Tuesday, April 16, 2013


మెరైన్ కెమిస్ట్రీ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థలేవి? కెరీర్ ఏవిధంగా ఉంటుంది?
-రామారావు, విశాఖపట్నం
A. ఇటీవల కాలంలో మెరైన్ కెమిస్ట్రీకి డిమాండ్ బాగా పెరుగుతోంది. సముద్ర ఆహారం, సముద్ర ఆధారిత ఔషధాలు, సముద్ర జలాల కలుషితం, చమురు- ఖనిజాన్వేషణ, తదితర కారణాల వల్ల మెరైన్ కెమిస్ట్రీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మెరైన్ బాడీల తయారీలో ఉపయోగించే కెమికల్స్, సముద్ర జీవులు, వాతావరణంపై కెమికల్స్ ప్రభావం వంటి అంశాలను మెరైన్ కెమిస్ట్రీలో చర్చిస్తారు.
మెరైన్ కెమిస్ట్రీని కెమికల్ ఓషనోగ్రఫీ అని కూడా అంటారు. ఇందులో పరిశోధనాత్మక కార్యకలాపాల పరిధి ఎక్కువగా ఉంటుంది. మెరైన్ కెమిస్ట్రీ పూర్తి చేసిన వారిని మెరైన్ కెమిస్ట్‌లుగా వ్యవహరిస్తుంటారు. వీరు సముద్ర గర్భంలో పరిశోధనలు చేయడం, సంబంధిత డేటా సేకరించడం, దాన్ని విశ్లేషించడం వంటి విధులను నిర్వహిస్తుంటారు.

ఈ రంగంలో కెరీర్ ప్రారంభించాలంటే మెరైన్ కెమిస్ట్రీ లేదా అనుబంధ కోర్సులో పీజీ చేయాలి. ఈ రంగంలో ఎక్కువగా పరిశోధనలు, ఫీల్డ్ వర్క్ అంశాలు ఉంటాయి తదనుగుణంగా స్కిల్స్ ఉంటేనే ఈ రంగంలో రాణించవచ్చు. ఈ క్రమంలో అభ్యర్థులకు సహనం, ఓర్పు, కాలంతో నిమిత్తం లేకుండా పని చేసే సామర్థ్యం ఉండాలి.

మెరైన్ కెమిస్ట్రీ అభ్యర్థులకు సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్- భావ్‌నగర్, నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ అండ్ ఓషన్ రీసెర్చ్- గోవా, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్- మైసూర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ- చెన్నై వంటి ప్రభుత్వ సంస్థలతోపాటు పలు ప్రైవేట్ రీసెర్‌‌చ ఆర్గనైజేషన్‌‌స కెరీర్ అవెన్యూస్‌గా ఉంటాయి. వీటిల్లో సైంటిస్ట్‌గా లేదా వివిధ హోదాల్లో అవకాశాలు లభిస్తాయి.

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
అన్నామలై యూనివర్సిటీ
కోర్సు: ఎంఎస్సీ (మెరైన్ కెమిస్ట్రీ)
అర్హత: కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్‌గా బ్యాచిలర్ డిగ్రీ.
వివరాలకు: http://annamalaiuniversity.ac.in
యూనివర్సిటీ ఆఫ్ గోవా
కోర్సు: ఎంఎస్సీ (మెరైన్ సైన్స్ విత్ మెరైన్ కెమిస్ట్రీ)
వివరాలకు: www.unigoa.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
కోర్సు:ఎంఎస్సీ(కెమిస్ట్రీ,మెరైన్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌గా)
వివరాలకు: www.andhrauniversity.info
n తర్వాత ఆసక్తి ఉంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ-గోవా వంటి ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి పీహెచ్‌డీ చేయొచ్చు.

Q. ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించడానికి కావలసిన అర్హతలు? - రచన, అసిఫాబాద్
A. ఎయిర్‌హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించాలంటే ముందుగా ఆ రంగంలో శిక్షణ తీసుకోవాలి. దేశంలో పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఎయిర్‌హోస్టెస్ శిక్షణను అందిస్తున్నాయి. శిక్షణలో చేరేందుకు వయసు, ఎత్తు, బరువు విషయంలో కొన్ని పరిమితులున్నాయి. ఆకర్షణీయమైన రూపం, సాధారణ కంటి చూపుతోపాటు హిందీ, ఇంగ్లిష్ భాషలను ధారాళంగా మాట్లాడాలి. వీటితోపాటు ఏదైనా విదేశీ భాషలో ప్రావీణ్యం ఉంటే అదనపు ప్రయోజనంగా ఉంటుంది. ప్రాథమిక అర్హతలు..
వయసు 18-24 ఏళ్లు.
ఎత్తు 160 సెం.మీ.
ఇంటర్మీడియెట్ (10+2) ఉత్తీర్ణత.

ఎయిర్ హోస్టెస్ శిక్షణ ను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
{ఫాంక్‌ఫిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ - సికింద్రాబాద్.
వివరాలకు: www.frankfinn.com
కేతన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ - హైదరాబాద్.
వివరాలకు: www.ketansinstitute.com
ఆప్టెక్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ అకాడమీ -
హైదరాబాద్.
వివరాలకు: http://aptechaviationacademy.com

Q. పలంటాలజీ కోర్సుకు సంబంధించిన వివరాలను తెలపండి? - మదన్, మహబూబాబాద్
A. పలంటాలజీ అంటే శిలాజ అధ్యయన శాస్త్రం. దీనిలో చరిత్ర పూర్వకాల అధ్యయనంతోపాటు శిలాజాల అధ్యయనం వంటి అంశాలు ఈ శాస్త్రంలో ఉంటాయి. ఎలాంటి వాతావరణ మార్పులకు అనుగుణంగా భూమి పరిణామం చెందింది అనే విషయాలను గురించి వివరిస్తుంది. బయాలజీ, జియాలజీ, ఆర్కియాలజీల అంశాలను వివరించే మల్టీడిసిప్లినరీ కోర్సుగా పలంటాలజీని పేర్కొంటారు.

ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ -హైదరాబాద్
కోర్సు: అప్లయిడ్ జియాలజీ(పలంటాలజీ ఒక సబ్జెక్ట్‌గా)
అర్హత: 40 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్ట్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
{పవేశం: ఎంట్రెన్స్ ఆధారంగా
వివరాలకు: www.osmania.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ- విశాఖపట్నం
కోర్సు: ఎంఎస్సీ జియాలజీ, ఎంఎస్సీ(టెక్-అప్లయిడ్ జియాలజీ, (పలంటాలజీ ఒక సబ్జెక్ట్‌గా)
అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ ఉత్తీర్ణత.
{పవేశం: ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా
వివరాలకు: www.andhrauniversity.info
జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్-హైదరాబాద్, సంబంధిత రంగంలో ప్రొఫెషనల్ శిక్షణను కూడా అందిస్తుంది.

Q. మెటలర్జికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కెరీర్ పరంగా అవకాశాలు ఏ విధంగా ఉంటాయి?
- రాజేశ్, కరీంనగర్

A. లోహ సంగ్రహణం, ప్రాసెసింగ్, సంబంధిత అంశాల గురించి మెటలర్జీ ఇంజనీరింగ్ వివరిస్తుంది. ఈ బ్రాంచ్‌తో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో చక్కటి అవకాశాలు ఉన్నాయి. వీరికి టాటా స్టీల్స్, సెయిల్, నాల్కో, స్పాంజ్ ఐరన్ లిమిటెడ్, హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్, ఎన్‌టీపీసీ, ఇస్రో, డీఆర్‌డీఓ, ఇండియన్ రైల్వేలు కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. వీటిల్లో సేఫ్టీ ఇంజనీర్, క్వాలిటీ ఇంజనీర్, ప్లానింగ్ ఇంజనీర్, వెల్డింగ్ ఇంజనీర్, ప్లాంట్ ఎక్విప్‌మెంట్ ఇంజనీర్‌గా లేదా రీసెర్చె ర్‌గా, కన్సల్టెంట్ వంటి హోదాల్లో అవకాశాలు లభిస్తాయి.

Q. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ నేవీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ మహిళా అభ్యర్థులకు ఎటువంటి అవకాశాలు ఉంటాయి? -దీపిక, మదిర
A. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ మహిళా అభ్యర్థులకు కెరీర్ పరంగా చక్కని అవకాశాలున్నాయి. వివరాలు..
- ఇండియన్ ఎయిర్‌ఫోర్స్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్- షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ బ్రాంచ్‌లో పనిచేయడానికి బీటెక్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసిన మహిళలకు అవకాశం ఉంటుంది. వయసు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. ఎంపిక ప్రక్రియలో ముందుగా ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌ను రాయాలి. పరీక్ష సమయం రెండు గంటలు. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉండే ఈ పరీక్షలో వెర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, జనరల్ ఎవేర్‌నెస్, మిలటరీ ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వస్తాయి. తర్వాత ఇంటలిజెన్స్ టెస్ట్ (స్టేజ్- 1), సైకలాజికల్ టెస్ట్-గ్రూప్ టెస్ట్-ఇంటర్వ్యూ (స్టేజ్- 2) దశలను అధిగమిస్తే నియామకం ఖరారవుతుంది.
వివరాలకు: www.careerairforce.nic.in
ఇండియన్ నేవీ: ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ బ్రాంచ్ ద్వారా ఎడ్యుకేషన్, లాజిస్టిక్ వంటి విభాగాల్లో మహిళలకు అవకాశాలను కల్పిస్తుంది. మల్టిపుల్ టెస్ట్స్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వివరాలకు: https://nausena-bharti.nic.in

ఫ్యూచర్ కెరీర్‌కు.. పీజీసెట్స్ - All PGCETs - 2013 (Academic Guidance)


ఆచార్య నాగార్జున

యూనివర్సిటీ - గుంటూరు
కోర్సులు:
ఎంఎస్సీ: ఆక్వాకల్చర్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెన్సైస్, జియాలజీ, మ్యాథమెటిక్స్, మైక్రో బయాలజీ, నానో బయోటెక్నాలజీ, ఆయిల్ అండ్ ఫ్యాట్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ.
ఎంఏ: యానిసెంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, ఎకనామిక్స్, ఇంగ్లిష్, హిందీ, హిస్టరీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మహాయాన బుద్ధిస్ట్ స్టడీస్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రూరల్ డెవలప్‌మెంట్, సంస్కృతం, సోషియాలజీ, తెలుగు.
ఇతర కోర్సులు: మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంఈడీ, ఎంకాం, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంపీఈడీ, పీజీ డిప్లొమా ఇన్ అంబేద్కర్ స్టడీస్, పీజీ డిప్లొమా ఇన్ యోగా ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ (ఫుల్‌టైం, పార్ట్‌టైం); ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ నానో టెక్నాలజీ (ఐదేళ్లు), ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్).
ఆలస్య రుసుంతో దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2013
ప్రవేశ పరీక్షలు ప్రారంభం: మే 4, 2013
వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in

ఆంధ్రా యూనివర్సిటీ - విశాఖపట్నం

ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించే పీజీసెట్ ద్వారా ఈ వర్సిటీతోపాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్సిటీ- శ్రీకాకుళంలో కూడా ప్రవేశాలు కల్పిస్తారు.
ఎంఎస్సీ: బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్, ఫుడ్స్- న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్, బోటనీ, హార్టికల్చర్ అండ్ ల్యాండ్‌స్కేప్ మేనేజ్‌మెంట్, కెమిస్ట్రీ (ఎనలిటికల్ కెమిస్ట్రీ, బయోఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఎనాలిసిస్ ఆఫ్ ఫుడ్స్- డ్రగ్స్ అండ్ వాటర్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెరైన్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ), కంప్యూటర్ సైన్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, జాగ్రఫీ, జియాలజీ, మెరైన్ జియాలజీ, టెక్ జియాలజీ, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిషరీ సైన్స్, ఆంత్రోపాలజీ, జువాలజీ, స్టాటిస్టిక్స్, టెక్.జియోఫిజిక్స్, హైడ్రాలజీ, మెరైన్ జియోఫిజిక్స్, ఫిజికల్ ఓషనోగ్రఫీ, మెటియోరాలజీ, న్యూక్లియర్ ఫిజిక్స్, స్పేస్ ఫిజిక్స్, ఫిజిక్స్, మైక్రో బయాలజీ, అప్లైడ్ మ్యాథమెటిక్స్, మెరైన్ బయోటెక్నాలజీ, కోస్టల్ ఆక్వాకల్చర్ అండ్ మెరైన్ బయోటెక్నాలజీ, మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్, హ్యూమన్ జెనెటిక్స్.
ఎంఏ కోర్సులు: ఉమెన్స్ స్టడీస్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, మ్యూజిక్, డ్యాన్స్, రూరల్ డెవలప్‌మెంట్, తెలుగు, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, సోషల్ వర్క్, సంస్కృతం, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఫిలాసఫీ, హెచ్‌ఆర్‌డీ, హిస్టరీ, యానిసెంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, హిందీ, ఇంగ్లిష్, అడల్డ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్.
ఇతర కోర్సులు: ఎంకాం, బీఎఫ్‌ఏ, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంజేఎంసీ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్ మెంటల్ రిటార్డేషన్)
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు: ఎంఎస్సీ అప్లైడ్ కెమిస్ట్రీ, ఎంఏ ఎకనామిక్స్.
ఆలస్య రుసుంతో పూర్తిచేసిన దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: ఏప్రిల్ 12, 2013
ప్రవేశ పరీక్షల ప్రారంభం: ఏప్రిల్ 28, 2013
వెబ్‌సైట్: www.andhrauniversity.info

ఎస్వీయూవైవీయూ పీజీసెట్

ఈ ప్రవేశపరీక్ష ద్వారా ఎస్వీయూ(తిరుపతి), యోగి వేమన వర్సిటీ (కడప)ల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. కోర్సులు...
ఎంఏ: అడల్ట్ ఎడ్యుకేషన్, ఎకనామిక్స్,ఇంగ్లిష్, హిస్టరీ, యానిసెంట్ ఇండియన్ హిస్టరీ-కల్చర్ అండ్ ఆర్కియాలజీ, హిందీ, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, లింగ్విస్టిక్స్, ఫర్‌ఫార్మింగ్ ఆర్ట్స్, మ్యూజిక్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాపులేషన్ స్టడీస్, రూరల్ డెవలప్‌మెంట్, సంస్కృతం, సోషియాలజీ, తమిళ్, తెలుగు,ఉర్దూ, టూరిజం, ఎకనోమెట్రిక్స్.
ఎంఎస్సీ కోర్సులు: ఆంత్రోపాలజీ, ఆక్వాకల్చర్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఇమ్యునోటెక్నాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, బోటనీ, కె మిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, జాగ్రఫీ, జియాలజీ, జియాలజీ-జియోఇన్ఫర్మేటిక్స్, హోంసైన్స్, టెక్ హైడ్రాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్, మైక్రో బయాలజీ, మెటీరియల్ సైన్స్ అండ్ నానో టెక్నాలజీ, ఫిజిక్స్, సైకాలజీ, కౌన్సెలింగ్ సైకాలజీ, జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్, జువాలజీ, యానిమల్ సైన్స్, విరాలజీ, స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, ఇండస్ట్రియల్ మైక్రో బయాలజీ.
ఇతర కోర్సులు: ఎంకాం, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంఎస్ ఉమెన్ స్టడీస్ అండ్ మేనేజ్‌మెంట్, ఎంటెక్ స్పేస్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్స్, ఎంపీఈడీ, ఎంసీజే, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఎస్ ఫుడ్ టెక్నాలజీ, ఎంఈడీ
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: ఏప్రిల్ 22, 2013
ప్రవేశ పరీక్ష లు: మే 18 నుంచి మే 26 వరకు
వెబ్‌సైట్: www.svudoa.in

కృష్ణా యూనివర్సిటీ - మచిలీపట్నం

ఎంఎస్సీ: ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్-ఇన్‌స్ట్రుమెంటేషన్, బయోటెక్నాలజీ, జువాలజీ, మైక్రో బయాలజీ, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ, బోటనీ, బయోకెమిస్ట్రీ, ఫిజిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్.
ఎంఏ: జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్, తెలుగు, ఎకనామిక్స్, సోషల్ వర్క్.
ఇతర కోర్సులు: ఎంఈడీ, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంకాం.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 16, 2013
ప్రవేశ పరీక్షల ప్రారంభం: ఏప్రిల్ 25, 2013
వెబ్‌సైట్: www.krishnauniversity.ac.in

కృష్ణదేవరాయ వర్సిటీ - అనంతపురం

ఈ వర్సిటీ ప్రవేశపరీక్ష ద్వారా శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ(అనంతపురం), ఆయిల్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (జేఎన్‌టీఏ అనుబంధ కళాశాల)ల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
ఎంఏ: అడల్ట్ ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రూరల్ డెవలప్‌మెంట్, సోషియాలజీ, తెలుగు, హిందీ.
ఎంఎస్సీ: బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, జాగ్రఫీ, మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, మైక్రో బయాలజీ, ఫిజిక్స్, పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెరికల్చర్, స్టాటిస్టిక్స్, జువాలజీ, పుడ్ టెక్నాలజీ (ఓటీఆర్‌ఐలో మాత్రమే)
ఇతర కోర్సులు: మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంఈడీ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంపీఈడీ, ఎంకాం.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 22, 2013
ప్రవేశపరీక్షలు: ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 29 వరకు
వెబ్‌సైట్: www.skupgcet.org

ద్రవిడియన్ విశ్వవిద్యాలయం - కుప్పం

ఎంఏ: ఫిలాసఫీ, లింగ్విస్టిక్స్, ఇంగ్లిష్, ఫోక్‌లోర్- ట్రైబల్‌లోర్ అండ్ కల్చరల్ టూరిజం, హిస్టరీ, కన్నడ, మళయాలం, తమిళం, తెలుగు, సోషియాలజీ, రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్,
ఎంఎస్సీ: జువాలజీ, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, మైక్రోబయాలజీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బోటనీ.
ఇతర కోర్సులు: మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంసీఏ, ఎంకాం, ఎంబీఏ, తుళు (సర్టిఫికెట్, డిప్లొమా కోర్సు), మళయాలం (సర్టిఫికెట్, డిప్లొమా కోర్సు), టీపీటీ, బీఈడీ, ఎంఈడీ.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 29, 2013
ప్రవేశ పరీక్షల ప్రారంభం: మే 11, 2013
వెబ్‌సైట్: www.dravidianuniversity.ac.in

ఆదికవి నన్నయ యూనివర్సిటీ-రాజమండ్రి

ఎంఎస్సీ: జువాలజీ, కెమిస్ట్రీ, జియాలజీ,పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్.
ఎంఏ కోర్సులు: ఇంగ్లిష్, తెలుగు, ఎకనామిక్స్, సైకాలజీ, సోషల్ వర్క్.
ఇతర కోర్సులు:
ఎంబీఏ (ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్‌ఆర్‌ఎం)
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 19, 2013
ప్రవేశపరీక్షల ప్రారంభం: మే 5, 2013
వెబ్‌సైట్: www.nannayauniversity.info

ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్

ఈ యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా తెలంగాణ యూనివర్సిటీ-నిజామాబాద్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ-నల్గొండ, పాలమూరు యూనివర్సిటీ-మహబూబ్ నగర్‌ల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
కోర్సులు:
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు: ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ; ఎంఏ (అప్లైడ్ ఎకనామిక్స్), ఎంబీఏ, ఎంబీఏ (డ్యుయెల్ డిగ్రీ).
ఎంఎస్సీ: ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, బోటనీ, కెమిస్ట్రీ (ఇనార్గానిక్/ఆర్గానిక్/ఫిజికల్ ఆర్గానిక్/ఫిజికల్ ఎనలిటికల్/ఫార్మాస్యూటికల్/ఫార్మకో ఇన్ఫర్మేటిక్స్), కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, జాగ్రఫీ, జియోఇన్ఫర్మేటిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జువాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, న్యూట్రిషన్ డైటిటిక్స్, జియోఫిజిక్స్, అప్లైడ్ జియోకెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్.
ఎంఏ: యానిసెంట్ ఇండియన్ హిస్టరీ-కల్చర్ అండ్ ఆర్కియాలజీ, అరబిక్, ఇంగ్లిష్, హిందీ, ఇస్లామిక్ స్టడీస్, కన్నడం, లింగ్విస్టిక్స్, మరాఠీ, పర్షియన్, ఫిలాసఫీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఉర్దూ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, థియేటర్ ఆర్ట్స్.
ఇతర కోర్సులు: ఎంసీజే, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంకాం, ఎంఈడీ, ఎంపీఈడీ; పీజీ డిప్లొమా ఇన్ ట్యాక్సేషన్, డిజిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్, ఉర్దూ పాలియోగ్రఫీ, అప్లైడ్ లింగ్విస్టిక్స్, ఫంక్షనల్ హిందీ అండ్ ట్రాన్స్‌లేషన్, చైల్డ్ సైకాలజీ, మ్యూజియాలజీ, ఆర్కైవల్ సైన్స్ అండ్ మ్యానుస్క్రిప్టాలజీ, జియోగ్రాఫికల్ కార్టోగ్రఫీ, సైకలాజికల్ కౌన్సెలింగ్, బయోస్టాటిస్టిక్స్.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 3, 2013
ప్రవేశ పరీక్షల ప్రారంభం: మే 30, 2013
వెబ్‌సైట్: www.osmania.ac.in

శ్రీ పద్మావతి మహిళ
విశ్వవిద్యాలయం-తిరుపతి
ప్రత్యేకంగా మహిళలకు మాత్రమే వివిధ కోర్సులను అందిస్తోంది. పద్మావతి మహిళా యూనివర్సిటీ అందించే కోర్సులు..
ఎంఏ: పబ్లిక్ రిలేషన్స్, భరత నాట్యం, మ్యూజిక్ (ఓకల్, వీణ), ఉమెన్స్ స్టడీస్, ఎకనామిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, తెలుగు లాంగ్వేజ్ లిటరేచర్ అండ్ ట్రాన్స్‌లేషన్.
ఎంఎస్సీ: అప్లైడ్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మైక్రోబయాలజీ, మైక్రోబయోల్ టెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఇన్ఫర్మేటిక్స్, జనరల్ బయోటెక్నాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, బోటనీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెన్సైస్ (క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్, కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్), హ్యూమన్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎనలిటికల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, సెరి బయోటెక్నాలజీ, జువాలజీ.
ఇతర కోర్సులు: ఎంపీఈడీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంసీజే, ఎంఈడీ, ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2013
వెబ్‌సైట్: www.spmvv.ac.in

రాయలసీమ
యూనివర్సిటీ - కర్నూలు
కోర్సులు:
ఎంఎస్సీ: బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జువాలజీ.
ఎంఏ: ఎకనామిక్స్, ఇంగ్లిష్, తెలుగు.
ఇతర కోర్సులు: ఎంఈడీ, ఎంకాం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఏప్రిల్ 22, 2013
ప్రవేశపరీక్షలు: మే 12 నుంచి 15 వరకు
వెబ్‌సైట్: www.rupgcet2013.org/default.aspx


ఎక్కువ మంది విద్యార్థుల ఎంపిక.. కెమిస్ట్రీ

ఏయూలో పీజీ కోర్సులకు ఇప్పటి వరకు 22 వేల దరఖాస్తులు వచ్చాయి. సైన్స్ విభాగంలో రసాయన శాస్త్రానికి విద్యార్థుల నుంచి విపరీతమైన ఆదరణ ఉంది. గణితం, భౌతికశాస్త్రం, ఎంకాం, ఎంఈడీ కోర్సులు తర్వాత స్థానంలో ఉంటున్నాయి. ఐదేళ్ల సమీకృత కోర్సుల్లో ఎకనామిక్స్, అప్లైడ్ కెమిస్ట్రీ కోర్సులకు విద్యార్థుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ లభిస్తోంది. ప్రవేశ పరీక్షలో విజయం సాధించడానికి సంబంధిత పాఠ్యపుస్తకాలు ఆమూలాగ్రం చదవాలి. అదేవిధంగా ప్రతి పాఠ్యాంశంలోని ప్రధాన అంశాలను పలుమార్లు పునశ్చరణ చేయాలి. ప్రశ్నల నిధిని సిద్ధం చేసుకుని ప్రణాళికా బద్దంగా సిద్ధమవ్వాలి. ఇలా చేస్తే విజయం సాధించడం సులువే. ఇకపోతే ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తిచేసినవారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

జిప్‌మర్‌లో విజయం ఇలా...


జిప్‌మర్ (జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్)లో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం కోసం 2013వ సంవత్సరానికి నోటిఫికేషన్ వెలువడింది. సంబంధిత వివరాలు..

ఎంసెట్ Vs జిప్‌మర్

ఫిజిక్స్, కెమిస్ట్రీ- సిలబస్ ఎంసెట్ సిలబస్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి ఎంసెట్ తరహా ప్రిపరేషన్ దీనికి సరిపోతుంది.

బోటనీ, జువాలజీ- ఎంసెట్ ప్రిపరేషన్ సరిపోతుంది. కొన్ని అంశాలు మాత్రం అదనంగా చదవాలి. అవి.. బయో మాలిక్యుల్స్, పాలిమర్స్, హ్యుమన్ ఫిజియాలజీ, జెనెటిక్స్. వీటి కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అధ్యయనం చేయాలి. అంతేకాకుండా ఇందుకోసం గ త ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ.. అయా అంశాల్లో అడుగుతున్న ప్రశ్నల సరళిని అవగాహన చేసుకోవాలి. దీని వల్ల ప్రిపరేషన్ మరింత మెరుగవుతుంది.

ఇతర మెడికల్ ఎంట్రెన్స్‌లతో పోల్చితే జిప్‌మర్ ప్రవేశ పరీక్ష కొంత భిన్నమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో గ్రూప్ సబ్జెక్ట్‌లతోపాటు ఇంగ్లిష్‌లో కూడా విద్యార్థి పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షలో ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. ఇందులో మొత్తం ఐదు విభాగాల్లో 200 ప్రశ్నలు ఉంటాయి. అవి.. ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ. ఈ ఐదు సబ్జెక్టుల నుంచి 40 ప్రశ్నల చొప్పున వస్తాయి. మొత్తం మార్కులు 200. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. వ్యవధి: మూడు గంటలు.

నిర్ణయాత్మకం:
గత ఫలితాలను విశ్లేషిస్తే.. ఇంగ్లిష్, ఫిజిక్స్ విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులే ర్యాంకుల విషయంలో ముంద ౦జలో ఉంటున్నారు. అంటే ర్యాంకుల నిర్ధారణలో ఈ రెండు సబ్జెక్ట్‌లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయని చెప్పొచ్చు.

ప్రిపరేషన్:
ఎంసెట్‌లో ప్రశ్నలు స్టేట్ సిలబస్ నుంచి వస్తే.. జిప్‌మర్‌లో అడిగే ప్రశ్నలు సీబీఎస్‌ఈ-ఐసీఎస్‌ఈ ఆధారంగా ఉంటాయి. ఎంసెట్ పూర్తయిన తర్వాత జిప్‌మర్ (జూన్ 2) కోసం దాదాపు 20 రోజుల సమయం ఉంటుంది. ఈ సమయంలో ఎంసెట్‌లో లేని జిప్‌మర్‌లో అదనంగా ఉన్న అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. కనీసం నాలుగు లేదా ఐదు మాక్ టెస్ట్‌లు రాయాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం కూడా ఉత్తమం.

బయాలజీదే సింహ భాగం:
జిప్‌మర్ ఎంట్రెన్స్‌లోని అన్ని సబ్జెక్టుల్లో బయాలజీదే (బోటనీ+ జువాలజీ) సింహ భాగం. మిగతా సబ్జెక్టులతో పోల్చితే ఈ విభాగం ప్రిపరేషన్ ఏమంత కష్టం కాదు. ఎందుకంటే ఫిజిక్స్, కెమిస్ట్రీల మాదిరిగా లాజిక్‌తో కూడిన ప్రశ్నలు కాకుండా సూటిగా ఉండే ప్రశ్నలను అడుగుతారు.

కీలక చాప్టర్లు: సెల్ బయాలజీ, జెనెటిక్స్-ఎవల్యూషన్, ప్లాంట్ అండ్ యానియల్ ఫిజియాలజీ, జెనెటిక్స్, బయోటెక్నాలజీ, మైక్రోబ్స్ ఇన్ హ్యుమన్ వెల్ఫేర్ - ఎకోసిస్టమ్.

= ఇంటర్మీడియెట్ బోర్డ్ సిలబస్‌లో కుందేలు అవయవ
వ్యవస్థ వివరణ ఉంది. జిప్‌మర్‌లో దీనికి బదులు మానవ శరీర ధర్మ శాస్త్రం (హ్యూమన్ ఫిజియాలజీ)పై ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన అంశం.. కుందేలు శరీర ధర్మ శాస్త్రానికి సంబంధించిన అంశాల్లో 80 శాతం మేరకు మానవ శరీర ధర్మ శాస్త్రంతో సరిపోతాయి. 20 శాతం మేరకు హ్యూమన్ ఫిజియాలజీ అంశాలైన జీర్ణ, శ్వాస, రక్త ప్రసరణ, విసర్జక, అస్థిపంజర, ప్రత్యుత్పత్తి వ్యవస్థల్లోని విషయాలు, డిజార్డర్స్ అదనంగా నేర్చుకోవాలి. ఇందుకోసం సీబీఎస్‌ఈ పాఠ్యాంశాలను ఔపోసన పడితే సరిపోతుంది.

కెమిస్ట్రీ:
మిగతా సబ్జెక్టులతో పోల్చితే కెమిస్ట్రీ పరిధి చాలా విస్తృతం. కాబట్టి ఇందు కోసం అధిక సమయం వెచ్చించాలి. ఏ చాప్టర్‌పై పట్టు ఉంటే ఆ చాప్టర్‌పైనే దృష్టి పెట్టడం మంచిది.

కీలక చాప్టర్లు: ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీలలో ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ ఈక్విలిబ్రియం, సర్ఫేస్ కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్, ఆర్గనో-మెటాలిక్ కాంపౌండ్స్, యాసిడ్స్, బేసిస్, సొల్యూషన్స్, అటామిక్ స్ట్రక్చర్, పిరీయాడిక్ టేబుల్స్, బయో మాలిక్యుల్స్, డీ-బ్లాక్ ఎలిమెంట్స్, హైడ్రోజన్ పైరాక్సైడ్ ముఖ్యమైనవి.

ఫిజిక్స్:
జిప్‌మర్ ఔత్సాహికులు ప్రధానంగా దృష్టి సారించాల్సిన విభాగం ఫిజిక్స్. ఇందులో కాన్సెప్ట్స్ ఆధారంగా అడిగే ప్రశ్నలు ఎక్కువ. అంతేకాకుండా ఈ విభాగం నుంచి అడిగే ప్రశ్నలు థియరీ బేస్డ్, లాజికల్‌గా ఉంటాయి. కాబట్టి సంబంధిత ఫార్ములాలు, షార్ట్‌కట్ మెథడ్స్‌పై పట్టు సాధిస్తే ఈ విభాగంలో చక్కని స్కోర్ చేయవచ్చు.

కీలక చాప్టర్లు: మోడ్రన్ ఫిజిక్స్, మెకానిక్స్ (ఫ్రిక్షన్, డైనమిక్స్, వెలాసిటీ), ఎస్‌హెచ్‌ఎం, కరెంట్ ఎలక్ట్రిసిటీ, కెపాసిటర్స్, వెక్టర్స్, వేవ్ మోషన్- అప్లికేషన్స్, ఉష్ణం, ఎలక్ట్రోమాగ్నటిక్ ఇండక్షన్, రే ఆప్టిక్స్.

ఇంగ్లిష్:
ఈ విభాగంలో విద్యార్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటున్నాయి. ఈ క్రమంలో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, యాంటానిమ్స్, సినానిమ్స్, వర్డ్ యూసేజ్, ప్రిపోజిషన్స్ యూసేజ్, ఆర్టికల్స్ యూసేజ్ వంటి వాటిపై దృష్టి సారించడం మేలు.

టార్గెట్ 165:
గత ఫలితాలను విశ్లేషిస్తే.. కనీసం 170 మార్కులను సాధిస్తే.. ఓపెన్ కేటగిరీలో సీటు ఖరారు చేసుకోవచ్చు. రిజర్వ్‌డ్ విద్యార్థులు మాత్రం 165 మార్కులకు తగ్గకుండా సాధించేందుకు ప్రయత్నించాలి.

రిఫరెన్స్ బుక్స్:
= ఎన్‌సీఈఆర్‌టీ -ఐసీఎస్‌ఈ 11,12 తరగతి పుస్తకాలు
= చాంద్ పబ్లికేషన్స్-బయాలజీ వాల్యూమ్ 1, 2
= క్యాంప్‌బెల్ బయాలజీ- 9వ ఎడిషన్
= కెమిస్ట్రీ - ఓపీ టాండన్
= కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ - హెచ్‌సీ వర్మ
= ఇంగ్లిష్ కోసం ఏదో ఒక ప్రామాణిక పుస్తకం.

జిప్‌మర్-2013 సమాచారం:
అర్హత: 10+2/తత్సమానం (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ బయోటెక్నాలజీ).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 4, 2013.
పరీక్ష తేదీ: జూన్ 2, 2013.
వివరాలకు: http://jipmer.edu.in/

నాణ్యమైన చదువుకు కేరాఫ్.. గురుకులాలు - ఏపీఆర్‌జేసీ సెట్ - 2013


పదో తరగతి... ప్రతి విద్యార్థి జీవితంలో టర్నింగ్ పాయింట్... భవిష్యత్తులో ఏ బాటలో ప్రయాణించాలన్నా.. తొలి అడుగు పడేది ఇక్కడే... ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దే విధంగా.. నాణ్యమైన ఉచిత ఇంటర్మీడియెట్ విద్యను అందిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (ఏపీఆర్‌జేసీ)లు.. ఈ గురుకులాల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఏపీఆర్‌జేసీ-కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(సెట్)-2013 నోటిఫికేషన్ వెలువడింది. వివరాలు..

ఆఫర్ చేస్తున్న గ్రూపులు:
ఏపీఆర్‌జేసీ కాలేజీల్లో ఆఫర్ చేస్తున్న గ్రూపులు- ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, ఈఈటీ, సీజీడీఎం. వీటిల్లోంచి ప్రతి విద్యార్థి ఒక గ్రూప్‌నకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు కాలేజీలో ఇంటర్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సుల (ఈఈటీ, సీజీడీఎం)ను కూడా అందిస్తున్నారు.

అర్హత:
జీపీఏ 6తో పదో తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత (బీసీ/ఎస్సీ/ఎస్టీ/ మైనార్టీలకు జీపీఏ 5 ఉంటే సరిపోతుంది). 2013-ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులై ఉండాలి.

గ్రూప్ ఆధారంగా..సెట్:
ఏపీఆర్‌జేసీ సెట్‌ను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇంటర్మీడియెట్‌లో ఎంచుకోవాలనుకుంటున్న గ్రూప్ ఆధారంగా.. నిర్దేశిత సబ్జెక్ట్‌లలో పరీక్షకు హాజరు కావాలి. ఈ క్రమంలో ఉండే సబ్జెక్ట్‌లు..
గ్రూప్- సబ్జెక్ట్‌లు - మార్కులు
ఎంపీసీ -ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్‌సైన్స్ -150
బైపీసీ- ఇంగ్లిష్, బయోసైన్స్, ఫిజికల్‌సైన్స్ -150
సీఈసీ- ఇంగ్లిష్, సోషల్, మ్యాథ్స్- 150
ఎంఈసీ- ఇంగ్లిష్, సోషల్, మ్యాథ్స్ -150
ఈఈటీ- ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్‌సైన్స్- 150
సీజీడీఎం- ఇంగ్లిష్, బయోసైన్స్, ఫిజికల్‌సైన్స్ -150

ఈ పరీక్షలో పైన పేర్కొన్న విధంగా ప్రతి సబ్జెక్ట్ నుంచి 50 ప్రశ్నల చొప్పున వస్తాయి (వీటికి ఒక్కొక్క మార్కు చొప్పున ప్రతి సబ్జెక్ట్‌కు 50 మార్కులు). మొత్తం ప్రశ్నల సంఖ్య 150. వ్యవధి: రెండున్నర గంటలు (150 నిమిషాలు).

తొలి రోజు నుంచే:
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులను కేవలం ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌కే పరిమితం చేయకుండా.. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా మరెన్నో అనుబంధ కోర్సుల్లో శిక్షణ కూడా లభిస్తుంది. వాటిలో.. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఎంసెట్, జేఈఈ వంటి జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు తొలిరోజు నుంచే సిద్ధం చేస్తారు. అదేవిధంగా ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులను సీఏ, ఐసీడబ్ల్యుఏ వంటి కోర్సుల్లో రాణించే తరహాలో శిక్షణనిస్తారు. ఎంఈసీ, సీఈసీ విద్యార్థులకు సీపీటీ (ఇ్కఖీ) మోడల్ టెస్ట్‌లను కూడా నిర్వహిస్తారు. నిరంతర పర్యవేక్షణ కోసం కార్పొరేట్ తరహాలో ప్రతి అధ్యాపకుడి (లోకో పేరెంట్‌గా వ్యవహరిస్తారు)కీ 15-20 మంది విద్యార్థులను కేటాయిస్తారు. విద్యార్థి చదువు, అసైన్‌మెంట్లు, మూల్యాంకనం, స్టడీ మెటీరియల్ అందించడం ఇవన్నీ ఆ అధ్యాపకుడే చూసుకుంటారు. ఫిజికల్, స్పోర్ట్స్ యాక్టీవిటీస్‌కు తగినంత ప్రాధాన్యత ఉంటుంది. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాలను కూడా నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం:
దరఖాస్తులను అన్ని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్ కాలేజీలు, ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్-నాగార్జునసాగర్, సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్-కర్నూలు, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాలు (హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా), కన్వీనర్ ఏపీఆర్‌జేసీ-ఆర్‌డీసీ సెట్-ఆఫీస్, ఎంపిక చేసిన కస్తూర్బా బాలికల విద్యాలయాల నుంచి పొందొచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను పోస్టు ద్వారా నిర్దేశిత చిరునామాకు పంపాలి.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 17, 2013.
పరీక్ష తేదీ: మే 15, 2013
చిరునామా: కన్వీనర్, ఏపీఆర్‌జేసీ-ఆర్‌డీసీ-సెట్ 2013
ఏపీఆర్‌ఈఐఎస్ సొసైటీ, నాలుగో అంతస్తు,
గగన్ విహార్, నాంపల్లి, హైదరాబాద్-500 001.
వెబ్‌సైట్: www.apresidential.gov.in

ప్రిపరేషన్
పాలిసెట్
మ్యాథమెటిక్స్:

మ్యాథమెటిక్స్‌లో ఉండే 60 ప్రశ్నలలో.. త్రికోణమితి, వైశ్లేషిక రేఖాగణితం, రేఖా గణితం, సాంఖ్యక శాస్త్రం, మాత్రికల నుంచి దాదాపు 45-50 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిపై ఎక్కువ దృష్టి సారించాలి. అంతేకాకుండా ప్రశ్నలు అప్లికేషన్ పద్ధతిలో అడుగుతారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్ సాగించాలి.

రిఫరెన్స్: పదో తరగతి పుస్తకాలతోపాటు మార్కెట్‌లో లభించే స్టాండర్డ్ మెటీరియల్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. కోచింగ్ తీసుకోవడం కూడా లాభిస్తుంది.

ఫిజికల్ సైన్స్:
ఫిజిక్స్‌లో గతి శాస్త్రం, శుద్ద గతిక శాస్త్రం, విద్యుత్, అయస్కాంతత్వం, ఆధునిక భౌతిక శాస్త్రం, ఎలక్ట్రానిక్స్, కాంతి వంటి అంశాలపై అధికంగా దృష్టి సారించాలి. అంతేకాకుండా సంబంధిత సమస్యలను సాధించటం అలవర్చుకోవాలి. ఈ క్రమంలో భావనలు, ఫార్ములాలు, సూత్రాలపై పట్టు సాధించాలి. రసాయన శాస్త్రంలో పరమాణు నిర్మాణం, రసాయన బంధం, ఆవర్తన పట్టిక, కర్బన రసాయన శాస్త్రం, సంకేతాలు- ఫార్ములాలు- సమీకరణాలు, ద్రావణాలు వంటి అంశాలపై పట్టు సాధించాలి. రిఫరెన్స్: 8,9,10వ తరగతుల ఫిజికల్ సైన్స్ పాఠ్యపుస్తకాలు.
ఏపీఆర్‌జేసీ-సెట్

మ్యాథమెటిక్స్:
మ్యాథమెటిక్స్‌లో అన్ని చాప్టర్ల నుంచి దాదాపు నాలుగు లేదా ఐదు ప్రశ్నలు రావచ్చు. ఏకఘాత ప్రణాళిక, గణన నుంచి ఒకటి/రెండు ప్రశ్నలు అడగవచ్చు. ఇందులో ప్రశ్నలు కూడా అప్లికేషన్ పద్ధతిలోనే ఉంటాయి. 60 శాతం ప్రశ్నలు సులువుగా సాధించేవిగా ఉంటే 40 శాతం ప్రశ్నలను అడ్వాన్స్‌డ్ స్థాయిలో అడుగుతారు.

రిఫరెన్స్: పదో తరగతి పుస్తకాలతోపాటు మార్కెట్‌లో లభించే స్టాండర్డ్ మెటీరియల్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. కోచింగ్ తీసుకోవడం కూడా లాభిస్తుంది.

ఫిజికల్ సైన్‌‌స:
ఫిజిక్స్‌లో గతి శాస్త్రం, శుద్ద గతిక శాస్త్రం, విద్యుత్, అయస్కాంతత్వం, ఆధునిక భౌతిక శాస్త్రం, ఎలక్ట్రానిక్స్, కాంతి వంటి అంశాలపై దృష్టి సారించాలి. ప్రశ్నలు అప్లికేషన్ మెథ డ్‌లో ఉంటాయి. అంతేకాకుండా సంబంధిత సమస్యలను సాధించటం అలవర్చుకోవాలి. ఈ క్రమంలో భావనలు, ఫార్ములాలు, సూత్రాలపై పట్టు సాధించాలి. కెమిస్ట్రీలో పరమాణు నిర్మాణం, రసాయన బంధం, ఆవర్తన పట్టిక, కర్బన రసాయన శాస్త్రం, సంకేతాలు- ఫార్ములాలు- సమీకరణాలు, ద్రావణాలు వంటి అంశాలపై పట్టు సాధించాలి.
రిఫరెన్స్: 8-10వ తరగతుల ఫిజికల్ సైన్స్ పాఠ్యపుస్తకాలు.

సోషల్:
ఈ విభాగంలో 8,9,10 తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. ఈక్రమంలో ..
భూగోళ శాస్త్రం: భూమి, సౌర కుటుంబం, భూకంపాలు, అక్షాంశాలు-రేఖాంశాలు, ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాలు, దేశ/రాష్ట్ర భౌగోళిక అంశాలు.. శీతోష్ణస్థితి, ఖనిజాలు, అడవులు, నదులు, వ్యవసాయం, రవాణా, జనాభా వంటి అంశాలపై దృష్టి సారించాలి.

చరిత్ర: ప్రపంచ యుద్ధాలు, పూర్వ చారిత్రక యుగం, ప్రాచీన ఇనుప-మధ్యయుగ నాగరికతలు, ప్రపంచ విప్లవాలు (రష్యా, ఫ్రెంచ్ విప్లవం వంటివి), భారతదేశ చరిత్ర-వారసత్వ సంపద, స్వాతంత్రోద్యమం వంటి అంశాలు కీలకమైనవి.

పౌరశాస్త్రం: భారత రాజ్యాంగం-మౌలిక అంశాలు, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకిక రాజ్యం,కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఐక్యరాజ్యసమితి, రవాణా విద్య వంటి అంశాలపై అధికంగా దృష్టి సారించాలి.

ఆర్థిక శాస్త్రం: జాతీయాదాయం, ప్రణాళికలు-విజయాలు- వైఫల్యాలు, భారత ఆర్థిక వ్యవస్థ-సమస్యలు వంటి అంశాలపై కీలకమైనవి.
రిఫరెన్స్ బుక్స్: 8, 9, 10 తరగతుల సోషల్ పుస్తకాలు

బయాలజీ:
ఈ సబ్జెక్ట్‌లో పూర్తిగా 10వ తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో జీవన విధానాలు, నియంత్రణ-సమన్వయం, పోషణ వంటి అధ్యాయాలను సమగ్రంగా ప్రిపేర్ కావాలి. వీటి నుంచి అధిక శాతం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన ప్రత్యుత్పత్తి, హెచ్‌ఐవీ-ఎయిడ్స్ నుంచి ఒకటి రెండు మినహా ఎక్కువ ప్రశ్నలు రాకపోవచ్చు.
రిఫరెన్స్ బుక్స్: 10వ తరగతి బయాలజీ పుస్తకం.

ఇంగ్లిష్:
ఈ సబ్జెక్ట్‌కు ప్రత్యేక సిలబస్ అంటూ ఏదీ లేదు. ఇంగ్లిష్‌లో విద్యార్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరిశీలించే విధంగా గ్రామర్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో Synonyms, Antonyms, Articles, Prepositions, Correction of sentences, Active voice, passive voice, Direct– indirect speech, Phrasal Verbs, Tenses, Meanings, Vocabulary, Opposites, Other form of verbs తదితరాలపై దృష్టి పెట్టాలి. ప్రశ్నల క్లిష్టత పదో తరగతి స్థాయిలో ఉంటుంది కాబట్టి.. పదో తరగతి వరకు చదువుకున్న గ్రామర్ అంశాలను ఒక్క సారి పునశ్చరణ చేసుకుంటే సరిపోతుంది.

సాంకేతిక విద్యకు తొలి మెట్టు పాలిటెక్నిక్ - APRJC-CET / POLYCET -


పాలిసెట్-2013

పదో తరగతి తర్వాత ఎన్నో అవకాశాలు.. మరెన్నో ప్రత్యామ్నాయాలు.. మారుతున్న ప్రపంచంలో టెక్నికల్ విద్యకు ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో.. అందుకు మొదటి మెట్టుగా నిలిచేవి పాలిటెక్నిక్ కోర్సులు.. ఈ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ (పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)-
2013 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో.. సంబంధిత వివరాలు..

పరీక్షా విధానం:
పాలిసెట్‌లో మొత్తం 120 ప్రశ్నలు ఉంటా యి.వీటికి ఒక్కొక్క మార్కు చొప్పున మొత్తం మార్కులు 120. రెండు గంటల్లో (120 నిమిషాల్లో) సమాధానాలను గుర్తించాలి. మొత్తం మూడు సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. అవి.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సబ్జెక్ట్‌ల వారీగా ప్రశ్నల విభజనను పరిశీలిస్తే..

మ్యాథమెటిక్స్ -60 ప్రశ్నలు
ఫిజిక్స్ -30 ప్రశ్నలు
కెమిస్ట్రీ -30 ప్రశ్నలు

పాలిసెట్‌తో:
పాలిసెట్‌తో ర్యాంకుతో రాష్ట్రంలో దాదాపు 360 కి పైగా ఉన్న పాలిటెక్నిక్‌లలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, తదితర ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో డిప్లొమా కోర్సులలోకి అడుగుపెట్టొచ్చు. ఫలితంగా భవిష్యత్తులో ఇంజనీరింగ్ దిశగా అడుగులు వేయొచ్చు. మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ (బీటెక్)లో నేరుగా రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ స్కీం ద్వారా ప్రవేశించొచ్చు. ఉపాధి అవకాశాలు కూడా అధికమే. డిప్లొమా ఇంజనీరింగ్ ఉత్తీర్ణులను పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు ట్రైనీలుగా నియమించుకుంటున్నాయి.

దరఖాస్తు విధానం:
అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో రూ. 20 చెల్లించి పాలిసెట్ దరఖాస్తులను పొందొచ్చు. లేదా రూ. 330 చెల్లించి ఏపీ ఆన్‌లైన్ సెంటర్లు, హెల్ప్ లైన్ సెంటర్లు, ఈ సేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పాలిసెట్ -2013 సమాచారం:
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.
(2013లో హాజరైన వారు కూడా అర్హులే.)
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2013
పాలిసెట్ తేదీ: మే 2, 2013
వెబ్‌సైట్: https://sbtetap.gov.in

Tuesday, April 9, 2013

ఫారెన్ లాంగ్వేజెస్/ జర్నలిజం


ఫారెన్ లాంగ్వేజెస్
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. వివిధ దేశాలకు చెందిన బహుళజాతి కంపెనీలు మరో దేశంలో పాగా వేస్తున్నాయి. అంతేకాకుండా సంబంధిత దేశాల్లో కంపెనీలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించడం, పరస్పరం సంప్రదింపులు వంటి కార్యకలాపాలు చేస్తున్నాయి. దీంతో సంబంధిత విదేశీ భాష తెలిసి ఉండటం తప్పనిసరి అవుతోంది. ఈ కారణంగా విదేశీభాషలు నేర్చుకున్న వారికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అంతేకాకుండా నాన్ ఇంగ్లిష్ స్పీకింగ్ దేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతుండటం వంటి కారణాల వల్ల విదేశీ భాషలు నేర్చుకోవాలనుకునేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ప్రవేశం.. కోర్సులు:
దేశంలో విదేశీ భాషలు అందిస్తోన్న యూనివర్సిటీలు ఎన్నో ఉన్నాయి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ స్థాయి వరకు వివిధ స్థాయిల్లో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రొఫెషనల్ కోర్సుల మాదిరిగానే ఈ కోర్సుల్లో ప్రవేశానికి కావల్సిన అర్హత ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం. కొన్ని యూనివర్సిటీలు.. డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సులను అందిస్తుంటే మరికొన్ని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సులనందించడంలో హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ), జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (ఢిల్లీ) లకు మంచి పేరుంది. హైదరాబాద్‌లో ఉన్న రామకృష్ణ మఠం వంటి కొన్ని సంస్థలు కూడా విదేశీ భాషలను అందిస్తున్నాయి.

డిమాండ్ ఉన్న భాషలు:
గ్లోబలైజేషన్‌తో పారిశ్రామిక రంగంతోపాటు వివిధ రంగాల్లో వస్తున్న మార్పుల కారణంగా ఫారెన్ లాంగ్వేజెస్‌లో నిష్ణాతులైన అభ్యర్థుల అవసరం పెరుగుతుంది. ముఖ్యంగా నాన్-ఇంగ్లిష్ స్పీకింగ్ దేశాల భాష తెలిసిన వారికి మంచి అవకాశాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో.. ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, చైనీస్, స్పానిష్, జపనీస్ భాషలకు విపరీతమైన డిమాండ్, ఆదరణ ఉంటోంది.

బోధించే అంశాలు:
సాధారణంగా డిగ్రీ స్థాయిలో.. తొలి ఏడాదంతా ఇంగ్లిష్‌లోనే బోధన ఉంటుంది. తర్వాతి రెండేళ్లు సంబంధిత భాషా సాహిత్యం, ఫొనెటిక్స్, క్లాసికాలజీ, ట్రాన్స్‌లేషన్, దేశ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తారు. సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్‌డ్ డిప్లొమా తదితర కోర్సుల సిలబస్‌లో నిర్ణీత లాంగ్వేజ్, ఇంగ్లిష్‌లపైనే ఎక్కువ దృష్టి సారిస్తారు. ఆయా దేశాల పరిస్థితులపై అవగాహన కలిగేలా మరికొన్ని సబ్జెక్టులను బోధిస్తారు.

కెరీర్:
ఫారెన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు అవకాశాలు విస్తృతం. వీరికి సెక్రటేరియల్ స్థాయి నుంచి ఎగ్జిక్యూటివ్ వరకు వివిధ స్థాయిల్లో ఉపాధి అవకాశాలు ఉం టాయి. ట్రాన్స్‌లేటర్స్, ఇంటర్‌ప్రిటేటర్స్, డీకోడర్స్, టెక్నికల్ రైటర్స్, కంటెంట్ రైటర్స్, టూర్ ఆపరేటర్స్, ఫ్యాకల్టీ వంటి వివిధ స్థాయిల్లో స్థిరపడొచ్చు. వివిధ ఐటీ కంపెనీలు, మీడియా, బోధన, పరిశ్రమలు, కార్పొరేట్ హౌసెస్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, పబ్లిషింగ్ హౌస్‌లు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ రాయబార కార్యాలయాల్లో అవకాశాలు ఉంటాయి.

ట్రాన్స్‌లేటర్స్.. ఇంటర్‌ప్రిటేటర్స్:
విదేశీ భాష నిపుణుల్లో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ట్రాన్స్‌లేషన్(అనువాదం). భాషపై మంచి పట్టు, అర్థాన్ని మార్చకుండా చక్కగా అనువదించే నేర్పు ఉంటే ఎదగడానికి అవకాశాలెన్నో. మల్టీ నేషనల్ కంపెనీలు దేశంలో అడుగుపెట్టడంతో.. మన కంపెనీలు ఫారెన్ కంపెనీలతో జాయింట్ వెంచర్స్‌కు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ ప్రక్రియలో విదేశీ ప్రతినిధులతో సంప్రదింపులు, డాక్యుమెంటేషన్ వ్యవహారాల కోసం సంబంధిత విదేశీ భాషపై పట్టు ఉన్న వారు అవసరమవుతున్నారు. టెక్నికల్, సైంటిఫిక్, బిజినెస్, సాహిత్యం రంగాల్లో కూడా వీరు తప్పనిసరి కావడంతో సంబంధిత ఆర్గనైజేషన్స్ ఆకర్షణీయమైన ప్యాకేజీలతో ట్రాన్స్‌లేటర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. భారత్‌లో ఐటీ రంగ వృద్ధి జోరుగా ఉంది. ప్రపంచదేశాల నుంచి అనేక ప్రాజెక్టులు ఐటీ కంపెనీలకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు నివేదికల తర్జుమాకు పెద్ద ఎత్తున ట్రాన్స్‌లేటర్లు అవసరం ఉంది. ఒక వ్యక్తి మాటలను అనువాదం చేసి మరొక వ్యక్తికి అప్పటికప్పుడు వినిపించే ప్రక్రియే ఇంటర్‌ప్రిటేషన్. వీరి అవసరం సెమినార్లు, కాన్ఫరెన్స్‌లు, సభలలో ఉంటుంది.

టీచింగ్:
ఫారెన్ లాంగ్వేజెస్ అభ్యర్థులకు ఉపాధి వేదికగా నిలుస్తోన్న మరో రంగం టీచింగ్. ఈ వృత్తిలో ప్రవేశించిన వారికి బోధనతోపాటు సంబంధిత భాషలో మరింత నిష్ణాతులుగా తయారయ్యే అవకాశం దీని వల్ల లభిస్తుంది. ప్రస్తుతం దేశంలోని పలు కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు విదేశీ భాష కోర్సులను నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఆ దిశగా కూడా అవకాశాలు అనేకం.

ఆఫర్ చేస్తున్న సంస్థలు:
* ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-
హైదరాబాద్, లక్నో, షిల్లాంగ్ క్యాంపస్‌లు.
కోర్సులు: అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ రష్యన్
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు (అరబిక్/ఫ్రెంచ్/స్పానిష్/జర్మన్/రష్యన్) పీజీ డిప్లొమా ఇన్ అరబిక్
వెబ్‌సైట్: www.efluniversity.ac.in
* ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
వెబ్‌సైట్: www.osmania.ac.in
* జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ-ఢిల్లీ.
వెబ్‌సైట్: www.jnu.ac.in
* రామకృష్ణ మఠం-హైదరాబాద్
వెబ్‌సైట్: www.rkmath.org

గ్లోబలైజేషన్ నేపథ్యంలో..
ఇఫ్లూలో ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, జపనీస్, అరబిక్ లాంగ్వేజ్‌లలో బీఏ ఆనర్స్ కోర్సులు, పార్ట్‌టైం విధానంలో కొరియన్, చైనీస్, పర్షియన్ లాంగ్వేజ్‌లలో డిప్లొమా, అడ్వాన్స్‌డ్ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత గ్లోబలైజేషన్ నేపథ్యంలో దాదాపు అన్ని రంగాల్లోనూ జాయింట్ వెంచర్లు ఏర్పాటవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో స్పానిష్, ఫ్రెంచ్, సౌత్ కొరియన్, ఇటాలియన్ లాంగ్వేజ్‌లకు కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏ అకడెమిక్ డిగ్రీ ఉన్న అభ్యర్థులైనా ఏదో ఒక ఫారెన్ లాంగ్వేజ్‌ను నేర్చుకుంటే అదనపు ప్రయోజనం కలుగుతుంది. ఉదాహరణకు అమెరికాలో స్థిరపడాలనుకునే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి తాను చేరే సంస్థకు అవసరమైన లాంగ్వేజ్‌ను నేర్చుకుని అడుగుపెడితే త్వరగా రాణించగలడు. ఇక.. పూర్తి స్థాయిలో ఫారెన్ లాంగ్వేజ్ సర్టిఫికెట్ హోల్డర్లకు ప్రధానమైన ఉపాధి వేదికలు ట్రావెల్ అండ్ టూరిజం, టీచింగ్, ట్రాన్స్‌లేషన్. దేశంలో దాదాపు 40 యూనివర్సిటీలు ఫారెన్ లాంగ్వేజ్ కోర్సులను అందిస్తున్నాయి. వాటిలో అధ్యాపకులకు కనీసం రూ. 40 వేల జీతం లభిస్తోంది. టూరిజం విభాగంలో గైడ్లుగా పనిచేస్తూ రోజుకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేలు సంపాదించేవారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ ట్రాన్స్‌లేషన్ ఒక పరిశ్రమగా రూపొందుతోంది. దీని ద్వారా లభించే ఆదాయానికి ఆకాశమే హద్దు.

జర్నలిజం
భారతదేశంలో మీడియాలోకి విదేశీ పెట్టుబడులను కేంద్రం అనుమతిస్తుండడంతో ఈ రంగంలోకి అనేక సంస్థలు ప్రవేశిస్తున్నాయి. దీంతో మీడియా రంగంలో అవకాశాలు కోకొల్లలు అని చెప్పొచ్చు. మీడియా మాస్ కమ్యూనికేషన్ అంటే ఒక్క ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియానే కాదు... ఇంకా సినిమాలు, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, రేడియోలు, పరిశ్రమలు, సంస్థల్లో పబ్లిక్ రిలేషన్ విభాగం, ఎడిటింగ్, స్క్రిప్ట్‌రైటింగ్, మ్యాగజైన్స్, వెబ్ జర్నలిజం.. ఇలా అన్నీ వస్తాయి. వీటన్నింటిలో అత్యంత శక్తివంతమైన సాధనాలు పత్రికలు, టీవీలు. అందుకే గత ఐదేళ్లలో భారతదేశంలో టీవీ, పత్రికా రంగాలు గణనీయంగా వృద్ధి చెందాయి. దేశంలో జర్నలిజంలో శిక్షణ ఇచ్చే ప్రతిష్టాత్మక సంస్థలు ఎన్నో ఉన్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ పేరుతో రెండేళ్ల కోర్సు నిర్వహిస్తున్నాయి.

మీడియాలో పోటీ నెలకొనడంతో నిష్ణాతులైన అభ్యర్థుల కోసం దేశవ్యాప్తంగా అనేక పత్రికలు, ఛానళ్లు సొంతంగా జర్నలిజంలో శిక్షణ ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థలు నేరుగా విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. మన రాష్ట్రంలో ప్రధాన దినపత్రికలన్నింటికి సొంతంగా జర్నలిజం స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో నియామకాలకు ఖాళీలను బట్టి నోటిఫికేషన్లు విడుదల చేసి అభ్యర్థులను భర్తీ చేసుకుంటాయి. అదేవిధంగా జాతీయస్థాయి దినపత్రికలైన ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పత్రికలకు సొంతంగా జర్నలిజం స్కూళ్లు ఉన్నాయి.

మన రాష్ట్రంలో మీడియా కోర్సులు:
* ఆంధ్రా యూనివర్సిటీ - విశాఖపట్నం
కోర్సు: ఎంజేఎంసీ
అర్హత:
బీఏ/బీకాం/బీఎస్సీ/బీబీఎం/బీసీఏ ఉత్తీర్ణత.
వెబ్‌సైట్: http://andhrauniversity.info
* ఆచార్య నాగార్జున యూనివర్సిటీ - గుంటూరు
కోర్సు:
ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in
* కృష్ణా యూనివర్సిటీ - మచిలీపట్నం
కోర్సు:
ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వెబ్‌సైట్: www.krishnauniversity.ac.in
* } వేంకటేశ్వర యూనివర్సిటీ- తిరుపతి
కోర్సు: ఎంసీజే (కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం)
అర్హత: ఏదైనా డిగ్రీ
వెబ్‌సైట్: http://svuniversity.in
* ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
కోర్సు: బీసీజే (వ్యవధి: ఏడాది)
అర్హత: 40శాతం మార్కులతో బీఏ/బీఎస్సీ/బీకాం
కోర్సు: ఎంసీజే (వ్యవధి: ఏడాది)
అర్హత: 40 శాతం మార్కులతో బీసీజే ఉత్తీర్ణత.
కోర్సు: ఎంసీజే (వ్యవధి: రెండేళ్లు)
అర్హత: ఏదైనా డిగ్రీ
వెబ్‌సైట్: www.osmania.ac.in
* యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
కోర్సు: ఎంఏ కమ్యూనికేషన్ (కమ్యూనికేషన్ అండ్ మీడియా స్టడీస్, ప్రింట్ జర్నలిజం అండ్ న్యూ మీడియా, టెలివిజన్ అండ్ రేడియో)
అర్హత:
55 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ.
వెబ్‌సైట్: www.uohyd.ac.in
* ఏసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం - చెన్నై
కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్
స్పెషలైజేషన్స్:
{పింట్, న్యూ మీడియా, టీవీ అండ్ రేడియో
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వెబ్‌సైట్: www.asianmedia.org/index.asp
* టైమ్స్ స్కూల్ ఆఫ్ జర్నలిజం - న్యూఢిల్లీ
కోర్సు:పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం.
అర్హత: 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
వెబ్‌సైట్: www.tcms.in
* ఎక్స్‌ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా స్టడీస్
-న్యూఢిల్లీ
కోర్సు: ప్రోగ్రామ్ ఇన్ జర్నలిజం
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
వెబ్‌సైట్: www.exims.in

మీడియా... కెరీర్ స్కోప్:
మీడియా సంస్థల్లో జర్నలిస్టులు ముఖ్యంగా రిపోర్టర్, సబ్‌ఎడిటర్, ఆపై హోదాల్లో పనిచేస్తారు. అయితే జర్నలిస్టులు కావాలనుకునేవారిని రాష్ర్టంలో పలు పత్రికలు, టీవీ ఛానళ్లు సొంత జర్నలిజం స్కూలు ద్వారా ఎంపిక చేసుకుని వారికి ఏడాది శిక్షణతో జర్నలిస్టులుగా తయారుచేస్తున్నాయి. శిక్షణ దశలో వీరికి వేతనాలు రూ.5 వేల నుంచి రూ.2 వేలలోపు ఉంటాయి. శిక్షణ తర్వాత తమ సంస్థల్లో వీరిని ప్రొబేషనరీ జర్నలిస్టులుగా నియమిస్తాయి. ఆ తర్వాత పనితీరు ఆధారంగా సంస్థ ఉద్యోగిగా నియామకం ఖరారుచేస్తాయి. వీరికి మొదట రూ.10 వేల నుంచి సీనియారిటీ ఆధారంగా రూ.60 వేలకు వరకు లభిస్తాయి.

* రిపోర్టర్: వీరంతా క్షేత్రస్థాయిలో తిరుగుతారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయపార్టీలు, వివిధ స్వచ్ఛంధ సంస్థల చుట్టూ తిరుగుతూ వార్తలు సేకరిస్తారు. ప్రతిరోజూ సమాజంలో జరిగే అన్ని కీలక పరిణామాలను గమనిస్తూ వార్తలు, వ్యాఖ్యానాలు, కథనాలు, విశ్లేషణలు చేస్తారు. వీరు రాసే కథనాలు, వార్తలు మరుసటి రోజు టీవీలు, పత్రికల్లో వస్తాయి.

* సబ్‌ఎడిటర్, కాపీ ఎడిటర్: పత్రికల్లో పనిచేసే వారిని సబ్‌ఎడిటర్లని, టీవీల్లో పనిచేసే వాళ్లను కాపీఎడిటర్ అని పిలుస్తారు. రిపోర్టర్లు తీసుకొచ్చిన వార్తలను సబ్ ఎడిటర్లు పరిశీలించి సమగ్రంగా తీర్చిదిద్దుతారు. టీవీల్లో పనిచేసే కాపీఎడిటర్లు విలేకరి తీసుకువచ్చిన వార్తల చిత్రాలను క్లుప్తీకరించి వీక్షకులకు తక్షణం అర్థమయ్యేలా రూపొందిస్తారు.

* న్యూస్ రీడర్: నిత్యం టీవీల్లో వార్తలను చదివేవారిని న్యూస్‌రీడర్లు అంటారు. కనీస అర్హత డిగ్రీ ఉంటేనే ఆయా ఛానళ్లు తీసుకుంటాయి. మంచి మాటతీరు, ఆకర్షణీయరూపం ఉన్నవాళ్లకు ఆయా సంస్థలు శిక్షణ ఇచ్చి న్యూస్‌రీడర్ ఉద్యోగాలు కేటాయిస్తాయి.

డిగ్రీలోనూ గ్రూప్ సబ్జెక్ట్‌గా జర్నలిజం
జర్నలిజం అంటే సాధారణ బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ప్రవేశం కల్పించే బీసీజేనే గుర్తుకొస్తుంది. కానీ ఇటీవల కాలంలో జర్నలిజంకు పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోనే గ్రూప్ సబ్జెక్ట్‌ల్లో ఒక సబ్జెక్ట్‌గా జర్నలిజంను కొన్ని కళాశాలలు అందిస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కోఠి మహిళా డిగ్రీ కళాశాలలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ప్రైవేట్ రంగంలో మరికొన్ని కళాశాలలు కూడా జర్నలిజం గ్రూప్ సబ్జెక్ట్‌గా బ్యాచిలర్ డిగ్రీ కోర్సును అందిస్తున్నాయి. ఈ కోర్సును మరిన్ని కళాశాలల్లో రూపొందించాలనే ప్రణాళికలు ఉన్నప్పటికీ అధ్యాపకుల కొరత కారణంగా ఆచరణ సాధ్యం కావట్లేదు. ఇక.. ఈ కోర్సు పూర్తి చేసిన వారు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు అర్హులు. అదే విధంగా ప్రైవేట్ రంగంలో పలు సంస్థల్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లుగా, ఎగ్జిక్యూటివ్స్‌గా అవకాశాలు లభిస్తున్నాయి. ప్రారంభంలో రూ. 15 వేల జీతం అందుకునే వీలుంది. ఉన్నత విద్యా పరంగా యూజీసీ-నెట్ జేఆర్‌ఎఫ్‌కు అర్హత లభిస్తే.. ఈ రంగంలో పరిశోధన చేసేందుకుగాను అయిదేళ్లపాటు నెలకు రూ. 22 వేల స్టైఫండ్ కూడా లభిస్తుంది. ఇలా.. ఇప్పుడిప్పుడే వేగంగా జర్నలిజం వృద్ధి చెందుతోంది.

‘లా’


నేటి కార్పొరేట్ సంస్కృతి ఎన్నో వృత్తులకు సరికొత్త దిశా నిర్దేశం చేసింది.. అలాంటి కోర్సుల్లో ‘లా (న్యాయశాస్త్రం)’ ఒకటి.. గతంలో మాదిరిగా కేవలం కోర్టు వ్యవహారాలకు, టీచింగ్ రంగాలకు మాత్రమే పరిమితం కాకుండా.. విస్తృత దృక్పథంతో విశ్లేషిస్తే.. సంస్కరణల యుగంలో.. ఆర్థిక సరళీకరణలు.. విదేశీ పెట్టుబడుల రాక, తదనుగుణంగా చోటు చేసుకుంటున్న పరిమాణాల నేపథ్యంలో.. ‘లా’ అభ్యర్థులకు అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.. ఈ నేపథ్యంలో ‘లా’ కెరీర్‌పై సమగ్ర విశ్లేషణ..

‘లా’లో చేరాలంటే:
‘లా’ కోర్సులో చేరడానికి రెండు మార్గాలు ఉన్నాయి. అవి.. ఇంటర్మీడియెట్ పూర్తి చేశాక ఐదేళ్ల వ్యవధి గల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సులో అడుగు పెట్టడం. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాక మూడేళ్ల వ్యవధి గల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సులో ప్రవేశం పొందడం. ఈ క్రమంలో జాతీయ, రాష్ర్ట స్థాయిలో నిర్వహించే పలు రకాల ప్రవేశ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. వాటి వివరాలు..

లాసెట్:
రాష్ట్రంలో న్యాయ విద్యనభ్యసించడానికి వీలు కల్పించే పరీక్ష లాసెట్ (లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్). మూడేళ్ల బీఎల్/ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సుల్లో లాసెట్ ర్యాంక్ ద్వారా ప్రవేశం పొందొచ్చు.

ఐదేళ్ల లా కోర్సును ఆఫర్ చేస్తున్న కాలేజీలు: 30
సీట్ల సంఖ్య: 2700

అర్హత: ఐదేళ్ల లా కోర్సుకు 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (10+2 విధానంలో) (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 40 శాతం మార్కులు సరిపోతాయి). మూడేళ్ల లా కోర్సుకు 10+2+3 విధానంలో 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.

పరీక్ష విధానం: గంటన్నర వ్యవధిలో జరిగే పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఒక్కోదానికి ఒక్కో మార్కు. మూడు విభాగాలుండే ప్రశ్నపత్రంలో పార్ట్-ఎలో జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీపై 30 ప్రశ్నలు, పార్ట్-బిలో కరెంట్ అఫైర్స్‌పై 30 ప్రశ్నలు, పార్ట్-సిలో లా ఆప్టిట్యూడ్‌పై 60 ప్రశ్నలుంటాయి. ఐదేళ్ల లా ప్రశ్నపత్రం ఇంటర్మీడియెట్ స్థాయిలో, మూడేళ్ల లా ప్రశ్నపత్రం డిగ్రీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. (2013 సంవత్సరానికి లాసెట్ నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 26. పరీక్ష తేదీ: జూన్ 6).
వెబ్‌సైట్:www.aplawcet.org

క్లాట్: నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) నిర్వహిస్తారు. ఈ ర్యాంక్‌తో ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి లా కాలేజీల్లో ప్రవేశం పొందొచ్చు.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (రిజర్‌‌వడ్ కేటగిరీ విద్యార్థులకు 50 శాతం మార్కులు). చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా కోర్సు ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం జూలై ఒకటో తేదీనాటికి 20 ఏళ్లు (రిజర్‌‌వడ్ కేటగిరీ విద్యార్థులు 22 ఏళ్లు వయసు) మించకూడదు.

నోటిఫికేషన్: ప్రతి ఏటా డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో వెలువడుతుంది.
పరీక్షా విధానం: ఐదు విభాగాల్లో క్లాట్ నిర్వహిస్తారు . అవి..
ఇంగ్లిష్ (కాంప్రెహెన్షన్‌తో కలిపి- 40 మార్కులు)
జనరల్ నాలెడ్జ్/ కరెంట్ అఫైర్స్ (50మార్కులు)
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (20 మార్కులు)
లీగల్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు)
లాజికల్ రీజనింగ్ (40 మార్కులు). వీటికి 2 గంటల్లో సమాధానాలను గుర్తించాలి.

క్లాట్ ద్వారా ప్రవేశం కల్పించే ఇన్‌స్టిట్యూట్‌లు:
* నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ - బెంగళూరు.
* నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా - హైదరాబాద్.
* దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (ఏపీ యూనివర్సిటీ ఆఫ్ లా) - వైజాగ్.
* ద నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ - భోపాల్.
* ద వెస్ట్‌బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిడికల్ సెన్సైస్ - కోల్‌కతా
* నేషనల్ లా యూనివర్సిటీ - జోథ్‌పూర్.
* హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ - రాయ్‌పూర్.
* గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ
- గాంధీనగర్.
* డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ - లక్నో.
* ఆర్‌ఎన్‌ఎల్‌యు ఆఫ్ లా- పాటియాలా.
* చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ- పాట్నా.
* నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్‌‌డ్స లీగల్ స్టడీస్ - కొచి.
* నేషనల్ లా యూనివర్సిటీ - ఒడిశా.
* నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్‌‌చ ఇన్ లా - రాంచీ.
* నేషనల్ యూనివర్సిటీ అండ్ జ్యుడీషియల్
అకాడెమీ - అసోం.
వెబ్‌సైట్: www.clat.ac.in

ఏఐఎల్‌ఈటీ: నేషనల్ లా యూనివర్సిటీ- న్యూఢిల్లీ, ఏఐఎల్‌ఈటీ (ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్)ను నిర్వహిస్తుంది. ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఐదేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు-బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్)లో ప్రవేశం పొందొచ్చు.
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్/ తత్సమానం. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్షా విధానం: మొత్తం ఐదు విభాగాల్లో 150 ప్రశ్నలకు ఏఐఎల్‌ఈటీ ఉంటుంది. అవి.. ఇంగ్లిష్ (35 ప్రశ్నలు); జనరల్ నాలెడ్జ్/కరెంట్ అఫైర్స్ (35 ప్రశ్నలు); మ్యాథమెటిక్స్ (10 ప్రశ్నలు); లీగల్ ఆప్టిడ్యూడ్ (35 ప్రశ్నలు); లాజికల్ రీజనింగ్ (35 ప్రశ్నలు); వీటికి 90 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి.
వెబ్‌సైట్: http://nludelhi.ac.in/
(ఏఐఎల్‌ఈటీ నోటిఫికేషన్ వెలువడింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ ఏప్రిల్ 5, 2013).

ఎస్‌ఈటీ: సింబయాసిస్ లా స్కూల్‌లో బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష ఎస్‌ఈటీ (సింబయాసిస్ ఎంట్రెన్స్ టెస్ట్).
అర్హత: 50 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీలకు 45 శాతం) ఇంటర్మీడియెట్/తత్సమానం.
పరీక్షా విధానం: మొత్తం 150 మార్కులకు ఐదు విభాగాల్లో ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఎస్‌ఈటీ ఉంటుంది. అవి.. లాజికల్ రీజనింగ్, లీగల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, రీడింగ్ కాంప్రెహెన్షన్. ఇందులో ప్రతి విభాగం నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. వీటికి 120 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. దీని తర్వాత నిర్వహించే గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.set&test.org
(2013 సంవత్సరానికి ఎస్‌ఈటీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఏప్రిల్ 14)

ఎల్‌శాట్: లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఇండియా (ఎల్‌శాట్)ను అమెరికాకు చెందిన లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ (ఎల్‌ఎస్‌ఏసీ) నిర్వహిస్తుంది. లాశాట్ స్కోర్ ఆధారంగా దేశంలోని దాదాపు 40పైగా లా స్కూల్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో అడ్మిషన్ పొందొచ్చు. వీటిలో జిందాల్ గ్లోబల్ లా స్కూల్, అమిటీ లా స్కూల్, జోథ్‌పూర్ నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ వంటి ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి.

పరీక్షా విధానం: మొత్తం నాలుగు విభాగాల్లో ఆబ్జెక్టివ్ విధానంలో లాశాట్ ఉంటుంది. అవి.. అనలిటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్-1, లాజికల్ రీజనింగ్-2, రీడింగ్ కాంప్రెహెన్షన్. ప్రతి విభాగానికి 35 నిమిషాల చొప్పున 140 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి.

అర్హత ప్రమాణాలు ఇన్‌స్టిట్యూట్‌ను బట్టి మారుతు ఉంటాయి. కాబట్టి దరఖాస్తుకు ముందు ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల అర్హత ప్రమాణాలు తెలుసుకోవాలి.
వెబ్‌సైట్: http://www.pearsonvueindia.com


అవకాశాలు: ప్రపంచీకరణ, అవుట్ సోర్సింగ్ నేపథ్యంలో.. లా గ్రాడ్యుయేట్లకు వైట్ కాలర్ జాబ్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్, బ్యాంకులు, సాఫ్ట్‌వేర్ సంస్థల్లో లీగల్ అడ్వైజర్, డ్రాఫ్ట్ రైటర్‌గా అవకాశాలు లభిస్తున్నాయి. ఇటీవల కాలంలో పేటెంట్ హక్కుల పర్యవేక్షణ సంస్థలు, కాపీరైట్ సంస్థలు, పబ్లిషింగ్ సంస్థలు, ఎన్‌జీఓలు కూడా లా గ్రాడ్యుయేట్లకు పెద్దపీట వేస్తున్నాయి. తమ కార్యకలాపాల చట్టపరమైన అంశాల పర్యవేక్షణకు వీరిని నియమించుకుంటున్నాయి. లా గ్రాడ్యుయేట్లు పీజీ, పీహెచ్‌డీ కోర్సులు చేయడం ద్వారా అధ్యాపక వృత్తిలో చేరొచ్చు.

ప్రభుత్వ రంగంలో: లా గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వ రంగలోనూ అవకాశాలకు కొదవ లేదని చెప్పొచ్చు. ఇవి అధికశాతం న్యాయవాద వృత్తికి సంబంధించినవై ఉంటాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌‌స, ఏపీపీఓ, మెజిస్ట్రేట్స్, సబ్-మెజిస్ట్రేట్స్, జూనియర్ జడ్జి స్థాయిల్లో ఎంట్రీ లెవల్ అవకాశాలు లభిస్తాయి. పరిపాలన ట్రిబ్యునల్స్, లేబర్ కోర్టులు, అప్పిలేట్ అథారిటీల్లోనూ పలు హోదాల్లో అడుగుపెట్టొచ్చు. ఇందుకు ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఇలా ప్రభుత్వ సర్వీసులో అడుగుపెట్టిన వారు.. హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల స్థాయికి చేరుకోవచ్చు.

ఎల్‌పీఓ: ‘లా’ గ్రాడ్యుయేట్లకు కెరీర్ పరంగా సరికొత్త వేదిక లీగల్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ (ఎల్‌పీఓ). ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలకు చెందిన న్యాయ సేవా సంస్థలు భారీ సంఖ్యలో (దాదాపు 150 నుంచి 200 వరకు) మన దేశంలో శాఖలను ఏర్పాటు చేస్తూ.. న్యాయ నిపుణుల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఆయా దేశాల చట్టాలపై శిక్షణనిచ్చి పర్మినెంట్ హోదా కల్పిస్తున్నాయి. ప్రారంభంలో నెలకు కనీసం రూ. 25 వేల వేతనం ఆఫర్ చేస్తున్నాయి. ఎంట్రీ లెవల్లో అసోసియేట్‌గా అడుగుపెట్టి అనుభవం ఆధారంగా రెండు, మూడేళ్ల వ్యవధిలో సీనియర్ అసోసియేట్, ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ వంటి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. రానున్న ఐదేళ్లలో ఎల్‌పీఓ రంగంలో 30 నుంచి 40 వేల మంది అవసరం ఏర్పడుతుందని.. లా గ్రాడ్యుయేట్లకు ఎల్‌పీఓ ఓ బంగారు వేదికవుతుందని ఓ అంచనా.

విదేశాల్లోనూ అవకాశాలు: లా గ్రాడ్యుయేట్లకు విదేశీ అవకాశాలూ లభిస్తున్నాయి. మన చట్టాలతో సరిపోలే బ్రిటన్‌లో అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ లా యూనివర్సిటీలు నిర్వహించే క్యాంపస్ ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్స్‌లో విదేశీ సంస్థలు వస్తుండటమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. అంతేకాకుండా ఈ క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో ఎంపికైన వారిలో కనీసం 20 నుంచి 25 శాతం మంది విదేశీ సంస్థల్లో అడుగుపెడుతున్నారు.

వేతనాలు: ప్రభుత్వ రంగంలో స్థిరపడిన వారికి హోదాను బట్టి రూ. 20 వేల నుంచి రూ. లక్ష వరకు వేతనాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీలు, బహూళ జాతి, తదితర సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న వారికి ఏడాదికి రూ. 4 నుంచి 6 లక్షల వరకు పే ప్యాకేజ్‌లు అందుతున్నాయి. సొంతంగా న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు.

ఉన్నత విద్య: లా బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ఎల్‌ఎల్‌ఎం (మాస్టర్ ఆఫ్ లా) కోర్సు చేయవచ్చు. దీని తర్వాత పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో ఉండే స్పెషలేజేషన్లు-సివిల్/క్రిమినల్ లా, ఇంటర్నేషనల్ లా, లేబర్ లా, అడ్మినిస్ట్రేటివ్ లా, రియల్ ఎస్టేట్ లా, హ్యూమన్ రైట్స్ లా, కార్పొరేట్ లా, బిజినెస్ లా, తదితరాలు. క్లాట్, పీజీలాసెట్ (మన రాష్ట్ర స్థాయి పరీక్ష) వంటి పరీక్షల ద్వారా పీజీ కోర్సుల్లో అడుగు పెట్టొచ్చు.

ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్: న్యాయవాద వృత్తి చేపట్టాలకునే అభ్యర్థులు.. ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పొందాక ప్రాక్టీస్‌కు ఉపక్రమించాలంటే తప్పనిసరిగా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. న్యాయవాద వృత్తి చేపట్టేందుకు ఉన్న పరిజ్ఞానాన్ని, సబ్జెక్ట్ నాలెడ్‌‌జను పరీక్షించి.. సదరు అభ్యర్థి వృత్తికి సరిపోతాడా? లేదా? నిర్ణయించడమే ఈ పరీక్ష ఉద్దేశం. ఈ ఎగ్జామినేషన్ ప్రతి ఏటా రెండు సార్లు (జూన్/జూలై, నవంబర్/డిసెంబర్) జరుగుతుంది. మూడున్నర గంటల వ్యవధిలో రెండు కేటగిరీ (కేటగిరీ-1, కేటగిరీ-2)ల్లో పార్‌‌ట-1, పార్‌‌ట-2 పద్ధతిలో జరుగుతుంది.
వెబ్‌సైట్: www.barcouncilofindia.org

బహుముఖ అవకాశాల ‘లా’
ఇంటర్మీడియెట్ అర్హతతో అయిదేళ్ల లా కోర్సులో ప్రవేశించొచ్చు. దీనికోసం ప్రతి ఏటా నిర్వహించే లాసెట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో అయిదేళ్ల లా కోర్సును దాదాపు 30 కళాశాలలు అందిస్తున్నాయి. వీటిలో సుమారు 2700 అందుబాటులో ఉన్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ‘లా’ ప్రస్తుతం కెరీర్ పరంగా పలు అవకాశాలు కల్పిస్తోంది. ప్రభుత్వ పరంగా.. బ్యాచిలర్ డిగ్రీ పూర్తవగానే ఎలాంటి అనుభవం లేకున్నా నేరుగా జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. అదే విధంగా డిస్ట్రిక్ట్ జడ్జి పోస్టులకు నేరుగా రిక్రూట్‌మెంట్ పరీక్షలకు హాజరు కావచ్చు. హైకోర్టు, లేదా సుప్రీంకోర్టులలో పదేళ్ల ప్రాక్టీస్ అనుభవం ఉంటే ఆయా కోర్టుల్లో జడ్జి పోస్టులకు అర్హత లభిస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యం గా ప్రతి మండలంలో ఒక మండల జ్యుడిషియల్ ఆఫీసర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సమీప భవిష్యత్తులో లా గ్రాడ్యుయేట్లకు అవకాశాలు పుష్కలం. ఇక.. ప్రైవేట్ రంగంలో అవకాశాలకు కొదవే లేదు. కారణం విస్తరిస్తున్న పారిశ్రామికీకరణే. ఆయా సంస్థలు లా గ్రాడ్యుయేట్లను లీగల్ అడ్వైజర్లుగా నియమిస్తున్నాయి. క్లాట్ ద్వారా ప్రవేశం లభించే 14 నేషనల్ లా యూనివర్సిటీల్లో పూర్తి చేస్తే లక్షల్లో జీతంతో క్యాంపస్ సెలక్షన్స్ అందుకోవచ్చు. ఉన్నత విద్య కోణంలో పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేయొచ్చు. బోధనపై ఆసక్తి ఉన్నవారు పీహెచ్‌డీ చేయడం అభిలషణీయం.

సీఎస్/హోటల్ మేనేజ్‌మెంట్


సీఎస్
పద్దులు, చిట్టాల లెక్కల గణింపు అంటే ఆందోళన చెందే విద్యార్థులకు, కార్యనిర్వాహక నైపుణ్యాలు సొంతం చేస్తూ.. ‘వైట్ కాలర్’ జాబ్‌ను అందించే కోర్సు కంపెనీ సెక్రటరీషిప్ (సీఎస్). ఈ కోర్సును ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) నిర్వహిస్తుంది. ఒక కంపెనీలోని బోర్డ్ మీటింగ్‌ల నిర్వహణ, ఎజెండా, మినిట్స్ రూపకల్పన, వాటి ఆచరణపై పర్యవేక్షణ వంటి ఎన్నో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వర్తించేది కంపెనీ సెక్రటరీలే. అయితే ఆ స్థాయికి చేరుకోవాలంటే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో మెంబర్‌షిప్ సొంతం చేసుకోవాలి.

అర్హత: ఇంటర్మీడియెట్/గ్రాడ్యుయేషన్.
కంపెనీ సెక్రటరీషిప్ కోర్సు మొత్తం మూడు దశలుగా ఉంటుంది. అవి..
ఫౌండేషన్ ప్రోగ్రాం
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం
{పొఫెషనల్ ప్రోగ్రాం

ఇంటర్‌తోనే ‘ఫౌండేషన్’:
ఐసీఎస్‌ఐ.. సీఎస్ కోర్సులోని తొలిదశ ఫౌండేషన్ ప్రోగ్రాం. దీనికి అర్హత ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో పేరు నమోదు చేసుకోవాలి.. ఈ ప్రోగ్రాం కోసం పరీక్ష ప్రతి ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్‌లలో జరుగుతుంది. ఏడాది మొత్తం పేరు నమోదు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. పేరు నమోదు చేసుకున్న తేదీకి, తొలిసారి పరీక్షకు హాజరయ్యే తేదీకి మధ్య కనీసం 8 నెలల వ్యవధి తప్పనిసరి. అంటే.. డిసెంబర్‌లో జరిగే పరీక్షకు మార్చి 31 లోపు, జూన్‌లో జరిగే పరీక్షకు అంతకుముందు సంవత్సరం సెప్టెంబర్ 30 లోపు ఇన్‌స్టిట్యూట్‌లో పేరు నమోదు చేసుకోవాలి. ఈ ప్రోగ్రాంలో మొత్తం నాలుగు పేపర్లలో పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.

రెండో దశ.. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం:
ఫౌండేషన్ ప్రోగ్రాంలోని అన్ని పేపర్లలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కంపెనీ సెక్రటరీషిప్ ప్రోగ్రాంలోని రెండో దశ ‘ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం’కు తమ పేరు నమోదు చేసుకోవాలి. బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులు ఫౌండేషన్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా నేరుగా ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం రెండు మాడ్యూల్స్‌లో ఉంటుంది. ఒక్కో మాడ్యూల్‌లో మూడు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షలు ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్‌లలో జరుగుతాయి. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో పేరు నమోదుకు తొలిసారి పరీక్షకు హాజరయ్యే తేదీకి మధ్య కనీసం తొమ్మిది నెలల వ్యవధి తప్పనిసరి. అభ్యర్థులు తమ సంసిద్ధత, కనీస వ్యవధి ప్రామాణాలను అనుసరించి పేరు నమోదు చేసుకోవాలి. ఇందుకోసం ఏటా నాలుగు కటాఫ్ డేట్లను (ఫిబ్రవరి 28, మే 31, ఆగస్టు 31, నవంబర్ 30) ఇన్‌స్టిట్యూట్ నిర్ణయించింది. ఈ పరీక్షలను కూడా ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్‌లలో నిర్వహిస్తారు.

ప్రొఫెషనల్ ప్రోగ్రాం టు సెటిల్ ఇన్ ప్రొఫెషన్:
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. సీఎస్ ప్రొఫెషన్‌లో సెటిలయ్యేందుకు చివరి దశ ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో పేరు నమోదు చేసుకోవాలి. ప్రొఫెషనల్ ప్రోగ్రాంను మొత్తం నాలుగు మాడ్యూల్స్‌గా విభజించారు. ఒక్కో మాడ్యూల్‌లో రెండు పేపర్లు ఉంటాయి.

15 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్:
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించి ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో పేరు నమోదు చేసుకున్న అభ్యర్థులు ఫ్రొఫెషనల్ ప్రోగ్రాం పరీక్ష రాసే సమయానికి తప్పనిసరిగా 15 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలి. ఇన్‌స్టిట్యూట్ గుర్తింపు పొందిన సంస్థలు లేదా ఇప్పటికే ఇన్‌స్టిట్యూట్‌లో ఫెలో మెంబర్‌గా ఉన్న ప్రాక్టీసింగ్ సెక్రటరీల పర్యవేక్షణలో ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకోవచ్చు. ఈ ట్రైనింగ్‌తోపాటు ప్రొఫెషనల్ ప్రోగ్రాంలోని నాలుగు మాడ్యూళ్లలో ఉత్తీర్ణత సాధిస్తేనే ఇన్‌స్టిట్యూట్ నుంచి అసోసియేట్ మెంబర్‌షిప్ లభిస్తుంది. సదరు విద్యార్థి కంపెనీ సెక్రటరీ అనే హోదాలో ఉద్యోగం పొందడానికి మార్గం ఏర్పడుతుంది. అసోసియేట్ మెంబర్‌షిప్ హోదాలో ఐదేళ్ల అనుభవం గడించాక ఫెలో మెంబర్‌షిప్ లభిస్తుంది.

కావల్సిన నైపుణ్యాలు:
కంపెనీ సెక్రటరీ వృత్తిలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ప్రాథమికంగా కావాల్సిన లక్షణం సునిశిత, తార్కిక పరిశీలన, నిరంతర అభ్యసన నైపుణ్యం. కంపెనీ సెక్రటరీ అంటే సదరు సంస్థకు సంబంధించి షేర్ హోల్డింగ్స్ మొదలు లీగల్ ఇష్యూస్ వరకు అన్నిటిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ విషయాల్లో నిరంతరం సవరణలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎప్పకప్పుడు కొత్త విషయాలపై అవగాహన సొంతం చేసుకుంటూ ముందుకు వేయాలి.

అవకాశాలు:
కంపెనీ సెక్రటరీషిప్ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశాలు పుష్కలం అనడంలో ఎలాంటి సందేహం లేదు. 1956 కంపెనీల చట్టం ప్రకారం రూ. 5 కోట్ల అధీకృత మూలధనం ఉన్న ప్రతి సంస్థ ఒక పూర్తి స్థాయి కంపెనీ సెక్రటరీని నియమించుకోవాలి. దేశవ్యాప్తంగా సీఎస్‌ల కొరత తీవ్రంగా ఉంది. రానున్న రోజుల్లో ప్రతి కంపెనీకి కంపెనీ సెక్రటరీ తప్పనిసరి. కార్పొరేట్ గవర్నెస్ అండ్ సెక్రటరీయల్ సర్వీసెస్, కార్పొరేట్ లా స్ అడ్వైజరీ అండ్ రిప్రెజెం టేషన్ సర్వీసెస్, ఫైనాన్షియల్ మార్కెట్ సర్వీసెస్, మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంబంధిత కంపెనీల్లో అవకాశాలు విస్తృతం. పారిశ్రామిక, వ్యాపార రంగాలు వృద్ధి చెందే కొద్దీ సీఎస్‌ల కెరీర్‌కు ఢోకా ఉండదు. ఓ అంచనా ప్రకారం- రానున్న ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 75,000 మంది కొత్త కంపెనీ సెక్రటరీల అవసరం ఉంటుంది. ఇవే కాకుండా ఐసీఎస్‌ఐకు దేశవ్యాప్తంగా ఉన్న 76 చాప్టర్లలో పేర్లు నమోదు చేసుకుని ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లను కూడా నిర్వహిస్తున్నారు. స్వయం ఉపాధి దిశగా ఆలోచించే వారు సొంతంగా ప్రాక్టీస్ కూడా చేయవచ్చు.

వేతనం:
ఒక ఫ్రెషర్‌కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వార్షిక వేతన ప్యాకేజ్ లభిస్తుంది. ఈ రంగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉంటే రూ. 25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వేతనం అందుకోవచ్చు.
వెబ్‌సైట్: www.icsi.edu

సీఎస్‌కూ పెరిగిన ప్రాధాన్యం
కొత్త కంపెనీల చట్టం ప్రకారం కంపెనీ సెక్రటరీ కోర్సుకు కూడా ప్రాధాన్యం పెరిగింది. రూ. 5 కోట్ల పెయిడ్-అప్ క్యాపిటల్ ఉన్న ప్రతి సంస్థ పూర్తి స్థాయి కంపెనీ సెక్రటరీని నియమించుకోవాలనే నిబంధన విధించింది. అంతేకాక ఒక సంస్థ ప్రారంభ సమయంలో సమర్పించాల్సిన డాక్యుమెంట్లకు కంపెనీ సెక్రటరీల ధ్రువీకరణ తప్పనిసరి. మరోవైపు కొత్త కంపెనీల చట్టం ప్రకారం ఆయా సంస్థల విలీన ప్రక్రియ, ఖాయి లా పరిశ్రమల పునరుద్ధరణ ప్రక్రియ, దివాల పిటిషన్ వ్యవహారాల్లోనూ కంపెనీ సెక్రటరీల ధ్రువీకరణ ఆవశ్యకం చేసింది. దీంతో సమీప భవిష్యత్తులో కంపెనీ సెక్రటరీలు పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో కీలక వ్యక్తులుగా మారనున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారమే దేశంలో 28 లక్షల సంస్థలు ఉంటే అర్హులైన కంపెనీ సెక్రటరీల సంఖ్య 40 వేల లోపే. అంటే ఈ గణాంకాలే డిమాండ్-సప్లయ్ వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇంత ప్రాముఖ్యం ఉన్న మూడు దశల కోర్సు (ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్) లో ఫౌండేషన్ కోర్సులో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో అడుగుపెట్టొచ్చు. మూడు దశల కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు సగటున రూ. 4 లక్షల వేతనం లభిస్తుంది. తొలుత అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీగా కెరీర్ ప్రారంభించొచ్చు. ఉద్యోగంలో కొంత అనుభవం గడించాక సొంతంగా ప్రాక్టీస్ కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది.

హోటల్ మేనేజ్‌మెంట్
శరవేగంగా విస్తరిస్తున్న ఆతిథ్య రంగం.. వేలాది అవకాశాల తరంగంగా వూరుతోంది.. పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో..అదే స్థారుులో.. హాస్పిటాలిటీ రంగంలో వూనవ వనరులకు విపరీతమైన డివూండ్ ఏర్పడుతోంది.. దాంతో హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్ ను కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్య కూడా అధికమవుతుంది. కోర్సు పూర్తవగానే ఉద్యోగంలో చేరాలనుకునేవారికి.. కష్టపడే ఉత్సాహవంతులకు ఈ రంగంలో ఉపాధి అవకాశాలకు కొదవలేదు. టూరిజం, హోటళ్లు, రిసార్టులు, ఫైవ్‌స్టార్ హోటళ్ల విస్తరణతో ఈ డిమాండ్ మరింతగా పెరుగుతోంది.

ప్రవేశం: హోటల్ మేనేజ్‌మెంట్ ప్రవేశానికి సంబంధిత అంశంలో డిగ్రీ లేదా డిప్లొమా ఉంటే చాలు. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని పలు ఇన్‌స్టిట్యూట్‌లు హోటల్ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికెట్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు పలు రకాల కోర్సులను అందిస్తున్నాయి. కోర్సులను బట్టి అర్హతలు ఉంటాయి. సర్టిఫికెట్/డిప్లొమా కోర్సులకు పదో తరగతి, బ్యాచిలర్ కోర్సులకు ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారు అర్హులు. అడ్మిషన్ సంబంధిత సమాచారాన్ని ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల వెబ్‌సైట్స్ లేదా నేరుగా పొందొచ్చు.

చక్కటి అవకాశం జేఈఈ: హోటల్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేయాలనుకునే వారికి చక్కని అవకాశం.. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ)- జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామి నేషన్ (జేఈఈ). ఈ పరీక్ష ద్వారా ఎన్‌సీహెచ్‌ఎంసీటీ ఇన్‌స్టిట్యూట్‌లలో బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. వివరాలు..

కాలేజీల సంఖ్య: 50.
సీట్ల సంఖ్య: 7500

ఈ పరీక్షకు అర్హత: ఇంటర్మీడియెట్ లేదా 10+2. ప్రతి ఏటా డిసెంబర్‌లో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఇందులో న్యూవురికల్ ఎబిలిటీ అండ్ సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ (30 మార్కులు), రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ (30 మార్కులు), జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ (30 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (60 మార్కులు), ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ (50 మార్కులు) విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్ కూడా జేఈఈ ఆధారంగానే బీఎస్సీ కోర్సులో అడ్మిషన్ కల్పిస్తుంది (2013 సంవత్సరానికి జేఈఈ నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 15. పరీక్ష తేదీ: ఏప్రిల్ 27).
వివరాలకు: www.nchmct.org

అవకాశాలు: హోటల్ మేనేజ్‌మెంట్‌లో ప్రధానంగా నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్(ఎఫ్ అడ్ బీ), ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్. వీటిల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని కెరీర్‌లో స్థిరపడొచ్చు. ఈక్రమంలో హోటల్/హాస్పిటాలిటీ సంబంధిత పరిశ్రమలో మేనేజ్‌మెంట్ ట్రైనీ, కిచెన్ మేనేజ్‌మెంట్/హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ సేల్స్, గెస్ట్/కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ వంటి హోదాల్లో స్థిర పడొచ్చు. ఆన్ బోర్డ్ ఫ్లైట్ సర్వీసెస్‌లో, ఇండియన్ నేవీ హాస్పిటాలిటీ సర్వీస్, క్రూరుుజర్లు, మల్టీనేషనల్ హాస్పిటాలిటీస్ సర్వీసెస్‌లోను అవకాశాలుంటాయి. ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ/ఎగ్జిక్యూటివ్‌గా స్థిర పడొచ్చు. బ్యాంకులు, హాస్పిటల్స్, టెలికాం, బీపీవో కంపెనీలు కూడా హోటల్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లను పెద్దఎత్తున నియమించుకుంటున్నాయి. టీచింగ్‌పై ఆసక్తి ఉంటే హోటల్ మేనేజ్‌మెంట్/ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్యాకల్టీగా కెరీర్ ప్రారంభించవచ్చు. ప్రభుత్వ పరంగా కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల్లో కూడా అవకాశాలుంటారుు. సొంతంగా సంస్థలను స్థాపించడం ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా స్థిర పడొచ్చు.

విదేశాల్లో:
హోటల్‌మేనేజ్‌మెంట్ అభ్యర్థులకు విదేశాల్లోనూ అవకాశాలు అనేకం. ముఖ్యంగా నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే యూరప్ దేశాలైన ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్‌తోపాటు కెనడా, అమెరికా వీరికి చక్కని వేదికలుగా నిలుస్తున్నాయి. క్రూయిజ్‌షిప్‌లు, ఎయిర్‌లైన్ సంస్థ లు, టూరిజం రిసార్ట్‌లలో కూడా అవకాశాలు బోలెడు. స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్ వంటి ఫారెన్ భాషల్లో ప్రావీణ్యం.. కెరీర్ ఉన్నతికి దోహదం చేస్తుంది.

స్కిల్స్:
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్
మేనేజీరియల్ నైపుణ్యాలు
సాఫ్ట్ స్కిల్స్
సేల్స్ అండ్ మార్కెటింగ్‌కు స్కిల్స్

వేతనాలు:
హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. కెరీర్ ప్రారంభంలోనే ఐదంకెల జీతాన్ని సొంతం చేసుకోవచ్చు. మేనేజ్‌మెంట్ ట్రైనీగా అరుుతే రూ. 15 నుంచి రూ. 18 వేలు, ట్రైనీ సూపర్‌వైజర్‌కైతే రూ. 10 నుంచి రూ. 14 వేలు, మిగతా విభాగాల వారికి రూ. 10 వేలు వర కూ వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా రూ. 30,000 నుంచి రూ. లక్ష వరకు సంపాదించవచ్చు. ఐటీ ఉద్యోగులతో సమానమైన సౌకర్యాలను హాస్పిటాలిటీ ఉద్యోగులకు సదరు కంపెనీలు కల్పిస్తున్నాయి.

ఉన్నత విద్య:
హోటల్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ఆసక్తిని బట్టి చదవడానికి పలు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ దిశగా ప్రస్తుత తరుణంలో చక్కటి కోర్సు.. ఎంబీఏ (హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్) /ఎంఎస్సీ (హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్). తద్వారా ఈ రంగంలో ఉన్నత స్థానంలో స్థిర పడొచ్చు. ఎంఎస్సీ (కలినరీ ఆర్ట్స్), పలు స్పెషలైజేషన్స్‌తో పీజీ డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో నిర్వహించే సివిల్ సర్వీసెస్, గ్రూప్-1,2, బ్యాంక్ పరీక్షలు, అన్ని రకాల ఉద్యోగ నియామకాల పరీక్షలకు కూడా వీరు హాజరు కావచ్చు.

కెరీర్‌కు ఢోకా లేని హోటల్ మేనేజ్‌మెంట్
కేవలం ఇంటర్మీడియెట్ అర్హతతో లక్షల జీతం అందించే కోర్సు హోటల్ మేనేజ్‌మెంట్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సు. ఈ క్రమంలో ప్రతి ఏటా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 50 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తుంది. ఇగ్నోతో ఒప్పందం ద్వారా బీఎస్సీ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ సర్టిఫికెట్ అందిస్తుంది. ఇక ప్రైవేటు రంగంలోనూ పలు ఇన్‌స్టిట్యూట్‌లు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్నాయి. మన రాష్ట్రంలో ఇలా దాదాపు పది కాలేజీల్లో 2 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగాల పరంగా ఎలాంటి ఢోకా లేని కోర్సు హోటల్ మేనేజ్‌మెంట్. హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో ఒక్కో గ్రాడ్యుయేట్‌కు నాలుగు కంపెనీల్లో ఆఫర్ వచ్చింది. దీన్ని బట్టి డిమాండ్-సప్లయ్ గ్యాప్‌ను అర్థం చేసుకోవచ్చు. ప్రారంభంలో సగటున రూ. 15 వేల జీతం లభిస్తోంది. అనుభవంతో విదేశాల్లో రెండు లక్షల వేతనం అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉన్నత విద్యపరంగానూ పలు అవకాశాలున్నాయి. ముఖ్యం గా ఎంబీఏలో హాస్పిటాలిటీ, హాస్పిటల్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌లు, ఎంఎస్సీ కలినరీ ఆర్ట్స్, హోటల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులతోపాటు పలు పీజీ డిప్లొమా కోర్సులు లభిస్తున్నాయి.

సీఏ/ సీఎంఏ


సీఏ
చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సును ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నిర్వహిస్తుంది.
* అర్హత: ఇంటర్మీడియెట్.
సీఏ కోర్సు మూడు దశలుగా ఉంటుంది. అవి..
* కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సీపీటీ)
* ఐపీసీసీ
* ఫైనల్ కోర్స్

‘పది’తో సీపీటీకి:
సీఏ కోర్సులో చేరడానికి తొలి దశ కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్. ఇది పూర్తి స్థాయి కోర్సుకి ఒక అర్హత పరీక్ష వంటిదని చెప్పొచ్చు. సీఏ భవిష్యత్తుగా ఎంచుకోవాలనుకునే ప్రతి విద్యార్థి ఇందులో ఉత్తీర్ణత సాధించాల్సిందే. దీనికోసం పదో తరగతి పూర్తి కాగానే ఐసీఏఐలో పేరు నమోదు చేసుకోవాలి. ఇలా పేరు నమోదు చేసుకున్న విద్యార్థులు తమ ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయ్యాక మాత్రమే సీపీటీకి హాజరయ్యేందుకు అనుమతి లభిస్తుంది. ఇందుకోసం ఇంటర్మీడియెట్ పరీక్షలు రాశాక దరఖాస్తు చేసుకోవాలి. సీపీటీ ప్రతి ఏటా రెండుసార్లు (జూన్/డిసెంబర్) జరుగుతుంది. వీటికి హాజరుకావాలంటే దరఖాస్తు చేసుకునే సమయానికి, సీపీటీకి మధ్య రెండు నెలల వ్యవధి తప్పనిసరి. అంటే జూన్‌లో సీపీటీకి హాజరవ్వాలంటే ఏప్రిల్ ఒకటో తేదీలోపు; డిసెంబర్‌లో సీపీటీకి హాజరవ్వాలంటే అక్టోబర్ ఒకటి లోపు దరఖాస్తు చేసుకోవాలి.

సిలబస్:
సీపీటీ పరీక్ష 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో రెండు సెషన్‌లు.. సెషన్-1, సెషన్-2గా ఉంటుంది. సెషన్-1లో సెక్షన్-ఎ (ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ - 60 మార్కులు), సెక్షన్-బి (మర్కెంటైల్‌లా- 40 మార్కులు); సెషన్‌లో-2లో సెక్షన్-సి (జనరల్ ఎకనామిక్స్- 50 మార్కులు), సెక్షన్-డి (క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50 మార్కులు) ఉంటాయి. పరీక్ష వ్యవధి: ఒక్కో సెషన్‌కు రెండు గంటలు.

ఐపీసీసీ:
కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్(సీపీటీ)లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. సీఏ కోర్సు క్రమంలో ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కోర్స్ (ఐపీసీసీ) కోసం పేరు నమోదు చేసుకోవాలి. ఈ కోర్సు రెండు గ్రూపులు.. గ్రూప్-1, గ్రూప్-2గా ఉంటుంది. అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఏదైనా ఒక గ్రూప్ లేదా ఒకేసారి రెండు గ్రూప్‌లకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇలా పేరు నమోదు చేసుకున్న తర్వాత తొమ్మిది నెలల పాటు ఉండే స్టడీ కోర్సును పూర్తి చేయాలి. దీంతోపాటు 35 గంటల వ్యవధిలో సాగే ఓరియెంటేషన్ కోర్సు, 100 గంటలపాటు సాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సును పూర్తి చేయాలి. వీటిని పూర్తి చేసిన వారికి మాత్రమే ఐపీసీసీలోని గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతి లభిస్తుంది.

ఫైనల్.. ముందే ఆర్టికల్ ట్రైనింగ్:
ఐపీసీసీలోని రెండు గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సీఏ ఫైనల్ కోర్సులోకి అనుమతి లభిస్తుంది. అయితే దీనికంటే ముందుగా ఐపీసీసీలో ఉత్తీర్ణత సాధించిన వెంటనే ఆర్టికల్‌షిప్ (ఆర్టికల్డ్ అసిస్టెంట్‌గా) కోసం పేరు నమోదు చేసుకోవాలి. ఐపీసీసీ మొదటి గ్రూప్ ఉత్తీర్ణత పొందిన వెంటనే కూడా ఆర్టికల్‌షిప్‌లో చేరొచ్చు. ఐసీఏఐ గుర్తింపు ఉన్న సీఏ దగ్గర ఈ ఆర్టికల్‌షిప్ చేయాలి. వ్యవధి మూడేళ్లు. ఆర్టికల్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకున్న తర్వాత దాని ఆధారంగా సీఏ ఫైనల్ కోర్సు కోసం పేరు నమోదు చేసుకోవాలి. సీఏ ఫైనల్ కోర్సు చదువుతూ, ఆర్టికల్‌షిప్ చివరి 12 నెలల సమయంలో.. 15 రోజుల జనరల్ మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల ఆర్టికల్‌షిప్ పూర్తి చేసిన తర్వాత లేదా ఆర్టికల్‌షిప్ చివరి ఆరు నెలల సమయంలో ఉన్నప్పుడు ఫైనల్ కోర్సు పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే పూర్తిస్థాయి సీఏ గుర్తింపు లభించినట్లే.

సీఏ ఫైనల్:
పూర్తి స్థాయి చార్టర్డ్ అకౌంటెంట్‌గా తీర్చిదిద్దే ఫైనల్ కోర్సు కూడా రెండు గ్రూపులుగా ఉంటుంది. ప్రతి గ్రూపులో నాలుగు పేపర్లు ఉంటాయి.
కెరీర్ ఆప్షన్స్:
సీఏ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులను రిక్రూట్ చేసుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతుంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. పలు కార్పొరేట్ సంస్థలు ఐసీఏఐ బ్రాంచ్‌లలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. సీఏ కోర్సు పూర్తి చేసిన వారికి సేవా రంగం, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, సాఫ్ట్‌వేర్, మైనింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, వివిధ పరిశ్రమలు కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. అంతేకాకుండా టైర్-3 పట్టణాల్లోని రిటైల్ షాపులు, జ్యువెలరీ, వస్త్ర, తదితర వాణిజ్య సంస్థల ఆదాయవ్యయాలు, లాభనష్టాలు.. ఇలా ప్రతి దశలోనూ సీఏలతో సంస్థాగత ఆడిటింగ్ నిర్వహించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో సీఏల అవసరం భారీ స్థాయిలో ఉంటోంది.

వేతనాలు:
సీఏ ఉత్తీర్ణులకు ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో ఫ్రెషర్‌కు నెలకు రూ. 35,000 నుంచి రూ.50,000వరకు వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవం ఆధారంగా దాదాపు రూ. 10 లక్షల వరకు వార్షిక వేతనం అందుకోవచ్చు.

డిగ్రీతో నేరుగా:
తాజా మార్పుల ప్రకారం- డిగ్రీ లేదా పీజీలో 55 శాతం మార్కులు సాధించిన కామర్స్ గ్రాడ్యుయేట్లు లేదా డిగ్రీ/పీజీలో 60 శాతం మార్కులు ఉన్న నాన్ కామర్స్ గ్రాడ్యుయేట్లు లేదా ఐసీడబ్ల్యూఏ లేదా సీఎస్‌లో ఇంటర్ పూర్తిచేసిన అభ్యర్థులు సీపీటీ నుంచి మినహాయింపనిచ్చారు. వీరు నేరుగా రెండో దశ ఐపీసీసీలో చేరొచ్చు. ఐసీఏఐ ప్రవేశపెట్టిన కోర్సు అకౌంటింగ్ టెక్నీషియన్. సీపీటీ పాసైన విద్యార్థి సీఏ పూర్తి చేయలేను అని భావిస్తే ఐపీసీసీలోని గ్రూప్-1 పూర్తి చేసి, ఒక ఏడాదిపాటు సీఏ దగ్గర ఆర్టికల్ షిప్ చేస్తే అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ సర్టిఫికెట్‌తో అకౌంటెంట్‌గా నెలకు రూ. 25,000 వేతనం పొందొచ్చు.
వెబ్‌సైట్: www.icai.org

ప్రాక్టికల్ దృక్పథంతో
మూడు దశల సీఏ కోర్సులో ఇంటర్మీడియెట్ అర్హతతో కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉత్తీర్ణత సాధించి ఫౌండేషన్ కోర్సులో చేరొచ్చు. ఇలా ఇంటర్మీడియెట్ తర్వాత ఫౌండేషన్ కోర్సులో చేరిన విద్యార్థులకు చేయూతనిచ్చే విధంగా ఇగ్నో, భారతీయార్, నేతాజీ సుభాష్, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకుని దూరవిద్యా విధానంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసే అవకాశం కల్పిస్తున్నాం. దీని ద్వారా విద్యార్థులకు మూడేళ్ల సమయం కలిసిరావడంతోపాటు సీఏ కోర్సును సరైన సమయంలో పూర్తి చేయడానికి వీలవుతుంది. ఫలితంగా 21, 22 ఏళ్ల వయసు వచ్చే సరికి సదరు విద్యార్థులు పరిపూర్ణ సీఏలుగా రూపుదిద్దుకుంటారు. సీఏ ఫైనల్ పూర్తి చేసిన వారికి సగటున రూ. 5 లక్షల వార్షిక వేతనం గ్యారెంటీ. గత ఏడాది ఐటీసీ సంస్థ అధికంగా రూ. 13 లక్షల వార్షిక వేతనం అందించింది. ప్రస్తుతం సీఏ అభ్యర్థుల కొరత పరిశ్రమలను వేధిస్తోంది. సీఏ కోర్సులో రాణించాలంటే నిరంతర ప్రాక్టీస్, సహనం, మారే చట్టాలపై అప్‌డేట్ కావాల్సి ఉంటుంది. విదేశీ అవకాశాలపరంగా ప్రస్తుతం ఐసీఏఐ ఆస్ట్రేలియా, కెనడా, యూకే తదితర పది దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల అక్కడి నియంత్రణ సంస్థలు నిర్వహించే కొన్ని పేపర్లలో ఉత్తీర్ణత సాధిస్తే ఆయా దేశాల్లోనూ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.

సీఎంఏ
అకౌంటింగ్ రంగాల్లో సమున్నత భవిష్యత్తును కోరుకునే విద్యార్థులకు మరో చక్కటి అవకాశం కల్పిస్తున్న కోర్సు కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ). ఈ కోర్సును ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది.

అర్హత: ఇంటర్మీడియెట్.
కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ) కోర్సు మూడు దశలుగా ఉంటుంది. అవి..
* ఫౌండేషన్ కోర్సు
* ఇంటర్మీడియెట్ కోర్సు
* ఫైనల్ కోర్సు

ఫౌండేషన్ కోర్సు:
కాస్ట్ అండ్ వర్‌‌క అకౌంటెన్సీ కోర్సు క్రమంలో తొలి దశ ఫౌండేషన్ కోర్సు. ఈ కోర్సులో పేరు నమోదు చేసుకోవడానికి కనీస అర్హత ఇంటర్మీడియెట్/10+2/ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూసే వారు కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ ఫౌండేషన్ కోర్సు పరీక్షలు ప్రతి ఏటా రెండు సార్లు జూన్, డిసెంబర్ నెలల్లో జరుగుతాయి. జూన్‌లో జరిగే పరీక్షలకు హాజరవ్వాలనుకుంటే అంతకుముందు సంవత్సరం డిసెంబర్ 5వ తేదీలోపు, డిసెంబర్‌లో జరిగే పరీక్షలకు హాజరవ్వాలనుకుంటే అదే సంవత్సరం జూన్ 5వ తేదీలోపు పేరు నమోదు చేసుకోవాలి. ఫౌండేషన్ కోర్సులో మొత్తం నాలుగు పేపర్లుంటాయి.

ఇంటర్మీడియెట్ కోర్సు:
సీఎంఏ ఫౌండేషన్ కోర్సు ఉత్తీర్ణులు లేదా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ ఇంటర్మీడియెట్ కోర్సుకు తమ పేరు నమోదు చేసుకోవచ్చు. ఇంటర్మీడియెట్ కోర్సు రెండు స్టేజ్‌లుగా ఉంటుంది. ప్రతి స్టేజ్‌లో మూడు పేపర్లుంటాయి. ప్రతి ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్‌లలో నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే క్రమంలో నిర్ణీత తేదీల్లోపు సంబంధిత దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. డిసెంబర్‌లో జరిగే పరీక్షలకు జూన్ 5వ తేదీలోపు; జూన్‌లో జరిగే పరీక్షలకు అంతకు ముందు సంవత్సరం డిసెంబర్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఫైనల్ కోర్సు:
ఇంటర్మీడియెట్ కోర్సు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో కాస్ట్ అండ్ వర్‌‌క అకౌంటెన్సీ ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దే క్రమంలో చివరి దశ ఫైనల్ కోర్సు. ఇది రెండు స్టేజ్‌లలో (స్టేజ్ -3, 4) ఉంటుంది. సీఎంఏ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు తమ ఆసక్తికి అనుగుణంగా మొదట ఫైనల్ కోర్సులోని రెండు స్టేజ్‌లలో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఒకేసారి రెండు స్టేజ్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలను కూడా ఏటా రెండుసార్లు (జూన్, డిసెంబర్‌లలో) నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన దరఖాస్తు తేదీల క్రమం కూడా.. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్ కోర్సుల మాదిరిగానే ఉంటుంది.

ఉన్నత విద్య:
సీఎంఏ కోర్సుకు కూడా ప్రభుత్వం గ్రాడ్యుయేషన్‌తో సమానమైన గుర్తింపునిచ్చింది. ఈ నేపథ్యంలో కామర్‌‌స, అకౌంటింగ్, మేనేజ్‌మెంట్ తదితర అకౌంటింగ్ సంబంధిత కోర్సుల్లో బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా ఉండే అన్ని ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశించొచ్చు. అదే అర్హతతో నిర్వహించే పోటీ పరీక్షలకు కూడా హాజరు కావచ్చు.

ఇగ్నో సంయుక్త కోర్సులు:
10+2 తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతో ఫౌండేషన్ కోర్సులో ప్రవేశించిన విద్యార్థుల సౌలభ్యం కోసం ఇన్‌స్టిట్యూట్.. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీతో ఒప్పందం ద్వారా బీకాం (ఫైనాన్షియల్ అండ్ కాస్ట్ అకౌంటింగ్), అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఇంటర్మీడియెట్ కోర్సులో నమోదు చేసుకున్న విద్యార్థుల కోసం ఎంకాం (మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్) అనే రెండు స్థాయిల స్పెషలైజ్డ్ కోర్సులను అందిస్తోంది.

కావల్సిన నైపుణ్యాలు:
కాస్ట్ అండ్ వర్‌‌క అకౌంటెన్సీ ప్రధాన లక్ష్యం వస్తువును ఉత్పత్తి చేసే క్రమంలో ఎదురయ్యే ఖర్చులను.. నిర్ణీత ఉత్పత్తి లక్ష్యానికి ఎలాంటి ఆటంకం లేకుండా తగ్గించడం. అంటే ఒకవైపు వస్తువుల ఉత్పత్తి సాఫీగా సాగాలి. మరోవైపు ఖర్చులు తగ్గాలి. ఇలాంటి బాధ్యతను నిర్వర్తించాలంటే లెక్కల చిక్కుముడులను ఇట్టే విప్పే నైపుణ్యం కావాలి. ఇందుకోసం లెక్కల నిర్వహణకు ఎక్కువ సమయం గడిపే విధంగా సహనం అలవర్చుకోవాలి. అనలిటికల్ స్కిల్స్, అప్లికేషన్ ఓరియంటెడ్‌గా చదవగలగడం, మ్యాథమెటిక్స్‌పై పట్టు, వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల నేర్పు చాలా అవసరం.

కెరీర్ ఆప్షన్‌‌స:
సీఎంఏ పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలకు కొదవే ఉండదు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, వస్తూత్పత్తి సంస్థలు, ఇన్సూరెన్స్ సంస్థలు, మైనింగ్ సంస్థలు, డెవలప్‌మెంట్ ఏజెన్సీలు, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెక్టర్, ఇతర పారిశ్రామిక సంస్థల్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, కాస్ట్ ఆడిటర్ వంటి హోదాలో ప్రవేశించొచ్చు. ఆతర్వాత ప్రతిభ ఆధారంగా సీఈఓ, మేనేజింగ్ డెరైక్టర్ కమ్ చైర్మన్ స్థాయికి చేరుకోవచ్చు. సీఎంఏ ఫైనల్ వరకు వేచిచూడకుండా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో కూడా పలు ఉద్యోగావకాశాలు చేజిక్కించుకోవచ్చు. ముఖ్యంగా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని మైనింగ్ సంస్థలు సీఎంఏ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులను ట్రైనీలుగా నియమించుకుంటున్నాయి. అన్నిటికంటే ముఖ్య విషయం భారత ప్రభుత్వం.. ఐఏఎస్, ఐపీఎస్ మాదిరిగానే ఇండియన్ కాస్ట్ అకౌంట్స్ సర్వీస్ అనే కేంద్ర సర్వీస్‌ను కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి ఐసీఎంఏఐలో ఫైనల్ పూర్తి చేసిన వారికి కేంద్ర సర్వీసులో అడుగుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. సొంతంగా కూడా కాస్ట్ అకౌంటెంట్‌గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.

వేతనాలు:
ప్రారంభంలో ఏడాదికి రూ. 6 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ ఆధారంగా రూ.30 నుంచి రూ.40 లక్షల వేతనాలు కూడా అందుకోవచ్చు.

వెబ్‌సైట్: http://icmai.in

కోర్సుకు కొత్త రూపు
గతంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాగా ఉండే ఇన్‌స్టిట్యూట్ పేరును ప్రస్తుతం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాగా మార్చారు. అదే విధంగా సంస్థ అందించే కోర్సు పేరును కూడా కొత్తగా కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీగా మార్చారు. ఇలా ఇన్‌స్టిట్యూట్, కోర్సు రూపు మార్చడంతోపాటు ఈ కోర్సుకు ప్రాముఖ్యత పెంచుతూ కంపెనీస్ యాక్ట్ కొత్త బిల్లు అనేక చర్యలు చేపట్టింది. సీఏ మాదిరిగానే సీఎంఏ ఉత్తీర్ణులు కూడా ఇంటర్నల్ ఆడిట్ చేసే అవకాశం కల్పించింది. అదే విధంగా త్వరలో రూపొందించనున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్ ప్రకారం, సంబంధిత రిటర్న్స్‌ను కాస్ట్ అకౌంటెంట్స్ ధ్రువీకరించడం తప్పనిసరి. అంతేకాకుండా కాస్ట్ ఆడిట్, కాస్ట్ కంప్లయన్స్‌ను తప్పనిసరి చేశారు. ఇలా పలు రకాలుగా కాస్ట్ అకౌంటెంట్ల పాత్ర భవిష్యత్తులో విస్తృతం కానుంది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియెట్ తర్వాతే ఫౌండేషన్ కోర్సులో అడుగుపెట్టి సమాంతరంగా ఈ కోర్సులోని దశలను, దూర విద్యా విధానంలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సును పూర్తి చేసుకుంటే ఒకే సమయంలో రెండు ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పటికీ దేశవ్యాప్తంగా దాదాపు అయిదు లక్షల మంది కాస్ట్ అకౌంటెంట్ల అవసరం ఉంది. ప్రారంభంలో రూ. 30 వేల జీతంతో కెరీర్ మొదలు పెట్టొచ్చు. ఆ తర్వాత అనుభవం ఆధారంగా సీఎఫ్‌ఓ, సీఈఓ స్థాయికి కూడా చేరుకోవచ్చు.

హార్టికల్చర్/ అగ్రికల్చర్ / హోంసైన్స్


దేశంలో శరవేగంగా విస్తరిస్తోన్న రంగాల్లో హార్టికల్చర్ ఒకటి. దేశానికి జీడీపీని సమకూర్చిపెట్టడంలో ఉద్యాన, సంబంధిత పంటలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వివిధ బహుళజాతి సంస్థలు కూడా భారీ ఎత్తున వ్యవసాయ క్షేత్రాల్లో ఉద్యానపంటలను సాగు చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న శ్రద్ధ.. నాణ్యమైన కూరగాయలపై పెరుగుతున్న మక్కువ వంటి కారణాలతో.. ఈ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. దీన్ని గుర్తించిన మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే రెండో హార్టికల్చర్ యూనివర్సిటీని 2007లో పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకటరామన్నగూడెంలో నెలకొల్పింది. ఈ యూనివర్సిటీలో వివిధ కోర్సులు న్నాయి.

కోర్సులు: బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్:
వ్యవధి: నాలుగేళ్లు.
అర్హత: ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత.
ప్రవేశం: ఎంసెట్ ద్వారా
సీట్ల సంఖ్య: 4 కాలేజీల్లో మొత్తం 230.
ఉన్నత విద్య: బీఎస్సీ హార్టికల్చర్ ఉత్తీర్ణులు ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ హార్టికల్చర్ కోర్సులు అభ్యసించొచ్చు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీతో పాటు వివిధ రాష్ట్రాల్లో అనేక వర్సిటీలు ఈ కోర్సులను అందిస్తున్నాయి.

ఉద్యోగావకాశాలు:
కోర్సులు పూర్తిచేసుకున్నవారికి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో టెక్నికల్, ప్రొబేషనరీ ఆఫీసర్లుగా ఉద్యోగాలు లభిస్తాయి. రాష్ర్ట ప్రభుత్వ ఉద్యాన విభాగాల్లో హార్టికల్చరల్ ఆఫీసర్లుగా అవకాశాలు లభిస్తాయి. వివిధ ప్రైవేటు సంస్థలు, నర్సరీలు, ఇన్సూరెన్స్ కంపెనీల్లో హార్టికల్చర్ కన్సల్టెంట్స్‌గా కూడా సేవలు అందించొచ్చు. సొంతంగా హార్టి క్లినిక్స్, ఉద్యాన వ్యాపార కేంద్రాలను నిర్వహించుకోవచ్చు. వివిధ ఎరువులు, రసాయనాలు, విత్తనాల కంపెనీల్లో టెక్నికల్ ఆఫీసర్లు లేదా మార్కెటింగ్ ఆఫీసర్లుగా పనిచేస్తూ నెలకు రూ.30000 వరకు సంపాదించొచ్చు.
వెబ్‌సైట్: drysrhu.edu.in


బ్యాంకులు మొదలు.. బహుళ జాతి సంస్థల వరకు
ఇటీవల కాలంలో ప్రాధాన్యత సంతరించుకుంటున్న కోర్సు హార్టికల్చర్. ప్రస్తుతం మన రాష్ట్రంలో డాక్టర్ వై.ఎస్.ఆర్. హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో నాలుగు కళాశాలల్లో 230 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పది శాతం సీట్లను హార్టికల్చర్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులకు, మరో పదిహేను శాతం సీట్లను జాతీయ స్థాయిలో నిర్వహించే ఐసీఏఆర్ ర్యాంకర్లకు కేటాయిస్తున్నాం. ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగానూ ఎన్నో అవకాశాలున్న కోర్సు బీఎస్సీ హార్టికల్చర్. దీని తర్వాత ఎమ్మెస్సీ చేయొచ్చు. అంతేకాకుండా ఐసీఏఆర్ నిర్వహించే జేఆర్‌ఎఫ్‌లో 50 లోపు ర్యాంకు పొందితే పరిశోధన సౌకర్యంతోపాటు నెలకు రూ. 8 వేల ఫెలోషిప్ కూడా లభిస్తుంది. ఇక.. కెరీర్ పరంగా బ్యాంకులు ప్రధాన వేదికలుగా నిలుస్తున్నాయి. హార్టికల్చర్ గ్రాడ్యుయేట్లను ఫస్ట్ గ్రేడ్ హోదాలో రూరల్ డెవలప్‌మెంట్ అధికారులుగా నియమిస్తున్నాయి. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్‌లో క్రాప్ కోఆర్డినేటర్స్, హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో అధికారులుగా చేరే అవకాశం ఉంది. ప్రైవేట్ రంగంలో డ్రిప్ ఇరిగేషన్, ఫెర్టిలైజర్ సంస్థలు ప్రధానమైన ఉపాధి వేదికలు. అంతేకాకుండా బీఎస్సీ పూర్తి చేస్తే మా యూనివర్సిటీలోనే పాలిటెక్నిక్ లెక్చరర్స్‌గా నియమిస్తున్నాం. ఏ రంగమైనా ప్రారంభంలో రూ. 25 వేల జీతం ఖాయం. ఇలా.. ఎన్ని కోణాల్లో చూసినా.. బీఎస్సీ హార్టికల్చర్ పూర్తి చేస్తే ‘ఖాళీగా ఉంటాం’ అనే ప్రసక్తే ఉండదు.

అగ్రికల్చర్

మన దేశం పారిశ్రామికంగా శరవేగంగా దూసుకుపోతున్నప్పటికీ దేశ జనాభాలో సగం మందికిపైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ రంగంలో పంటలకు వచ్చే వివిధ చీడపీడల నివారణ, వివిధ రుతువులకనుగుణంగా పంటల సాగు, అత్యధిక దిగుబడినిచ్చే విత్తనాల తయారీ, రైతులకు వివిధ అంశాలపై అవగాహన కలిగించడం వంటి విషయాల్లో నిష్ణాతుల అవసరం ఉంటోంది. ఈ నేపథ్యంలో వివిధ యూనివర్సిటీలు పాలిటెక్నిక్, బ్యాచిలర్, మాస్టర్ స్థాయిలో అగ్రికల్చర్ కోర్సులను అందిస్తున్నాయి.

బీఎస్సీ అగ్రికల్చర్:
కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
అర్హత: ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత.
సీట్ల సంఖ్య: 8 కాలేజీల్లో మొత్తం 620.
బీటెక్ అగ్రి ఇంజనీరింగ్:
కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
అర్హత: ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత.
ప్రవేశం: ఎంసెట్ ద్వారా
సీట్ల సంఖ్య: 3 కాలేజీల్లో మొత్తం 90.
ఉన్నత విద్య: బీఎస్సీ పూర్తయ్యాక ఎంఎస్సీ (అగ్రి)లో చేరొచ్చు. తర్వాత పీహెచ్‌డీ చేయొచ్చు.

ఉద్యోగావకాశాలు:
అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్లు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల్లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లుగా చేరొచ్చు. మోన్‌శాంటో, బేయర్ వంటి విత్తన, ఫర్టిలైజర్ కంపెనీల్లో టెక్నికల్ ఆఫీసర్లుగా ఉద్యోగాలుంటాయి. దాంతోపాటు టీ గార్డెన్‌లు, రబ్బర్ ప్లాంటేషన్‌లలోనూ అవకాశాలు లభిస్తాయి. ఎంఎస్సీ, పీహెచ్‌డీ పూర్తి చేసుకుంటే పరిశోధన రంగంలోనూ తిరుగుండదు. అంతేకాకుండా ఏఎస్‌ఆర్‌బీ పరీక్ష ద్వారా అగ్రికల్చర్ సైంటిస్ట్‌లుగా స్థిరపడొచ్చు లేదా ఏఆర్‌ఎస్-నెట్ ద్వారా వివిధ వర్సిటీలు, కళాశాలల్లో లెక్చరర్, ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించవచ్చు. అగ్రికల్చరల్ డిపార్ట్‌మెంట్‌లు, ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్, అగ్రి-బయోటెక్ సంస్థలు, కమర్షియల్ ఫార్మింగ్‌లో కూడా ఉద్యోగావకాశాలు పుష్కలం.
వెబ్‌సైట్: angrau.ac.in

అప్‌కమింగ్ బ్రాంచ్
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయం క్లిష్టంగా మారడంతో టెక్నాలజీ ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అప్‌కమింగ్ బ్రాంచ్‌గా వెలుగులీనుతోంది. కోర్సు ద్వారా భూ ఉత్పాదకత పెంచడమే ప్రధానోద్దేశం. ప్రస్తుతం మన రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో (బాపట్ల, మడకశిర, సంగారెడ్డి) ఉన్న కళాశాలల్లో అందిస్తున్న ఈ కోర్సు ఎంతో క్రేజీగా మారుతోంది. ఉద్యోగాల పరంగా వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల్లో బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీర్లకు పెద్దపీట వేస్తున్నారు. ప్రైవేటు రంగంలో వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు, ఇతర పనిముట్లు ఉత్పత్తి చేసే సంస్థలు, మైక్రో ఇరిగేషన్ సంస్థలు, డైరీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలు ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి.

మన రాష్ట్రంలో ఏటా 400 మంది అగ్రికల్చర్ ఇంజనీర్ల అవసరం ఏర్పడుతోందని ఒక అంచనా. కానీ బయటికి వస్తున్న విద్యార్థుల సంఖ్య మాత్రం 150. దీన్నిబట్టే ఉద్యోగాల పరంగా డిమాండ్-సప్లయ్ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవచ్చు. వేతనాల పరంగా ప్రారంభంలో సగటున రూ. 25 వేల జీతం అందుకోవచ్చు.

గత ఏడాది మహీంద్రా ట్రాక్టర్స్ కంపెనీ నెలకు రూ. 40 వేల వేతనం అందించింది. ఉన్నత విద్యా కోణంలోనూ పీజీ, పీహెచ్‌డీ చేయొచ్చు. మన రాష్ట్రంలో బాపట్ల అగ్రికల్చరల్ కళాశాలలో ఫార్మ్ మెషినరీ అండ్ పవర్, సాయిల్ అండ్ వాటర్ ఇంజనీరింగ్, ప్రాసెస్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్ విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ అందుబాటులో ఉన్నాయి.

హోమ్ సైన్స్

మారుతున్న పరిసరాలకనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దడం కోసం గత కొంత కాలంగా సైన్స్ విభాగంలో ఎన్నో కొత్త కోర్సుల ఆవిర్భావం జరిగింది. అలాంటి వాటిల్లో ఇటీవలి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన కోర్సుల్లో హోమ్ సైన్స్ ఒకటి.

హోమ్ సైన్స్ అంటే:
గృహ, కుటుంబ జీవితాన్ని మరింత మెరుగ్గా తీర్చుదిద్దుకోవడం కోసం రూపొందించిన కోర్సు హోమ్ సైన్స్. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలను అవగాహన చేసుకోవడం, వాటికి శాస్త్రీయ దృక్ఫథంతో పరిష్కారాలను కనుక్కోవడం వంటి అంశాలను ఈ కోర్సులో బోధిస్తారు. అంతేకాకుండా మారుతున్న జీవన విధానానికి తగ్గట్టు విద్యార్థినులను తీర్చిదిద్దడమే కాకుండా వారికి జీవనోపాధిని కల్పించే విధంగా కోర్సు రూపకల్పన ఉంటుంది.

కేవలం మహిళలకే:
ఈ కోర్సుకు కేవలం మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు. నాలుగేళ్ల కోర్సులో.. మొదటి రెండేళ్లు ఐదు సబ్జెకులు కామన్‌గా ఉంటాయి. మూడో ఏడాది నుంచి ఏదో ఒక స్పెషలైజేషన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అవి..
* ఫుడ్ అండ్ న్యూట్రిషన్
* ఫ్యామిలీ రిసోర్స్ మేనేజ్‌మెంట్
* హోమ్ సైన్స్ ఎక్స్‌టెన్షన్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్
* హ్యూమన్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్
* టెక్స్‌టైల్స్ అండ్ అపెరల్ డిజైనింగ్

అవకాశాలు:
కోర్సు పూర్తి చేసిన వారికి ప్రొడక్షన్ ఇండస్ట్రీ, టూరిజం, సర్వీస్ సెక్టార్, డాబర్ వంటి ఫుడ్ మేకింగ్ పరిశ్రమలు, ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్ తదితర రంగాల్లో.. వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి. పరిశోధన రంగంలో రీసెర్చ్ అసోసియేట్, ఫుడ్ సైంటిస్ట్‌గా స్థిరపడొచ్చు. పీజీ, పీహెచ్‌డీ కోర్సులు పూర్తి చేసి సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్యాకల్టీగా కూడా చేరొచ్చు. రీసెర్చ్ అనలిస్ట్, న్యూట్రిషన్ కన్సల్టెంట్‌గా, ఇంటీరియర్ డిజైనర్‌గా సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా ప్రభుత్వం నిర్వహించే.. సివిల్స్, గ్రూప్-1,2 వంటి అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరు కావచ్చు.

వేతనాలు:
బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులకు కెరీర్ ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి 20 వేల వరకు వేతనం లభిస్తుంది. చదువు, అనుభవం ఆధారంగా తర్వాత నెలకు రూ.40 వేల వరకు సంపాదించవచ్చు.

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
మన రాష్ట్రంలో కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ (ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ)-సైఫాబాద్, హైదరాబాద్ మాత్రమే బీఎస్సీ (ఆనర్స్-హోమ్ సైన్స్) కోర్సును ఆఫర్ చేస్తుంది.
సీట్ల సంఖ్య: 100

అర్హత:
ఫిజికల్ సెన్సైస్, బయాలజికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్‌లలో ఏదేని ఒక కాంబినేషన్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. పల్లెల్లో పదో తరగతి వరకూ చదివి, కనీసం మూడు ఎకరాల పొలం ఉన్న రైతుల సంతానానికి
‘రైతుల కోటా’లో 40 శాతం సీట్లను కేటాయిస్తారు.
ప్రవేశం: మెరిట్ ఆధారంగా.
వివరాలకు: www.angrau.net

ఉన్నత విద్య:
బ్యాచిలర్ డిగ్రీ తర్వాత వివిధ రకాల స్పెషలైజేషన్స్‌తో పీజీ కోర్సులను చదివే అవకాశం ఉంది. తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ కూడా చేయవచ్చు. ఈ క్రమంలో ఉండే స్పెషలైజేషన్లు..

పీజీ:
* న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్
* అపెరల్స్ అండ్ టెక్స్‌టైల్స్
* చైల్డ్ గెడైన్స్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలింగ్
* ఇంటీరియర్ డిజైన్

ఎంఎస్సీ(హోమ్ సెన్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న వర్సిటీలు:
* } వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి.
వెబ్‌సైట్: www.svuniversity.in
* ఆచార్య ఎన్‌జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.angrau.net
* } సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్- అనంతపూర్ క్యాంపస్.
వెబ్‌సైట్: http://sssihl.edu.in

పీహెచ్‌డీ స్పెషలైజేషన్స్:
* ఫుడ్ అండ్ న్యూట్రిషన్
* హ్యూమన్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్
* రిసోర్స్ మేనేజ్‌మెంట్ అండ్ క న్జ్యూమర్ సెన్సైస్
* అపెరల్ అండ్ టెక్స్‌టైల్స్
* ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్

అద్భుత అవకాశాలు
బీఎస్సీ హోమ్ సైన్స్‌లో ప్రస్తుతం అయిదు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అవి.. అపరెల్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఈసీసీడీ, న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్, ఇంటీరియర్ అండ్ ఎక్స్‌ట్రీరియర్ స్పేస్ డిజైన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్. నాలుగేళ్ల వ్యవధిలో ఉండే కోర్సు పూర్తి చేస్తే ఆనర్స్ డిగ్రీ లభించడం బీఎస్సీ హోమ్ సైన్స్ ప్రత్యేకత. ప్రస్తుతం సైఫాబాద్ (హైదరాబాద్)లోని కాలేజ్‌లో 100 సీట్లతో మాత్రమే ఆఫర్ చేస్తున్న ఈ కోర్సును వచ్చే విద్యా సంవత్సరం నుంచి గుంటూరులో కూడా ప్రారంభించనున్నాం. ఇక ఉన్నత విద్య పరంగా ఎమ్మెస్సీ స్థాయిలో ఏడు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణుల కోసం ఉద్యోగాల పరంగా డిమాండ్, సప్లయ్ వ్యత్యాసం దాదాపు 60-40 గా కొనసాగుతోంది. బీఎస్సీ ఉత్తీర్ణులు ప్రారంభంలోనే రూ. 20 వేల జీతం అందుకోవ చ్చు. పీజీ పూర్తి చేస్తే టీచింగ్, రీసెర్చ్ ఫెలోషిప్ అవకాశాలు పుష్కలం. యూజీ స్థాయిలో ఎంచుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా ఉద్యోగాలు లభిస్తాయి. ఉదాహరణకు న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్ స్పెషలైజేషన్‌తో డైటీషియన్స్‌గా స్థిరపడొచ్చు. ప్రభుత్వ రంగంలో కూడా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు లభిస్తాయి.

మెడిసిన్/ ఫార్మసీ


మెడిసిన్

‘వైద్యో నారాయణో హరీ’ అన్నారు. అంటే వైద్యం అందించే డాక్టర్ దేవుడితో సమానం. ఇంతటి బాధ్యతాయుతమైన వృత్తిలో అడుగుపెడితే ఆపదల్లో ఉన్న ఎన్నో ప్రాణాలకు ఊపిరి పోశామన్న సంతృప్తితోపాటు అద్భుతమైన కెరీర్ సొంతమవుతుంది. ఇంటర్ బైపీసీ పూర్తిచేసిన విద్యార్థులు ఎంబీబీఎస్ చేయడానికి అర్హు లు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మొత్తం 5450 సీట్లకు పోటీపడే విద్యార్థుల సంఖ్య లక్షకుపైగా ఉంటుంది. ఎంసెట్-2013 మెడికల్ విభాగంలో పోటీపడే విద్యార్థుల సంఖ్య ఇప్పటికే లక్ష దాటిపోయింది. ఎంతోమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు హాట్ ఫేవరెట్ కోర్సుల్లో ఒకటైన మెడిసిన్ కోర్సు, కెరీర్ వివరాలు..

అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత.
వ్యవధి: ఐదున్నరేళ్లు
మన రాష్ట్రంలో ప్రవేశం: ఎంసెట్ ద్వారా. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కొత్తగా తెరమీదికొచ్చిన నీట్ ద్వారా కూడా ప్రవేశాలు జరిగే వీలుంది. అయితే సుప్రీంకోర్టు తుది తీర్పుకనుగుణంగా ప్రవేశాలపై నిర్ణయం తీసుకొంటారు.

జాతీయస్థాయిలో ప్రముఖ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్:
నీట్; జిప్‌మర్ (పాండిచ్చేరి), క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (వెల్లూరు), ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ (పుణె), బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్), ఎస్‌ఆర్‌ఎం, అమృత విశ్వవిద్యా పీఠం, డీవై పాటిల్, మణిపాల్ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్- వార్ధా నిర్వహించే మెడికల్ ప్రవేశ పరీక్షలు.

నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి, మార్చి
కావల్సిన స్కిల్స్: ఓర్పు, సహనం, నిరంతర అధ్యయనం, సేవ చేసే గుణం, చేసే పని పట్ల నిబద్ధత, అంకిత భావం.

ఉన్నత విద్య: ఎంబీబీఎస్ కోర్సును పూర్తిచేసినవారు పీజీ/డిప్లొమా/ఎండీ/సూపర్ స్పెషాలిటీ వంటి కో ర్సులు చదవొచ్చు. పీజీలో ఎన్నో స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అవి.. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, సైకియాట్రీ, అనస్థీషియా మొదలైనవి. దేశంలో పలు వర్సిటీలు ఈ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి.

కెరీర్ :
ఇప్పుడు ఎన్నో కార్పొరేట్ ఆస్పత్రులు దేశమంతటా విస్తరిస్తున్నాయి. ఇవి కూడా ఎంబీబీఎస్ విద్యార్థులకు భారీ జీతాలు ఆఫర్ చేస్తున్నాయి. అందులోనూ మనదేశంలో ప్రతి లక్ష మంది ప్రజలకు ఒక డాక్టర్ మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్ చేసినవిద్యార్థులకు అపార అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టాప్ 5 కెరీర్స్‌లో ఎంబీబీఎస్ ఒకటి. రోజురోజుకు విస్తృతమవుతోన్న వ్యాధులు వైద్య రంగానికి సవాళ్లు విసురుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు సరిపోయినంతమంది డాక్టర్లు మనదేశంలో లేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ కేటాయింపుల్లో కూడా వైద్య, ఆరోగ్య రంగాలకు అత్యధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరో వైపు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేసే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ)తోపాటు వివిధ కార్పొరేట్ సంస్థలు నెలకొల్పిన స్వచ్ఛంధ సంస్థల్లో వీరికి అవకాశాలుంటాయి. అదేవిధంగా యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్‌గా సేవలందించొచ్చు. ఆర్థిక స్థోమత ఉన్నవారు సొంతంగాహాస్పిటల్ పెట్టుకునిప్రాక్టీస్ చేయొచ్చు.
వెబ్‌సైట్: 119.226.159.184

పీజీకి ప్రాధాన్యమివ్వాలి
రాష్ట్రంలో 14 ప్రభుత్వ, 27 ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 5450 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే విద్యా సంవత్సరంలో మరో నాలుగైదు కొత్త కళాశాలలు అందుబాటులోకి వ చ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ఉస్మానియా, గాంధీ, కాకతీయ, రంగరాయ మెడికల్ కళాశాలల్లో అదనంగా 50 సీట్లు చొప్పున పెరిగే అవకాశం ఉంది. ఇక... వైద్య వృత్తిలో రాణించాలనుకునేవారు ఎంబీబీఎస్ సర్టిఫికెట్‌తోనే సరిపెట్టుకోకుండా పీజీ చేయడానికి ప్రాధాన్యమివ్వాలి. వాస్తవానికి వైద్య విద్యారంగంలో పీజీ మేజర్ టర్నింగ్ పాయింట్. ఎంబీబీఎస్ విద్యార్థులకు భవిష్యత్తుపరంగా మూడు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అవి స్వదేశంలో ప్రైవేట్ ప్రాక్టీస్‌లో స్థిరపడడం, రెండు ప్రభుత్వ సర్వీస్‌లో చేరడం, మూడోది పీజీ కోర్సులో అడుగుపెట్టడం. ఈ మూడింటిలో పీజీలో చేరడమే అభిలషణీయం. విదేశాల్లో ఉన్నతవైద్య విద్యలో చేరాలనుకునే వారికి ప్రధానంగా అమెరికా, యూకేలు లక్ష్యంగా ఉంటున్నాయి. వృత్తి సంతృప్తి ఆశించేవారు పీజీ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరొచ్చు.

వెటర్నరీ సైన్స్
ప్రపంచంలోనే అత్యధిక పశుసంపద కలిగిన దేశాల్లో భారత్ ఒకటి. పశు ఉత్పత్తులపై వచ్చే ఆదాయం కూడా ఎక్కువే. దేశ జనాభాలో ఎక్కువ శాతం మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశువులకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు, పశువుల గర్భధారణ పద్ధతులు తదితర అంశాల్లో పరిజ్ఞానం కలిగిన నిష్ణాతుల అవసరం పెద్ద ఎత్తున ఏర్పడుతోంది. మన రాష్ట్రంలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వెటర్నరీలో పాలిటెక్నిక్, బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ కోర్సులను అందిస్తోంది.

కోర్సు: బీవీఎస్సీ అండ్ ఏహెచ్ వ్యవధి: ఐదేళ్లు.
అర్హత: ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత. ప్రవేశం:ఎంసెట్ ద్వారా
సీట్ల సంఖ్య: 5 కాలేజీల్లో మొత్తం 300 సీట్లున్నాయి.

ఉద్యోగావకాశాలు: పౌల్ట్రీ, యానిమల్ ప్రొడక్ట్స్ రంగం ఎన్నడూ లేనంతగా విస్తరిస్తుండటంతో... ఈ కోర్సులను పూర్తిచేసుకున్న అభ్యర్థులకు అవకాశాలు పుష్కలం. ఫౌల్ట్రీ ఫారాలు, ప్రభుత్వ, ప్రైవేటు పశు వైద్య ఆసుపత్రులు, పశుసంవర్థక శాలలు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలు, డెయిరీ ఫామ్స్, గొర్రెల పెంపక కేంద్రాల్లో కెరీర్ ప్రారంభించవచ్చు. పీహెచ్‌డీ చేస్తే వివిధ కళాశాలల్లో ప్రొఫెసర్‌గా పనిచేయొచ్చు.
వెబ్‌సైట్: www.svvu.edu.in

ఎంబీబీఎస్ తర్వాత బీవీఎస్సీనే
ప్రస్తుతం విద్యార్థులు ఎంబీబీఎస్ తర్వాత ప్రాధాన్యమిస్తున్న కోర్సు బీవీఎస్సీ. రాష్ట్రంలో మొత్తం అయిదు కళాశాలల్లో 300 సీట్లు ఉన్నాయి. ఉన్నత విద్య పరంగా ఎంవీఎస్సీ, పీహెచ్‌డీ చేస్తే మరింత ఉన్నత అవకాశాలు అందుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీతోనే రాష్ట్ర పశుసంవర్ధక శాఖలో వైద్యులుగా చేరొచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌గా అడుగుపెట్టొచ్చు. కేంద్ర రక్షణ శాఖలో రిమోట్ వెటర్నరీ కార్ప్స్ ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. సొంతంగా కెనైన్ ప్రాక్టీస్ క్లినిక్స్ నెలకొల్పుకోవచ్చు. ఇక ప్రైవేటు రంగంలో పౌల్ట్రీ ఫార్మ్స్, డైరీ ఫారాలు, ఫీడ్ ఇండస్ట్రీల్లో స్థిరపడొచ్చు. ప్రారంభంలో కనీసం రూ.25 వేల - రూ.30 వేల వేతనం గ్యారెంటీ. విదేశీ విద్యకు జీఆర్‌ఈ, టోఫెల్‌ల్లో ఉత్తీర్ణులై ప్రధానంగా అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఎంవీఎస్సీ చేసేందుకు పలు మార్గాలున్నాయి.


ఫార్మసీ

ప్రస్తుతం శరవేగంగా విస్తరిస్తున్న రంగాల్లో ఫార్మసీ ఒక టి. విస్తృత అవకాశాలకు నెలవుగా మారిన ఈ రంగం లో ప్రవేశించడానికి డీఫార్మసీ, బీఫార్మసీ, ఫార్మ్.డి వం టి కోర్సులను చదవాలి. ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఫార్మ్.డి, బీఫార్మసీ కోర్సుల్లో, ఇంటర్ మార్కుల ఆధారంగా డీఫార్మసీ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.

బీ ఫార్మసీ: కోర్సు కాలవ్యవధి: నాలుగేళ్లు
అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ/ఎంపీసీ.
సీట్ల సంఖ్య: 280 కాలేజీల్లో దాదాపు 25000.

డాక్టర్ ఇన్ ఫార్మసీ (ఫార్మ్‌డీ): డి.ఫార్మసీ, బి.ఫార్మసీ కోర్సులు అందుబాటులో ఉండగా... కొత్తగా ఫార్మ్‌డీ అవసరం ఏంటి? దీనికున్న ప్రత్యేకత, ప్రాధాన్యతలు ఏంటి? అనేది చాలా మందికి కలిగే సందేహం. మన దేశంలో ఫార్మసీ విద్య ఎక్కువగా థియరీ బేస్డ్. అంటే.. థియరీ ఎక్కువ..ప్రాక్టికల్స్ తక్కువ. దాంతో అభ్యర్థులకు ప్రాక్టికల్ అనుభవం ఉండకపోవడంతో ఫార్మా రంగంలో ప్రొడక్ట్ లేదా ఫార్ములేషన్ అసిస్టెంట్లుగానే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితికి ముగింపు పలికి, ఫార్మసిస్ట్‌లను డాక్టర్లకు దీటుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఫార్మ్‌డీ కోర్సుకు అంకురార్పణ జరిగింది. రోగికి ఇచ్చే మందుల్లో ఏముంది? ఏ డోస్ ప్రకారం వేసుకోవాలి? ఆ మందులు వేసుకోవాల్సిన అవసరం రోగికి నిజంగా ఉందా? ప్రత్యామ్నాయంగా తక్కువ సైడ్ ఎఫెక్ట్‌తో దొరికే మందేమైనా ఉందా? ఇవన్నీ ఫార్మ్‌డీ కోర్సులో తెలుసుకునేలా ఉంటాయి. రోగి వివరాలు పొందుపర్చడం, ఆహార నియమాలు తెలపడం, ప్రాక్టికల్స్ ఇవన్నీ ఫార్మ్‌డీ డాక్టర్ల విధుల్లో భాగమే.

వ్యవధి: ఆరేళ్లు.
అర్హత: ఇంటర్ ఎంపీసీ/బైపీసీ ఉత్తీర్ణత.
సీట్ల సంఖ్య: 14 కాలేజీల్లో మొత్తం 400.

అవకాశాలు అనేకం: దేశంలో ఫార్మసీ పట్టభద్రులకు సమీప భవిష్యత్తులో అనేక అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. ఫార్మసీ రంగంలో విదేశీ పెట్టుబడులు పెరగడం, డ్రగ్ డెవలప్‌మెంట్, క్లినికల్ రీసెర్చ్ కార్యకలాపాలు ఊపందుకోవడమే ఇందుకు కారణం. ప్రారంభంలోనే నెలకు రూ.15 వేల జీతంతో కెరీర్ ప్రారంభించవచ్చు. అటు బోధన రంగంలోనూ లెక్చరర్లు, ప్రొఫెసర్లుగా ప్రభుత్వ విభాగాల్లో స్థిరపడేందుకు ఎంఫార్మసీ, పీహెచ్‌డీలు తోడ్పడతారుు. ఇక.. స్వయం ఉపాధి దిశగా కూడా పలు మార్గాలున్నారుు. సొంతంగా ఫార్మా టెస్టింగ్ ల్యాబ్‌లు, ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకొని డయూగ్నస్టిక్ సెంటర్లు నెలకొల్పవచ్చు. ఫార్మ్‌డీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు దేశ విదేశాల్లో ఉద్యోగావకాశాలు పుష్కలం. కేవలం ఆస్పత్రుల్లోనే కాకుండా.. క్లినికల్ రీసెర్చి సంస్థలు, డ్రగ్ డెవలప్‌మెంట్, క్లినికల్ ట్రయల్స్, క్లినికల్ ఫార్మసీ విభాగాల్లోనూ వీరికి అవకాశాలుంటాయి.

ఎంపీసీ.. బైపీసీ ఇద్దరికీ అవకాశం కల్పించే బీ ఫార్మసీ
ప్రస్తుతం మన రాష్ట్రంలో సుమారు 280 బీఫార్మసీ కళాశాలల్లో దాదాపు 25 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు పూర్తి చేసిన వారికి ఫార్మాస్యుటికల్ సంస్థల్లో అనలిటికల్ కెమిస్ట్, క్వాలిటీ కంట్రోల్ కెమిస్ట్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్స్ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. ఎం.ఫార్మసీ, ఫార్మ్-డి వంటి ఉన్నత విద్యా కోర్సులు పూర్తి చేస్తే అధ్యాపకులుగా, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాల్లో సైంటిస్ట్‌లుగా అవకాశాలు అందుకోవచ్చు. బీఫార్మసీ విద్యార్థులకు విదేశాల్లోనూ ముఖ్యంగా యూకే, అమెరికా, ఆస్ట్రేలియాల్లోనూ ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. అయితే కేవలం కోర్సు, కెరీర్ కోణంలో కాకుండా మంచి కాలేజీలో చేరాలి.

ఆయుర్వేద

వైద్య వృత్తిలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఎంబీబీఎస్ తర్వాత మరో ప్రత్యామ్నాయం... బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీఏఎంఎస్).
మన రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా బీఏఎంఎస్ కోర్సులో ప్రవేశం కల్పిస్తున్నారు.
అర్హత: ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత.
సీట్ల సంఖ్య: 14 కాలేజీల్లో మొత్తం 400.
ఉన్నత విద్య: బీఏఎంఎస్ తర్వాత పీజీ స్థారుులో ఎండీ (ఆయుర్వేద), ఎంఎస్ (ఆయుర్వేద) కోర్సులు చదివే అవకాశముంది. పీజీలో కాయ చికిత్స (జనరల్ మెడిసిన్), శల్యతంత్ర (జనరల్ సర్జరీ),ఆయుర్వేద సంహిత (ఆయుర్వేదిక్ క్లాసిక్) తదితర విభాగాలు అందుబాటులో ఉన్నారుు.

జాబ్స్:
ఉద్యోగాలపరంగానూ బీఏఎంఎస్ అభ్యర్థులకు అవకాశాలు బాగానే ఉన్నారుు. ప్రభుత్వ విభాగంలో మెడికల్ ఆఫీసర్ హోదాలో కెరీర్ ప్రారంభించవచ్చు. ఆయుర్వేద ఔషధ తయూరీ సంస్థలు(చరక్, డాబర్, హిమాలయ తదితర) కూడా అవకాశాలు కల్పిస్తున్నారుు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లోనూ అవకాశాలు లభిస్తున్నారుు. అరుుతే, అక్కడ హెర్బల్ మెడిసిన్ పేరుతో సేవలు అందిస్తున్నారు. కళాశాలల్లో లెక్చరర్ గా కూడా కెరీర్ ప్రారంభించవచ్చు.
వెబ్‌సైట్: 119.226.159.184

హోమియోపతి
ఎంబీబీఎస్, బీడీఎస్ తర్వాత ఎక్కువమంది విద్యార్థులు ఎంపిక చేసుకొనే కోర్సు.. బీహెచ్‌ఎంఎస్. ఇటీవల ఈ కోర్సు పూర్తి చేసినవారికి అవకాశాలు మెరుగుపడటం, సామాన్యులకు సైతం ఫీజులు అందుబాటులో ఉండటంతో దీనిపై ఆదరణ పెరుగుతోంది.
మన రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా బీహెచ్‌ఎంఎస్ కోర్సులో ప్రవేశం కల్పిస్తున్నారు.

అర్హత: ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత.
సీట్ల సంఖ్య: 6 కాలేజీల్లో మొత్తం 280.
కోర్సు స్వరూపం: ఐదున్నరేళ్ల బీహెచ్‌ఎంఎస్ కోర్సు లో... ఒక ఏడాది ఇంటర్న్‌షిప్ చేయూలి. ఎంబీబీఎస్‌లో మాదిరిగానే హోమియోపతిలో కూడా అనాటమీ, ఫిజియూలజీ, పాథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ తదితర సబ్జెక్టులుంటారుు. అరుుతే, వాటితోపాటు అదనంగా ప్రతి ఏటా హోమియోపతికి సంబంధించి మెటీరియా మెడికా, ఫిలాసఫీ, హోమియోపతి ఫార్మసీ సబ్జెక్ట్‌లుంటారుు.

ఉన్నత విద్య: ఉన్నత చదువులు చదవాలనుకున్నవారు ఎండీ హోమియోపతి చేయొచ్చు. విదేశాల్లో ఉన్నత చదువులు అందుబాటులో లేవు. అక్కడ హోమియోపతిని స్పెషల్ కోర్సుగా పరిగణిస్తారు. పీజీలో ప్రస్తుతం మెటీరియూ మెడికా, హోమియోపతిక్ ఫిలాసఫీ కోర్సులు ఉన్నారుు.

అవకాశాలు:
హోమియోపతి కోర్సు చేసిన విద్యార్థులకు ఇటీవల అవకాశాలు పెరుగుతున్నారుు. ఈ కోర్సు చేసినవారికి కార్పొరేట్ హాస్పటల్స్‌లోను అవకాశాలు లభిస్తున్నారుు. అలాగే సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. ప్రాక్టికల్ నాలెడ్జ్, రోగాన్ని త్వరగా నయంచేసే నైపుణ్యం ఉన్నవారు ప్రాక్టీసులో బాగా రాణించవచ్చు.
వెబ్‌సైట్: 119.226.159.184