరుస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. రెజ్యుమెలో పేర్కొన్న సమాచారం సరైందో? కాదో తెలుసుకోవడానికి కంపెనీలు బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్‌ను నిర్వహిస్తాయని గుర్తించాలి. రెజ్యుమెలో కచ్చితమైన, వాస్తవ సమాచారం ఇవ్వాలి. అప్పుడే జాబ్ ఇంటర్వ్యూలను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. రెజ్యుమె నిర్మాణానికి టెంప్లేట్స్ ఉపయోగించడం తప్పుకాదు. వాటిలో తమ అభిరుచికి అనుగుణంగా అభ్యర్థులు మార్పులు చేయాలి. చదవడానికి అనువుగా... స్పష్టంగా: రెజ్యుమె తయారీలో జాగ్రత్తగా వ్యవహరించాలి. భాష సరళంగా ఉండాలి. విరామ చిహ్నాల దగ్గర్నుంచి గ్రామర్ వరకు ప్రత్యేక దృష్టి సారించాలి. రెజ్యుమెను చూడగానే అభ్యర్థికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయనే భావన కలగాలి. పదాల పునరుక్తులు ఉండకుండా చూసుకోవాలి. సృజనాత్మకంగా రాయాలి. రెజ్యుమెలో ఎక్కువగా ‘I’, ‘me’, ‘my' వంటి పదాలనుపయోగించొద్దు. రెజ్యుమెలో అక్షర దోషాలు లేకుండా చెక్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ భాషనే ఉపయోగించాలి. ప్రజెంటేషన్: రెజ్యుమె రూపకల్పనలో ప్రజెంటేషన్‌పై ఎక్కువ దృష్టిసారించాలి. సమాచారాన్ని పాయింట్ల వారీగా రాయడం ద్వారా సులువుగా చదవొచ్చు. రెజ్యుమె మొత్తంలో స్థిరమైన ఫాంట్ ఉండేలా చూసుకోవాలి. బిజినెస్ లెటర్లలో సాధారణంగా వాడే Arial, Times New Roman, Courier New ఫాంట్‌లను ఉపయోగించొచ్చు. ఫాంట్ సైజు 11 లేదా 12 ఉంటే రెజ్యుమె ఆకర్షణీయంగా కనిపిస్తుంది. హెడ్డింగులకు కూడా స్థిరమైన ఫాంట్, సైజులను కేటాయించాలి. హెడ్డింగు సైజు బాడీ టెక్ట్స్ కంటే కొంచెం పెద్దదిగా ఉండాలి. అలాగే హెడ్డింగును బోల్డ్ చేయడం, అండర్‌లైన్ చేయడంలో ఏకరూపతను పాటించాలి. రెజ్యుమెలో ఎక్కువగా మెరిసే రంగులు ఉపయోగించొద్దు. రెజ్యుమెలో బ్యాగ్రౌండ్ పిక్చర్స్, క్లిప్ ఆర్ట్స్, ఫొటోలు అవసరం లేదు. ముఖ్యమైనవి మర్చిపోవద్దు: అభ్యర్థులు రెజ్యుమె తయారీలో ఆబ్జెక్టివ్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, వర్క్ హిస్టరీ, ఎడ్యుకేషన్ వివరాలు, నైపుణ్యాలు, పర్సనల్ రిఫరెన్స్ తదితర అంశాల ప్రస్తావనలో నిర్లక్ష్యం ప్రదర్శించొద్దు. ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా ఈ ఇవి తప్పనిసరని తెలుసుకోవాలి. కెరీర్ ఆబ్జెక్టివ్: దీన్ని రెజ్యుమె లేదా కవర్‌లెటర్‌లో ప్రత్యేక అంశంగా పేర్కొనాలి. సాధారణంగా ఒకటి లేదా రెండు వాక్యాల్లో ముగించాలి. ఉద్యోగానికి ఎందు కు దరఖాస్తు చేస్తున్నారో ఆబ్జెక్టివ్‌లో స్ఫురించాలి. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్: అభ్యర్థులు తమ పేరు, ఫోన్ నంబరు, ఇ-మెయిల్ ఐడీ, ప్రొఫెషనల్ వెబ్‌సైట్ తదితర అంశాలను రెజ్యుమె పైభాగంలో చదవడానికి అనువైన ప్రదేశంలో రాయాలి. సోషల్ నెట్‌వర్క్స్, బ్లాగులు ప్రొఫెషనల్‌వైతేనే వాటి వివరాలను రెజ్యుమెలో పొందుపర్చాలి. అర్హతలు, అనుభవం: అభ్యర్థుల అకడమిక్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లను స్పష్టంగా పేర్కొనాలి. పాఠశాల విద్య, కాలేజీ కోర్సులు, టెక్నికల్ డిగ్రీ ప్రోగ్రామ్స్, సర్టిఫికేషన్స్, పొందిన అవార్డ్స్ గురించిన సమాచారాన్ని పొందుపర్చాలి. కంప్యూటర్ నాలెడ్జ్, మెకానికల్ ఎక్స్‌పీరియన్స్, భాషాపటిమ తదితర అంశాలు, ైనె పుణ్యాలనూ రాయాలి. పర్సనల్ రిఫరెన్సెస్: రెజ్యుమెలో కనీసం మూడు విశ్వసనీయ పర్సనల్ రిఫరెన్స్‌లను సమర్పించాలి. చాలా కంపెనీలు ఎక్కువ రిఫరెన్స్‌లను అడుగుతున్నాయి. ప్రతికూల అంశాలొద్దు: రెజ్యుమెలో ప్రతికూల పదాలనుపయోగించొద్దు. మీ వివరాలను సానుకూల వివరణల్లోనే రాయాలి. నిర్వహించిన బాధ్యతల కంటే సాధించిన విజయాలు ప్రస్తావిస్తే ప్రయోజనం ఉంటుంది. హాబీస్ ఉద్యోగానికి సంబంధించినవైతేనే రాయడం మంచిది. మీ వ్యక్తిగత అలవాట్ల గురించి ఎక్కువగా రాయడం సమయం, స్పేస్ రెండూ వృథా. కీస్ టు సక్సెస్: ఉద్యోగ సాధనలో రెజ్యుమె వారధిగా పనిచేస్తుంది. ఇంటర్వ్యూ స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని రెజ్యుమెను రూపొందించాలి. జాబ్ సాధించడమే ధ్యేయంగా రెజ్యుమె ఉండకూడదు. ఎందుకంటే కేవలం రెజ్యుమె మాత్రమే ఉద్యోగాన్ని సాధించిపెట్టదు. దానికి మరో ముఖ్యమైన ఇంటర్వ్యూ ఉందని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. సాధించిన విజయాల గురించి రాసేటప్పుడు అందుకు దోహదపడిన అంశాలనూ ప్రస్తావించాలి. ఇతర నైపుణ్యాలను పేర్కొనడం మర్చిపోవద్దు. వాలంటీరుగా పనిచేసిన అనుభవం, కమ్యూనిటీ సర్వీస్, మల్టిలింగువల్ లాంగ్వేజ్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, టెక్నికల్ ప్రొఫీషియన్సీస్‌నూ పేర్కొనాలి. రెండు నిమిషాల్లో రెజ్యుమెలోని అన్ని అంశాలను చదవగలిగేలా ఉండాలి. కాబట్టి అభ్యర్థులు ముఖ్యమైన సమాచారాన్ని, దరఖాస్తు చేస్తున్న ఉద్యోగానికి సరిపడే నైపుణ్యాలు మొదట పేర్కొనాలి. కవ ర్ లెటర్లు, రిఫరెన్స్‌ల్లో వివర ణాత్మకంగా రాయొచ్చు. వివిధ కంపెనీలు, దరఖాస్తు చేసుకునే ఉద్యోగాలకనుగుణంగా రెజ్యుమెలో మార్పులు చేయాలి. ఉద్యోగ నేపథ్యం, అక్కడి విధులు, నిర్వహించబోయే బాధ్యతలు, అనుభవాలను ప్రతిబింబించేలా రెజ్యుమె ఉండాలి. ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో రెజ్యుమెను అప్‌డేట్ చేయడం మర్చిపోవద్దు. ................................ ఇంటర్వ్యూ టిప్స్ ఉద్యోగ నియామక ప్రక్రియల్లో ఇంటర్వ్యూ కీలక దశ. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్‌ల్లో ప్రతిభ కనబర్చిన వారిని నేరుగా పరిశీలించేందుకు కంపెనీలు ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తాయి. ఇక్కడ అభ్యర్థి సామర్థ్యాలు, నెపుణ్యాలను గుర్తించడానికి ఇంటర్వ్యూర్ కఠినమైన ప్రశ్నలు అడగవచ్చు. అభ్యర్థి వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు సులువైన ప్రశ్నలనూ అడగొచ్చు. ఇంటర్వ్యూలో విజయం సాధించడం అనేది.. అభ్యర్థుల ప్రజెంటేషన్, భావ వ్యక్తీకరణపైనే ఆధారపడుతుంది. ఇంటర్వ్యూలో సాధారణంగా అడిగే ప్రశ్నలు వాటికి ఏ పంథాలో జవాబు చెప్పాలో తెలుసుకుంటే సులభంగా రాణించొచ్చు!! ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులు ముందుగా కంపెనీ చరిత్ర, లక్ష్యాలు, ప్రొడక్ట్స్, వర్క్ కల్చర్ గురించి అవగాహన ఏర్పరచుకోవాలి. వాటికి తమ స్కిల్స్‌ను అన్వయించుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలి. బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. ఇంటర్వ్యూ హాల్‌లో కుర్చీలో నిటారుగా కూర్చోవడం, ఇంటర్వ్యూర్ కళ్లలోకి సూటిగా చూస్తూ సమాధానం చెప్పడం, సమాధానానికి అనుగుణంగా ముఖ కవళికలు ప్రదర్శిస్తూ ఇంటర్వ్యూర్‌ను ఆకట్టుకోవచ్చు. ఇంటర్వ్యూర్ అడిగే ప్రశ్నలను శ్రద్ధగా వినాలి. వారికి వినపడేలా సమాధానాలు చెప్పాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రదర్శించాలి. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికే అభ్యర్థులను ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. ఆ సమయంలో విసుగు, అసహనం ప్రదర్శించొద్దు. అన్ని ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం చెప్పాలి. ఇంటర్వ్యూలో సాధారణంగా అడిగే కొన్ని ప్రశ్నలు: ? టెల్ మి అబౌట్ యువర్‌సెల్ఫ్? ఎక్కువ శాతం ఇంటర్వ్యూల్లో అడిగే ప్రశ్న ఇది. చాలా మంది అభ్యర్థులు తమ ప్రొఫెషనల్ వివరాలతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని కూడా వివరిస్తుంటారు. అయితే అభ్యర్థుల రిలేషన్ షిప్స్, బాల్యం, కుటుంబ వివరాలు తెలుసుకోవడానికి ఈ ప్రశ్న అడగలేదని అభ్యర్థులు గుర్తించాలి. విద్యాభ్యాసం, కెరీర్‌కు సంబంధించిన ప్రత్యేక ఆసక్తులు, జాబ్‌కు తగిన స్కిల్స్ గురించి వివరించాలి. ? ఈ కంపెనీనే ఎంచుకోవడానికి కారణమేంటి? అభ్యర్థుల అర్హతలు, నైపుణ్యాలు... కంపెనీ జాబ్ ప్రొఫైల్‌కు ఏ విధంగా సరిపోతాయో వివరిస్తూ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. కంపెనీ ఎంపిక కోసం చేసిన కసరత్తును వివరించాలి. పరిశ్రమ గుర్తింపు, ఉత్పాదకత వంటి విషయాల ఆధారంగానే ఎంపిక జరిగిందని వివరించాలి. ఉద్యోగుల ఆలోచనలు, లక్ష్యాలకనుగుణంగా కంపెనీ లక్ష్యాలు ఉన్నప్పుడే బాగా పనిచేయగలరని వివరించాలి. ? కెరీర్ లక్ష్యాల గురించి వివరించండి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు లక్ష్యాల ప్రస్తావనతో పాటు వాటిని చేరుకోవడానికి చేయబోయే ప్రయత్నాల గురించీ వివరించాలి. ఉదాహరణకు దీర్ఘకాల లక్ష్యాలను చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకుని లక్ష్యసాధనకు కృషి చేస్తానని చెప్పాలి. ? మీకున్న బలాలు, బలహీనతల గురించి చెప్పండి? ఇంటర్వ్యూలో బలం గురించి అడిగినప్పుడు ప్రత్యేక నైపుణ్యాలు, పని విధానం, సక్సెస్ రేటును వివరించొచ్చు. అలాగే బలహీనతల గురించి ప్రశ్నించినప్పుడు సంకోచించాల్సిన అవసరం లేదు. తప్పొప్పులు, లోటుపాట్లు లేని వారు ఎవరూ ఉండరు. బలహీనతలను చెప్పి వాటిని సరిదిద్దుకునేందుకు తీసుకుంటున్న చర్యలు వివరించాలి. ఇది కూడా అభ్యర్థుల పట్ల సానుకూల ధోరణిని పెంచుతుంది. ? మీ వ్యక్తిత్వం గురించి తెలపండి? అభ్యర్థులు ఒత్తిడి సమయంలో ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవడానికి ఈ ప్రశ్న ఉపయోగపడుతుంది. సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని, భిన్న పరిస్థితుల్లో పనిచేయడానికి సముఖత వ్యక్తం చేయాలి. గతంలో విజయవంతంగా పూర్తిచేసిన ప్రాజెక్టుల గురించి వివరించాలి. మరిన్ని ప్రశ్నలు: ఈ ఉద్యోగానికి నీవు ఎందుకు సరిపోగ లవని అనుకుంటున్నావు? ఈ ఉద్యోగంలో ఇతరులకంటే భిన్నంగా మీరేం చేయగలరు? ఈ ఉద్యోగం మీకే ఎందుకివ్వాలి? మీరు చేయాలనుకుంటున్న జాబ్‌లో ఏం కోరుకుంటున్నారు? మీ గురించి మీ స్నేహితుల అభిప్రాయం ఏంటి? ఇతర ఏయే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు? మీరు అడగాల్సిన ప్రశ్నలేవైనా ఉన్నాయా? మీరు నిర్వహించిన ప్రాజెక్టుల గురించి వివరించండి? |
ఫెలోషిప్ ఇన్ఫో
యూజీసీ పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్ ఫర్ ఉమెన్
గుర్తింపు పొందిన భారతీయ యూనివర్సిటీలు/కళాశాలల నుంచి సంబంధిత సబ్జెక్టులలో పీహెచ్‌డీ డిగ్రీని పొంది సెన్సైస్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్‌లో అడ్వాన్స్‌డ్ స్టడీస్, రీసెర్చ్ చేయాలనుకునే మహిళలను ప్రోత్సహించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌లను అందిస్తోంది.
మొత్తం ఫెలోషిప్స్: 100
వ్యవధి: ఎంపికైనవారికి ఐదేళ్లపాటు ఫెలోషిప్ లభిస్తుంది.
ఫెలోషిప్ మొత్తం:
మొదటి రెండేళ్లు నెలకు * 18,000, ఆ తర్వాత మూడేళ్లకు నెలకు * 20,000, చెల్లించడంతోపాటు ఇతర ఖర్చుల నిమిత్తం ఐదేళ్లకు * 50,000 కాంటిన్‌జెన్సీ గ్రాంట్ మంజూరవుతుంది.
శారీరక వికలాంగులకు, అంధులకు ఎస్కార్ట్స్/రీడర్ అసిస్టెన్స్ కింద నెలకు * 2000 అదనంగా చెల్లిస్తారు. వీటితోపాటు అందరికీ సంబంధిత యూనివర్సిటీ /కళాశాలలో ఉచిత నివాస వసతి, వైద్య సౌకర్యం కల్పిస్తారు.
అర్హతలు:
జూలై 1 నాటికి 55 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీహెచ్/మైనార్టీలకు 60 ఏళ్లు
ఈ ఫెలోషిప్‌లకు మహిళలు మాత్రమే అర్హులు.
జనరల్ కేటగిరీ విద్యార్థులు యూజీలో 55 శాతం, పీజీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీహెచ్‌లు యూజీలో 50 శాతం, పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
పీహెచ్‌డీ పొంది నిరుద్యోగులుగా ఉన్న మహిళలు మాత్రమే ఈ ఫెలోషిప్‌లకు అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు కొన్ని సర్టిఫికెట్స్‌ను కూడా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. అవి..
కులధ్రువీకరణ పత్రం
వయస్సు ధ్రువీకరణ పత్రం
గ్రాడ్యూయేషన్/పోస్ట్‌గ్రాడ్యుయేషన్ మార్కుల పత్రాలు
పీహెచ్‌డీ సర్టిఫికెట్
శారీరక వికలాంగులైతే అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 24, 2012
వెబ్‌సైట్: www.ugc.ac.in/pdfw
ఇన్‌స్పైర్‌లో ఏఓఆర్‌సీకి దరఖాస్తులు
భవిష్యత్తు శాస్త్రవేత్తలను రూపొందించే క్రమంలో విద్యార్థులకు, ఔత్సాహికులకు ప్రోత్సాహకాలు అందించే ఉద్దేశంతో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ప్రారంభించిన ‘ఇన్‌స్పైర్’ ప్రోగ్రాం.. ద్వారా పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న వారికి మరో అవకాశం ఎదురైంది. ఇన్‌స్పైర్ ప్రోగ్రాం ద్వారా ‘అష్యూర్‌డ ఆపర్చునిటీ ఫర్ రీసెర్‌చ కెరీర్ ప్రోగ్రాం’కు ప్రకటన విడుదల చేసింది. మొత్తం వేయి మందికి అయిదు సంవత్సరాల వ్యవధిలో ఫెలోషిప్ మంజూరవుతుంది. ఈ ఫెలోషిప్.. ఐఐటీ ప్రొఫెసర్ పే స్కేల్‌కు సమానంగా ఉండటం విశేషం.
అర్హత: మ్యాథమెటిక్స్ / సైన్‌స/ ఇంజనీరింగ్/ ఫార్మసీ/ అగ్రికల్చర్/ మెడిసిన్ విభాగాల్లో పీహెచ్‌డీ ఉండాలి. ఇప్పటికే పీహెచ్‌డీ థీసిస్ అందించిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయో పరిమితి: 32 సంవత్సరాలు
ఎంపిక విధానం: రెండంచెల వడపోత ద్వారా దరఖాస్తుదారుల తుది జాబితా రూపొందిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: ఫిబ్రవరి 29, 2012
వెబ్‌సైట్: www.inspire-dst.gov.in

అడ్వర్టైజింగ్ రంగం
కొత్తగా ఆలోచించాలన్న తపన, దృక్పథం, సృజనాత్మకత, వినియోగదారుల ఆలోచనలు, అభిప్రాయాలను పసిగట్టగలిగే నేర్పు ఉంటే.. అడ్వర్టైజింగ్ రంగం పట్టం కడుతోంది. భారత్‌లో అడ్వర్టైజింగ్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. రానున్నరోజుల్లో ఈ రంగంలో ఉద్యోగావకాశాలు లక్షల్లోనే! ప్రస్తుతం దేశంలో అడ్వర్టైజింగ్ రంగం వ్యాపారం 24 వేల కోట్లకు చేరుకుంది. ఏటా 8 శాతం నుంచి 10 శాతం వరకు వృది ్ధనమోదు చేస్తోంది. ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంటే... భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదగొచ్చు.
ప్రస్తుతం ప్రతి రంగంలో అనేక అవకాశాలున్నా.. కంపెనీలకు కావలసిన లక్షణాలను అందిపుచ్చుకోవడంలో మాత్రం చాలామంది వెనుకబడిపోతున్నారు. ఇప్పటివరకు నేను రాసిన పుస్తకాలన్నీ విద్యార్థులను మానసికంగా ముందుకు నడిపించడం కోసమే. కెరీర్లో తాను ప్రముఖులతో కలిసి పనిచేసిన అనుభవాలతో నేటి యువతకు మార్గదర్శనం చేయాలన్నదే తన ఏకైక లక్ష్యం అంటున్నారు
ప్రముఖ అడ్వర్టైజింగ్ నిపుణులు ఏజీ కృష్ణమూర్తి.
ఆయనతో సాక్షి భవిత ప్రత్యేక ఇంటర్వ్యూ...
ప్ర: భారత్‌లో అడ్వర్టైజింగ్‌కు భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
మనిషి జీవన విధానంతోపాటు మీడియా రంగం విస్తరించడంతో ప్రకటనల ప్రభావం బాగా పెరిగింది. ఫలితంగా ప్రతి కంపెనీ ఏదోకరకంగా తమ ఉత్పత్తులను మార్కెట్‌లోకి విస్తరించేందుకు ప్రకటనలపై ఆధారపడుతోంది. ఇప్పటికే దేశంలో అడ్వర్టైజింగ్ పరిశ్రమ టర్నోవర్ * 24,000 కోట్లు.
కాగా, అందులో టెలివిజన్ రంగం వాటా * 14,000 కోట్లు, పత్రికా రంగానికి * 10,000 కోట్లు. ప్రకటనల విషయంలో కంపెనీల మధ్య భారీగా పోటీ నెలకొంది. ఆన్‌లైన్ ప్రకటనలు వేగంగా విస్తరిస్తున్నాయి. గతంలో తమ కంపెనీ ఇమేజ్ పెంచుకోవడానికి ప్రకటనలు రూపొందిస్తే.. ఇప్పుడు తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి ప్రకటనలను ఆశ్రయిస్తున్నారు. దాంతో భవిష్యత్తులో అడ్వర్టైజింగ్ నిపుణుల అవసరం లక్షల్లోనే ఉండే అవకాశముంది.
ప్ర: ఈ రంగంలో రాణించాలంటే.. ఎలాంటి స్కిల్స్ అవసరం?
{పచార రంగంలో ఎప్పటికప్పుడు వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదే సమ యంలో అవకాశాలు, సవాళ్లు రెండూ ఉంటాయి. ఎప్పటికప్పుడు సృజనాత్మకంగా ఆలోచించడం, కొత్త ఆలోచనలకు పదునుపెట్టడం చేయాలి. దాంతోపాటు సరైన విద్యార్హతలు, టీం వర్క్, పనిని ప్రేమించడం.. వినియోగదారుల ఆలోచనలు, అభిరుచులు పసిగట్టగల నేర్పు ఉంటే.. ఈ రంగంలో ఎవరైనా ముందుకు దూసుకుపోవచ్చు. నిత్యనూతనమైన అడ్వర్టైజింగ్ రంగంలో కొత్తగా ఆలోచించేవారే పోటీలో ముందుంటారు.
ప్ర: అడ్వర్టైజింగ్ రంగంలో అవకాశాలు, వేతనాలు ఎలా ఉంటాయి?
{పస్తుతం అడ్వర్టైజింగ్ రంగం ఉద్యోగాల కల్పతరువుగా మారింది. అడ్వర్టైజింగ్‌లో పీజీ చేస్తే మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రధానంగా క్రియేటివిటీ, మార్కెట్ రీసెర్చ్, బ్రాండ్ మేనేజ్‌మెంట్, మీడియా సేల్స్, ఔట్‌డోర్ విభాగాల్లో కోర్సులు చేస్తే తక్షణమే ఉద్యోగాలొస్తాయి. క్రియేటివిటీ, క్లైంట్ సర్వీస్, మార్కెట్ రీసెర్చ్, ప్రొడక్షన్, వంటి విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. నెలకు సుమారు రూ.40,000 వరకు ఆర్జించవచ్చు.
ప్ర: కోర్సులు, కాలేజీలు?
అడ్వర్టైజింగ్ రంగంలో ప్రవేశించాలనుకునేవారికి అడ్వర్టైజింగ్ రంగానికి సంబంధించి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దేశంలో, రాష్ట్రంలో పలు మేనేజ్‌మెంట్ కాలేజీలు ఎంబీఏలోనే మార్కెటింగ్, అడ్వర్టైజ్‌మెంట్ కోర్సులు అందిస్తున్నాయి. బ్రాండ్ మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తిచేస్తే అడ్వర్టైజింగ్ రంగంలోకి సులువుగా ప్రవేశించవచ్చు.
ప్ర: నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి?
సమాజంలో ప్రతి వ్యవస్థకు నాయకత్వం కావాలి. కుటుంబం నుంచి పెద్దపెద్ద కంపెనీల వరకూ.. నాయకత్వం లేనిదే పని ముందుకు నడవదు. ప్రతి ఒక్కరూ నాయకులు కాగలరా? అంటే కావచ్చు. అందుకు కొన్ని లక్షణాలు అలవర్చుకోవాలి. నాయకత్వ లక్షణాలు లేకపోవడం వల్లే ఏళ్ల తరబడి పనిచేస్తూ కూడా చాలామంది అవకాశాల్లో వెనుకబడిపోతున్నారు. ప్రధానంగా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలంటే ముందు ‘‘నేనెలాగో.. నా సహచరుడు అలానే’’.. అనే దృక్పథాన్ని అలవర్చుకోవాలి.
అలాంటప్పుడే అందరి దృష్టిలో మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి వీలవుతుంది. తన విజన్‌ను, విజయాన్ని సహచరులతో పంచుకోవడం.. అర్థం చేసుకుని వ్యవహరించడం.. అందరివాడిగా మెలగడం.. స్నేహపూర్వకంగా మసలుకోవడం.. అందరిలో వీరిని ప్రత్యేకంగా నిలబె డతాయి. ఈ లక్షణాలే భవిష్యత్తులో పలు అవకాశాలు తెచ్చిపెడతాయి.
ప్ర: {పొడక్ట్ విజయం సాధించాలంటే.. నాణ్యత? ప్రచారం? రెండిట్లో ఏది ముఖ్యం?
ఏ వస్తువుకైనా, ఉత్పత్తికైనా ముందు నాణ్యత ఉండాలి. అప్పుడే నలుగురికి దగ్గరై విజయం సాధిస్తుంది. ఒకరకంగా నాణ్యత ప్రాథమిక లక్షణం. దానికి మరింత ప్రచారం కల్పిస్తే జనంలోకి దూసుకుపోవడానికి దోహదపడుతుంది.
ప్ర: సక్సెస్‌ఫుల్ అడ్వర్టైజ్‌మెంట్ రూపొందించాలంటే?
వినియోగదారుడి అవసరాలను అర్థం చేసుకోగలగాలి. అడ్వర్టైజ్‌మెంట్ అంటే.. ఒకరకంగా మ్యాచ్‌మేకర్. వినియోగదారుడికి, కంపెనీకి మధ్య వారధిగా ఉంటూ.. వారి అవసరాలను గుర్తించగలిగితే సక్సెస్‌ఫుల్ అడ్వర్టైజ్‌మెంట్ రూపొందించవచ్చు.
ప్ర: మీరు పుస్తకాలు రాయడానికి ప్రేరణ?
నాకు చిన్నప్పటినుంచి రాయడమంటే ఇష్టం! అందుకే ఎప్పటికీ రాస్తూనే ఉంటా. నేను నా కెరీర్‌లో ఎంతోమంది ప్రముఖులతో కలిసి పనిచేశా. ఆ విలువైన అనుభవాలు నేటి యువత జీవితంలో పైకి రావడానికి ఉపయోగపడాలనే తపనతోనే పుస్తకాలు రాస్తున్నాను. అడ్వర్టైజింగ్ రంగంలో ఇంత పేరుప్రఖ్యాతులు సంపాదించడం వెనుక ఎంతో కృషి ఉంది.
ప్ర: మార్కెట్లో లక్షల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. ఉద్యోగాలు దొరక్క అభ్యర్థులు ఇబ్బందిపడుతున్నారు. కారణం?
కేవలం డిగ్రీ సర్టిఫికేట్ ఒకటే ఉంటే ఉద్యోగం దొరికే రోజులు కావిప్పుడు. క్వాలిఫికేషన్ ఒక్కటేకాదు.. స్కిల్స్ కూడా ముఖ్యం. ఇంటర్వ్యూకి వెళ్లాలంటే చాలామందికి బెరుకు. ఆత్మవిశ్వాసం కొరవడటం, ఇంగ్లిష్‌పై పట్టులేకపోవడం వంటివి ఉద్యోగ అన్వేషణలో వెనుకబాటుకు కారణమవుతున్నాయి. ఈ లోపాలను అధిగమించాలి. విషయావగాహనతోపాటు మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. సబ్జెక్ట్ స్కిల్స్‌తోపాటు బాడీలాంగ్వేజ్ వంటి విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటే ఉద్యోగం ఖాయం.
ప్ర: ఇన్నేళ్ల విజయానికి కారణం?
కష్టేఫలి అనేదే నా నినాదం. నా విజయానికి కారణం.. పట్టుదలగా పనిచేయడమే!
ప్ర: జీవిత లక్ష్యం?
ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వచ్ఛంగా బతికితే చాలు. అదే నా జీవిత లక్ష్యం.

Subscribe to:
Posts (Atom)