మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్(ఎం.ఆర్క్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి? -కవిత, నల్లగొండ. దేశంలో నేడు ఆర్కిటెక్చర్ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ ఎంతో ఉంది. ఎంఎన్‌సీలు, ఎస్‌ఈజెడ్‌ల ఏర్పాటు.. విదేశీపెట్టుబడుల ప్రవాహం.. కారణంగా ఈ రంగం వేగంగా విస్తరిస్తోంది. కాబట్టి కేవలం బ్యాచిలర్ డిగ్రీనే కాకుండా మాస్టర్ డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసుకున్న వారు కార్పొరేట్ రంగంతోపాటు ప్రభుత్వ రంగంలోనూ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఎం.ఆర్క్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు: జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ-హైదరాబాద్, ఎం.ఆర్క్ కోర్సును ఆఫర్ చేస్తుంది. అర్హత: బీఆర్క్. ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వివరాలకు: http://jnafau.ac.in స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్-న్యూఢిల్లీ, ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్, అర్బన్ డిజైన్ స్పెషలైజేషన్స్‌గా మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్(ఎం.ఆర్క్) కోర్సును అందిస్తుంది. అర్హత: 55శాతం మార్కులతో బీఆర్క్/బీప్లానింగ్. వివరాలకు: www.spa.ac.in జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ- న్యూఢిల్లీ, మెడికల్ ఆర్కిటెక్చర్, బిల్డింగ్ సర్వీసెస్ రిక్రియేషనల్ అండ్ ఆర్కిటెక్చర్ స్పెషలైజేషన్లుగా ఎం.ఆర్క్. కోర్సును ఆఫర్ చేస్తుంది. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. వివరాలకు: http://jmi.ac.in/ ముద్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆఫర్ చేస్తున్న కోర్సులేవి? సురేష్, రామగుండం. కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్‌లో దేశంలోనే ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్ ముద్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్. దీన్ని 1991లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో స్థాపించారు. ఈ ఇన్‌స్టిట్యూట్ మేనేజ్‌మెంట్ కమ్యూనికేషన్‌లో పలు రకాల కోర్సులను ఆఫర్ చేస్తుంది. వివరాలు.. ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ కమ్యూనికేషన్: అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ (హ్యుమానిటీస్/జర్నలిజం/బిజినెస్ మేనేజ్‌మెంట్/అడ్వర్‌టైజింగ్/మార్కెటింగ్/పీఆర్) లేదా తత్సమానం. పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కమ్యూనికేషన్: అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్. పీజీ సర్టిఫికెట్ ఇన్ క్రాఫ్టింగ్ క్రియేటివ్ కమ్యూనికేషన్ అర్హత: గ్రాడ్యుయేషన్. పీజీ సర్టిఫికెట్ ఇన్ క్రాఫ్టింగ్ క్రియేటివ్ కమ్యూనికేషన్ అర్హత: గ్రాడ్యుయేషన్. ప్రవేశం: కోర్సులను బట్టి క్యాట్ స్కోర్/ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే రాతపరీక్ష/గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా. ఇన్‌స్టిట్యూట్ రెగ్యులర్ కోర్సులతోపాటు అడ్వర్‌టైజింగ్ మేనేజ్‌మెంట్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, రీసెర్చ్ అండ్ డేటా ఎనాలిసిస్ విభాగాల్లో పీజీ సర్టిఫికెట్ కోర్సులను ఆన్‌లైన్ విధానంలో అందిస్తుంది. వివరాలకు: www.mica.ac.in ఎయిమ్స్ నుంచి ఎంబీబీఎస్ చేయాలంటే? -శ్వేత, కరీంనగర్ దేశంలోని ప్రఖ్యాత మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లలో న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) ఒకటి. ఈ ఇన్‌స్టిట్యూట్ ఆఫర్ చేసే ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి అర్హత: 60 శాతం మార్కులతో ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో 10+2/ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. మూడున్నర గంటలపాటు మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. రాత పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. ఇంగ్లిష్/హిందీ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. రాతపరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీలను కలిపి)ల నుంచి 60 ప్రశ్నల చొప్పున వస్తాయి. మిగతా 20 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్‌పై ఉంటాయి. తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదలైంది. జూన్‌లో ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది. వివరాలకు: www.aiims.edu సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (సీఎఫ్‌పీ) కోర్సు వివరాలు, ఆ కోర్సు అర్హతగా లభించే అవకాశాల గురించి తెలపండి? శివ, హైదరాబాద్. చార్టెర్డ్ అకౌంటెన్సీ(సీఏ), కంపెనీ సెక్రటరీ, ఐసీడబ్ల్యూఏ మాదిరిగానే ఒక ప్రొఫెషనల్ కోర్సు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్(సీఎఫ్‌పీ). ఫైనాన్షియల్ ప్లానింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ అడ్వైజరీ రంగాల్లో.. అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న కోర్సు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. భారత్‌లో ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్(ఎఫ్‌పీఎస్‌బీ)-ఇండియా, అమెరికాలోని డెన్వర్ కేంద్రంగా పని చేసే ఎఫ్‌పీఎస్‌బీ.. అంతర్జాతీయంగా ఈ కోర్సు వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొఫెషనల్స్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఆఫీసర్స్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్, స్టాక్ బ్రోకర్స్ సంబంధిత రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్‌తోపాటు గ్రాడ్యుయేట్లు కూడా ఈ కోర్సును ఎంచుకోవచ్చు.సీఎఫ్‌పీ సర్టిఫికెట్ పొందడానికి ముందుగా.. కోర్సును ఆఫర్ చేస్తున్న సంబంధిత ఏజెన్సీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత నిర్దేశించిన కరిక్యులంను పూర్తి చేయాలి. ఇందులో ఆరు మాడ్యూల్స్ ఉంటాయి. మొదటి మాడ్యూల్‌లో ఇంట్రడక్షన్ టు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది. తర్వాతి దశలో.. రిస్క్ అనాలిసిస్ అండ్ ఇన్సూరెన్స్ ప్లానింగ్, రిటైర్‌మెంట్ ప్లానింగ్ అండ్ ఎంప్లాయీ బెనిఫిట్స్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్, ట్యాక్స్ ప్లానింగ్ అండ్ ఎస్టేట్ ప్లానింగ్ సబ్జెక్టులు ఉంటాయి. ఎగ్జామ్ 1,2,3,4గా వ్యవహరించే.. ఈ కోర్సును నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ) ఆఫర్ చేస్తుంది. తర్వాత సీఎఫ్‌పీ ఎగ్జామ్‌కు హాజరవ్వాలి. దీన్నే ఎగ్జామ్-5 అని కూడా అంటారు. ఈ కోర్సు డిస్టెన్స్, ఈ-లెర్నింగ్, పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ పద్ధతుల్లో అందుబాటులో ఉంది. వివరాలకు: www.fpsb.co.in ఎంబీఏ(మార్కెటింగ్)కోర్సు చేసిన వారికి సేల్స్ పరంగా కాకుండా ఎటువంటి అవకాశాలు ఉంటాయి? -శరణ్, సికింద్రాబాద్. ఎంబీఏ (మార్కెటింగ్) కోర్సు పూర్తి చేసిన వారికి సేల్స్ పరంగా కాకుండా చాలా అవకాశాలు ఉన్నాయి. వీరు బ్రాండ్ మేనేజర్, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్, న్యూప్రొడక్ట్ మేనేజర్ వంటి హోదాల్లో స్థిరపడొచ్చు. ఇవన్నీ సేల్స్ విభాగంతో ముడిపడి ఉన్న జాబ్స్ అయినప్పటికీ.. జాబ్ నేచర్‌లో తేడాలు ఉంటాయి. డిజైనింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీస్(మార్కెట్ వ్యూహాలను రూపొందించడం), అడ్వర్‌టైజింగ్, పబ్లిక్ రిలేషన్స్, కస్టమర్ రిలేషన్‌షిప్, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, డెవలప్‌మెంట్ మేనేజర్ వంటి హోదాల్లో వివిధ బ్యాంకులు, ఇండస్ట్రీస్, ఫైనాన్స్ కంపెనీలలో స్థిరపడొచ్చు. |
Thursday, March 29, 2012
రాష్ర్టంలో ‘సెట్(కామన్ ఎంట్రెన్‌స టెస్ట్)’ల సందడి మొదలైంది. పాలిటెక్నిక్ మొదలు..పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు పలు కోర్సుల్లో ప్రవేశానికి వివిధ ‘సెట్’ల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఒక్కో సెట్‌ది ఒక్కో తీరు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్లు విడుదలైన సెట్స్ సమాచార సమాహారం.. వాటి ప్రిపరేషన్ టిప్స్ మీ కోసం...
సీప్-2012
ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు పాలిటెక్నిక్ (సీప్)- 2012’ ప్రకటన వెలువడింది. ఈ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత, ఈ సంవత్సరం పరీక్ష రాస్తున్నవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం: రెండుగంటల వ్యవధిలో జరిగే పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. మ్యాథ్స్ 60, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30 మార్కులకు ఉంటాయి. మంచి ర్యాంక్ రావాలంటే మ్యాథ్స్‌పై పట్టు తప్పనిసరి. ప్రశ్నలు సాధారణంగా కాన్సెప్ట్ బేస్డ్‌గా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు తొమ్మిది, పది తరగతుల.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి.
ఇవీ కోర్సులు:
మూడేళ్ల వ్యవధితో: అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ (షుగర్ టెక్నాలజీ), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ.
మూడున్నరేళ్ల వ్యవధితో: స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ విత్ బయోమెడికల్ ఇంజనీరింగ్, సిరామిక్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్(ఆయిల్ టెక్నాలజీ/పెట్రో కెమికల్స్/ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్), స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ విత్ ఎంబడెడ్ సిస్టమ్స్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ విత్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ విత్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ విత్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ విత్ టీవీ అండ్ సౌండ్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ.
నాన్ ఇంజనీరింగ్: కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్; వ్యవధి: మూడేళ్లు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా
ఆఫ్‌లైన్ దరఖాస్తు విధానం: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లో * 20 నగదు చెల్లించి దరఖాస్తు పొందొచ్చు.
ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2012
ప్రవేశ పరీక్ష: మే 2, 2012
వెబ్‌సైట్: www.sbtetap.gov.in
పీజీఈసెట్-2012
రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో ఎంఈ/ ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, ఎంప్లానింగ్, ఫార్మ్‌డీ (పోస్ట్ బాక్యులరేట్) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) ప్రకటన వెలువడింది. ఆ వివరాలు...
అర్హతలు: బీటెక్/బీఈ/ఏఎంఐఈ/బీఫార్మసీ/బీఆర్క్/బీప్లానింగ్‌లలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఫైనలియర్ విద్యార్థులు కూడా అర్హులే.
పరీక్ష విధానం: రెండు గంటలలో జరిగే పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 120 మార్కులుంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 60 శాతం థియరీ, 40 శాతం ప్రాబ్లమ్స్ (ఫార్ములా బేస్డ్) ప్రశ్నలు ఉంటాయి.
సిలబస్: పీజీఈసెట్ సిలబస్ అంతా గేట్ సిలబస్ మాదిరిగానే ఉంటుంది. ప్రశ్నలు గేట్ కంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉంటా యి. గేట్ ప్రిపరేషన్ సాగించేవారు ఈ పరీక్షలో మంచి ర్యాంకు సొంతం చేసుకోవచ్చు.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 23
పరీక్షలు: జూన్ 8, నుంచి జూన్ 11, 2012
వెబ్‌సైట్: www.appgecet.org
ఈసెట్-2012
పాలిటెక్నిక్, బీఎస్సీ మ్యాథ్స్ కోర్సులు చేసిన విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ ద్వారా డెరైక్ట్‌గా యూజీ ఇంజనీరింగ్/ ఫార్మసీ కోర్సుల్లో సెకండియర్‌లో ప్రవేశానికి నిర్వహించే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్)-2012 నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలు..
అర్హత: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ గుర్తింపు పొందిన కళాశాల నుంచి 45 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచ్‌తో పాలిటెక్నిక్ డిప్లొమా ఉత్తీర్ణత. ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే, లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 45 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా డిగ్రీ ఉత్తీర్ణత.
ప్రవేశ పరీక్ష విధానం: మూడు గంటల వ్యవధిలో జరిగే పరీక్షలో ఆబ్జెక్టివ్ విధానంలో రెండొందల ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. డిప్లొమా విద్యార్థులకు ఒక విధంగా, బీఎస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు మరో విధంగా పరీక్ష ఉంటుంది.
డిప్లొమా విద్యార్థులకు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి: మ్యాథమెటిక్స్-50, ఫిజిక్స్-25, కెమిస్ట్రీ-25, పాలిటెక్నిక్‌లో సంబంధిత బ్రాంచ్ (ఉదా: మెకానికల్, సివిల్, ఈసీఈ)కు 100 మార్కులుంటాయి.
బీఎస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు: మ్యాథమెటిక్స్-100, ఎనలిటికల్ ఎబిలిటీ-50, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్-50 ఉంటాయి.
ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి: ఫార్మాస్యూటిక్స్-50, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ-50, ఫార్మకాగ్నసీ-50, ఫార్మకాలజీ-50 మార్కులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో నిర్దేశిత పోస్టాఫీసులు, ఈసేవా కేంద్రా లు, యాక్సిస్ బ్యాంక్ శాఖల్లో *300 నగదు చెల్లించి పొందొచ్చు.
ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 2, 2012
ప్రవేశ పరీక్ష: మే 24, 2012
వెబ్‌సైట్: www.apecet.org
లాసెట్, పీజీఎల్‌సెట్-2012
మూడేళ్ల బీఎల్/ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ/బీఎల్/బీబీఏ-ఎల్‌ఎల్‌బీ (ఇంటిగ్రేటెడ్ కోర్సు) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్-2012 నోటిఫికేషన్ వెలువడింది. దీంతోపాటుగా పీజీ ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి పోస్ట్‌గ్రాడ్యుయేట్ లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ప్రకటన కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ ప్రవేశ పరీక్షల అర్హతలు, పరీక్ష విధానాలపై ఫోకస్..
యూజీ కోర్సులు:
అర్హత: మూడేళ్ల లా కోర్సుకు 10+2+3 విధానంలో ఏదై నా డి గ్రీలో 45 శాతం మార్కులతో, ఐదేళ్ల లా కోర్సుకు ఇంటర్మీడియట్ (10+2) విధానంలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 40 శాతం మార్కులు సరిపోతాయి)
వయోపరిమితి: మూడేళ్ల కోర్సుకు 30 ఏళ్లు, ఐదేళ్ల కోర్సు కు 20 ఏళ్లు మించరాదు.(ఎస్సీ, ఎస్టీలకు మూడేళ్ల కోర్సు కు ఐదేళ్లు, ఐదేళ్ల కోర్సుకు రెండేళ్లు వయోసడలింపు)
పీజీ కోర్సులు:
అర్హత: ఎల్‌ఎల్‌బీ/బీఎల్ ఉత్తీర్ణులు, ఆఖరు సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు గరిష్ట వయోపరిమితి లేదు.
పరీక్ష విధానం:
యూజీ పరీక్ష ఇలా...
గంటన్నర వ్యవధిలో జరిగే పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఒక్కోదానికి ఒక్కో మార్కు. మూడు విభాగాలుండే ప్రశ్నపత్రంలో పార్ట్-ఎలో జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీకి 30 ప్రశ్నలు, పార్ట్-బిలో కరెంట్ అఫైర్స్‌కు 30 ప్రశ్నలు, పార్ట్-సిలో లా ఆప్టిట్యూడ్‌పై 60 ప్రశ్నలుంటాయి. ఐదేళ్ల లా ప్రశ్నపత్రం ఇంటర్మీడియట్ స్థాయిలో, మూడేళ్ల లా ప్రశ్నపత్రం డిగ్రీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది.
పీజీ లా సెట్ ఇలా...
పరీక్ష విధానం: మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. 90 నిమిషాల వ్యవధి. ప్రశ్నపత్రంలో రెండు పార్ట్‌లు ఉంటాయి. పార్ట్-ఎలో భాగంగా జూరిస్ ప్రుడెన్స్‌పై 20, కాన్‌స్టిట్యూషనల్ లాపై 20 ప్రశ్నలు అడుగుతారు. పార్ట్-బీలో పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, మర్కెంటైల్ లా, లేబర్ లా, క్రైమ్స్ అండ్ టోర్ట్స్, ఐపీఆర్ అండ్ అదర్ లాస్ ఒక్కో అంశంపై 16 ప్రశ్నలు చొప్పున మొత్తం 80 ప్రశ్నలుంటాయి.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, లేదా నిర్దేశిత హెడ్ పోస్టాఫీసులు, యాక్సిస్ బ్యాంక్ శాఖలలో * 250 చెల్లించి పొందొచ్చు. పీజీఎల్‌సెట్ దరఖాస్తుల కోసం సెక్రటరీ, ఏపీఎస్‌సీహెచ్‌ఈ పేరిట హైదరాబాద్‌లో చెల్లేలా *500డీడీ తీసి ప్రధా న యూనివర్సిటీల లా క్యాంపస్ కళాశాలల్లో పొందొచ్చు.
ముఖ్య తేదీలు:
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2012
పరీక్ష తేదీ: జూన్ 2, 2012
వెబ్‌సైట్: www.aplawcet.org/home.htm
ఎడ్‌సెట్-2012
డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించడానికి అవకాశం కల్పించే కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ). ఈ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్షే.. ఎడ్‌సెట్. ఈ పరీక్షలో ర్యాంకుతోనే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఏడాది వ్యవధి ఉండే బీఈడీ కోర్సులో ఫిజికల్ సెన్సైస్, బయోలాజికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్ మెథడాలజీల్లో ప్రవేశం పొందొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 610 బీఈడీ కళాశాలల్లో.. సుమారుగా 65,000 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఎడ్‌సెట్ అర్హతలు, సిలబస్, పరీక్ష విధానం వివరాలు..
అర్హత: బీఏ/బీఎస్సీ/ బీకాం/బీఎస్సీ(హోంసైన్స్) /బీసీఏ/బీబీఎం 50 శాతం(రిజర్వుడ్ కేటగిరీ విద్యార్థులు 40 శాతం) మార్కులతో ఉత్తీర్ణత, లేదా పీజీ ఉత్తీర్ణత, డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులూ అర్హులే.
వయోపరిమితి: జూలై 1, 2012 నాటికి 19 ఏళ్లు ఉండాలి.
పరీక్ష విధానం: రెండు గంటల వ్యవధిలో జరిగే పరీక్షలో 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. పార్ట్-ఎ, పార్ట్-బి అందరికీ కామన్‌గా ఉంటుంది. పార్ట్-సి అభ్యర్థి ఎంచుకున్న అంశంలో 100 మార్కులకు ఉంటుంది.
పార్ట్-ఎ: జనరల్ ఇంగ్లిష్: రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సస్, స్పెల్లింగ్, వొకాబ్యులరీ, సినానిమ్స్, యాంటోనిమ్స్; సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్; డెరైక్ట్ స్పీచ్, ఇన్ డెరైక్ట్ స్పీచ్‌లపై 25 ప్రశ్నలకు 25 మార్కులు.
పార్ట్-బి: జనరల్ నాలెడ్జ్: వర్తమాన వ్యవహారాలతోపాటు సైంటిఫిక్ ఈవెంట్స్, పొరుగు దేశాల చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఎకాలజీ, ఎకనామిక్స్, జనరల్ పాలసీ, సైంటిఫిక్ రీసెర్చ్‌లపై 15 ప్రశ్నలు అడుగుతారు.
టీచింగ్ ఆప్టిట్యూడ్: టీచింగ్ స్కిల్స్‌ను పరీక్షించేలా 10 ప్రశ్నలు అడుగుతారు. టీచర్లు-విద్యార్థుల మధ్య సంబంధాలు, విద్యార్థులకు బోధించడంలో టీచర్ల సామర్థ్యం, మంచి టీచర్ల లక్షణాలు, వ్యక్తిగత వైరుధ్యాలున్న విద్యార్థులకు బోధించడంలో బోధకుడి సమర్థత, జనరల్ ఇంటెలిజెన్స్, ఎనలిటికల్ థింకింగ్‌లపై ప్రశ్నలుంటాయి.
పార్ట్-సి: 100 మార్కులు. కింది అంశాల్లో ఏదైనా ఒక దాన్ని అభ్యర్థి రాయాల్సి ఉంటుంది.
1) మ్యాథమెటిక్స్-100
2) ఫిజికల్ సెన్సైస్(ఫిజిక్స్ - 50, కెమిస్ట్రీ - 50)
3) బయోలాజికల్ సెన్సైస్(బోటనీ-50,జువాలజీ-50)
4) సోషల్ సెన్సైస్(జాగ్రఫీ - 35, హిస్టరీ- 30, సివిక్స్ - 15, ఎకనామిక్స్-20) 5) ఇంగ్లిష్ -100
ఆప్షనల్స్ సిలబస్: మొదటి నాలుగు సబ్జెక్టులకు విద్యార్థులు తాము చదివిన డిగ్రీ సిలబస్‌ను బాగా చదువుకోవాలి. ఇంగ్లిష్‌కు మాత్రం ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు, ఇంటర్మీడియెట్ సిలబస్ నుంచి 50 ప్రశ్నలు, డిగ్రీ సిలబస్ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా
ఆఫ్‌లైన్ దరఖాస్తు విధానం: నిర్దేశిత హెడ్‌పోస్టాఫీసుల్లోనూ, యాక్సిస్ బ్యాంక్ ప్రధాన శాఖల్లో * 150 నగదు చెల్లించి దరఖాస్తులు పొందొచ్చు.
ముఖ్య తేదీలు:
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 23, 2012
పరీక్ష తేదీ: జూన్ 8, 2012
వెబ్‌సైట్: www.edcet2012.info

Saturday, March 24, 2012
బీటెక్ తర్వాత గేమ్ డిజైనింగ్ కోర్సులు చేయాలంటే?
గేమ్ డిజైన్‌లో అంత ర్లీనంగా ఉండేది యానిమేషనే. యానిమేషన్‌లో స్పెషల్ కోర్సుల ద్వారా గేమ్ డిజైన్‌లో స్థిరపడొచ్చు. ఐతే గేమ్ డిజైనర్లకు కోడింగ్‌పై ప్రావీణ్యం, కొత్తగా ఆలోచించగలగడం, సృజన, తర్కం లాంటివి అనివార్యం. ప్రస్తుతం గేమింగ్ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతోంది. కేవలం దీనికోసమే కొన్ని కంపెనీలు వెలిశాయి. మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఎక్స్‌బాక్స్ లాంటి ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. హైదరాబాద్ లాంటి చోట్ల కూడా సెవెన్ సీస్ టెక్నాలజీస్ లాంటి కంపెనీలు కేవలం గేమింగ్ పరిశ్రమ కోసమే వెలిశాయి.
డిజైనింగ్‌లో ఉన్నతస్థాయిలో స్థిరపడాలనుకుంటే ఐఐటీ-బాంబే నిర్వహించే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్-(సీడ్) పరీక్ష రాయాలి. ఈ పరీక్ష ద్వారా ఐఐటీ-బాంబే, ఢిల్లీ, గౌహతి, కాన్పూర్‌లతోపాటు ఐఐఎస్సీ బెంగళూరుల్లో మాస్టర్ ఇన్ డిజైన్ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. ఈ సంస్థల్లో వివిధ రకాల డిజైన్ కోర్సులు ఉన్నాయి. గేమింగ్ పరిశ్రమలో చేరాలనుకున్నవాళ్లు మాస్టర్ ఇన్ డిజైన్‌లో యానిమేషన్ కోర్సు ఎంపిక చేసుకోవాలి.
సీడ్ పరీక్ష ద్వారా ఐఐటీలతో పాటు మరికొన్ని సంస్థల్లో కూడా ప్రవేశం లభిస్తుంది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఐఐటీ-బాంబే వెబ్‌సైట్ www.iitb.ac.in లో లభిస్తాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-అహ్మదాబాద్ కూడా డిజైనింగ్‌లో వివిధ కోర్సులు అందిస్తుంది. ఈ సంస్థ డిజైనింగ్ కోర్సుల్లో దేశంలోనే ప్రసిద్ధమైందిగా చెప్పుకోవచ్చు. ఇవేకా కుండా గేమ్ డెవలప్‌మెంట్, గేమ్ డిజైనింగ్ పేరుతో వివిధ సంస్థలు సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ కోర్సులు అందిస్తున్నాయి.
కంపెనీ సెక్రటరీ కోర్సు వివరాలు తెలపండి? -కిషోర్ కుమార్, విశాఖపట్నం
ఈ కోర్సులో మూడు దశలు ఉంటాయి. అవి... ఫౌండేషన్ ప్రోగ్రాం, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం, ప్రొఫెషనల్ ప్రోగ్రాం. ఇంటర్మీడియెట్ పూర్తికాగానే ముందుగా ఫౌండేషన్ కోర్సు చేయాలి. ఇందులో ఐదు సబ్జెక్టులు ఉంటాయి. అవి.. ఇంగ్లిష్ అండ్ బిజినెస్ కమ్యూనికేషన్స్, బేసిక్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, ఫైనల్ అకౌంటింగ్, ఎలిమెంట్స్ ఆఫ్ బిజినెస్ లాస్ అండ్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్స్ సిస్టమ్స్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్. ఫౌండేషన్ కోర్సు పరీక్షలు ప్రతి ఏటా డిసెంబర్ , జూన్‌ల్లో జరుగుతాయి.
మార్చి 31 లోపు పేరు నమోదు చేసుకుంటే... డిసెంబర్‌లో జరిగే పరీక్షలకు, సెప్టెంబర్ 30లోపు నమోదు చేసుకుంటే... తర్వాత ఏడాది జూన్‌లో జరిగే పరీక్షలు రాయొచ్చు. ఫౌండేషన్ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం కోసం పేరు నమోదు చేసుకోవాలి. దీనిలో నూ ఉత్తీర్ణులు ఫైనల్ ప్రోగ్రాంలో చేరొచ్చు. కోర్సు పూర్తి చేసినవాళ్లు బహుళజాతి కంపెనీల్లో కంపెనీ సెక్రటరీగా స్థిరపడొచ్చు.
వెబ్‌సైట్: www.icsi.edu

Wednesday, March 21, 2012
ఐఐటీ గౌహతి
వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)- గౌహతి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పీహెచ్‌డీ: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్ట్రికల్, మెకానికల్, సివిల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, డిజైన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్, సెంటర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, ఎనర్జీ, నానో టెక్నాలజీ. అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ మెడికల్ సెన్సైస్/ వెటర్నరీ సెన్సైస్/ఫార్మసీలో పీజీ/ ఎమ్మెస్సీ(మ్యాథమెటిక్స్)/ ఎంఆర్క్/మాస్టర్ ఆఫ్ డిజైన్/ఎంటెక్/ఎంఈ/ సైన్స్ సంబంధిత అంశాల్లో పీజీ. హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ కోసం కనీసం 55 శాతం మార్కులతో ఆర్ట్స్/కామర్స్‌లో పీజీ. డ్యూయల్ డిగ్రీ కోర్సులు: ఎంటెక్+పీహెచ్‌డీ-కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అర్హత: బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ఎంఏ: డెవలప్‌మెంటల్ స్టడీస్ అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ. ఎంటెక్: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ మాస్టర్ ఆఫ్ డిజైన్: అర్హత: సంబంధిత అంశంలో డిగ్రీ. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 23, 2012 వెబ్‌సైట్: http://www.iitg.ac.in ఐఐటీ ఖరగ్‌పూర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-ఖరగ్‌పూర్ ఇంజనీరింగ్, సిటీ ప్లానింగ్‌లో జాయింట్ మాస్టర్, పీహెచ్‌డీ కోర్సు - ఎంటెక్/ఎంసీపీ-పీహెచ్‌డీలో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత: కనీసం 60 శాతం(ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 55 శాతం) మార్కులతో ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత. ఎంపిక: గేట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా.. దరఖాస్తు ఫీజు: రూ.500(పీడీ/ఎస్సీ/ఎస్టీలకు రూ.250) దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2012; వెబ్‌సైట్: http://gate.iitkgp.ernet.in/mtech మాస్టర్ ఆఫ్ గ్లోబల్ బిజినెస్ ఎస్‌పీ జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్.. మాస్టర్ ఆఫ్ గ్లోబల్ బిజినెస్(ఎంజీబీ)లో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ సంస్థకు దుబాయ్, సింగపూర్, సిడ్నీల్లో క్యాంపస్‌లున్నాయి. కోర్సు కాలపరిమితి: 16 నెలలు(నాలుగు నెలల ఇంటర్న్‌షిప్) అర్హత: ఏదైనా అంశంలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు కనీసం మూడేళ్ల అనుభవం. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా వెబ్‌సైట్: ఠీఠీఠీ.టఞ్జ్చజీ.ౌటజ ఎన్‌ఐడీలో ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం దిగువ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిప్లొమసీ(ఎన్‌ఐడీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంఏ: డిప్లొమసీ/ ఇంటర్నేషనల్ రిలేషన్స్/ సౌత్ ఏషియన్ అసోసియేషన్ అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. కోర్సు: ఎల్‌ఎల్‌ఎం అర్హత: ఎల్‌ఎల్‌బీ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2012 వెబ్‌సైట్: http://www.diplomacy.net.in ఎఫ్‌డీడీఐ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) వివిధ కోర్సు ల్లో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మాస్టర్ డిగ్రీ కోర్సులు: ఫ్యాషన్ మార్కెంటైజింగ్ అండ్ రిటైల్ మేనేజ్‌మెంట్, ఫుట్‌వేర్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, క్రియేటివ్ డిజైన్ అండ్ సీఈడీ/ సీఏఎం, లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీ డిజైన్, విజువల్ మార్కెంటైజింగ్ అండ్ కమ్యూనికేషన్ డిజైన్, ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ మేనేజ్‌మెంట్. బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు: ఫ్యాషన్ మార్కంటైజింగ్ అండ్ రిటైల్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫుట్‌వేర్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీ డిజైన్. దరఖాస్తులు: వెబ్‌సైట్‌లో లభిస్తాయి. వెబ్‌సైట్: www.fddiindia.com |
Saturday, March 17, 2012
పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ
పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ ప్రకటన విడుదలచేసింది.
ఎంఏ కోర్సులు: ఆంత్రోపాలజీ, అప్లైడ్ ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, హిందీ, హిస్టరీ, మాస్ కమ్యూనికేషన్, ఫిలాసఫీ, పాలిటిక్స్, సంస్కృతం, సోషియాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్, తమిళం
ఎమ్మెస్సీ కోర్సులు: అప్లైడ్ జియాలజీ, అప్లైడ్ సైకాలజీ, ఆస్ట్రో ఫిజిక్స్, బయో కెమిస్ట్రీ, బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ, కెమికల్ సెన్సైస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, కంప్యుటేషనల్ బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్, ఎలక్ట్రానిక్ మీడియా, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మెరైన్ బయాలజీ, మ్యాథ్స్, మైక్రోబయాలజీ, ఫిజిక్స్, క్వాంటిటేటివ్ ఫైనాన్స్, స్టాటిస్టిక్స్
ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు: అప్లైడ్ జియాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, హిస్టరీ, పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ సైన్స్, సోషియాలజీ
ఎంకాం, ఎంఎడ్, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్, ఎంపీఈడీ, ఎంఎస్‌డబ్ల్యు, ఎంపీఏ, ఎల్‌ఎల్‌ఎం లతోపాటు వివిధ పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:
ఏప్రిల్ 16, 2012
పరీక్ష తేదీలు: మే 26, 27
వెబ్‌సైట్: www.pondiuni.edu.in
మణిపాల్ యూనివర్సిటీ
దిగువ పేర్కొన్న అంశాల్లో డిగ్రీ, పీజీ, సూప ర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశానికి మణిపాల్ యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అంశాలు..
మేనేజ్‌మెంట్, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్‌మెంట్, జ్యూయలరీ డిజైన్ అండ్ మేనేజ్‌మెంట్, మీడియా అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ సైన్స్, రీజనరేటివ్ మెడిసిన్, హ్యుమానిటీస్, జియోపాలిటిక్స్, గాంధీయన్ అండ్ పీస్ స్టడీస్, బేసిక్ సెన్సైస్, లైబ్రరీ సైన్స్, మెడిసిన్, డెంటిస్ట్రీ, అలైడ్ హెల్త్ సెన్సైస్, నర్సింగ్, ఫార్మసీ, లైఫ్ సెన్సైస్, వైరాలజీ, పబ్లిక్ హెల్త్,
వెబ్‌సైట్: www.manipal.edu
మ్యాట్-2012
ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూట్ టెస్ట్ (మ్యాట్)- 2012కు ప్రకటన వెలువడింది. ఈ పరీక్ష ద్వారా 160కి పైగా బిజినెస్ స్కూళ్లలో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
అర్హత: ఏదైనా అంశంలో డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనలియర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
రాత పరీక్ష: కంప్యూటర్ బేస్డ్, పేపర్ బేస్డ్ టెస్ట్‌ల్లో ఒక పరీక్షను ఎంపిక చేసుకోవాలి
దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా
ఆంధ్రప్రదేశ్‌లో రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:
ఏప్రిల్ 14, 2012
రాత పరీక్ష తేదీ: మే 6, 2012
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తేదీ: మే 12, 2012
వెబ్‌సైట్: www.aimaind.org
Thursday, March 15, 2012
చార్టెర్‌డ అకౌంటెంట్ ఉద్యోగం.. లక్షల్లో జీతం
|
సీఏ కోర్సు ఇలా..
కచ్చితంగా అయిదంకెల జీతాలు.. మరి కాసింత నైపుణ్యాలతో కలర్‌ఫుల్ కెరీర్‌కు మార్గం వేసే కోర్సు చార్టర్డ్ అకౌంటెన్సీ. ఈ రంగంలో అడుగు పెట్టాలనుకునే విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వెంటనే అందుకు శ్రీకారం చుట్టాలి. మొత్తం మూడు దశలుగా ఉండే చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు వివరాలు..
మొదటి దశ కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్:
భవిష్యత్తులో సీఏగా స్థిరపడాలనుకునే విద్యార్థులు మొదటిగా ఎదుర్కోవాల్సిన పరీక్ష కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సీపీటీ). ఈ పరీక్ష రాయాలంటే ముందుగా పదో తరగతి సర్టిఫికెట్ ఆధారంగా తమ పేరు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సు పరీక్షలు రాశాక సీపీటీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే దరఖాస్తు చేసుకునే సమయానికి, సీపీటీకి మధ్య కనీసం రెండు నెలల వ్యవధి తప్పనిసరి. ఉదాహరణకు జూన్‌లో జరిగే సీపీటీకి హాజరు కావాలంటే ఏప్రిల్ 1లోపు; డిసెంబర్‌లో జరిగే సీపీటీకి అక్టోబర్ 1లోపు దరఖాస్తు చేసుకోవాలి.
సీపీటీ పరీక్ష, సిలబస్: మొత్తం రెండు వందల మార్కులకు రెండు సెషన్లలో సీపీటీని నిర్వహిస్తారు. ప్రతి సెషన్‌కు రెండు గంటల సమయం ఉంటుంది. మొదటి సెషన్‌లో సెక్షన్ ఎ(ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్-60 మార్కులు); సెక్షన్ బి(మర్కెంటైల్ లా-40 మార్కులు) ఉంటాయి. రెండో సెషన్‌లో సెక్షన్-ఎ జనరల్ ఎకనామిక్స్, సెక్షన్-బి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటాయి. ప్రతి సెక్షన్‌కు 50 మార్కులు.
ఇంటిగ్రేటెడ్ ప్రొషెఫనల్ కాంపిటెన్స్ కోర్స్:
సీఏగా రూపుదిద్దుకోవడంలో రెండో దశ ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కోర్స్ (ఐపీసీసీ). సీపీటీతోపాటు ఇంటర్మీడియెట్ కూడా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మాత్రమే ఐపీసీసీ నమోదు కోసం అర్హత లభిస్తుంది. నమోదు చేసుకున్న తర్వాత తప్పనిసరిగా తొమ్మిది నెలల స్టడీ కోర్స్‌ను పూర్తి చేయాలి.
ఆ తర్వాత వారం రోజులు పాటు నిర్వహించే ఓరియెంటేషన్ కోర్స్; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్‌లో నిర్వహించే వంద గంటల కోర్సులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మాత్రమే ఐపీసీసీ పరీక్ష రాసేందుకు అనుమతి లభిస్తుంది.
ఐపీసీసీ స్వరూపం, సిలబస్: ఐపీసీసీని గ్రూప్-1, గ్రూప్-2లుగా విభజించారు. గ్రూప్-1 నాలుగు పేపర్లు; గ్రూప్-2లో మూడు పేపర్లు ఉంటాయి. అవి..
గ్రూప్-1:
పేపర్-1 అకౌంటింగ్; పేపర్-2 బిజినెస్ ‘లా’స్, ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్; పేపర్-3 కాస్ట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, పేపర్-4 టాక్సేషన్.
గ్రూప్-2: పేపర్-5 అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్; పేపర్-6 ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్; పేపర్-7 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్.
రెండు గ్రూపుల్లోనూ ప్రతి పేపర్ పరీక్షను వంద మార్కులకు నిర్వహిస్తారు.
ఫైనల్ కోర్స్:
పేరు పక్కన చార్డర్డ్ అకౌంటెంట్ అనే హోదా పొందే క్రమంలో.. సీఏ కోర్సులో చివరి దశ ఫైనల్ కోర్స్. ఐపీసీసీలోని రెండు గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించి, ఇన్‌స్టిట్యూట్ గుర్తింపు పొందిన చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర మూడేళ్ల ఆర్టికల్ అసిస్టెంట్ శిక్షణ పూర్తయ్యాక తర్వాత మాత్రమే ఫైనల్ కోర్సు పరీక్ష రాసేందుకు అర్హత లభిస్తుంది. ఈ క్రమంలో విద్యార్థులు ఐపీసీసీలోని ఒక గ్రూప్ లేదా రెండు గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన వెంటనే ఆర్టికల్ అసిస్టెంట్ శిక్షణ కోసం నమోదు చేసుకోవాలి.
దాని ఆధారంగా ఫైనల్ కోర్సుకు నమోదు చేసుకోవాలి. మూడేళ్ల ఆర్టికల్ అసిస్టెంట్ శిక్షణ పూర్తయ్యాక ఫైనల్ కోర్సు పరీక్ష రాసేందుకు అర్హత లభిస్తుంది. అయితే ఈ విషయంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా విద్యార్థులకు కొంత వెసులుబాటు కల్పించింది. మూడేళ్ల ఆర్టికల్ అసిస్టెంట్ శిక్షణలోని చివరి ఆరు నెలల్లో ఫైనల్ కోర్సు పరీక్షలకు హాజరు కావచ్చు.
ఫైనల్ కోర్సు అభ్యసించే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం జనరల్ మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ (జీఎంసీఎస్) కోర్స్. ఇది 15 రోజుల వ్యవధిలో ఉంటుంది. ఆర్టికల్ అసిస్టెంట్ శిక్షణ రెండేళ్లు పూర్తయ్యాక జీఎంసీఎస్‌కు అర్హత లభిస్తుంది. ఇక.. ఫైనల్ కోర్సును కూడా రెండు గ్రూపులుగా, ప్రతి గ్రూప్‌లో నాలుగు పేపర్లుగా వర్గీకరించారు.
అవి..
గ్రూప్-1: పేపర్-1 ఫైనాన్షియల్ రిపోర్టింగ్; పేపర్-2 స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్; పేపర్-3 అడ్వాన్స్‌డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్; పేపర్-4 కార్పొరేట్ అండ్ అలైడ్ ‘లా’స్.
గ్రూప్-2: పేపర్-5 అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్; పేపర్-6 ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కంట్రోల్ అండ్ ఆడిట్; పేపర్-7 డెరైక్ట్ టాక్స్ ‘లా’స్; పేపర్-8 ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్ ‘లా’స్.
మరో అవకాశం.. అకౌంటింగ్ టెక్నిషియన్ ఎగ్జామ్:
సీఏ కోర్సంటే విద్యార్థులు ఎంతో క్లిష్టంగా భావిస్తారు. ఈ క్రమంలో మధ్యలోనే వెనుకడుగు వేసేవారి సంఖ్య కూడా ఎక్కువే. దీన్ని గమనించిన ఐసీఏఐ మరో అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే అకౌంటింగ్ టెక్నిషియన్ ఎగ్జామ్. ఐపీసీసీకి పేరు నమోదు చేసుకుని తొమ్మిది నెలల స్టడీ కోర్సు కూడా పూర్తి చేసుకుని ఐపీసీసీ గ్రూప్-1లో ఉత్తీర్ణత సాధించిన వారికి అకౌంటింగ్ టెక్నిషియన్ హోదా లభిస్తుంది.
నిరంతరం నమోదు:
సీఏ కోర్సులో అడుగుపెట్టాలనుకునే విద్యార్థులు తమ దరఖాస్తులను ఏడాదిలో ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు. ఎలాంటి గడవు ఉండదు. అయితే నిర్దేశిత కోర్సుకు నమోదు చేసుకున్న తర్వాత ఇన్‌స్టిట్యూట్ నిర్దేశించిన కనీస వ్యవధి పూర్తయ్యాక మాత్రమే ఆ కోర్సుకు నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేసుకునే అనుమతి లభిస్తుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.icai.org

Thursday, March 8, 2012
ఐసెట్-2010 I-CET
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో ఎంబిఎ, ఎంసిఎ ప్రవేశాల కోసం ఉద్దేశించిన (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఐసెట్-2010 నోటిఫికేషన్ వెలువడింది. పూర్తికాలిక, అంశకాలిక, సాయంకాల, దూరవిద్యా విధానాల్లో ఎంబిఎ, ఎంసిఎ కోర్సులు చదవాలని భావించే అభ్యర్థులు ఐసెట్ తప్పనసరిగా రాయాల్సి ఉంటుంది. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు వారి వారి ప్రతిభననుసరించి వివిధ యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో ప్రవేశం లభిస్తుంది. రాష్ట్రంలోని దిగువ యూనవర్సిటీల్లో ఎంబిఎ/ఎంసిఎ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
1.ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనవర్సిటీ
2.ఆచార్య నాగార్జున యూనవర్సిటీ
3. ఆదికవి నన్నయ యూనవర్సిటీ
4. ఆంధ్రా యూనివర్సిటీ
5. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ
6. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ
7. ద్రవిడియన్ యూనర్సిటీ
8. జెఎన్‌టియూ-అనంతపూర్
9. జెఎన్‌టియూ- హైద్రాబాద్
10. జెఎన్‌టియూ - కాకినాడ
11. కాకతీయ యూనవర్సిటీ
12. కృష్ణా యూనవర్సిటీ
13. మహాత్మాగాంధీ యూనవర్సిటీ
14. ఉస్మానియా యూనివర్సిటీ
15. పాలమూర్ యూనవర్సిటీ
16. రాయలసీమ యూనవర్సిటీ
17. ఎస్కే యూనవర్సిటీ
18. ఎస్వీ యూనివర్సిటీ
19. శాతవాహన యూనివర్సిటీ
20. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం
21. తెలంగాణ యూనివర్సిటీ
22. విక్రమ్ సింహపురి యూనివర్సిటీ
23. యోగి వేమన యూనివర్సిటీ
అర్హతలు: 1.భారతీయుడై ఉండాలి. రాష్ట్ర విద్యాసంస్థల నియమ నిబంధనల మేరకు లోకల్ / నాన్ లోకల్ అంశాలకు అర్హులై ఉండాలి.
2.విదేశీ విద్యార్థులు స్థానిక విశ్వవిద్యాలయాల నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
3. బీఒఎల్/బీఎఫ్‌ఏ మినహా అభ్యర్థులు ఏదేని డిగ్రీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పొంది ఉండాలి.
4.ఎంబిఏ ప్రవేశం కోరుకునే అభ్యర్థులు పదోతరగతిలో గణితం ఒక సబ్జెక్టుగా కలిగి ఉండాలి. మూడేళ్ల డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పాసై ఉండాలి.
5.ఎంసిఎలో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌లో తప్పనిసరిగా గణితం ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. మూడేళ్ల డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పాసై ఉండాలి.
7. డిగ్రీ చివరి సంవత్సరం చదివే అభ్యర్థులు సైతం ఐసెట్-2010కు దరఖాస్తు చేసుకోవచ్చు.
8.ఎస్సీ-ఎస్టీలకు కనీసార్హత మార్కులు లేవు.
Wednesday, March 7, 2012
సిఎస్‌ఐఆర్ యుజిసి నెట్
విశిష్ట సంస్థల్లో పరిశోధన చేపట్టే అవకాశం కోసం పలువురు పరిశోధనలు ఆశిస్తారు. అందుకు వీలు కల్పించే పరీక్షల్లో ప్రధానమైంది....
సిఎస్‌ఐఆర్ యుజిసి నెట్
సిఎస్‌ఐఆర్ పరిధిలో దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో పరిశోధన చేసేందుకు ఈ టెస్ట్ అవకాశం కల్పిస్తుంది. అదే సమయంలో లెక్చరర్స్ పోస్టుకు అర్హతగా పనికొస్తుంది. అందువల్ల ఈ టెస్ట్‌కు హాజరయ్యే అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జెఆర్‌ఎఫ్)తోపాటు లెక్చరర్‌షిప్‌కు కలిపి దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం లెక్చరర్‌షిప్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకునే సదుపాయం కూడా ఉంది. పరీక్ష ఫలితాలు నవంబర్///// //డిసెంబర్‌లో వెల్లడిస్తారు.
కెమికల్ సైన్సెస్, ఎర్త్ అట్మాస్ఫియరిక్ ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మేథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్‌లో టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ ఉదయం 10 నుంచి 12.30 వరకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. రెండో పేపర్ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటలవరకు మరో 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్ 1లో రెండు సెక్షన్లు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అలాగే సిఎస్‌ఐఆర్ నిర్దేశించిన మార్కులను మొదటి పేపర్‌లో సాధిస్తేనే అభ్యర్థులు రెండో పేపర్ రాయడానికి అనుమతిస్తారు. అలాగే మొదటి పేపర్‌కు హాజరుకాని పక్షంలో రెండో రాయనివ్వరు. ఈ రెండు పేపర్లు ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటాయి.
పరీక్షకు నిర్దేశించిన సిలబస్
వెబ్‌సైట్ : www.csirhrdg.ac.in, www.ugc.ac.in లో లభిస్తుంది. కనీసం 55 శాతం (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 50 శాతం) మార్కులతో ఆయా సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత పరీక్ష ఆఖరు సంవత్సరం లేదా చివరి రెండు సెమిస్టర్లు చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది జులై 1 నాటికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు వయస్సు 19-28 సంవత్సరాల మధ్య ఉండాలి. లెక్చరర్‌షిప్ కోసం వయసుతో నిమిత్తం లేదు. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, భువనేశ్వర్ తదితర 25 నగరాల్లో పరీక్ష జరుగుతుంది. దరఖాస్తు బులెటిన్ ధర రూ.400. ఒబిసిలకు రూ.200. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆ మొత్తానికి న్యూఢిల్లీలో చెల్లే విధంగా
ఇండియన్ బ్యాంక్, 3/1 వెస్ట్ పటేల్‌నగర్, న్యూఢిల్లీ-110 008
చిరునామాకు పంపి మార్చి 17లోగా దరఖాస్తు పొందవచ్చు. మన రాష్ట్రంలో హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కరీంనగర్, తిరుపతి, వరంగల్‌లోని ఇండియన్ బ్యాంక్ నిర్ధేశిత బ్రాంచీల్లోనూ దరఖాస్తులు లభిస్తాయి. ఆన్‌లైన్‌లోనూ దరకాస్తు సమర్పించుకోవచ్చు.
Tuesday, March 6, 2012
వినోద, సాంకేతిక పరిజ్ఞానాల సమ్మేళనం... యానిమేషన్
దేశీయంగా అంతర్జాతీయంగా కూడా యానిమేషన్‌కు ఉజ్వల భవిత కనిపిస్తోంది. అన్ని రంగాల్లోకి చొచ్చుకువెళ్తున్న యానిమేషన్‌లో కెరీర్‌ను తీర్చిదిద్దుకోవటానికి యువత ఆసక్తిప్రదర్శిస్తోంది ! మాంద్యం వల్ల బడ్జెట్ పరిమితులు ఏర్పడ్డాయి. దీంతో పాశ్చాత్య దేశాల్లోని యానిమేషన్ అవుట్‌సోర్సింగ్‌కు మనదేశం వైపే చూస్తున్నాయి. మరోపక్క బాలీవుడ్, ప్రాంతీయ సినిమా రూపకర్తలకు స్పెషల్ ఎఫెక్ట్‌లపై ఆసక్తి పెరుగుతుండటం వల్ల యానిమేషన్ కార్యకలాపాలపై ఉపొచ్చింది. కానీ సుశిక్షితుల కొరత ఈ రంగంలో ఎక్కువగానే ఉంది. ఈ పరిణామం యానిమేషన్ శిక్షణ సంస్థలకు ప్రాధాన్యం పెంచుతోంది. ఆసిక్తి, అభిరుచీ ఉన్న యువత ఈ రంగానికి అవసరమైన నైపుణ్యాలను అభ్యసించడానికి శిక్షణ సంస్థలను ఆశ్రయిస్తున్నారు.
వికాస దశలో ఉన్న కెరీర్‌లో యానిమేషన్ ముఖ్యమైంది. మనదేశంలో ఈ రంగం ఆలస్యంగానే అడుగులు వేయటం ప్రారంభించింది. భారతీయ సాంస్కృతిక వారసత్వం మనకు అపార సంపద. యానిమేషన్ రంగం వీటిని ఉపయోగించుకోవటానికి విస్తృత అవకాశాలున్నాయి.
యానిమేషన్ అనేది వినోద, సాంకేతిక పరిజ్ఞానాల సమ్మేళనం. యానిమేషన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వినియోగం దాదాపు అన్ని పరిశ్రమల్లోకీ విస్తరించి ఈ కెరియర్ ప్రాముఖ్యాన్ని వెల్లడిస్తోంది. ఫార్మాస్యూటికల్, ఏరోస్పేస్, సివిల్, ఆటోమొబైల్ మొదలైన ఎన్నో పరిశ్రమలు యానిమేషన్ ప్రక్రియను ఉపయోగించుకుంటున్నాయి.
ప్రాథమిక, సంక్లిష్ట యానిమేషన్ అసైన్‌మెంట్లు చేయటానికి ప్రతిభావంతులైన యానిమేషన్ ఆర్టిస్టుల అవసరం ఉంటుంది. ఒక్క ఆర్టిస్టు క్యాటగిరిలోనే మళ్లీ సబ్ క్యాటగిరీలున్నాయి. 2-డి యానిమేటర్, కాన్సెప్ట్ ఆర్టిస్ట్, 3-డీ క్యారెక్టర్ మోడ్‌లర్, 3 డీ క్యారెక్టర్ మోడ్‌లర్, 3 డీ యానిమేటర్, టెక్చరింగ్ ఆర్టిస్ట్, 3 డీ లైటింగ్ ఆర్టిస్ట్, 3 డీ కంపోజర్, ఎఫ్‌ఎక్స్ ఆర్టిస్టు, విఎఫ్‌ఎక్స్ కంపోజర్ విఎఫ్‌ఎక్స్ రోటో అండ్ పెయింట్ ఆర్టిస్ట్...ఇన్ని ఉన్నాయి. ప్రాథమిక పరిజ్ఞానంతోపాటు అన్ని రకాల యానిమేషన్ డిసిప్లిన్లలో అనుభవం ఉండి, ఎంచుకున్న రంగంలో ప్రత్యేక ప్రతిభ ఉన్నవారు సంపూర్ణమైన యానిమేషన్ ఆర్టిస్ట్ అవుతారు.
యానిమేషన్‌కు అంతర్జాతీయ వాల్ట్‌డిస్నీ స్టూడియోస్, సోనీ లాంటివి ప్రఖ్యాతి చెందాయి. భారతీయ యానిమేషన్ పరిశ్రమ అవుట్ సోర్సింగ్‌కు బాగా ప్రసిద్ధికెక్కింది. టాటా, రిలయన్స్, సత్యం, రిదమ్ అండ్ హ్యూమ్ లాంటి ప్రఖ్యాత ఐటీ సంస్థలు కూడా ఈ రంగంలోకి ప్రవేశించాయి.
భారతీయ యానిమేషన్ సంస్థలతో కలిసి పనిచేయ టానికి అంతర్జాతీయ సంస్థలు కూడా చూస్తున్నాయనేది గణనీయమైన అంశమే. కార్టూన్ క్యారెక్టర్ స్కెచింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్ మొదలైన అసైన్‌మెంట్లు అవుట్‌సోర్సింగ్ కింద మనదేశానికి లభిస్తున్నాయి.
ప్రస్తుత భారతీయ యానిమేషన్ కార్యకలాపాలు ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్‌ఎక్స్‌ల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ కూడా త్వరలో మొదలయ్యే అవకాశముంది.
దేశీయంగా ఉండే వినోద పరిశ్రమ నుంచి కూడా యానిమేషన్ సంస్థలకు గిరాకీ ఏర్పడుతుంది. మగధీర, అరుంధతి.. వంటి సినిమాల్లో విజువల్ ఎఫెక్టులు ప్రేక్షకులను ఎంతో అలరించిన సంగతి తెలిసిందే.
మనదేశానికి యానిమేషన్, గేమ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు రావటంలో ఖర్చులు తగ్గటం అనేది ముఖ్యాంశమే. దాదాపు 60 శాతం ప్రొడక్షన్ ఖర్చులు కలిసొస్తాయి. దీంతోపాటు నాణ్యత, పౌరాణిక, చారిత్రక వారసత్వం, ఇంగ్లిష్ మాట్లాడే వారు అత్యధికంగా ఉండటం కూడా మనదేశానికి అనుకూలించే అంశాలు.
ఎటువంటి అర్హతలుండాలి
యానిమేటర్ కావాలంటే ఊహాశక్తి, పరిశీలనా శక్తి, డ్రాయింగ్ నైపుణ్యం, విజువలైజేషన్‌లో ప్రతిభ ఉండాలని ఈ రంగంలోని నిపుణులు చెపుతున్నారు. కొత్తదనాన్ని ప్రదర్శించగలిగే నేర్పు ముఖ్యం. కంప్యూటర్‌ను కనీసం ఉపయోగించగలటం తప్పనిసరి. ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలండటం అదనపు ప్రయోజనం.యానిమేషన్ శిక్షణలో స్వల్ప, దీర్ఘకాలిక కాలవ్యవధిలో డిగ్రీ, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కొంత ప్రాథమిక పరిజ్ఞానం ఉండి, తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోదలిచినవారికి స్వల్పకాలిక కోర్సులు ఉపయోగం. వీటి వల్ల యానిమేషన్లోని డిజిటల్ డిజైనింగ్, త్రీడీ మోడలింగ్ టెక్చరింగ్, లైటింగ్‌లలో ప్రవేశస్థాయి ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది.
దీర్ఘకాలిక కోర్సులకు సహజంగానే ఎక్కువ విలువ ఉంటుంది. దీర్ఘకాలిక కోర్సుల్లో అన్ని రకాల అంశాలనూ నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది కదా !
ఈ కోర్సుల్లో చేరదల్చినవారు తమకు నిజంగా ఈ రంగంపై ఆసక్తి ఉందో లేదో తేల్చుకోవాలి. దీనికోసం ఈ రంగంలోని వారితో మాట్లాడటం, ఇంటర్నెట్‌లో పరిశ్రమ గురించి ప్రాథమికాంశాలైనా తెలుసుకోవటం..ఇవన్నీ అవసరమే.
ఎలాంటి శిక్షణ సంస్థను ఎంచుకోవాలి ?
అన్నికంటే ఉత్తమమైన పద్ధతి...ఎవరో చెప్పిందానిపైనే ఆధారపడకుండా స్వయంగా యానిమేషన్ శిక్షణ సంస్థలను సందర్శించటం. వాటికి ఉన్న ప్రఖ్యాతీ, అక్కడి మౌలిక సదుపాయాలూ, అక్కడి విద్యార్థుల ప్లేస్‌మెంట్ రికార్డ్ పరిశీలించటం ముఖ్యమే. అక్కడి విద్యార్థులు ఎలా నేర్చుకుంటున్నారో వారి ద్వారానే తెలుసుకోవాలి. ఆ తర్వాతే తుది నిర్ణయానికి రావటం మేలు.
యానిమేషన్ అనేది వినోద, సాంకేతిక పరిజ్ఞానాల సమ్మేళనం. యానిమేషన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వినియోగం దాదాపు అన్ని పరిశ్రమల్లోకీ విస్తరించి ఈ కెరియర్ ప్రాముఖ్యాన్ని వెల్లడిస్తోంది. ఫార్మాస్యూటికల్, ఏరోస్పేస్, సివిల్, ఆటోమొబైల్ మొదలైన ఎన్నో పరిశ్రమలు యానిమేషన్ ప్రక్రియను ఉపయోగించుకుంటున్నాయి.ప్రాథమిక, సంక్లిష్ట యానిమేషన్ అసైన్‌మెంట్లు చేయటానికి ప్రతిభావంతులైన యానిమేషన్ ఆర్టిస్టుల అవసరం ఉంటుంది. ఒక్క ఆర్టిస్టు క్యాటగిరిలోనే మళ్లీ సబ్ క్యాటగిరీలున్నాయి. 2-డి యానిమేటర్, కాన్సెప్ట్ ఆర్టిస్ట్, 3-డీ క్యారెక్టర్ మోడ్‌లర్, 3 డీ యానిమేటర్, టెక్చరింగ్ ఆర్టిస్ట్, 3 డీ లైటింగ్ ఆర్టిస్ట్, 3 డీ కంపోజర్, ఎఫ్‌ఎక్స్ ఆర్టిస్టు, విఎఫ్‌ఎక్స్ కంపోజర్ విఎఫ్‌ఎక్స్ రోటో అండ్ పెయింట్ ఆర్టిస్ట్...ఇన్ని ఉన్నాయి. ప్రాథమిక పరిజ్ఞానంతోపాటు అన్ని రకాల యానిమేషన్ డిసిప్లిన్లలో అనుభవం ఉండి, ఎంచుకున్న రంగంలో ప్రత్యేక ప్రతిభ ఉన్నవారు సంపూర్ణమైన యానిమేషన్ ఆర్టిస్ట్ అవుతారు.
Subscribe to:
Posts (Atom)